Phone number
-
ఫోన్ నంబర్ ఇక ఫ్రీ కాదు.. ట్రాయ్ షాకింగ్ ప్రతిపాదన
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఫోన్ నంబర్ లేని వారంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతిఒక్కరికి వ్యక్తిగత ఫోన్ నంబరో లేక ల్యాండ్‌లైన్ నంబరో ఏదో ఒకటి ఉంటుంది. యూజర్లు తమ అవసరాలను బట్టీ వాటికి రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఫోన్ నంబర్ కోసం ఇప్పటి వరకూ ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్ కోసం త్వరలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్‌ను అత్యంత విలువైన, పరిమితమైన ప్రజా వనరుగా భావిస్తున్న ట్రాయ్ ఈ నంబర్లకు గానూ మొబైల్ ఆపరేటర్లపై ఛార్జీలు విధించాలని ప్రతిపాదించింది. కంపెనీలు వీటిని వినియోగదారుల నుంచి రికవరీ చేయవచ్చు. అలాగే ఎక్కువ నంబర్లు కలిగి తక్కువ వినియోగం ఉన్న టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే అవకాశాన్ని ట్రాయ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ సహా పలు దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్లకు ఫీజులు విధిస్తున్నాయి. భారత్‌లోనూ నంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి చర్యలను అవలంబించాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఛార్జీల అమలుకు ట్రాయ్ పలు మార్గాలను సూచించింది. ప్రభుత్వం ప్రతి నంబర్‌కు వన్ టైమ్ ఛార్జీ లేదా వార్షిక రుసుమును విధించవచ్చు. ఇక ప్రీమియం లేదా 'వీఐపీ' నంబర్ల కోసం వేలం నిర్వహించవచ్చు.प्रेस विज्ञप्ति संख्या 27/2024 - राष्ट्रीय नंबरिंग योजना के संशोधन पर परामर्श पत्र के संबंध में ।Press Release No. 27/2024 regarding Consultation Paper on Revision of National Numbering Plan.https://t.co/AQC11neBSr— TRAI (@TRAI) June 7, 2024 -
పదేళ్లు పూర్తయిన వారందరికీ ఆధార్ నవీనీకరణ తప్పని సరి
సాక్షి,మేడ్చల్ జిల్లా: ఆధార్ కార్డు నవీకరణ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. కార్డులు పొంది పదేళ్లు పూర్తయిన వారు, ప్రస్తుతం ఉన్న కార్డులను నవీనీకరించుకోవాలని ఇప్పటికే యూఐడీఏఐ సూచించింది. ఆధార్ కార్డు నవీనీకరణకు మొదట జూన్ 14 వరకు గడువు విధించారు. అయితే ప్రజల నుంచి నామ మాత్రంగా స్పందన రావడంతో గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. 2010–18 సంవత్సరాల మధ్య ఆధార్ కార్డులు పొందినవారు సెపె్టంబరు 14 వరకు ఉచితంగా నవీనీకరించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. రెండు రకాలుగా... ఆధార్ కార్డును మై–ఆధార్ పోర్టల్, ఎం–ఆధార్ యాప్‌లో ఉచితంగా నవీనీకరించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న శాశ్వత ఆధార్ కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఆధార్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు గతంలో ప్రజలు చెప్పిన వ్యక్తిగత వివరాలను మాత్రమే హడావుడిగా నమోదు చేశారు. చాలా మంది తప్పుడు సమాచారం ఇచి్చనట్లు గుర్తించారు. ప్రస్తుతం,.. గతంలో ప్రజలు వెల్లడించిన వివరాల ప్రకారం ధ్రువపత్రాలను అప్లోడ్ చేసి నవీనీకరించుకోవచ్చు. నవీనీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని ఖచి్చతంగా సమరి్పంచాల్సి ఉంటుంది. అక్షరాస్యులైతే పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్తే సరిపోతుంది. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ పత్రం, తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రాలను తీసుకెళ్లి ఆధార్ కార్డు నవీనీకరణను పూర్తి చేసుకోవచ్చు. ఇతర మార్పులకు ఇలా... ప్రస్తుతం పదేళ్లు దాటిన వారందరూ ఆధార్ కార్డు సమాచారాన్ని నవీనీకరించుకోవాల్సి ఉంది. దీంతోపాటు పేరులో అక్షరాలను సరి చేసుకోవడానికి, ఫొటో, చిరునామా మార్పు, ఫోన్ నంబర్లలో మార్పులు చేసుకోవచ్చును. జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో లేవు. నవీనీకరణకు తప్పనిసరిగా మండల కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గతంలో కొత్తగా ఆధార్ కార్డుల జారీ సమయంలో గ్రామాల వారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ నవీనీకరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
AP: వలంటీర్ మారినా ఫోన్ నంబర్ మారదు
సాక్షి, అమరావతి: ఏదైనా కారణంతో వలంటీర్ మారినా.. సమాచారం విషయంలో ఆ క్లస్టర్ పరిధిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగర కార్పొరేషన్లలో క్లస్టర్ వారీగా శాశ్వత ఫోన్ నంబర్‌ను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వం ప్రతి వలంటీర్‌కు మొబైల్ ఫోన్‌తో పాటు సిమ్‌ను కూడా అందజేసింది. అయితే ఏ కారణంతోనైనా ఏదైనా ప్రాంతంలో వలంటీర్ విధుల నుంచి తప్పుకొని తనకు కేటాయించిన ఫోన్ నంబర్ తిరిగి ఇవ్వనప్పుడు ఆ క్లస్టర్ పరిధిలోని ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బంది ఇకపై తలెత్తకుండా విధుల నుంచి తప్పుకొన్న వలంటీర్‌కు కేటాయించిన సిమ్‌ను బ్లాక్ చేసి, అదే నంబర్‌తో కొత్త సిమ్ తీసుకొని కొత్త వలంటీర్‌కు అధికారులు అందజేయనున్నారు. ఇందుకోసం వలంటీర్లకు ప్రభుత్వం కేటాయించిన ఫోను నంబర్ల వివరాలను రాష్ట్ర స్థాయి ఆన్లైన్ డేటా బేస్ సెంటర్లో నమోదు చేస్తున్నారు. ఈ నెల పదో తేదీ కల్లా ప్రతి వలంటీర్ తమ మొబైల్ నంబర్ వివరాలతో పాటు సిమ్ కార్డు వివరాలు రాష్ట్ర స్థాయి డేటా బేస్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా సరైన సిగ్నల్ లేక ప్రభుత్వం కేటాయించిన సిమ్ కాకుండా వలంటీర్లు తమ సొంత ఫోన్ నంబర్ వాడుతుంటే.. అలాంటి చోట్ల సరైన సిగ్నల్ ఉండే కంపెనీలకు చెందిన ఫోన్ నంబర్లనే వలంటీర్లకు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. (క్లిక్ చేయండి: వైద్య శాఖలో కొలువుల జాతర) -
ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్లు.. పొరపాటా లేక స్పష్టత కోసమా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో భాగంగా జారీ చేసిన నోటీసులలో గందరగోళం నెలకొంది. సోమవారం హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్లు లక్ష్మీ జనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇరువు రూ విచారణకు వచ్చేటప్పుడు వారు వినియోగించే మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వెంట తీసుకురావాలని నోటీసులో సిట్ పేర్కొంది. ఫలానా ఫోన్ నంబరు, ఫలానా ఐఎంఈఐ నంబరు గల సెల్‌ఫోన్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని ఆదేశించింది. ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం లేదా చెరపడం కానీ చేయరాదని పేర్కొంది. అయితే బీఎల్ సంతోష్, శ్రీనివాస్.. ఇద్దరికీ సిట్ జారీ చేసిన నోటీసులలో పేరొన్న ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబర్లు ఒకటే ఉండటం గందరగోళానికి తెరతీసింది. ముద్రణలో పొరపాటేనా.. ఇరువురు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సిట్ విచారణాధికారి, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ బి.గంగాధర్ ఈ నెల 16న నోటీసులు జారీ చేశా రు. అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరికీ నోటీసులు జారీ చేసే క్రమంలో ముద్రణలో పొరపాటు జరిగిందా? లేక దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నంబరు ఎవరి దగ్గర ఉంది? ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకోవటానికే అలా ఇద్దరి నోటీసుల్లోనూ ఒకటే ఫోన్, ఐఎంఈఐ నంబర్ల ను పేర్కొన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబరుకు ‘సాక్షి’ కాల్ చేసేందుకు ప్రయత్నించగా.. ట్రూ కాలర్‌లో బీఎల్ సంతోష్ అనే పేరు రావటం గమనార్హం. దీంతో శ్రీనివాస్‌కు జారీ చేసిన నోటీసు ముద్రణలో సిట్ అధికారు లు పొరపాటు చేసి ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ఈనెల 29లోగా దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సమయం తక్కువగా ఉండటంతో నోటీసుల జారీలో పొరపాట్లు దొర్లి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్కా పట్టణం కాగా.. సిట్ అధికారులు మాత్రం బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎవరికీ భౌతికంగా అందించలేదు.. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు హరియాణాలోని ఫరీదాబాద్ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహాయాజీలను విచారించి న పోలీసులు వారి నుంచి మరింత సమాచారా న్ని రాబట్టారు. వీటి ఆధారంగా సంతోష్, శ్రీనివాస్‌లతో పాటు కేరళలో బీజే పీకి మిత్రపక్షమైన భరత్ ధర్మజనసేన(బీడీజేఎస్) అధినేత తుషార్ వెల్లపళ్లి, రామచంద్రభారతికి మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామికి కూడా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కూడా సిట్ అధికారులు భౌతికంగా నోటీసులు అందించకపోవటం గమనార్హం. శ్రీనివాస్, జగ్గు స్వామి ఇళ్లకు నోటీసులు అతికించగా, తుషార్ ఇంట్లో లేకపోవటంతో ఆయన ఆఫీసు సెక్రటరీకి నోటీసులు అందించారు. అయితే ఈనెల 3న సీఎం కేసీఆర్.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి సంభాషించిన ఆడియో, వీడి యో రికార్డులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో రామచంద్రభారతి, బీఎల్ సంతోష్, సునీల్‌కుమార్ బన్సల్, తుషార్ పేర్లను పలుమార్లు ప్రస్తావించారు. ఇందులో సంతోష్, తుషార్లకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. బన్సల్‌కు నోటీసులు జారీ చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత కోసమేనా? కాగా.. అరెస్టు సమయంలో రామచంద్రభా రతి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోని కాంటాక్ట్‌లను పరిశీలించగా.. ‘సంతోష్ బీజేపీ’ పేరిట ఉన్న ఫోన్ నంబర్‌కు ఇంగ్లీషులో పంపిన సందేశాలను పోలీసులు గుర్తించారు. ‘నేను రామచంద్రభారతిస్వా మీజిని, హరిద్వార్ బైఠక్‌లో మిమ్మల్ని కలిశా. తెలంగాణలో కీలకాంశాలపై చర్చించాలి. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ అపాయింట్మెంట్ కావాలి, ఆ ముగ్గురికీ కొంత విట మిన్ ఎం అవసరం.. వంటి పలు సందేశాలను పోలీసులు గుర్తించారు. సంతోష్ బీజేపీ నుంచి మాత్రం రామచంద్రభారతికి ఎలాంటి రిప్లైలు వచ్చినట్లు పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత కోసమే సిట్ అధికారులు బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌లకు ఇరువురికీ ఒకే ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబరును తీసుకురావాలని సూచించినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. అసలు ఆ ఫోన్‌ను ఎవరు వినియోగిస్తున్నారో బయటపడుతుందని చెపుతున్నారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్! -
ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు
ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలేముంటాయి? అతనికి సరైన క్వాలిఫికేషన్స్ లేకపోవడం. ఆ వ్యక్తి ఆ పొజిషన్‌కు సరిపోడనుకోవడం. వగైరా.. వగైరా. కానీ, కేవలం ఫోన్ నెంబర్లో ఓ దురదృష్టకరమైన సంఖ్య ఉందని చెప్పి... అభ్యర్థులను తిరస్కరించింది ఓ చైనీస్ ఎడ్యుకేషన్ కంపెనీ. ఫోన్ నెంబర్లోని 5వ స్థానంలో నెంబర్ 5 ఉన్న అభ్యర్థులను వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగం తప్పనిసరిగా కావాలనుకుంటే... మొబైల్ నెంబర్ మార్చుకొని రావాలని సూచించింది. గాంగ్డాంగ్లోని షెంగెన్కు చెందిన ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టిన ఈ నిబంధన చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంత అభివృద్ధి చెందినా... ఇప్పటికీ అతీత శక్తులను, మూఢ నమ్మకాలను అనుసరించే చైనా సామాజిక మాధ్యమాల్లో దీనిపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఎడ్యుకేషన్ కంపెనీ ఇలాంటి పిచ్చి రిక్రూటింగ్ పాలసీలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా వివక్ష చూపడమేనంటున్నారు. ఉద్యోగులను కాకుండా జ్యోతిష్యం చెప్పే ‘ఫెంగ్ షూయ్ మాస్టర్’ను రిక్రూట్ చేస్తే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే... పురాతన చైనీస్ భవిష్యవాణి ‘బుక్ ఆఫ్ చేంజెస్’ ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యని, అందుకే కొందరు దాన్ని అనుసరిస్తారని చైనీస్ సంఖ్యాశాస్త్ర నిపుణుడు, బ్లాగర్ జిమెంజున్ చెబుతున్నాడు. -
ఇదేమి రిక్రూటింగ్ పాలసీ: ఫోన్ నంబర్ మార్చుకుంటేనే ఉద్యోగం!
ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలేముంటాయి? అతనికి సరైన క్వాలిఫికేషన్స్ లేకపోవడం, ఆ పొజిషన్‌కు సరిపోడను కోవడం.. వగైరా. కానీ కేవలం ఫోన్ నెంబర్ లో ఓ దురదృష్టకరమైనసంఖ్య ఉందని చెప్పి.. అభ్యర్థులను తిరస్కరించింది ఓ చైనీస్ ఎడ్యుకేషన్ కంపెనీ. ఫోన్‌నెంబర్‌లోని 5వ స్థానంలో నెంబర్ 5 ఉన్న అభ్యర్థులను వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగం తప్పనిసరిగా కావాలనుకుంటే... మొబైల్ నెంబర్ మార్చుకొని రావాలని సూచించింది. గాంగ్డాంగ్లోని షెంగెన్కు చెందిన ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టిన ఈ నిబంధన చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ అతీత శక్తులను, మూఢనమ్మకాలను అనుసరించే చైనా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఎడ్యుకేషన్ కంపెనీ ఇలాంటి పిచ్చి రిక్రూటింగ్ పాలసీలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. ఇది వివక్ష చూపడమే నంటున్నారు. ఉద్యోగులను కాకుండా జ్యోతిష్యం చెప్పే ‘ఫెంగ్ షూయ్ మాస్టర్’ను రిక్రూట్ చేస్తే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే... పురాతన చైనీస్ భవిష్యవాణి ‘బుక్ ఆఫ్ చేంజెస్’ ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యని, అందుకే కొందరు దాన్ని అనుసరిస్తారని చైనీస్ సంఖ్యాశాస్త్ర నిపుణుడు, బ్లాగర్ జిమెంజున్ చెబుతున్నాడు. -
చిత్ర పరిశ్రమలో కలకలం.. సినీ దర్శకుడిపై ఫిర్యాదు
నటి మొబైల్ నంబర్ ఇవ్వకుంటే నీ భార్యను మానభంగం చేస్తానని బెదిరించిన దర్శకుడిపై చాయాగ్రాహకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రామాపురంపోలీసుల కథనం మేరకు.. రామాపురం, భారతీవీధికి చెందిన ఎంఎస్ ప్రభు 30 ఏళ్లుగా సినీ చాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు. ఏఎల్ సూర్య ఇతనికి 2006లో ఏఎల్ సూర్య అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. నటి పద్మప్రియతో భారతీయార్ పాటను వీడియోగా రూపొందించి ఇవ్వాల్సిందిగా సూర్య అడిగాడు. ఆ వీడియోలు రూపొందించి ఇవ్వడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే కొంతకాలం తర్వాత దర్శకుడు ఏఎల్ సూర్య తనకు నటి పద్మప్రియను పరిచయం చేయాల్సిందిగా ప్రభును కోరాడు. ఆమె ఫోన్ నంబర్ ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఎందుకని ప్రశ్నించడంతో గొడవ పడ్డాడు. పద్మప్రియ ఫోన్ నంబర్ ఇవ్వకుంటే నీ భార్యను మానభంగం చేస్తానని బెదిరించారని బాధితుడు ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చదవండి: (తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్) -
'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం'
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోని నాలెడ్జ్ సిటీలో ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్లో 24 గంటలు తెరిచి ఉండే ఒటినో రూఫ్ టాప్ హ్యాంగింగ్ బార్‌కు శనివారం రాత్రి 11.30 గంటలకు యూఎస్‌లో రీసెర్చ్ స్కాలర్, న్యూట్రీషియన్‌గా పనిచేస్తూ నగరంలో ఉండే రాజస్తాన్‌కు చెందిన ఓ యువతి (25)తో కలిసి విష్ణు, విక్రమ్‌లు వెళ్లారు. యువతికి పరిచయస్తుడైన మయాంక్ అగర్వాల్, అబ్రార్, సాదత్, అరీఫుద్ధీన్లతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి అదే బార్‌కు వచ్చారు. చదవండి: (నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం) అర్థరాత్రి దాటిన తరువాత మయాంక్, సాదత్లు యువతిని పక్కకు పిలిచి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాక్సర్ విక్రమ్ దాడిలో అబ్రార్ గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అబ్రార్ శనివారం తెల్లవారు జామున రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడంతో తనపై లైంగిక దాడి చేస్తామని బెదిరించారని బాధిత యువతి సోమవారం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విక్రమ్ దాడిలో అబ్రార్, మయాంక్ వర్గం దాడిలో విష్ణు గాయపడ్డారని చెప్పారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని, సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధితురాలితో పాటు విష్ణు, విక్రమ్‌లు మంగళవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్‌కు వచ్చారు. యువతి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా యువతి మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబీకులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. -
భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజున పంజాబ్ సీఎం సంచలన ప్రకటన.. దేశంలోనే ఫస్ట్..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఆలోచనలతో పంజాబ్‌లో వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది ఆప్ ప్రభుత్వం. ఇప్పటికే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి, మంత్రులకు టార్గెట్ విధించిన ఆప్ సర్కార్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. బుధవారం భగత్ సింగ్ బలిదానం చేసిన రోజైన షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా ఖట్కర్ కలాన్‌లో సీఎం మాన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల విగ్రహాల వద్ద నివాళి అర్పించిన అనంతరం పంజాబ్‌లో అవినీతిపరుల ఆట కట్టించేందుకు యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నంబర్(9501200200)ను సీఎం ప్రకటించారు. అందులో భాగంగానే యాంటీ కరప్షన్ యాక్షన్ లైన్ పేరుతో ఒక వాట్సాప్ నంబర్(9501200200)ను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ ఓ వీడియో పోస్ట్ విడుదల చేశారు. పంజాబ్‌లో ఎవరైనా లంచం అడిగినా, మరేదైనా అవినీతికి పాల్పడినట్లు ప్రజల దృష్టికి వస్తే ఈ వాట్సాప్ నంబర్‌కు వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసి పంపించాలన్నారు. అనంతరం సీఎం పర్యవేక్షణలో ఉన్న ఓ టీమ్ వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పంజాబ్‌ను అవినీతిమయం కాకుండా కాపాడుకుందామని సీఎం పిలుపునిచ్చారు. పంజాబ్‌ను అవినీతి రహితం చేస్తే అదే మనం స్వాతంత్ర్య సమర యోధులకు ఇచ్చి నివాళి అంటూ వ్యాఖ్యలు చేశారు. AAP PUNJAB GOVT LAUNCHES ANTI-CORRUPTION ACTION LINE! 📞 WhatsApp: 9501-200-200 "कोई रिश्वत मांगे तो मना मत करना! उसकी Audio/Video Recording कर लेना, हम उसके ख़िलाफ़ एक्शन लेंगे!" - CM @BhagwantMann #AAPagainstCorruption pic.twitter.com/TsXHUKH9Iq — AAP (@AamAadmiParty) March 23, 2022 -
ఒక్క ఫోన్ నెంబర్‌తో లూటీ... రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
హిమాయత్‌నగర్: అమెజాన్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుపై, మీ ఫోన్ నంబర్‌పై రూ. కోటి లాటరీ వచ్చిందని నగర మహిళకు ఎర వేశారు సైబర్ నేరగాళ్లు. రూ.కోటి మీ సొంతం కావాలంటే ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత డబ్బు చెల్లించాలన్నారు. దీనికి ఆశపడిన బాధితురాలు వారు కోరిన విధంగా పలు దఫాలుగా 15 రోజుల్లో రూ. 15 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లో జమ చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం చేతికి అందకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ నుంచి రూ. 11 లక్షలు... గోల్కొండ కేంద్రంగా పని చేస్తున్న ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి రూ. 11 లక్షలు మాయమైనట్లు కంపెనీ ప్రతినిధులు మంగళవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కంపెనీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాల ఫోన్ నంబర్లను ఇటీవల మార్చారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే కంపెనీ ఖాతా నుంచి రూ. 11 లక్షలు డెబిట్ అయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడగా రూ. 4 లక్షలను ఫ్రీజ్ చేయగలిగారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పోలీసులకు విదేశీ వనిత కృతజ్ఞతలు) -
Pegasus: ఏంటీ పెగాసస్.. భారీ డేటా హ్యాక్‌లో వాస్తవమెంత?
ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్ ‘పెగాసస్’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా డేటా హ్యాక్ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘ది వైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్ పేర్కొంది. యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list. — Subramanian Swamy (@Swamy39) July 18, 2021 దావా వేస్తాం 2018-19 నడుమ ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. గతంలో కూడా.. పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్వో గ్రూప్ మీద ఫేస్బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి. -
‘ఆహా.. నా నంబరు కావాలా! కుదరదు’
కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇంతకీ శ్రుతి ఏదైనా సినిమా ఆఫర్‌ని కుదరదంటే కుదరదన్నారా? అంటే.. కాదు... కాదు. ఇద్దరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ‘కుదరదు’ అని సమాధానం చెప్పారు శ్రుతి. ఇటీవల సోషల్ మీడియా లైవ్ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు శ్రుతీహాసన్. ఒక అభిమాని ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగితే ‘కుదరదు’ అని చెప్పారు. అలాగే మరో అభిమాని ‘మీ మొబైల్ నంబరు ఇస్తారా’ అని అడగ్గా ఈ ప్రశ్నకు కూడా శ్రుతి ‘ఆహా.. నా నంబరు కావాలా! కుదరదు’ అని సరదాగా చెప్పారు. ఇంకా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ– ‘‘క్రాక్’ సినిమాలో నేను చేసిన యాక్షన్ సీన్స్‌కు మంచి స్పందన లభించినందుకు సంతోషంగా ఉంది. ‘సలార్’ సినిమాలో నాకు అంతగా యాక్షన్ సీన్స్ లేవు. కానీ మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో ప్రభాస్‌తో యాక్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
లైవ్‌లో ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. వెంటనే ఇచ్చేసిన శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక ఈ బ్యూటీ లైవ్‌లోకి వచ్చిందంటే చాలు.. నెటిజన్లు తమ ధర్మ సందేహాలన్నింటిని బయటపెడతారు. శ్రీముఖి కూడా ఓపికగా, తనదైన శైలీలో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా లైవ్ చిట్ చాట్ చేసిన ‘రాములమ్మ’ఏకంగా ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాలు ఇండియాలో బ్యాన్ కాబోతున్నాయని వార్తలు రావడంతో వెంటనే లైవ్ లోకి వచ్చింది శ్రీముఖి. మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఓపెన్‌గా అడిగేయండి అంటూ ఆఫర్ ఇవ్వడంతో నెటిజన్లు రెచ్చిపోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ బ్యాన్ అయితే మీతో మాట్లాడటం ఎలా అక్కా? ఎస్సెమ్మెస్లొ మాట్లాడుకుందాం అక్క టోల్ ఫ్రీ నెంబర్ చెప్పు అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో వెంటనే ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన 9848032919 నెంబర్ ను శ్రీముఖి ఇచ్చింది. వీటితో పాటు తన పెళ్లి, రిలేషన్‌షిప్‌పై అడిగిన ప్రశ్నలకు కూడా శ్రీముఖి ఫన్నీ సమాధానాలు ఇచ్చి నవ్వులు పూయించింది. -
ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్ మీడియాలో నంబర్ షేర్ చేస్తే..
