UDAI
-
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకొనే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. శనివారంతో గతంలో ఇచి్చన గడువు ముగియడంతో ఉడాయ్ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఈ వివరాలను వెల్లడించింది. పదేళ్ల కిందటి ఆధార్ కార్డులకు సంబంధించిన మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్డేట్లను ఉచితంగా చేసుకొనేందుకు గడువును మరో మూడునెలల పాటు.. డిసెంబర్ 14 వరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పొడగించింది. ఆన్లైన్లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా మై ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయి మార్పులను ఉచితంగా చేసుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు వివరాలను అప్డేట్ చేసుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్ సూచించింది. ఒకవేళ డిసెంబర్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోలేని వారు... తర్వాత 50 రూపాయలు చెల్లించి ఆధార్ కేంద్రాల్లో వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. -
ఆధార్ నోటీసులు: కీలక అంశాలు!
సాక్షి, హైదరాబాద్: ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నకిలీ ధృవపత్రాలతో ఆధార్ కార్డు అందుకున్నాడంటూ హైదరబాద్‌లో నివసించే సత్తర్‌ఖాన్ అనే ఆటో రిక్షా డ్రైవర్‌కు ఫిబ్రవరి 3న నోటీసులు జారీచేసింది. కాగా 2018లో రోహింగ్యా ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి.. వారికి ఆధార్‌కార్డులు ఇప్పించినట్లు సత్తార్‌పై సీపీఎస్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. అదే విధంగా.. పాతబస్తీలో పలువురు బ్రోకర్లు నకిలీ పాత్రలు సృష్టించి 127 మంది రోహింగ్యా లకు ఆధార్ నమోదు చేయిస్తున్న విషయం బట్టబయలైంది. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా... తెలంగాణ పోలీసులు ఆధార్ సంస్థకు లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ఆధార్ యాజమాన్యం 127 మంది రోహింగ్యా ముస్లింలకు నోటీసులు జారీచేసింది. సరైన పత్రాలతో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అతడికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. ఇక సత్తార్‌ఖాన్‌కు తనకు వచ్చిన నోటీసుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఆధార్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారు గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా... ఈరోజు జరగాల్సిన నకిలీ ఆధార్ విచారణను యూడీఏఐ రద్దు చేసింది. బాలాపూర్ మెగా గార్డెన్స్‌లో విచారణ జరగాల్సి ఉండగా అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక తదుపరి విచారణకు సంబంధించిన వివరాలను నోటీసులు అందుకున్న వారికి స్పీడ్‌పోస్టులో పంపింది. పౌరసత్వాన్ని నిరూపించుకోండంటూ 127 మందికి నోటీసులు -
ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్..
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉడాయ్, తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. ఉడాయ్ నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ఆధార్ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాతపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో ఆధార్ చూపమని అడగటం విరమించుకోవాలని, ఇలా చేయడానికి మీకు చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి ఏఐఎంఐఎం చీఫ్ ట్వీట్ చేశారు. నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని, ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్ సస్పెండ్ చేయాలని మరో పోస్టులో ఆయన కోరారు. కాగా 127 మందికి నోటీసులు జారీ చేసిన ఉడాయ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని వారిని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది. చదవండి : హైదరాబాద్‌లో 127మందికి ఆధార్ నోటీసులు -
జయలలిత వేలిముద్రలపై సుప్రీం తీర్పు
