aviation show
-
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో
-
HYD: నేటి నుంచి ఏవియేషన్ షో.. ఏ గేటు నుంచి ఎవరెవరికి ప్రవేశమంటే..
హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఏవియేషన్ షోకు సర్వం సిద్ధమైంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఉన్నతాధికారుల రాకను పురస్కరించుకుని 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. విమానాశ్రయాన్ని డాగ్‌స్క్వాడ్‌తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఏ గేటు నుంచి ఎవరెవరు ప్రవేశం.. గేటు 1: చాలెట్ ఎగ్జిబిటర్లు, వీఐపీలు, అతిథులు గేటు 2: కాన్ఫరెన్స్ డెలిగేట్స్, సీఈఓ రౌండ్ టేబుల్‌కు హాజరయ్యేవారు గేటు 3: నిర్వాహకులు, చాలెట్ ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ప్రతినిధులు గేట్ 4: నిర్వాహకులు, ఎగ్జిబిటర్స్, మీడియా, బిజినెస్ విజిటర్స్ గేటు 5: ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, ఎగ్జిబిటర్స్, వింగ్స్ ఇండియా విధులు నిర్వర్తించేవారు ► మీడియా, పాస్‌లు కలిగిన జనరల్ పబ్లిక్, ఎగ్జిట్ గేటు ద్వారా అందరూ బయటకు రావాల్సి ఉంటుంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో హైలైట్స్ ► కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై వింగ్స్ ఇండియా–2024ను ప్రారంభిస్తారు. ► ప్రపంప దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్, 15 హాస్పిటాలిటీ చాలెట్స్.. 106 దేశాల నుంచి 1500 డెలిగేట్స్, 5,000 బిజినెస్ విజిటర్స్ పాల్గొంటారని అంచనా. ► 500కు పైగా బీ2జీ, బీ2బీ సమావేశాలు ► ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్‌ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రదర్శన. ► ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయిస్, ప్రట్ అండ్ వైట్నీల ఉత్పత్తుల ప్రదర్శన. ► యూఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్, జమైకా, మారిషస్, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్, సౌత్‌కొరియా, గ్రీక్, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్ ఎగ్జిబిషన్‌కు హాజరు కానున్నారు. సారంగ్ టీం స్పెషల్.. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకై క జట్టుగా పేరొందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీం ఇప్పటికే నగరానికి చేరుకుంది. హుస్సేన్‌సాగర్ వద్ద బుధవారం 5 నిమిషాల పాటు తమ విన్యాసాలను ప్రదర్శించిన అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ రిహార్సల్స్‌ను కొనసాగించింది. -
విజయవంతంగా ముగిసిన ఏవియేషన్ షో (ఫొటోలు)
-
లోహ విహంగాల హంగామా.. 'వింగ్స్ ఇండియా' (ఫోటోలు)
-
WINGS INDIA 2022 : రెక్కలు తొడిగిన గగనం (ఫొటోలు)
-
గగనమంత ఉత్సాహం: ఆకట్టుకున్న ‘వింగ్స్ ఇండియా’ ఏవియేషన్ షో (ఫొటోలు)
-
20 ఏళ్లు.. 2,210 విమానాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏవియేషన్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండు దశాబ్దాల్లో భారత విమానయాన రంగానికి కొత్తగా 2,210 విమానాలు అవసరం కానున్నాయి. వీటిలో 1,770 చిన్న స్థాయి, 440 మధ్య..భారీ స్థాయి ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండనున్నాయి. గురువారమిక్కడ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో సందర్భంగా విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా విభాగం ప్రెసిడెంట్ రెమి మెలార్డ్ ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్‌పై అంచనాలకు సంబంధించిన నివేదిక ప్రకారం 2040 నాటికి దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏటా 6.2 శాతం మేర వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జనాభాపరంగా, ఆర్థికంగా, భౌగోళికంగా భారత్‌కు ఉన్న ప్రత్యేకతలు ఇందుకు దోహదపడగలవని రెమి తెలిపారు. దేశీయంగా మధ్యతరగతి వర్గాలు.. విమాన ప్రయాణాలపై మరింతగా వెచ్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ .. సర్వీస్ సామర్థ్యాలు, ట్యాక్సేషన్ విధానాలు మొదలైనవన్నీ మరింత అనుకూలంగా ఉంటే భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందగలదని రెమి తెలిపారు. అంతర్జాతీయంగా ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 3.9 శాతం స్థాయిలోనే ఉండగలదన్నారు. అంతర్జాతీయ రూట్లలో వాటా పెంచుకోవాలి గడిచిన పదేళ్లలో దేశీయంగా ఎయిర్ ట్రాఫిక్ దాదాపు తొమ్మిది రెట్లు పెరిగిందని, అంతర్జాతీయ ట్రాఫిక్ రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రూట్లలో విదేశీ ఎయిర్‌లైన్స్ వాటా 94 శాతం పైగా ఉంటుండగా.. భారత విమానయాన సంస్థల వాటా 6 శాతం స్థాయిలోనే ఉందని రెమి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ విమానయాన సంస్థలు తమ మార్కెట్ వాటా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని రెమి చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ సహా పలు సంక్షోభాలు ఏవియేషన్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయితే పరిశ్రమ వీటి నుంచి ధీటుగా బైటపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ వేగంగా కోలుకుంటోందని.. అందుకే అంచనాలను పెంచామన్నారు. 34 వేల మంది పైలట్లు కావాలి విమానయాన పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో 2040 నాటికి భారత్‌లో అదనంగా 34,000 మంది పైలట్లు, 45,000 సాంకేతిక నిపుణులు అవసరమవుతారని భావిస్తున్నట్లు రెమి వివరించారు. భారత్‌లో ఎయిర్‌బస్ 7,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా భారత్ నుంచి 650 మిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతోందని చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని, జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించడం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో విమానయాన సంస్థలకు వారానికి ఒకటి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌బస్ డెలివర్ చేయగలదని రెమి చెప్పారు. గతేడాది 611 విమానాలను డెలివర్ చేయగా ఇందులో 10% ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత సంస్థలకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 720 విమానాల డెలివరీ టార్గెట్ అని తెలిపారు. సుదూర ప్రయాణాలకు ఏ350 విమానాలు ఏ350 విమానాలను సుదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించినట్లు రెమి తెలిపారు. ఇవి ఏకంగా 18,000 కి.మీ. దూరం ప్రయాణించగలవని, 300–410 మంది వరకూ ప్యాసింజర్లు ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. అధునాతన మెటీరియల్స్ వల్ల ఇదే తరహా పోటీ సంస్థల విమానాలతో పోలిస్తే ఏ350 విమానాలు ఇంధనాన్ని 25% మేర ఆదా చేయగలవని, తద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించగలవని రెమి తెలిపారు. ఈ విమానాల కోసం 50 కస్టమర్ల నుంచి 915 ఆర్డర్లు వచ్చినట్లు (సరుకు రవాణా కోసం ఉపయోగించే ఏ350ఎఫ్ సహా) ఆయన పేర్కొన్నారు. వీటి విక్రయాలకు సంబంధించి భారతీయ విమానయాన సంస్థలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. -
WINGS INDIA 2022 : నేటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏవియేషన్ షో (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో
సాక్షి, హైదరాబాద్: ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్ షో... పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్ షో కోసం సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా గత మార్చిలో ఈ షోను కేవలం బిజినెస్ మీట్‌గా మాత్రమే పరిమితం చేశారు. రెండేళ్ల కోవిడ్ కాటు నుంచి కోలుకుంటూ... నగరంలో వింగ్స్ ఇండియా పూర్తి స్థాయిలో సందడి చేయనుంది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటుండగా, నగరానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వింగ్స్ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజకీయ/ పరిశ్రమ ప్రముఖుల హాజరు... ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభిస్తారు. మరో కేంద్రమంత్రి వికె సింగ్‌లు హాజరుకానున్నారు. చర్చలు.. సదస్సులు.. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్ పరిశ్రమపై రౌండ్ టేబుల్ చర్చ జరుగనుంది. అదే విధంగా ఏవియేషన్ ఫైనాన్సింగ్– లీజింగ్ డ్రోన్స్, ఏవియేషన్ రివైవల్, ఏరో మాన్యుఫ్యాక్చరింగ్ భవిష్యత్తు, నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు తదితర అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహిస్తారు. సంబంధిత రంగంతో పాటు అనుబంధ రంగాలకు చెందిన పలు సంస్థలకు వింగ్స్ ఇండియా పురస్కారాలను మార్చి 25న ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం హోటల్ తాజ్‌కృష్ణాలో జరుగుతుంది. చివరి 2రోజులూ సందర్శకులకు... ఈ ఈవెంట్లో తొలి 2 రోజులూ వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేశారు. చివరి 2 రోజులూ సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ ) విహంగాలు.. విశేషాలు.. ఈసారి ఎయిర్ షోలో సరికొత్త ఎయిర్ బస్ 350 సందడి చేయనుంది. సుదీర్ఘ ప్రయాణాలకు వీలుగా అందుబాటులోకి తెస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో గత కొంతకాలంగా ఎయిర్ బస్ 350పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే విధంగా బ్రెజిల్ కు చెందిన ఎంబ్రార్స్ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇ 195–ఇ2 కూడా ప్రదర్శనలో కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాన్స్ట్రేషన్ టూర్లో భాగంగా ఇది నగర వాసులకు పరిచయం కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన సారంగ్ టీమ్ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్ షో సమర్పిస్తారు. (క్లిక్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..) -
ఆకాశవీధిలో ఆహా!