ముంబై: మగవారిలో కొందరు మగానుభావులు ఉంటారు. వీరికి సమయం, సందర్భం ఇలాంటి ఏం పట్టవు. ఆడగాలి సోకితే చాలు.. చిత్తకార్తి కుక్కలా మారిపోతారు. అవతలి మనిషి పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా వారిని వేధింపులకు గురి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ మహిళా కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం ప్లాస్మా, వెంటిలేటర్స్ కావాలి.. దాతలు ఎవరైనా సాయం చేయండని కోరుతూ.. సోషల్ మీడియాలో తన పర్సనల్ మొబైల్ నంబర్ షేర్ చేసింది. ఇంకేముంది.. మహిళ సెల్ నంబర్ దొరికడంతో కొందరు మృగాళ్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా.. లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దాంతో సదరు మహిళ ‘‘సాయం కోసం నంబర్ షేర్ చేసాను.. ఇలాంటి సమయంలో కూడా ఆడవారిని ఏడిపించే ప్రబుద్ధులు.. మెడికల్ ఎమర్జెన్సీలో కూడా కేవలం జననేంద్రియాలతో ఆలోచించే దరిద్రులు ఉంటారని అస్సలు అనుకోలేదు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు తమ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు’’ అంటుంది బాధితురాలు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన శస్వతి శివ అనే యువతి కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. వారి చికిత్సలో భాగంగా ప్లాస్మా, వెంటిలేటర్స్ అవసరం అయ్యాయి. దాంతో తనకు తెలిసిన వారందరికి కాల్ చేసి సాయం చేయమని అడిగింది. కానీ లాభం లేకపోయింది. లేట్ చేసిన కొద్ది కోవిడ్ బారిన పడిన వారికి ప్రమాదం. దాంతో ఆమె తన పరిస్థితిని వివరిస్తూ.. ప్లాస్మా, వెంటిలేటర్స్ కోసం అర్థిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది. దాతలు తనను సంప్రదించేందుకు వీలుగా ఆమె పర్సనల్ సెల్ నంబర్ని షేర్ చేసింది. ఇక మొదలైంది టార్చర్. ఫోన్ మోగిన ప్రతి సారి ఆమె తనకు సాయం లభిస్తుందనే ఉద్దేశంతో ఆశగా కాల్ లిఫ్ట్ చేసేది. కానీ చాలా సార్లు ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఆమెకు కాల్ చేసిన వారు అందరూ మగవారు. వారిలో చాలా మంది ‘‘మీరు ఎక్కడ ఉంటున్నారు’’.. ‘‘మీరు సింగిలా’’.. ‘‘నేను మీకు సాయం చేస్తాను కానీ నాతో డేట్‌కి వస్తారా’’.. ‘‘మీ డీపీ చాలా బాగుంది’’ వంటి చెత్తంతా వాగేవారు. ఇక మరి కొందరు ప్రబుద్ధులు మరో అడుగు ముందుకు వేసి.. వీడియో కాల్ చేయడం.. మార్ఫడ్ ఫోటోలు పంపడం చేశారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె ఫోటో కొన్ని అశ్లీల వెబ్సైట్లలో ప్రత్యక్షం అయ్యింది. ఏడుగురు వ్యక్తులు అయితే ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఆమెకు వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు. జరిగిన సంఘటనలు చూసి ఆమెకు చిరాకెత్తింది. సాయం చేయమని కోరుతూ నంబర్ షేర్ చేస్తే.. ఇతంటి భయానక అనుభవం ఎదురయ్యింది అంటూ వాపోయింది. దాంతో శస్వతి శివ ట్విట్టర్ ద్వారా తన బాధను వెల్లడించారు. తను ఎదర్కొన్న అనుభవాలను చెప్తూ.. ‘‘మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కూడా చాలా మంది మగవారు కేవలం తమ జననేంద్రియాలతో మాత్రమే ఆలోచిస్తారని.. పరిస్థితితో సంబంధం లేకుండా ఆడవారిని వేధిస్తారని ఈ ఘటనతో నాకు బాగా అర్థం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యక్తిగత నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి’’ అంటూ ట్వీట్ చేశారు. I thought it wouldn't get worse, but since this morning, I've received (on whatsapp) 3 dick pics, and 7 men trying to video call me continuously. Even in a medical emergency, men think only with their genitals. Women: NEVER, EVER let your number out in public forums. https://t.co/CAJJKiQmR6 — Shasvathi Siva (@shasvathi) April 16, 2021 చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది’ -
అడల్ట్ గ్రూప్స్‌లో నటి ఫోన్ నెంబర్
చెన్నై : డోమినోస్ పిజ్జా డెలివరీ బాయ్‌పై తమిళ నటి గాయత్రి సాయి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ఇంటికి పిజ్జా తీసుకువచ్చిన డెలివరీ బాయ్ ఆ తర్వాత ఆమె ఫోన్ నెంబర్‌ను వాట్సాప్‌లోని పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. దీంతో పలువురు ఆమెను వేధిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం, పోన్స్ చేయడం ప్రారంభించారు. వేధింపులతో ఆగ్రహానికి లోనైనా గాయత్రి.. తేనాంపేటలోని మహిళ పోలీస్ స్టేషేన్లో పిజ్జా డెలివరీ బాయ్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే ట్విటర్ వేదికగా తనకు ఎదురైన వేధింపులను వివరించారు. ‘ఫిబ్రవరి 9న చెన్నైలోని నా ఇంటికి డోమినోస్ డెలివరీ బాయ్ పిజ్జా తీసుకుని వచ్చాడు. పిజ్జా డెలివరీ చేసే సమయంలో అతడు మత్తులో ఉన్నాడు. అతడు నా ఫోన్ నంబర్‌ను పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించి అతని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అది పెండింగ్‌లోనే ఉంది. అతను నా నెంబర్ షేర్ చేయడంతో.. విపరీతమైన ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయ’ని గాయత్రి తెలిపారు. అలాగే పిజ్జా డెలివరీ బాయ్ ఫొటోను కూడా షేర్ చేశారు. తనకు వస్తున్న వాట్సాప్ మెసేజ్‌లను స్ర్కీన్ షాట్లను ఆమె ట్విటర్లో ఉంచారు. అలాగే తనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరారు. ఆన్లైన్లో ఆన్లైన్ యాప్‌లు తమ నెంబర్లు ఇతరులకు షేర్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మరోవైపు గాయత్ని ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో గాయత్రి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించారు. .@DrMRaviIPS1 commisioner called and said he is transferring the case to protection under women Sir. Hope other online apps do not share our numbers. Most of our orders these days are online. The complaint is lodged in Teynampet station sir https://t.co/0RiKZIo9es — Gayatri Sai (@gainsai) February 27, 2020 .@dominos_india this is how he spread it through Whatsapp @TNPOLICE_HQ please help pic.twitter.com/xePh7QsiGo — Gayatri Sai (@gainsai) February 26, 2020 -
ఓ ట్వీట్‌తో అడ్డంగా బుక్కయ్యాడు!
