
సనత్‌నగర్: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో నాలుగు రోజులు నిర్వహించిన వింగ్స్ ఇండియా–2018 ఏవియేషన్ షో ఆదివారంతో ముగిసింది. వీకెండ్ కావడంతో సందర్శకులు భారీగా వస్తారని ఆశించిన నిర్వాహకులకు
ఆశాభంగమే ఎదురైంది. దీనికికారణం.. ఆశించిన స్థాయిలో విమానాలు, అసలు వైమానిక ప్రదర్శనలే లేకపోవడం. అంతేకాకుండా స్టాళ్లు కూడా శనివారం నాటికే సగం ఖాళీ అయిపోయాయి. ఆదివారం అక్కడక్కడ కనిపించాయంతే! ఎంతో ఉత్సాహంతో ప్రదర్శనకు వచ్చిన సిటీజనులకు నిరాశే మిగిలింది. మొత్తానికి ఏవియేషన్ షో... సోసోగా అనిపించింది. నగరవాసులను అలరించలేకపోయింది.