రాజహంస(ఎమిరేట్స్) రాజసం లేదు.. ఖతర్ మెరుపులు లేవు.. ఎతిహాడ్ హోయలు అసలే కనిపించలేదు.. ఎయిర్ ఏషియా(మలేషియా), థ్రస్ట్ ఎయిర్ క్రాఫ్ట్కో(టీఎస్సీ–003), ఇండిగో (ఏ320–నియో)ల సోయగాలు లేనే లేవు.. ఔను గతంలో సందర్శకులను మైమరిపించిన విమానాలు ఈ ఏడాది కనిపించలేదు. చిన్నా చితకా విమానాలే తప్ప చెప్పుకోదగ్గ పెద్ద విమానాలు రాకపోవడంతో సందర్శకులను ఉసూరుమన్పించింది. ఇదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా–2020’లోని సీన్.. అయితే ఎయిరోబాటిక్(వైమానిక విన్యాసాలు) మాత్రం సందర్శకులను కనురెప్ప వాల్చనీయలేదు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు కాస్తా ఊరటనిచ్చాయి. కరోనా ప్రభావం ‘వింగ్స్ ఇండియా’పై స్పష్టంగా కనిపించింది. గతంతో పోలిస్తే సందర్శకుల(బిజినెస్మెన్) సందడి తక్కువగా కనిపించింది. పట్టుమని 10 విమానాలు కూడా షోకు రాలేదు. అందులోనూ ప్రాఫిట్ హంటర్, ఎయిర్‌బస్ విమానం మినహాయిస్తే మిగతావాన్నీ బుల్లి విమానాలే. ఈ ఏడాది కొత్తగా ‘ప్రాఫిట్ హంటర్’ మాత్రమే వచ్చిచేరింది. సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్: ఈ షోకు ఆదివారం వరకు సమయం ఉండటంతో మరికొన్ని వచ్చి చేరే అవకాశం లేకపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్లకోసారి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ‘వింగ్స్ ఇండియా’ను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ సారి ఏవియేషన్ షో కేవలం బిజినెస్‌కే పరిమితమైంది. ఆదివారం వరకు జరిగే ఈ షోకు వివిధ విమానయాన సంస్థలతో పాటు తయారీ సంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే కరోనా వైరస్ భయం కారణంగా గురువారం షోకు హాజరైన కొంతమంది సందర్శకులతో పాటు అక్కడ ఉన్న భద్రత సిబ్బంది మాస్క్‌లు ధరించి కనిపించారు. గగనంలో విన్యాసాలు.. గగనంలో గింగరాలు తిరిగే ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. పొగలు చిమ్ముకుంటూ నింగిలో రకరకాల ఆకృతులను ఆవిష్కరించిన దృశ్యాలు కనువిందు చేశాయి. ఏవియేషన్ షో అంటే ముందుగా గుర్తొచ్చేది గగనంలో విన్యాసాలే. ఊపిరి బిగపట్టుకుని కళ్లార్పకుండా విన్యాసాలు వీక్షించేవారు. పొగలు కక్కుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లుగా అనిపించినంతలోనే.. అమాంతం కిందపడుతుందేమోనని భయంతో చూసేవారికి ముచ్చెమటలు పట్టాయి. అంతలోనే మళ్లీ వేరే డైరెక్షన్లో విమానం దూసుకుపోవడం.. దాని వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్ అయిపోయి కిందపడుతున్నాయోనని ఒళ్లంతా గగుర్పాటుకు గురిచేసే విన్యాసాలు అబ్బురపరిచాయి. సారంగ్ టీమ్ బృందం నాలుగు ‘ధ్రువ’ హెలికాప్టర్లతో, మార్క్జెఫ్రీ బృందం మూడు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో వేర్వేరుగా చేసిన ఎయిరోబాటిక్స్ అలరించాయి. ప్రదర్శనకు ఉంచిన విమానాలు ఇవే.. మొత్తం తొమ్మిది విమానాలు ప్రదర్శనలో ఉంచారు. వీటిలో హోండా ఎన్271బీబీ, హెచ్ఏఎల్ ధ్రువ్ (ఏఎల్‌హెచ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ హెలికాప్టర్, హెచ్ఏఎల్ డీఓ–228, ప్రాఫిట్ హంటర్, ఎయిర్ ఇండియా, వీటీ–జీహెచ్ఎల్కు చెందిన జీబీఎల్ హెలికాప్టర్, వీటీ–వీబీబీ ఎయిర్‌క్రాప్ట్, డీఏ 42–వీ1 విమానం, ప్రాఫిట్ హంటర్ ఈ195–ఈ2 హెలికాప్టర్లు ప్రదర్శనలో ఉంచారు. ప్రాఫిట్ హంటర్ అదుర్స్.. వింగ్స్ ఇండియా 2020లో ప్రదర్శనకు ఉంచిన విమానాల్లో ఆకట్టుకున్నది ప్రాఫిట్ హంటర్ ఈ 195 ఈ2.. 146 మంది వరకు సీటింగ్ కెపాసిటీ గల ఈ విమానంలో ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఇతర విమానాల్లా కాకుండా కొంచెం అప్‌గ్రేడ్ చేస్తూ ‘ద కింగ్ ఆఫ్ ద స్కై’గా పిలిచే ఈ విమానంలో ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు సీట్లను 29 ఇంచుల నుంచి 35 ఇంచుల వరకు ఉండేలా చూశారు. సీటులో వెనుకకు ఒరిగి పడుకున్న ఇతరులకు ఇబ్బంది లేకుండా రూపకల్పన చేశారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పెట్టుకునేందుకు ప్రత్యేక ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కువగా శబ్దం వినబడదు. ఇంధనం కూడా మిగతా వాటికంటే కాస్తా తక్కువగానే ఖర్చవుతుంది. బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రార్ తయారుచేసిన విమానం ప్రపంచంలోనే మూడో అతి పెద్దది కావడంతో బిజినెస్ విజిటర్స్ చూసేందుకు ఆసక్తి కనబరిచారు. గంటలకు 833 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానం 1,450 మీటర్ల నుంచి టేకాఫ్, 1,240 మీటర్ల నుంచి ల్యాండ్ అవుతుందని పైలట్ లూయిస్ సొగారో తెలిపారు. విమాన యాక్సెసరీస్‌కే కంపెనీల పెద్దపీట.. ఏవియేషన్ షోలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎక్కువ శాతం విమాన ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చేలా పలు సంస్థలు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఇంజిన్ ఉత్పత్తుల నుంచి ప్రయాణికులు దిగేందుకు ఉపయోగించే మూవింగ్ స్టెప్స్ వెహికల్ వరకు అన్ని రకాల ఉత్పత్తుల తయారీ సంస్థలు ప్రచారానికి పెద్దపీటనే వేశాయి. విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాయి. అలాగే ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు స్సైస్ జెట్, స్పైస్ ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో పాటు స్పేర్‌పార్ట్స్‌ను ఎగ్జిబిషన్లో ఉంచారు. ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయ్సే, ప్రట్ అండ్ వైట్నీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. అలాగే జెట్ ఎయిర్వేస్, కార్పొరేట్స్ జెట్స్ వంటి స్టాళ్ల ద్వారా విమానాలు, హెలికాప్టర్ మోడళ్లపై ప్రచారం కల్పిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏరోస్పేస్ సైట్స్ ఇన్ తెలంగాణ, సీఎస్ఐఆర్ నేషనల్ ఏరో స్పేస్ లేబరేటరీస్, గుజరాత్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ, టర్బో ఎయిర్‌బస్ హెలికాప్టర్ వంటి సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటుచేసి తమ సేవలను వివరించాయి. మురిపిస్తోన్న బుల్లి విమాన నమూనాలు.. బుల్లి విమాన నమూనాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఎగ్జిబిషన్లో వివిధ స్టాల్స్‌లో ఈ విమాన నమూనాల ప్రదర్శనతో పాటు అమ్మకానికి ఉంచారు. వివిధ పరిమాణాల్లో చూడముచ్చటగా వీటిని తీర్చిదిద్దారు. ఏ–380 ఎయిర్‌బస్ విమాన నమూనా రూ.4,040కు విక్రయిస్తున్నారు. అలాగే బోయింగ్ విమానం రూ.23,955, ఎక్స్‌ప్రెస్ విమానం రూ.3 వేలకు లభ్యమవుతున్నాయి. మరోవైపు ఆయా విమాన, హెలికాప్టర్ కంపెనీలకు చెందిన ఎయిర్ హోస్టెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విమాన నమూనాలతో పాటు సందర్శకులతో ఫొటోలకు ఫోజులివ్వడం కనిపించింది. విమాన పైలెట్లను అప్రమత్తం చేస్తుంది విమానాశ్రయాల్లో సురక్షితంగా ల్యాండ్ అవడం, టేక్ ఆఫ్ సేవల కోసం ఏవియేషన్ వెదర్ మానిటర్ సిస్టమ్ పనిచేస్తోంది. పొగమంచు బాగా కురిసిన సమయంలో, వర్షం బాగా కురిసిన సమయంలో విమాన సేవలు కొనసాగించాలా, వద్దా అన్న దానిపై అక్కడి వాతావరణాన్ని బాగా అధ్యయనం చేసి ఏటీసీకి చేరవేస్తోంది. మనమిచ్చే సమాచారాన్ని ఆయా విమాన పైలెట్లకు పంపించి అప్రమత్తం చేస్తారు. అలాగే మైన్లను గుర్తించేందుకు మాగ్నెటోను కూడా ఈ ఏడాది మరింత అప్డేట్ చేశాం. ఐదు కిలోమీటర్ల కమ్యూనికేషన్ రేంజ్లో ఇది పనిచేసేలా అభివృద్ధి చేశాం. – కులకర్ణి, సీఎస్ఐఆర్ ప్రతినిధి విమానరంగంలో మహిళలకు బాసట ఇండియన్ ఉమెన్ పైలెట్స్ అసోసియేషన్(ఐడబ్ల్యూపీఏ)లో 300 మంది వరకు సభ్యులుగా ఉన్నారు. విమాన రంగంలోకి వివిధ హోదాల్లో అడుగిడే మహిళా ఉద్యోగులకు మెళకువలు నేర్పుతున్నాం. ఈ రంగంలో వచ్చే ఆధునిక సమాచారం, అభివృద్ధిని కూడా విశదీకరిస్తాం. అలాగే పాఠశాలు, కాలేజీల్లో విమానరంగంపై అవగాహన కలిగిస్తాం. అలాగే ఉపకార వేతనాలు అందిస్తున్నాం. ఇలా ముఖ్యంగా మహిళలు ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహం అందిస్తున్నాం.– డింపుల్ వాలీ, ఐబ్ల్యూపీఏ కమిటీ మెంబర్ -
అద్భుతంగా ‘సారంగ్’ టీమ్ విన్యాసాలు
సనత్‌నగర్: బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా వింగ్స్ ఇండియా–2020 గురువారం ప్రారంభమైంది. ఇందులో సారంగ్ టీమ్ వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సారంగ్ టీమ్ నాలుగు రోజుల పాటు గురువారం నుంచి ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు వైమానిక విన్యాసాలు చేయనున్నారు. ఈ టీమ్ ప్రధానంగా భారత వైమానిక దళం వైపు యువతను ప్రేరేపించే దిశగా ప్రదర్శనలు ఇస్తుంటుంది. సారంగ్ హెలికాప్టర్ 2003లో బెంగళూరులో అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎవాల్యుషన్ ఫ్లైట్ వారు రూపొందించారు. దీన్ని ‘ధ్రువ్’గా పిలుస్తారు. ఇది ఇండియన్ ఏవియేషన్ సెక్టార్‌కు మూల స్తంభంగా నిలబడింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)చే డిజైన్ చేయబడింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఛేదించే మల్టీ–మిషన్ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్‌గా ఖ్యాతి గడించింది. భారతీయ వైమానిక దళం వృత్తి నైపుణ్యాన్ని, భారత విమానయాన పరిశ్రమ సాధించిన మైలురాళ్లను ప్రదర్శించే లక్ష్యానికి ఈ హెలికాప్టర్లు మార్గం సుగమం చేశాయి. ఈ హెలికాప్టర్ల బృందానికి సారంగ్ అని నామకరణం చేశారు. సారంగ్ అంటే సంస్కృతంలో నెమలి. ఈ బృందం భారతీయ వైమానిక దళం బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తోంది. 