టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఫోన్ నంబర్ లేని వారంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతిఒక్కరికి వ్యక్తిగత ఫోన్ నంబరో లేక ల్యాండ్‌లైన్ నంబరో ఏదో ఒకటి ఉంటుంది. యూజర్లు తమ అవసరాలను బట్టీ వాటికి రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఫోన్ నంబర్ కోసం ఇప్పటి వరకూ ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్ కోసం త్వరలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్‌ను అత్యంత విలువైన, పరిమితమైన ప్రజా వనరుగా భావిస్తున్న ట్రాయ్ ఈ నంబర్లకు గానూ మొబైల్ ఆపరేటర్లపై ఛార్జీలు విధించాలని ప్రతిపాదించింది. కంపెనీలు వీటిని వినియోగదారుల నుంచి రికవరీ చేయవచ్చు. అలాగే ఎక్కువ నంబర్లు కలిగి తక్కువ వినియోగం ఉన్న టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే అవకాశాన్ని ట్రాయ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ సహా పలు దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్లకు ఫీజులు విధిస్తున్నాయి. భారత్‌లోనూ నంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి చర్యలను అవలంబించాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఛార్జీల అమలుకు ట్రాయ్ పలు మార్గాలను సూచించింది. ప్రభుత్వం ప్రతి నంబర్‌కు వన్ టైమ్ ఛార్జీ లేదా వార్షిక రుసుమును విధించవచ్చు. ఇక ప్రీమియం లేదా 'వీఐపీ' నంబర్ల కోసం వేలం నిర్వహించవచ్చు.
प्रेस विज्ञप्ति संख्या 27/2024 - राष्ट्रीय नंबरिंग योजना के संशोधन पर परामर्श पत्र के संबंध में ।
Press Release No. 27/2024 regarding Consultation Paper on Revision of National Numbering Plan.https://t.co/AQC11neBSr— TRAI (@TRAI) June 7, 2024
Comments
Please login to add a commentAdd a comment