సోషల్ మీడియాలో అసందర్భంగా కామెంట్ చేసిన ఓ వ్యక్తికి పుణె పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు. సాయం కోసం ప్రయత్నించిన మహిళ ఫోన్ నెంబర్ కావాలని అడగడంతో.. పోలీసులు అతనికి తమదైన శైలిలో జవాబిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ న్యాయ విధ్యార్థిని ధనోరి పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలని ట్విటర్లో పూణె పోలీసులను కోరింది. దీనిపై స్పందించిన పూణె పోలీసు ట్విటర్ అధికార విభాగం.. ఆ మహిళకు ధనోరి పోలీస్ స్టేషన్ నెంబర్‌ను షేర్ చేశారు. అయితే ఇక్కడే ఓ నెటిజన్ పోలీసుల ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ప్లీజ్ నాకు ఆమె నెంబర్ ఇవ్వగలరా’ అని కామెంట్ చేశాడు. అతను అలా కామెంట్ చేయడంపై పూణె పోలీసులు ఘాటుగా స్పందించారు. అతన్ని హెచ్చరించడంతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సార్, ప్రస్తుతం మీ నెంబర్ తెలుసుకోవడానికి మేము ఎక్కువ ఆసక్తిగా ఉన్నాం. ఎందుకంటే.. మహిళల నెంబర్లపై మీకు ఎందుకంతా ఆసక్తి ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ గోప్యతకు మేము గౌరవం ఇస్తాం. అందుకే మీకు డైరక్ట్ మేసేజ్ చేస్తాం’ అని పేర్కొన్నారు. మహిళల పట్ల చులకన భావం ప్రదర్శించిన సదరు నెటిజన్‌కు పోలీసులు గట్టి కౌంటర్ ఇవ్వడంతో.. వారిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. @PuneCityPolice Can I get the number of Dhanori police station please. Need urgently! — Nidhi Doshi (@nidhidoshi12) January 12, 2020 @PuneCityPolice can i get her number please ? — Chiklu (@abirchiklu) January 12, 2020 Sir, we are more interested in your number currently, to understand your interest in the lady’s number. You may DM. We respect privacy. https://t.co/LgaD1ZI2IT — PUNE POLICE (@PuneCityPolice) January 12, 2020 -
రాంగ్ కాల్ రోమియోలు.. మెసేజ్‌లు, ఫొటోలు
కావలికి చెందిన దేవి (పేరు మార్చాం)కి చెందిన ఫోన్ నంబరుకు నెల రోజులుగా వాట్సాప్‌లో ఓ నంబరు నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయి. మెసేజ్‌లతో పాటు అశ్లీల వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నాడు. ఆ మెసేజ్‌లు చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వాట్సాప్ మేసేజ్‌ల వేధింపులపై కావలి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో మెసేజ్‌లు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో అసభ్యకరమై సందేశాలు వచ్చాయి. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమెనే అనుమానించి వేధించడం ప్రారంభించారు. నువ్వు వాడికి తెలియకపోతే నీ నంబరు ఎలా తెలుస్తుంది.. నీకెలా అంత ధైర్యంగా పంపిస్తాడంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న ఆమె కుటుంబంలో కలతలు చోటు చేసుకోవడంతో ఆమె మానసికంగా నరకాన్ని చవిచూస్తోంది. ఎవరో చేసిన తప్పుకు ఆమె శిక్ష అనుభవిస్తోంది. సాక్షి, నెల్లూరు: మహిళలకు ఇంటా.. బయటే కాదు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోనూ భద్రత లేకుండా పోతోంది. సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో రాంగ్ కాల్ చిచ్చు రగులుతోంది. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. పోకిరీలు మహిళలను టార్గెట్ చేసి వారిని లొంగదీసుకునేందుకు ‘మిస్డ్ కాల్’ వలలు విసురుతున్నారు. మహిళల అభద్రతాభావాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్ ఐడీలతో సిమ్‌లు సేకరిస్తున్నారు. ఏదొక నంబర్లకు కాల్ చేస్తున్నారు. ఎవరిదో మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి చేస్తే.. అది మహిళ గొంతు అయితే రాంగ్ కాల్ వచ్చిందంటూ మాటలు కలుపుతున్నారు. ఆ నంబర్లకు వాట్సాప్ ఆప్షన్ ఉంటే.. దానికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. వీరి మెసేజ్‌లకు ఎవరైనా తిరిగి రెస్పాండ్ అయితే.. ఆ మెసేజ్‌లను అడ్డం పెట్టుకునిబ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లోని కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలు సేకరించి, వాటి ద్వారా అశ్లీల వీడియోలు, ఫొటోలుగా మార్ఫింగ్ చేసి వారికే పంపించి ఆర్థికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చాలా వరకు పోలీస్స్టేషన్లకు వెళ్లడం లేదు. వీలైనంత వరకు సిమ్ నంబర్లు మార్చేసుకోవడం, ఖాతాలను బ్లాక్ చేసుకోవడం చేస్తున్నారు. కూలిపోతున్న కాపురాలు.. కుటుంబాల్లో కలతలు రాంగ్ కాల్ రోమియోలు చేష్టలకు కొన్ని కుటుంబాల్లో కలతలు చోటు చేసుకుంటుంటే.. మరి కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణే.. నెల్లూరు భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన మహిళ ఉదంతం. ఇంకా వెలుగుచూడని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అశ్లీల వీడియోలు, చిత్రాలతో మహిళలను మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు. కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్తే ఎక్కడ అపార్థం చేసుకుంటే.. ఏ పరిస్థితులకు దారి తీస్తాయో అనే భయంతో కుమిలిపోతున్నారు. ఈ పోకిరీల వలలో పడి కొందరు మహిళలు మోసపోయి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. వేధించడానికి ఆయుధంగా.. తమను ఇబ్బంది పెట్టిన మహిళలను వేధించడానికి కూడా కొందరు ఆయుధంగా వాడుకుంటున్నారు. కావలి మహిళకు పంపుతున్న మెసేజ్‌లు చూస్తుంటే.. ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆమె భూవివాదం విషయంలో నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేతతో పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇలాంటి మెసేజ్‌లు రావడంతో ఆ చోటా టీడీపీ నేతే తనను టార్గెట్ చేసి, వాట్సాప్‌లో అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నట్లు అనుమానిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు చెప్పినా.. మహిళల భద్రత విషయంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ మహిళలపై ఇలాంటి వేధింపుల విషయంలో పోలీసులు ఏ మాత్రం కఠిన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కావలికి చెందిన దేవి వాట్సాప్‌లో వేధింపుల విషయంలో గత డిసెంబర్ 10న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక పోలీసులు విచారణ కూడా చేపట్టకపోగా ఆ నంబర్‌ను బ్లాక్ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. పోలీసుల ప్రవర్తన వల్ల మహిళలు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఏటా మహిళలపై వేధింపుల ఫిర్యాదులు తగ్గుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నా వాస్తవంగా పోలీసుల తీరుపై నమ్మకం లేక వెలుగులోకి తేలేకపోతున్నారు. -
సన్నీ ఫోన్ నంబరు ఎంత పనిచేసింది!
