సాక్షి,మేడ్చల్ జిల్లా: ఆధార్ కార్డు నవీకరణ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. కార్డులు పొంది పదేళ్లు పూర్తయిన వారు, ప్రస్తుతం ఉన్న కార్డులను నవీనీకరించుకోవాలని ఇప్పటికే యూఐడీఏఐ సూచించింది. ఆధార్ కార్డు నవీనీకరణకు మొదట జూన్ 14 వరకు గడువు విధించారు. అయితే ప్రజల నుంచి నామ మాత్రంగా స్పందన రావడంతో గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. 2010–18 సంవత్సరాల మధ్య ఆధార్ కార్డులు పొందినవారు సెపె్టంబరు 14 వరకు ఉచితంగా నవీనీకరించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
రెండు రకాలుగా...
ఆధార్ కార్డును మై–ఆధార్ పోర్టల్, ఎం–ఆధార్ యాప్‌లో ఉచితంగా నవీనీకరించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న శాశ్వత ఆధార్ కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఆధార్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు గతంలో ప్రజలు చెప్పిన వ్యక్తిగత వివరాలను మాత్రమే హడావుడిగా నమోదు చేశారు. చాలా మంది తప్పుడు సమాచారం ఇచి్చనట్లు గుర్తించారు. ప్రస్తుతం,.. గతంలో ప్రజలు వెల్లడించిన వివరాల ప్రకారం ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసి నవీనీకరించుకోవచ్చు. నవీనీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని ఖచి్చతంగా సమరి్పంచాల్సి ఉంటుంది. అక్షరాస్యులైతే పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్తే సరిపోతుంది. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ పత్రం, తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రాలను తీసుకెళ్లి ఆధార్ కార్డు నవీనీకరణను పూర్తి చేసుకోవచ్చు.
ఇతర మార్పులకు ఇలా...
ప్రస్తుతం పదేళ్లు దాటిన వారందరూ ఆధార్ కార్డు సమాచారాన్ని నవీనీకరించుకోవాల్సి ఉంది. దీంతోపాటు పేరులో అక్షరాలను సరి చేసుకోవడానికి, ఫొటో, చిరునామా మార్పు, ఫోన్ నంబర్లలో మార్పులు చేసుకోవచ్చును. జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో లేవు. నవీనీకరణకు తప్పనిసరిగా మండల కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గతంలో కొత్తగా ఆధార్ కార్డుల జారీ సమయంలో గ్రామాల వారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ నవీనీకరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment