హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఏవియేషన్ షోకు సర్వం సిద్ధమైంది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఉన్నతాధికారుల రాకను పురస్కరించుకుని 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. విమానాశ్రయాన్ని డాగ్‌స్క్వాడ్‌తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు.
ఏ గేటు నుంచి ఎవరెవరు ప్రవేశం..
గేటు 1: చాలెట్ ఎగ్జిబిటర్లు, వీఐపీలు, అతిథులు
గేటు 2: కాన్ఫరెన్స్ డెలిగేట్స్, సీఈఓ రౌండ్ టేబుల్‌కు హాజరయ్యేవారు
గేటు 3: నిర్వాహకులు, చాలెట్ ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ప్రతినిధులు
గేట్ 4: నిర్వాహకులు, ఎగ్జిబిటర్స్, మీడియా, బిజినెస్ విజిటర్స్
గేటు 5: ఎయిర్‌పోర్ట్ ఎంప్లాయీస్, ఎగ్జిబిటర్స్, వింగ్స్ ఇండియా విధులు నిర్వర్తించేవారు
► మీడియా, పాస్‌లు కలిగిన జనరల్ పబ్లిక్, ఎగ్జిట్ గేటు ద్వారా అందరూ బయటకు రావాల్సి ఉంటుంది.
ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో హైలైట్స్
► కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై వింగ్స్ ఇండియా–2024ను ప్రారంభిస్తారు.
► ప్రపంప దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్, 15 హాస్పిటాలిటీ చాలెట్స్.. 106 దేశాల నుంచి 1500 డెలిగేట్స్, 5,000 బిజినెస్ విజిటర్స్ పాల్గొంటారని అంచనా.
► 500కు పైగా బీ2జీ, బీ2బీ సమావేశాలు
► ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్‌ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రదర్శన.
► ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్‌ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయిస్, ప్రట్ అండ్ వైట్నీల ఉత్పత్తుల ప్రదర్శన.
► యూఎస్‌ఏ, కెనడా, ఫ్రాన్స్, జమైకా, మారిషస్, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్, సౌత్‌కొరియా, గ్రీక్, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్ ఎగ్జిబిషన్‌కు హాజరు కానున్నారు.
సారంగ్ టీం స్పెషల్..
ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకై క జట్టుగా పేరొందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీం ఇప్పటికే నగరానికి చేరుకుంది. హుస్సేన్‌సాగర్ వద్ద బుధవారం 5 నిమిషాల పాటు తమ విన్యాసాలను ప్రదర్శించిన అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ రిహార్సల్స్‌ను కొనసాగించింది.
Comments
Please login to add a commentAdd a comment