2004 ఫిబ్రవరిలో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఏరోస్పేస్ ఎయిర్ షోలో సారంగ్ బృందం తన తొలి బహిరంగ ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత అదే ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆల్ ఐన్ గ్రాండ్ ప్రిక్స్, 2008 మేలో బెర్లిన్‌లో జరిగిన ఇండో–జర్మన్ ఎయిర్ షోలో పాల్గొని బెస్ట్ ఏరోబాటిక్ టీమ్‌గా పేరుతెచ్చుకుంది. రాజెడ్ 90వ వార్షికోత్సవం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్లో, ఆ తరువాత ఆర్ఏఎఫ్ ఫెయిర్పోర్ట్లోని రాయల్ ఇంటర్నేషనల్ ఎయిర్ టాటూలో ప్రదర్శనలు ఇచ్చారు. 2008లో ప్రఖ్యాత ఫార్న్‌బరో ఎయిర్‌షో, 2016 జవనరిలో అల్ సఖీర్ ఎయిర్‌బేస్ వద్ద జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో, 50వ జాతీయ దినోత్సవం సందర్భంగా 2018 మార్చిలో మారిషస్‌లో సారంగ్ టీమ్ ఎయిర్ షోలు చేసింది. అవే కాకుండా ఫోఖ్రాన్‌లో ఫైర్ పవర్ డిమానిస్ట్రేషన్ వంటి ఉత్సవ సందర్భాల్లో వైమానిక విన్యాసాలను చేయడంతో పాటు బెంగళూరులోని ఏరో ఇండియా ఎయిర్ షోలో ఈ బృందం క్రమం తప్పకుండా పాల్గొంటుంది. ప్రెసిడెన్షియల్ ప్లీట్ రివ్యూ, నేవీ డే, వరల్డ్ మిలటరీ గేమ్స్, కామన్వెల్త్ యూత్ గేమ్స్ వంటి ఉత్సవ సందర్భాల్లో ఎయిర్ షో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. షోల ప్రదర్శన మాత్రమే కాకుండా యువతను వైమానిక దళం వైపు మళ్లించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాధ్యతాయుతమైన పాత్ర 2006లో గుజరాత్లో వైబ్రంట్, 2008లో ముంబాయిలో మెరైన్ డ్రైవ్, 2014లో అరుణాచల్ ప్రదేశ్‌లోని పసిఘాట్, బిజు పట్నాయక్ శతాబ్ది ఉత్సవాల్లో ఈ బృందం తమ సందేశాలను అందించింది. వీరి విన్యాసాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జాతీయ శక్తిని నలుదిశలా చాటిచెప్పేందుకు ఒక సాధనంగా నిలుస్తాయి. సేవా ›కార్యక్రమాల్లో కూడా ఈ బృందం ముందంజలో ఉంది. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల సమయంలో హెచ్ఏడీఆర్ మిషన్‌లో ఈ బృందం చురుగ్గా పాల్గొంది. ఈ బృందం వెయ్యి మందిని రక్షించింది. 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో 12 టన్నుల సహాయక సామగ్రిని అందించాయి. అలాగే గత డిసెంబర్ 17న ఓఖీ తుఫాను, 2018 మార్చిలో తేనిలో జరిగిన అటవీ మంటల వ్యాప్తిని నిరోధించడంలో ఈ బృందం స్పందించిన తీరు అద్భుతం. 2018 ఆగస్టులో కేరళలో సంభవించిన వరదల సమయంలో తమ సామర్థ్యంతో 320 మందిని రక్షించారు. కేరళ ప్రజలకు సహాయంగా 77 టన్నుల సహాయక సామగ్రిని అందించారు. వరదలతో బాధపడుతున్న ప్రజలకు సహాయాన్ని అందించడంలో ఈ బృందం బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూనే ఉంది. నాలుగు రోజులపాటు ఏవియేషన్ షో వింగ్స్ ఇండియా 2020 ఏవియేషన్ షో ఇవాళ్ట నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో సరంగ్, మార్క్ జెఫ్రీ బృందాలు విమాన విన్యాసాల రిహార్సల్స్‌తో బుధవారం అలరించాయి. నింగిలో అబ్బురపరిచే విన్యాసాలతో కిరాక్ పుట్టించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. నింగిలో విన్యాసాలను చూసేందుకు రహదారుల పైనే తమ వాహనాలను నిలిపి రిహార్సల్స్‌ను చూసి ఎంజాయ్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బై బై ఎయిర్ షో....
-
షో.. సో..సో!
సనత్‌నగర్: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో నాలుగు రోజులు నిర్వహించిన వింగ్స్ ఇండియా–2018 ఏవియేషన్ షో ఆదివారంతో ముగిసింది. వీకెండ్ కావడంతో సందర్శకులు భారీగా వస్తారని ఆశించిన నిర్వాహకులకు ఆశాభంగమే ఎదురైంది. దీనికికారణం.. ఆశించిన స్థాయిలో విమానాలు, అసలు వైమానిక ప్రదర్శనలే లేకపోవడం. అంతేకాకుండా స్టాళ్లు కూడా శనివారం నాటికే సగం ఖాళీ అయిపోయాయి. ఆదివారం అక్కడక్కడ కనిపించాయంతే! ఎంతో ఉత్సాహంతో ప్రదర్శనకు వచ్చిన సిటీజనులకు నిరాశే మిగిలింది. మొత్తానికి ఏవియేషన్ షో... సోసోగా అనిపించింది. నగరవాసులను అలరించలేకపోయింది. -
ఏవియేషన్ షోలో డెమో విమానాల సందడి
-
ఆశ.. నిరాశే అన్నీ ఎగిరిపోయే!
సనత్‌నగర్: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2018 ఏవియేషన్ షోను తిలకించేందుకు ఎంతో ఆశతో వచ్చిన నగరవాసులకు నిరాశే ఎదురైంది. అసలే అంతంతమాత్రంగా విమానాలు ఉండడం... ఉన్న వాటి దగ్గరికి కూడా అనుమతించకపోవడంతో అసహనానికి గురయ్యారు. రన్‌వే మీద ఏర్పాటు చేసిన విమానాలు, హెలికాప్టర్ల దగ్గరికి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దూరం నుంచే చూడాలని ఆంక్షలు విధించారు. దీంతో చేసేదేమిలేక గ్రిల్స్ దగ్గర నిలబడే ఫొటోలు తీసుకొని సంబరపడ్డారు. మరోవైపు వైమానిక విన్యాసాలూ లేకపోవడంతో సందర్శకులు ఉసూరుమన్నారు. ఫొటో ఖరీదు రూ.2000 : నిజానికి శని, ఆదివారాలు సాధారణ సందర్శకులకు అనుమతి. వీరికి ఎంట్రీ పాస్ రూ.400. కానీ శనివారం వీరిని విమానాల దగ్గరికి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీంతో కొందరు ఔత్సాహికులు తప్పని పరిస్థితుల్లో రూ.2000 వెచ్చించి బిజినెస్ పాస్ కొనుగోలు చేశారు. ఈ పాస్ ఆధారంగా లోపలికి వెళ్లి విమానాలను చూసి, అక్కడ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. పెద్దగేంలేదు.. ఇక్కడ పెద్దగేం లేదు. ప్రత్యేక విమనాలేవీ లేవు. రూ.400 వెచ్చించి షోకు వస్తే విమానాలు లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. అయితే కొంతమేర మా స్టడీకి సంబంధించి సమాచారం దొరికింది. – తెలంగాణ ఏవియేషన్ అకాడమీవిద్యార్థులు ఏంటిది? వైమానిక విన్యాసాలు లేవు. కొన్ని విమానాలుంటే వాటి దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. మరోవైపు ఫుడ్ ధరలేమో చుక్కల్లో ఉన్నాయి. ఏంటిది? ఇలా చేస్తే సందర్శకులు ఎలా వస్తారు. – అవినాష్, మోతీనగర్ ఐదారే... పెద్ద విమానాలు ఉంటాయని వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదారు మాత్రమే ఉన్నాయి. అది కూడా వాటి దగ్గరకు అనుమతించకపోవడం పిల్లలకు నిరాశను కలిగించింది. – శివకుమార్, ఈసీఐఎల్ స్టాళ్లు.. సగం ఖాళీ ఎగ్జిబిషన్లో సగం స్టాళ్లు ఖాళీ అయ్యాయి. రన్‌వేపై మిగిలిన ఆరు విమానాలు, ఉన్న కొద్దిపాటి స్టాళ్లను తిలకించి సందర్శకులు సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇక ఫుడ్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వాటర్ బాటిల్ రూ.40, ఆహార పదార్థాలు రూ.50కి పైగా ఉండడంతో సందర్శకులకు చిర్రెత్తుకొచ్చింది. -
ఏవియేషన్ షోలో హోండా జెట్‌ప్లేన్ ప్రదర్శన
-
దేశంలో తొలి గగనతల అంబులెన్స్ ప్రారంభం
-
మార్చి 8 నుంచి ఏవియేషన్ షో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ స్థాయిలో... హైదరాబాద్‌లో రెండేళ్లకోసారి జరిగే ‘ఇండియా ఏవియేషన్ షో’ తేదీలు ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా ‘వింగ్స్ ఇండియా 2018’ థీమ్‌తో మార్చి 8 నుంచి 11 వరకు ఇది జరుగనుంది. 150కి పైగా కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. 5,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పౌర విమానయాన రంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణలకు వింగ్స్ ఇండియా వేదిక కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. విధానపర అంశాలు, వ్యాపార అవకాశాలపై సదస్సులు నిర్వహిస్తారు. పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, ఎయిర్ ఇండియా, పవన్ హాన్స్ సహకారం అందిస్తున్నాయి. చిన్న విమానాలతోనే.. దిగ్గజ సంస్థలు రూపొందించిన నూతన తరం ప్రైవేట్ జెట్లు ఈ ప్రదర్శనలో తళుక్కుమననున్నాయి. ఎనిమిది కొత్త జెట్స్ తొలిసారిగా దర్శనమివ్వనున్నాయి. వీటిలో 14 సీట్లతో కూడిన ఫా ల్కన్ ఒకటి. గతంలో జరిగిన ఏవియేషన్ షోలలో భారీ విమానాలు కనువిందు చేశాయి. భారీ విహంగమైన ఎయిర్‌బస్ ఏ380ని చూసేందుకు వీక్షకులు ఎగబడ్డారు. ఈసారి ఇలాంటివి ఉండవని, పూర్తిగా బిజినెస్ టు బిజినెస్ ఈవెంట్‌గానే ఇది ఉంటుందని విమానయాన రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీ వ్యవస్థాపకుడొకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రైవేట్ జెట్స్ మాత్రమే కొలువుదీరతాయన్నారు. ఇక ఎప్పటిలాగే ఏరోబాటిక్ ప్రదర్శన హైలైట్‌గా నిలవనుంది. తొలి రెండు రోజులు బిజినెస్ విజిటర్లకు, చివరి రెండు రోజులు సాధారణ ప్రజానీకానికి కేటాయించారు. బిజినెస్ టికెట్ రూ.1,500, జనరల్ టికెట్ రూ.300 ఉంది. -
జస్ట్ మిస్!
ఎనిమిదేళ్లలో మూడు ‘విమాన ప్రమాదాలు’ 2008 సిస్నా... 2010 కిరణ్... ఇప్పుడు ‘బస్’ ప్రతి ఉదంతంలోనూ తప్పిన పెనుముప్పు సిటీబ్యూరో: రాజధానిలో గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో మూడు విమాన సంబంధిత ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో రెండు ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్స్ కాగా... తాజాగా జరిగింది ట్రైనింగ్ కోసం తీసుకువెళ్తున్న విమానం. 2008 సెప్టెంబర్ 8న సనత్‌నగర్ ప్రాంతంలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్నా-150 కుప్పకూలింది. 2010 మార్చి 3న ఏవియేషన్ షో నేపథ్యంలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కిరణ్ ఎంకే-2 న్యూబోయిన్‌పల్లిలోని భ వనంలోకి దూసుకుపోయింది. ఆదివారం బేగంపేట ఎయిర్పోర్ట్ వెనుక వైపు ఎయిర్ ఇండియాకు చెందిన, మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న 320 ఎయిర్ బస్ శిక్షణ కోసం క్రేన్లతో తరలిస్తుండగా ‘కూలిపోయింది’. మొదటి రెండు ఉదంతాల్లో పెను ప్రమాదాలు తృటిలో తప్పగా... తాజా ఉదంతంలో ముందు జాగ్రత్త ఫలితంగా గట్టెక్కారు. జనావాసాల్లో కూలినవి రెండు... నగర శివార్లలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ బేస్‌లు, స్టేషన్లకు సంబంధించిన మిగ్ తదితర విమానాలు అనునిత్యం ప్రమాదాలకు లోనవుతూనే ఉన్నాయి. అయితే జనావాసాల మధ్య మాత్రం ఇప్పటికి రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లు కూలాయి. ఈ ఉదంతాల్లో వాటికి సంబంధించిన వారే నలుగురు చనిపోయారు. ఈ రెండుసార్లూ సాధారణ పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు ప్రమాదాలు ఉదయం పూటే జరిగాయి. సంజీవరెడ్డినగర్‌లో 2008 సెప్టెంబరు 8 ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరిని బలి తీసుకుంది. విమానంలో శిక్షకుడిగా ఉన్న కెప్టెన్ నీరజ్ జైన్, ట్రైనీ పెలైట్ పి.