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసుపై సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది. జయలలిత వేలిముద్రలు సమర్పించాలని పరప్పణ అగ్రహారం జైలు అధికారులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేసు విచారణలో భాగంగా జయ లలిత వేలిముద్రలు సేకరించడాన్ని నిలుపుదల చేయాలని, వేలిముద్రలు లేకుండానే కేసు విచారణ పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుపరంకండ్రం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏఐడీఎంకే నేత ఎకే బోస్ ఎన్నికను సవాలు చేస్తూ డీఎంకే నేత శరవణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జయలలిత స్పృహలో లేని సమయంలో అమె అనుమతి లేకుండా వేలిముద్రలు తీసుకున్నారని, అమె సమ్మతి లేకుండా తీసుకున్న వేలిముద్రలు చెల్లవని ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ 2016లో శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన మద్రాసు హైకోర్టు కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలు అధికారుల వద్ద జయలలిత వేలిముద్రలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను తప్పుబడుతూ జయలలిత వేలిముద్రల సేకరణను విరమించుకోవాలని సుప్రీకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
ఆధార్ వివరాల లీకేజీ నిజమే
సుప్రీం కోర్టులో కేంద్రం అంగీకారం న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారుల వివరాలు లీకైన మాట నిజనమేనని, అయితే ఉడాయ్ నుంచి లీక్ కాలేదని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు బుధవారం తెలిపింది. ‘వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి వివరాలు లీక్ అయ్యాయి. కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. హనుమంతుడి పేరుతో, కుక్కల పేరుతో కార్డులు జారీ అయినప్పటికీ, యూఐడీ ఇప్పటికీ కచ్చితమైన బయోమెట్రిక్ వ్యవస్థే’ అని ప్రభుత్వ న్యాయవాది ఆర్ఘ్య సేన్ గుప్తా తెలిపారు. ప్రభుత్వ సేవలకు అసలైన లబ్ధిదారులకు అందించేందుకు ఆధార్ ఉపయోగపడుతుందన్నారు. ఉడాయ్ నిబంధనలకే విరుద్ధం పాన్ నంబర్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టులో పిటిషనర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయం ఆధార్ స్వచ్ఛందమేనన్న ఆధార్ చట్టబద్ధ విభాగం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నిబంధనలకే పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయం పౌరహక్కులను నీరుగారుస్తుంది. వారిపై ఆధిపత్యం చలాయిస్తూ వ్యక్తుల గోప్యతను దెబ్బతీసి, జీవితాంతం వారిపై నిఘా ఉంచుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమమని చెప్పుకునే ఏ దేశమూ ఆధార్‌లాంటి వ్యవస్థను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఆధార్ కార్డుదారుల వివరాలను ప్రైవేటు సంస్థలు సేకరిస్తున్నాయని, వాటిని దుర్వినియోగం, లీక్ చేసే అవకాశముందని పిటిషనర్ల న్యాయవాది శ్యామ్ దివన్ అన్నారు. -
ప్రభు, ఉదయ కాంబినేషన్లో ఉత్తరువు మహారాజా
ప్రముఖ నటుడు ప్రభు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి చాలా కాలమైంది.హీరోగా ఒక్క తమిళంలోనే నటించిన ఈయన ఇప్పుడు తెలుగు, కన్నడం, మలయాళం అంటూ బహుభాషా నటుడిగా ప్రాచుర్యం పొందారు. చాలా కాలం తరువాత మళ్లీ నటుడు ఉదయతో కలిసి ఉత్తరువు మహారాజా అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరు ఇంతకు ముందు తిరునెల్వెల్లి చిత్రంలో కలిసి నటించారన్నది గమనార్హం.స్టార్ విజన్ పతాకంపై గణేశ్‌కుమార్ నిర్వహించనున్న ఈ చిత్రంలో కోవైసరళ, శ్రీమాన్, మన్సూర్ అలీశాఖాన్, మనోబాల, అజయ్త్న్రం, కుట్టిపద్మిని నటించనున్నారు. తమిళ్, హిందీ, బెంగాలీ చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేసిన ఆశీప్ క్రేసీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని చిత్ర హీరోల్లో ఒకరైన ఉదయ వెల్లడించారు. ఇందులో తాను త్రిపాత్రాభినయం చేయనున్నట్లు ఉదయ్ చెప్పారు. ముగ్గురు కథానాయికల ఎంపిక జరుగుతోందని, ఇది హాస్యంతో కూడిన సైకో థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. దర్శకుడు కథనాన్ని విభిన్నంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇతర చిత్రాలకు కచ్చితంగా భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మార్చి 24న కోవైలో చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.