ఇటీవల ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి దానిలో ఆధార్ అనుసంధానం చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు చాలా వాటిలో ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తవగా, పాన్ కార్డులో ఇది ఇంకా కొనసాగుతోంది. అందుకే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వ ( March 2023) లోపు లింక్ చేసుకోవాలిని సూచిస్తోంది.
వాస్తవానికి ఈ అనుసంధానం కోసం ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చింది ఐటీ శాఖ. ఈ క్రమంలో మరో మారు గడువు పెంచే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఇచ్చినా, ఇక్కడ ఇంకో నిబంధన కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్‌తో లింకు చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత గడువు లోపు లింకు చేస్తున్న వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులు గమనిస్తే.. మరోమారు ఈ ప్రక్రియకు పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ గడువు తేదిలోపు లింక్ చేసుకోవడం ఉత్తమం. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి.
చదవండి: ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి!
Comments
Please login to add a commentAdd a comment