శ్రీనివాస్ మరణించారు. మరో ఇద్దరు స్థానికులకు తీవ్ర గాయాలయ్యాయి. బేగంపేటలోని ఆంధ్ర ప్రదేశ్ ఏవియేషన్ అకాడమీలో భాగమైన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియాకు సంస్థకు చెందిన సిస్నా-152 రకం శిక్షణ విమానంలో నీరజ్, శ్రీనివాస్ ఉదయం 10.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన ఐదు నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో సంజీవరెడ్డినగర్ పరిధిలోని అశోక్‌నగర్ కాలనీ, లింగయ్యనగర్ ల మధ్య ఓ ఇంటిపై కూలిపోయింది. ఆపై 2010 మార్చి 3న విన్యాసాలకు ప్రత్యేకంగా వినియోగించే నేవీకి చెందిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కిరణ్ ఎంకే-2 న్యూబోయిన్‌పల్లిలోని పెద్ద తోకకట్ట వద్ద ఉన్న రెండతస్థుల భవనంలోకి దూసుకుపోయింది. ఇది ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ అయినప్పటికీ అప్పట్లో నేవీలో విన్యాసాల ప్రదర్శనకు వాడుతున్నారు. ఈ ఘటనలో పెలై ట్‌గా ఉన్న లెఫ్టనెంట్ కమాండర్ ఎస్కే మౌర్య, కో-పెలైట్‌గా ఉన్న రాహుల్ నాయర్ మృతిచెందారు. భవనంలో నివసించే విజయేశ్వరి, శ్యామ్ గాయాలపాలయ్యారు. తరలింపుల్లో ‘రోడ్డెక్కిన’ ఎయిర్‌బస్... బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన 320 ఎయిర్ బస్ అనే భారీ విమానం మూడేళ్లుగా నిరుపయోగంగా పడుంది. సీట్లు, ఇంజన్ లేకుండా బాడీగా మిగిలిన ఈ విమానాన్ని బోయిన్పల్లి ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు మీదుగా ఎయిర్ ఇండియాకు చెందిన సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (సీటీఐ)కు తీసుకవెళ్లేందుకు అధికారులు ఆదివారం ప్రయత్నించారు. శిక్షణలో ఉన్న సిబ్బందికి తలుపులు/ పెలైట్లు కూర్చునే కాక్‌పిట్ నిర్వహణ, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సినజాగ్రత్తలపై శిక్షణ ఇవ్వడానికి ఉపక్రమించారు. ఆదివారం ఉదయం తరలింపు ప్రారంభించిన పది నిమిషాల్లోనే విమానాన్ని మోస్తున్న క్రేన్ కుప్పకూలింది. ప్రహరీగోడపై విమానం పడటం, దానిపై క్రేన్ పడటంతో విహంగం రెండు ముక్కలైంది. తప్పిన పెను ప్రమాదాలు... 2008, 2010ల్లో జరిగిన ఉదంతాల్లోనూ తృటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. సంజీవ్రెడ్డినగర్లో సిస్నా-152 కూలింది సెప్టెంబరు నెలలో. ఈ సమయంలో గణేష్ ఉత్సవాలు జరుగుతుండటంతో అక్కడున్న గణేష్ మండపాలు, ఆ సమయంలో ఉన్న పవర్‌కట్ ప్రాణనష్టాన్ని నివారించాయి. మరమ్మతుల కోసమని ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు ముందే ప్రకటించారు. 10.50 గంటల సమయంలో విమానం నేలకూలే ముందు ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అది విరిగి వైర్లు తెగి జనావాసాల మీద పడ్డాయి. అదృష్ట వశాత్తూ అప్పటికే విద్యుత్ సరఫరా నిలిపేయడంతో పెనుప్రమాదం తప్పింది. మరోవైపు విమానం కూలిన ప్రాంతానికి సమీపంలో ఉన్న అశోక్‌నగర్ కాలనీ, లింగయ్య నగర్ల మధ్యలో ఉన్న రహదారి ఎప్పుడూ స్థానికుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే ఆ సమయంలో అక్కడ గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేయడంతో రాకపోకలు వేరే రోడ్డునుంచి సాగుతున్నారుు. ఫలితంగా వాహన చోదకులూ మరణించలేదు. ఇక కిరణ్ ఎంకే-2 విషయంలోనూ తృటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రమాద స్థలికి కాస్త దూరంలోనే 400 మంది పిల్లలు చదివే పాఠశాల ఉంది. విమానం అటు వైపు వెళ్లలేదు. మరోపక్క దూసుకుపోయిన భవనం రెండో అంతస్థులోనూ నాలుగు కుటుంబాలు నివసిస్తుండగా పనిదినం కావడంతో మూడిళ్లకు తాళం పడింది. మిగిలిన ఒక్క ఇంట్లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. ఈ ఇంటి పైన ఉన్న వాటర్‌ట్యాంక్ పగిలి నీరు రావడం వల్ల విమానంలోని ఫ్యూయల్ అంటుకోలేదు. తాజాగా అధికారుల చర్యలతో... ఆదివారం నాటి ఉదంతంలో అధికారులు తీసుకున్న చర్య లు, ముందు జాగ్రత్తల నేపథ్యంలో ప్రాణనష్టం తప్పింది. ఎయిర్‌బస్‌ను తరలించేందుకు అధికారులు మూడు రోజులుగా కసరత్తు చేశారు. విద్యుత్, పోలీసు విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. శనివారం రాత్రి 11.30 గంటల నుంచే ఓల్డ్ ఎయిర్‌పోర్టు మీదుగా వాహనాల రాకపోకలను ఆపేశారు. విమాన తరలింపు జరుగుతున్న ప్రదేశానికి కిలోమీటరు పరిధిలో పాదచారులనూ రానివ్వలేదు. ఈ చర్యల ఫలితంగానే ప్రాణనష్టం తప్పింది. -
భారీ ఈవెంట్ల భాగ్యం
చారిత్రక నగరం చరిత్రను తిరగరాస్తోంది. నవనాగరిక దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. ఒకటి వెంట ఒకటిగా వెల్లువెత్తుతున్న విభిన్న రకాల ఈవెంట్లు సిటీని వినూత్నంగా పరిచయం చేస్తున్నాయి. భవిష్యత్‌లో మరెన్నో ఈవెంట్లు నగర వేదికపై నాట్యం చేయనున్నాయి. ఏవియేషన్ షో లాంటి అధికారిక ఈవెంట్ల పరంపర కొనసాగుతుండగానే మరోవైపు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలూ సిటీలో వెల్లువెత్తుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం వేదికగా దేశంలోనే అతిపెద్ద ఆధునిక సంగీత, నృత్యోత్సవంగా పేరొందిన ‘సన్‌బర్న్’ ఇటీవటే సిటీజనులకు పరిచయమై సూపర్ హిట్టయింది. ఆ పేరు పలికితే చాలు సిటీలోని పార్టీ పీపుల్ ఆలోచనలు, ప్రణాళికలు గోవా దిశగా పరుగు తీసే పరిస్థితిలో మార్పు తెచ్చిందీ ఈవెంట్. స్థానిక కాన్సెప్ట్‌తో రూపొందిన స్కై ఫెస్ట్ కూడా టాక్ ఆఫ్ ది సిటీ అయింది. వైట్‌తో గ్రేట్.. ట్రెండ్‌కు మరింత ఆజ్యం పోస్తూ వచ్చేసిందే వైట్ సెన్సేషన్. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ ఈవెంట్‌ను సొంతం చేసుకోవడానికి పలు నగరాలు పోటీపడినా ఆసియాలోనే తొలిసారి సిటీకి దక్కడం.. సిటీ ఈవెంట్స్ హబ్ కానుందనే ఆశలకు రెక్కలు తొడిగింది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ భారీ ఈవెంట్‌కు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్ దిగ్విజయంగా పూర్తవడంతో అంతర్జాతీయంగా పేరొందిన ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీలు సిటీ వైపు దృష్టి సారించాయి. ఈ తరహా భారీ ఈవెంట్లు నగర పర్యాటక రంగానికి ఊపునిస్తాయనే నమ్మకం ఉంది. ఈ ఈవెంట్‌కు హాజరైన వారిలో 40 శాతం మంది ఇతర ప్రాంతాల వారేనని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని భారీ ఈవెంట్లకు సిటీ వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాంపస్ పార్టీ కమింగ్ సూన్.. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, సైన్స్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్, స్టార్టప్స్.. వీటన్నింటినీ కలబోసిన క్యాంపస్ పార్టీ సెప్టెంబర్‌లో సిటీకి రానుంది. ఇది వారం రోజులు కొనసాగుతుంది. ఉదయం టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లు, సాయంత్రం పార్టీలు నిర్వహిస్తారు. దాదాపు 10 వేల మంది యువత టెంట్లలోనే బస చేస్తారు. అలాగే ‘బ్రాడ్ వే మ్యూజికల్స్’ పేరుతో మరో పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ డిసెంబర్లో సిటీ చేరనుంది. ఇది దాదాపు 20 రోజులు జరుగుతుంది. ఇలా సెన్సేషన్ విజయం చూసిన తర్వాత టుమారో ల్యాండ్, ఆల్ట్రా.. లాంటి మరెన్నో ఇంటర్నేషనల్ ఫెస్టివళ్లు మన దేశానికి రావాలని చూస్తున్నాయి. ‘సన్‌బర్న్’ ఈ ఏడాది కూడా సిటీలో జరగనుంది. ఈసారి మార్టిన్ గార్రిక్స్, అవిసి, హార్డ్‌వెల్.. లాంటి పాపులర్ డీజేలు సిటీకి రానున్నారు. ఫెస్టివల్ విలేజ్ అవసరం.. ప్రపంచస్థాయి వినోద సంబరాలను హైదరాబాద్‌కు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్న వేడుకలను మేం పరిచయం చేస్తున్నాం. సన్‌బర్న్, వైట్ సెన్సేషన్.. లాంటి ఈవెంట్లు తీసుకురాగలిగామంటే ఇక్కడి పార్టీ ప్రియుల అభిరుచి, రాష్ట్ర ప్రభుత్వ సహకారమే కారణం. ప్రభుత్వ సహకారం లేనిదే భారీ ఈవెంట్ల నిర్వహణ అసాధ్యం. వైట్ సెన్సేషన్ తర్వాత చాలా మంది ఇక్కడ ఈవెంట్లు చేయాలని చూస్తున్నారు. అయితే ఆడిటోరియం అద్దెకు తీసుకోవడం వల్ల ఈవెంట్లకు చాలా ఖర్చవుతోంది. ఈవెంట్స్ విలేజ్ చాలా అవసరం. అప్పుడు ఏడాదంతా ఈవెంట్స్ నిర్వహించొచ్చు. - విజయ్ అమృత్‌రాజ్, ఓలా ఈవెంట్స్ -
నింగి మెరిసె నేల మురిసె
రెండో రోజూ ఏవియేషన్ షో కిటకిట చిత్రకారులను స్ఫురింపజేసేలా ఆకాశంలో వి‘చిత్రాలు’... సందర్శకుల మది దోచేలా ప్రదర్శనలు... రూపంలోనూ... సౌకర్యాల్లోనూ ప్రతి విమానం.... దేనికదే ప్రత్యేకం. ఇదీ ‘ఇండియా ఏవియేషన్-2016’ స్పెషల్. విమానాల విన్యాసాలతో నింగి మెరిసింది. తిలకించిన సందర్శకుల సందడితో నేల మురిసింది. గురువారం ఏవియేషన్ షో ఉత్సాహంగా సాగింది. బేగంపేట విమానాశ్రయ పరిసరాలు బిజినెస్ విజిటర్స్‌తో కిటకిటలాడాయి. రాజహంస అందాల వీక్షణకు జనం ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. ఎమిరేట్స్ లగ్జరీ లుక్‌ని చూసి ముగ్దులయ్యారు. - సనత్‌నగర్ విన్యాసాల వీరులు పొగ చిమ్ముతూ విమానం దూసుకెళ్తుంటే.. వినువీధిలో చిత్రాలు ఆవిష్కరిస్తూ వింతలు చేస్తుంటే.. సందర్శకులు రెప్పవాల్చకుండా అంబరాన్ని సంబరంగా చూస్తుంటే.. విన్యాసాల వీరులు వి‘చిత్రాలు’ చేస్తున్నారు. ప్రచండ వేగంతో విమానాలను పల్టీలు కొట్టిస్తున్నారు. తిరిగి యథాస్థితికి చేరుస్తున్నారు. ఏవియేషన్ షోలో మార్క్ జెఫర్స్ బృందం విహంగ విన్యాసాలతో సందర్శకుల మదిదోచుకుంటోంది. ఈ బృంద సారథి జెఫర్స్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆ మాట ముచ్చట మీకోసం.. - సాక్షి, సిటీబ్యూరో లోహ విహంగాన్ని వినువీధిలో రివ్వుమని ఎగిరిస్తూ.. దాని పొగతో అద్భుత చిత్రాలను ఆవిష్కరించడమే సింక్రనైజ్డ్ స్మోక్ యాక్ట్స్. ఈ విన్యాసాలు చేయడంలో మార్క్ బృందం దిట్ట. ఇండియా ఏవియేషన్-2016లో విన్యాసాలు సృష్టించేందుకు రెండోసారి నగరానికి వచ్చిన ఈ బ్రిటీష్ బృందం.. వీక్షకుల మన్ననలు అందుకుంటోంది. 37 ఏళ్లుగా ఈ విన్యాసాల్లో విహరిస్తున్న మార్క్ వయసు 50కి పైనే. వైమానిక దళంతో ఏ మాత్రం సంబంధం లేని ఈయన విమానాలతో నింగిలో ఆటలాడుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. కేవలం విమానాల మీద ఉన్న ఆసక్తే తనను ఈ రంగంలోకి తీసుకొచ్చిందని చెబుతారు మార్క్. ఈయన ఔత్సాహికులైన మరో నలుగురితో కలిసి ‘గ్లోబల్ స్టార్ ఏరోబాటిక్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ఈ బృందం సామూహిక విహంగాల విన్యాసాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంది. యువతలో స్ఫూర్తికి ‘ఎస్టీఈఎం’... ‘యువత ‘ఎస్టీఈఎం’ వైపు నడిచేలా మా విన్యాసాలతో స్ఫూర్తినిస్తున్నాం. ఎస్టీఈఎం అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెకానిక్స్. ఈ నినాదాన్ని మా విన్యాసాలతో యూత్‌లోకి తీసుకెళ్లి వారిని విమానయాన రంగం వైపు అడుగులు వేయించాలన్నదే మా అభిమతం. బ్రిటిష్ ఏరోబాటిక్ అకాడమీకి వేదిక లాంటి కేంబ్రిడ్జి షైర్లోని గ్రాన్స్డెన్లో మా ఏరోబాటిక్ శిక్షణ కేంద్రం ఉంది. దీని ద్వారా ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నాం. గతేడాది భారత్‌లో 10, ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌లో ఆరు ప్రదర్శనలిచ్చాం. ఈ షో ముగిశాక పుణెలో ప్రదర్శనకు వెళ్తామ’ని చెప్పారు మార్క్. ఐ లవ్ హైదరాబాద్... భారత్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హైదరాబాద్. 2014 ఏవియేషన్ షోకి నా మిత్రుడు టామ్‌తో వచ్చాను. అప్పుడు ఇక్కడి సందర్శకుల నుంచి వచ్చిన స్పందన నేను ఇప్పటికీ మర్చిపోలేను. అదే ప్రోత్సాహం ఈ సారి మరో ఇద్దరు మిత్రులు మైకేల్ పికెన్, కేత్ టేయర్లను తీసుకొచ్చేలా చేసింది. గత ఏవియేషన్ షోలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ప్రదర్శనలిచ్చాం. ఈసారి నాలుగు క్రాఫ్ట్‌లతో విన్యాసాలు చేస్తున్నాం. - మార్క్ జెఫర్స్ లైవ్ రికార్డింగ్.. ఈ విన్యాసాల కోసం సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏర్పాటు చేసుకుందీ బృందం. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒకరు మాత్రమే కూర్చునే వీలుంటుంది. ఇందులో విన్యాసాలకు అవసరమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. వీరు చేసే విన్యాసాలను రికార్డు చేసేందుకు లైవ్ కెమెరాలు ఉంటాయి. గల్లంతైన వ్యక్తులను గుర్తించే ‘కాప్టర్’ ప్రమాదకర పరిస్థితుల్లో గల్లంతైన వ్యక్తులను గుర్తించే ఆధునిక పరికరం అటానమస్ కాప్టర్‌ను చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎం వర్సిటీ విద్యార్థులు రూపొందించారు. ల్యాప్‌టాప్ సహాయంతో గూగుల్ మ్యాప్‌లో పాయింట్లు సెట్ చేస్తే ఈ కాప్టర్ టేకాఫ్ అవుతుంది. అప్పటికే ఈ కాప్టర్‌పై ఏర్పాటు చేసిన కెమెరా లైవ్ వీడియో రికార్డు చేసి ఫొటోలు కూడా తీసేస్తుంది. పెట్రోల్ సహాయంతో నడిచే ఈ విహంగం సుమారు రెండు గంటల పాటు ఐదు కిలోమీటర్ల ఎత్తులో 240 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఫొటోలు తీసి సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. దీంతో గల్లంతైన వ్యక్తుల సమాచారాన్ని తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయొచ్చు. క్లిష్టమైన పరిస్థితుల్లో అదృశ్యమైన వ్యక్తులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తుందని విద్యార్థులు శ్రేయస్ వాసుదేవన్, భరుణ్, అరుణమ్ అంటున్నారు. రెండు నెలలు శ్రమించి ఫైబర్ గ్లాస్, వుడ్ ఉపయోగించి దీనిని తయారు చేశామన్నారు. విమానాలను లాగేస్తుంది.. బస్‌ను పార్క్ చేసిన చోటు నుంచి మరో చోటుకి మార్చాలంటే పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ రోడ్డుపై బస్ ఆగిపోతే మరో వాహనంతో లాక్కెళ్లడం సాధారణ విషయమే. అదే విమానాల విషయానికొస్తే.. రన్‌వేపై పార్క్ చేసిన విమానాన్ని మరో చోటుకి మార్చాల్సి వస్తే పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం. ఇక విమానం రన్‌వేపై ఆగిపోతే పరిస్థితేంటి? వీటికి సమాధానమే ఎయిర్‌సైడ్ సిమ్యులేటర్. పెద్ద విమానాలను అలవోకగా ముందుకు లాగడం లేదా వెనకకు తోయడం కోసం దీనిని వినియోగిస్తారు. పైగా విమానాలు వెనకకు ప్రయాణించే అవకాశం లేకపోవడంతో సైడ్ సిమ్యులేటర్ ఆధారంగా వెనకకు నెట్టి అవసరమైన చోట పార్క్ చేస్తారు. అనుభూతిని ‘కళ్లకు కడతారు’.. విమానం నడిపే అనుభూతిని పొందాలనుందా? ఫ్లైట్ ఇంజినీర్‌గా మారి ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? విమానంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఫీలింగ్ కావాలా.? వీటిలో ఏ అనుభూతిని పొందాలన్న మీరు విమానం ఎక్కాల్సిన అవసరం లేదు. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో హానివెల్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శిస్తే చాలు.. ఆ మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేక పరికరాన్ని కళ్లకు కట్టి, హెడ్‌ఫోన్స్‌ను చెవులకు అమరుస్తారు. అంతే మీ తలను అటూ ఇటూ తిప్పుతుంటే విమానంలో పైలట్, ఇంజినీర్, ప్యాసింజర్ స్థానాల్లో కూర్చుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి ఫీలింగ్‌ని పొందొచ్చు. మీరూ వెళ్లాలంటే... ♦ నేడు బిజినెస్ సందర్శకులకు మాత్రమే ప్రవేశం. టికెట్ ధర: రూ.700 ♦ 19, 20 తేదీల్లో సామాన్య సందర్శకులకు ప్రవేశం. టికెట్ ధర: రూ.300 ♦ వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ♦ www.bookmyshow.comవెబ్సైట్లో టికెట్లు లభిస్తాయి. ♦ ఎయిర్ షో వేళలు: ఉదయం 11 నుంచి 11.15, మధ్యాహ్నం 3 నుంచి 3.15 ♦ పార్కింగ్ బేగంపేట విమానాశ్రయం కార్గో ఏరియాలో వాహనాలు పార్క్ చేయాలి. ♦ ఫుడ్ బయట నుంచి ఆహారం, మంచినీరు అనుమతించరు. ఎగ్జిబిషన్ ప్రాంగణంలోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. -
‘రాజహంస’ కోసం క్యూ కట్టారు..
ఏవియేషన్ షోలో రెండో రోజూ సందర్శకుల కిటకిట హైదరాబాద్: పొగలు కక్కుతూ ఆకాశంలోకి దూసుకుపోవడం... అంతలోనే కిందపడుతుందేమో అనిపించడం.. మళ్లీ వేరే డెరైక్షన్‌లో విమానం దూసుకుపోవడం.. దానికి వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్ అయిపోతాయేమో అని భ్రమ కల్పించడం.. మొత్తం గా ఏవియేషన్ షోలో వైమానిక విన్యాసాలు సందర్శకులను ఊపిరి బిగబట్టేలా చేశాయి. రెండో రోజు కూడా ఏవియేషన్ షో కిటకిటలాడింది. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వైమానిక విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. మరోవైపు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎగ్జిబిషన్లో తమ ఉత్పత్తుల స్టాల్స్‌ను ప్రదర్శించారు. విమానయానానికి అనుబంధంగా ఆయా ఉత్పత్తులు అధునాతన టెక్నాలజీని సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అందరి బాటా... రాజహంస వైపే.. ఏవియేషన్ షోకే హైలైట్‌గా నిలుస్తోన్న ఎమిరేట్స్(రాజహంస)ను చూసేందుకే సందర్శకులు మక్కువ కనబరుస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ ఆ డబుల్ డెక్కర్ విమానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు సైతం ఏవియేషన్ షోను సందర్శించి ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కి అందులోని ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఇక సందర్శకులైతే మండుటెండలో క్యూలో నిలబడి ఆ విమానాన్ని చూసి మహదానందం పొందారు. -
ఏవియేషన్ షో-2016
-
రివ్వుమంటూ రిహార్సల్స్...
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో జరిగే ఏవియేషన్ ఎగ్జిబిషన్లో భాగంగా లోహ విహంగాలు గగనంలో రిహార్సల్స్ చేశాయి. నాలుగు విమానాలు వాయువేగంతో నింగి వైపు దూసుకుపోయి విభిన్న ఆకృతులను ఆవిష్కరించి అద్భుత విన్యాసాలకు తెరలేపాయి. ఏవియేషన్ షోకు ముందే బేగంపేట్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతవాసులు ఈ విన్యాసాలను తిలకించి ఆనందపారవశ్యులయ్యారు. కాగా ఏవియేషన్ నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం వరకు వివిధ కంపెనీల విమానాలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నాయి. -
16న హైదరాబాద్‌కు ప్రణబ్ ముఖర్జీ
హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 16న హైదరాబాద్ రానున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగే సివిల్ ఏవియేషన్ షో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ప్రణబ్‌ను ఆహ్వానించనున్నారు.16వ తేదీ మధ్యాహ్నం 2.50 ని.లకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రణబ్ చేరుకుంటారు. ఎయిర్ షో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లతారు.