ముంబై: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు తయారైంది ముంబై వాసి ప్రశాంత్ మిశ్రా పరిస్థితి. అధికారులు చేసిన పొరపాటు అతడికి పెద్ద చికాకు తెచ్చిపెట్టింది. లోక్‌సభ వెబ్సైట్లో పొరపాటున అతడి మొబైల్ నంబరు పెట్టడంతో నిరాంతరాయంగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ గురుదాస్‌పూర్ ఎంపీ, నటుడు సన్నీ డియోల్‌కు వెళ్లాల్సినవి. లోక్‌సభ వెబ్సైట్లో సన్నీ డియోల్ నంబరుకు బదులుగా ప్రశాంత్ మిశ్రా ఫోన్ నంబరు పెట్టారు. దీంతో అతడి ఫోన్‌కు రకరకాల ఫిర్యాదులు, అభ్యర్థనలతో ఫోన్లు, వాట్సప్, టెక్ట్స్ మెసేజ్‌లు వస్తున్నాయి. సన్నీ డియోల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ముంబైలో ఉంటున్నారని గురుదాస్‌పూర్ వాసుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. సన్నీడియోల్‌ను తమ ఎంపీగా ఎన్నుకుని తప్పు చేశామని చాలా మంది వాపోయారు. సన్నీడియోల్‌ను కలవాలని ఆయన అభిమానులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని ప్రశాంత్ మిశ్రా వాపోయాడు. గతేడాదే ఈ ఫోన్ నంబరు తీసుకున్నానని, లోక్‌సభ వెబ్సైట్లో పొరపాటుగా తన నంబరు పెట్టడంతో వేలాదిగా ఫోన్లు వస్తున్నాయని తెలిపాడు. తన నంబరును లోక్‌సభ వెబ్సైట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాడు. సన్నీ డియోల్ ఫోన్ నంబరును లోక్‌సభ వెబ్సైట్లో అప్డేట్ చేశారని ఆయన వ్యక్తిగత సహాయకుడు నిరంజన్ విద్యాసాగర్ తెలిపారు. పొరపాటుగా పెట్టిన ప్రశాంత్ నంబరును అధికారులు తొలగిచారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా సన్నీ డియోల్ గెలిచిన సంగతి తెలిసిందే. -
లీకైన సన్నీ లియోన్ ఫోన్ నంబర్..?
న్యూఢిల్లీ: సెలబ్రిటీ నంబర్ అంటూ మీ ఫోన్ నంబర్‌ను లీక్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. రోజంతా విపరీతంగా కాల్స్, మెసేజ్‌లతో బుర్ర బద్దలవుతుంది. ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వల్కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సన్నీ లియోన్ నంబర్ అంటూ పునీత్ నంబర్‌ను లీక్ చేశారు. ఇంకేముంది ఓ వారం రోజుల నుంచి ఒకటే ఫోన్లు, అసభ్య సందేశాలట. విసిగి పోయిన పునీత్.. ‘అర్జున్ పటియాలా’ సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతనికి కాల్స్ వస్తే.. సినిమా మీద ఫిర్యాదు చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే ఉంది అసలు విషయం. సన్నీ లియోన్ నటించిన 'అర్జున్ పటియాలా' సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో వచ్చే ఓ సన్నివేశంలో సన్నీ, పోలీస్ అధికారికి తన తన ఫోన్ నంబర్ ఇస్తుంది. దురదృష్టం కొద్ది ఆ నంబర్ కాస్త పునీత్‌ది కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ నంబర్ నిజంగా సన్నీదే అని చాలామంది నోట్ చేసేసుకున్నారు. చేసుకోవడమే కాదు.. ఆ నంబర్‌కు ఫోన్ చేసి సన్నీ మేడమేనా మాట్లాడేది? అంటూ ఆరా తీశారు. కాదని బదులిస్తే.. అసభ్యకరంగా తిడుతూ ఫోన్ పెట్టేసేవారు. ఇలా దాదాపు రోజుకు 100-200 కాల్స్, అసభ్య సందేశాలు రావడంతో విసిగి పోయిన పునీత్ పోలీసులను ఆశ్రయించాడు. కానీ ఈ విషయంలో వారు కూడా ఏం చేయలేకపోవడంతో.. కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నాడు. సాధరణంగా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాల్లో వాడుకలో లేని ఫోన్ నంబర్లను ఇవ్వడం పరిపాటి. కానీ ఇందుకు విరుద్ధంగా చిత్రంలో పునీత్ నంబర్‌ను వాడారు. దాంతో అప్పటి నుంచి అతడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. -
మొబైల్ నెంబర్ మారుస్తున్నారా ! ఐతే జాగ్రత్త
కర్ణాటక, బనశంకరి : బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అఇన మీ మొబైల్ నెంబరు మార్చాలని ఆలోచిస్తున్నారా అలాగైతే హుషార్ కావాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే మీ అకౌంట్లో ఉన్న నగదు దోచేయడం ఖాయం. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన సిమ్‌కార్డుకు బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కాబడిన మొబైల్ నెంబరు తీసుకున్న మరో వ్యక్తి పేటీఎం వ్యాలెట్ వినియోగించి అతడి అకౌంట్ నుంచి నగదు దోచేసిన ఘటన వెలుగుచూసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ మొబైల్ బ్యాంకింగ్ ఇతర బ్యాంకింగ్ సేవలకు మొబైల్ నెంబరు కచ్చితంగా ఉండాలి. సైబర్ క్రైం నేరాలను అడ్డుకట్టవేయడం, భద్రత కోసం భారతీయ రిజర్వుబ్యాంక్ కూడా ఇప్పటికే లింక్ ఆదేశాలు జారీ చేస్తూ ఆర్దినెన్స్ విడుదల చేసింది. ఈ సేవలను పొందినప్పుడు మొబైల్ కు వచ్చే ఓటీపీ చాలా ముఖ్యం. దీనిపై నిఘా వహించకపోతే బ్యాంక్ అకౌంట్లో నగదు మాయం కావడం తథ్యం. కొడగు జిల్లా కుశాలనగరకు చెందిన వ్యక్తి అష్రఫ్ దుబాయిలో ఉంటున్నాడు. ఇతను తన బ్యాంక్ అకౌంట్‌కు, పేటీఎం, వ్యాలెట్‌కు లింక్ చేసి మొబైల్ నెంబర్‌ను ఇటీవల తొలగించాడు. కానీ కొత్త మొబైల్ నెంబరును బ్యాంక్‌లో లింక్ చేయలేదు. దుబాయి నుంచి అష్రఫ్ కుశాలనగర బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమచేసి తల్లిదండ్రులకు పంపించేవాడు. కానీ అష్రఫ్ తొలగించిన మొబైల్ నెంబరు సిమ్‌కార్డు కంపెనీ దావణగెరె భరత్ అనే వ్యక్తికి విక్రయించింది. భరత్ కొనుగోలు చేసిన కొత్త సిమ్‌కార్డుకు అష్రఫ్ బ్యాంకింగ్ మెసేజ్‌లు మొబైల్‌కు వస్తున్నాయి. మొదట పట్టించుకోని భరత్ అనంతరం మొబైల్‌కు పేటీఎం, వ్యాలెట్ యాక్టివేట్ చేసుకున్నాడు. తక్షణం అష్రఫ్ బ్యాంక్ అకౌంట్‌తో సహ సింక్ కాబడింది. అనంతరం భరత్ పేటీఎం వ్యాలెట్‌తో తన బ్యాంక్ అకౌంట్‌కు నాలుగురోజుల్లో రూ.79,994 వేలు నగదు జమ అయింది. దీంతో కంగారుపడిన అష్రఫ్ కొడగు జిల్లా సీఐఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మొబైల్ నెంబర్ ఆధారంగా భరత్‌ను బుదవారం అరెస్ట్ చేశారు. -
