
కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇంతకీ శ్రుతి ఏదైనా సినిమా ఆఫర్‌ని కుదరదంటే కుదరదన్నారా? అంటే.. కాదు... కాదు. ఇద్దరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ‘కుదరదు’ అని సమాధానం చెప్పారు శ్రుతి. ఇటీవల సోషల్ మీడియా లైవ్ సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు శ్రుతీహాసన్. ఒక అభిమాని ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగితే ‘కుదరదు’ అని చెప్పారు.
అలాగే మరో అభిమాని ‘మీ మొబైల్ నంబరు ఇస్తారా’ అని అడగ్గా ఈ ప్రశ్నకు కూడా శ్రుతి ‘ఆహా.. నా నంబరు కావాలా! కుదరదు’ అని సరదాగా చెప్పారు. ఇంకా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ– ‘‘క్రాక్’ సినిమాలో నేను చేసిన యాక్షన్ సీన్స్‌కు మంచి స్పందన లభించినందుకు సంతోషంగా ఉంది. ‘సలార్’ సినిమాలో నాకు అంతగా యాక్షన్ సీన్స్ లేవు. కానీ మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో ప్రభాస్‌తో యాక్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్.
Comments
Please login to add a commentAdd a comment