అనుపమ నంబర్ మారింది
సినిమా: హీరోయిన్ల వెతలు అంతా ఇంతా కాదు. రిజర్వుగా ఉంటే టెక్కు ఎక్కువ అంటారు. కాస్త ఫ్రీగా ఉంటే అలుసుగా తీసుకుని ఏకాంతాన్ని భంగం కలిగిస్తుంటారు. వీళ్లతో ఎలాగబ్బా ఏగేది అని తల పట్టుకుంటున్నారు కొందరు హీరోయిన్లు. ఎవరి సంగతి ఏమోగానీ, నటి అనుపమ పరమేశ్వన్ పరిస్థితి మాత్రం ఇదే. ఈ మలయాళీ బ్యూటీ దక్షిణ భారతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. అయితే అందాలారబోత విషయంలో కొన్ని పరిమితులను విధించుకున్న ఈ అమ్మడికి అవకాశాలు నత్తనడకగానే వస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ అనుపమను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో తెలుగు, తమిళం భాషల్లోనే దృష్టి సారిస్తోంది. ఇకపోతే ఈ కేరళా కుట్టి చిత్ర వర్గాలతో చాలా చనువుగా ఉంటుందట.ఈమె ఫోన్ నంబరు కూడా చాలా మందికి తెలుసట. అనుపమ చనువు ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారిందట. నటినటులతో పాటు సాంకేతిక వర్గం కూడా తరచూ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుండడంతో అనుపమ ప్రైవసీని కోల్పోతోందట. వారిపై విసుగు, కోపం కలుగుతున్నా, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి కావడంతో ఇక చేసేదేమీలేక తన సెల్‌ఫోన్ నంబరునే మార్చేసిందట. ఇది చాలా మందిని నిరుత్సాహపరుస్తున్నా, అనుపమకు మాత్రం అభిమాన గోల తప్పిందని సంతోషపడుతోందట. -
మావోల లేఖల్లో దిగ్విజయ్ నంబర్
పుణె: ఎల్గార్ పరిషత్ కేసు విచారణలో భాగంగా తమకు లభించిన లేఖల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నంబర్ ఉందని పుణె పోలీసులు వెల్లడించారు. దాంతో చార్జిషీట్లో దానిని చేర్చామన్నారు. సెప్టెంబర్ 25, 2017న సురేంద్ర గాడ్లింగ్ అనే మానవహక్కుల కార్యకర్తకు మావోయిస్టు నేత నుంచి వచ్చిన ఒక లేఖలో దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నెంబర్ ఉందని తెలిపారు. ‘విద్యార్థుల సహకారంతో దేశవ్యాప్త నిరసనలను మనం మరింత తీవ్రతరం చేయాలి. సాధారణంగా పోలీసులు విద్యార్థులతో కఠినంగా వ్యవహరించలేరు. అది మనకు అనుకూలత. మన ఉద్యమాలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెంబర్లో మన మిత్రుడిని సంప్రదించగలరు’ అని ఆ లేఖలో ఉందన్నారు. ఆ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేనని పోలీసులు భావిస్తున్నారన్నారు. ఆ నంబర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లోనూ ఉందని ఒక పోలీసు అధికారి చెప్పారు. దిగ్విజయ్ స్పందిస్తూ.. ధైర్యముంటే తనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌లకు సవాల్ విసిరారు. -
అదే నంబర్ రవికి ఎలా వచ్చింది ?
యశవంతపుర : ప్రముఖ రౌడీ, సైకిల్ రవితో ప్రముఖు సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణలో మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు సీసీబీ పోలీసుల విచారణలో బయటపడింది. ఎంబీ పాటిల్ మంత్రిగా ఉన్నప్పుడే రౌడీ రవినే మంత్రికి 24 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలు లభించాయి. ఈ సందర్భంగా నిందితుడు ఉపయోగించిన 11 ఫోన్లతో పాటు 38 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సిమ్ నంబర్ ద్వారా మాత్రమే ఎంబీ పాటిల్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. రవి ఉపయోగించిన సిమ్‌కార్డు మండ్యకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సచ్చిదానంద పేరుతో ఉంది. అదే నంబర్ రవికి ఏలా వచ్చిందో పోలీసులకు అర్థం కావటంలేదు. 2009 నుండి తానే ఉపయోగిస్తున్నట్లు సచ్చిదానంద చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అదే నంబర్‌ను రవి ఉపయోగించి ఉండవచ్చని సీసీబీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో విచారణ చేపట్టారు. ఇదే సమయంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టనుండటంతో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు చిత్ర రంగ ప్రముఖల్లో భయం నెలకొంది. రవి ఎవరో నాకు తెలియదు : మాజీ మంత్రి ఎంబీ పాటిల్ రవి ఏవరో తనకు తెలిదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో వెల్లడించిన నెంబర్ తనదేనని, తన వాట్సాప్ నెంబర్ కూడా అదేనన్నారు. అయితే రవి అనే వ్యక్తితో తనకు ఎప్పుడు పరిచయం లేదని, అతడిని ఒక్కసారి కూడా చూడలేదన్నారు. -
కిమ్‌కు వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చిన ట్రంప్
-
ఆదివారం నాకు ఫోన్ చేయమని చెప్పాను : ట్రంప్
ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది...ట్రంప్ - కిమ్‌ల భేటి గురించే. సింగపూర్ వేదికగా సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక భేటీ ఫలప్రదమైన సంగతి తెలిసిందే. సమావేశం ప్రారంభం నుంచి ఇరు దేశాల అధ్యక్షులు పాత వివాదాలను పక్కన పెట్టి నూతన చెలిమికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి...ఏకంగా తన డైరెక్ట్ ఫోన్ నంబర్‌ను కిమ్‌కు ఇచ్చాడు. అంతేకాక ఏదైన సమస్య తలెత్తితే మొహమాట పడకుండా తనకు ఫోన్ చేయమని మరి చెప్పాడంట కిమ్‌కు. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘నేను ఇప్పుడు అతనికి(కిమ్) ఫోన్ చేయగలను. అంతేకాక కిమ్‌కు ఏదైనా సమస్య వస్తే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయమని చెప్పాను. ఈ ఆదివారం నాకు ఫోన్ చేయమని కిమ్‌కు చెప్పానన్నా’డు. ఈ విషయం గురించి మీడియా...‘ఆదివారం మీరు ఎవరితో మాట్లడబోతున్నారు?’ అని అడగ్గా, అందుకు ట్రంప్ ‘ఉత్తర కొరియాలో ఉన్న నా దేశ ప్రజలు, అలానే ఉత్తర కొరియా ప్రజలతో మాట్లాడతానన్నా’డు.