new proposal
-
EPFO: ఈపీఎస్‌పై కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలు మారవచ్చు.ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ వేతనంలో 12% మొత్తం నెలవారీ కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎఫ్‌కు వెళుతుంది. యజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమచేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్-95 కింద పెన్షన్ నిధికి వెళుతుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్‌కి జమవుతుంది. అయితే ఇప్పటివరకు యాజమాన్యాలు జమచేసే 8.33 శాతంపై ఎలాంటి వడ్డీ రావడంలేదు. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెలా జమవుతూ ఉంటుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కంట్రిబ్యూషన్ మారవచ్చు. ఈపీఎఫ్ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది. దీనిపై ఈపీఎఫ్‌వో నిర్ధిష్ట వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.25% ఉంది. ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలు మారవచ్చు. మీడియా నివేదిక ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కి అనుగుణంగా ఈపీఎఫ్ సంపదను లెక్కించాలని, పెన్షన్ కార్పస్‌పై సంవత్సరానికి 8% వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్'ది హిందూ' నివేదిక ప్రకారం.. ఎన్పీఎస్ మాదిరిగానే ఈపీఎస్ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని, జమయిన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా 'ఫిక్స్డ్ పెన్షన్ జీతం' ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (IRIROA) వాదిస్తోంది.ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లాగానే పని చేస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం, ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్‌పై ఏటా స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భారీగా పెరుగుతుంది. -
ఫోన్ నంబర్ ఇక ఫ్రీ కాదు.. ట్రాయ్ షాకింగ్ ప్రతిపాదన
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఫోన్ నంబర్ లేని వారంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతిఒక్కరికి వ్యక్తిగత ఫోన్ నంబరో లేక ల్యాండ్‌లైన్ నంబరో ఏదో ఒకటి ఉంటుంది. యూజర్లు తమ అవసరాలను బట్టీ వాటికి రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఫోన్ నంబర్ కోసం ఇప్పటి వరకూ ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్ లైన్ నంబర్ కోసం త్వరలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్‌ను అత్యంత విలువైన, పరిమితమైన ప్రజా వనరుగా భావిస్తున్న ట్రాయ్ ఈ నంబర్లకు గానూ మొబైల్ ఆపరేటర్లపై ఛార్జీలు విధించాలని ప్రతిపాదించింది. కంపెనీలు వీటిని వినియోగదారుల నుంచి రికవరీ చేయవచ్చు. అలాగే ఎక్కువ నంబర్లు కలిగి తక్కువ వినియోగం ఉన్న టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే అవకాశాన్ని ట్రాయ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ సహా పలు దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్లకు ఫీజులు విధిస్తున్నాయి. భారత్‌లోనూ నంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి చర్యలను అవలంబించాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఛార్జీల అమలుకు ట్రాయ్ పలు మార్గాలను సూచించింది. ప్రభుత్వం ప్రతి నంబర్‌కు వన్ టైమ్ ఛార్జీ లేదా వార్షిక రుసుమును విధించవచ్చు. ఇక ప్రీమియం లేదా 'వీఐపీ' నంబర్ల కోసం వేలం నిర్వహించవచ్చు.प्रेस विज्ञप्ति संख्या 27/2024 - राष्ट्रीय नंबरिंग योजना के संशोधन पर परामर्श पत्र के संबंध में ।Press Release No. 27/2024 regarding Consultation Paper on Revision of National Numbering Plan.https://t.co/AQC11neBSr— TRAI (@TRAI) June 7, 2024 -
ఏపీ భవన్.. ఆంధ్రప్రదేశ్‌కు 12.09, తెలంగాణకు 7.64 ఎకరాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలను గురువారం విడుదల చేసింది. ఏపీ భవన్‌కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీ భవన్ విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్–ఈతో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వీలైనంత త్వరగా తెలపాలని కేంద్రం కోరింది. తద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించింది. ఆప్షన్–డీలో భాగంగా పటౌడీ హౌస్ భూమి 7.64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోందని కేంద్రం తెలిపింది. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. అయితే కేంద్రం ఆప్షన్–ఈ కింద పటౌడీ హౌస్ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ కలిపి 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు అని ప్రతిపాదించింది. కేంద్ర హోం శాఖ సమావేశంలో కేంద్ర సంయుక్త కార్యదర్శులు సంజీవ్‌కుమార్ జిందాల్, జి.పార్థసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆప్షన్లు ఇవే.. ఏపీ ఆప్షన్–ఏ: తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్‌లో సగభాగం.. ఏపీకి గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ బ్లాకు, పటౌడీ హౌస్‌లో సగభాగం ఏపీ ఆప్షన్–బీ: ఏపీకి పటౌడీ హౌస్ మొత్తం, శబరి బ్లాకు, తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ తెలంగాణ ఆప్షన్–సీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్‌కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ తెలంగాణ ఆప్షన్–డీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ 12.09 ఎకరాలు, ఏపీకి పటౌడీ హౌస్ కేంద్రం ఆప్షన్–ఈ: ఏపీకి శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ సహా 12.09 ఎకరాలు.. తెలంగాణకు పటౌడీ హౌస్ 7.64 ఎకరాలు . చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ -
ఇక రేషన్.. చికెన్!
సాక్షి, హైదరాబాద్: ‘పుష్టికర భారత్’నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలతో పాటు ప్రొటీన్ సహిత ఆహారపదార్థాలను కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దేశంలోని పేదలకు అందజేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తోంది. గుడ్లు, చికెన్, మాంసం, చేపలను ఈ జాబితా లో చేర్చింది. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పుష్టికర ఆహారాన్ని వీలైనంత తక్కువ ధరలకే పేదల కు అందజేయాలనే ఈ ప్రతిపాదనను తన 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్లో పెట్టే అవకాశాలున్నాయి. అమలు, పంపిణీపై అధ్యయనం పౌష్టికాహార లోపం సమస్యను నివారించడంలో భాగంగా గుడ్లు, చికెన్, మాంసం, చేపలు లాంటి ప్రొటీన్ సహిత ఆహార పదార్థాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే వ్యవస్థను రూపొందించడంపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ ఈ విషయమై మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న ఆదాయం ద్వారా పౌష్టికాహారం పొందాల్సింది పోయి దురదృష్టవశాత్తు ఎక్కువ మంది నూనె, చక్కెర, మసాల సహిత పదార్థాలపై ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలతో పాటు చట్టసభల సభ్యుల్లో కూడా అవగాహన కల్పించేలా విజన్ డాక్యుమెంట్లో ప్రస్తావిస్తామని వెల్లడించారు. ‘పీడీఎస్ ద్వారా ఇప్పటికే సబ్సిడీ ఆహార పదార్థాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి. దీనికి తోడు మాంసాహారం పంపిణీ అమలు భారమయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే పంపిణీ చేస్తున్న పదార్థాల్లో కొన్నింటిని తగ్గించి మా ప్రతిపాదనల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలను పంపిణీ చేస్తే బాగుంటుంది’అని సూచించారు. ఇప్పటికే మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.5లకు పైగా ఉండగా, కిలో మాంసం వందల్లో ఉంది. ఈ నేపథ్యంలో సబ్సిడీ ఎంత ఇవ్వాలి.. రేషన్ షాపుల ద్వారా వీటి పంపినీ ఎలా చేయాలన్న దానిపై కూడా నీతి ఆయోగ్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు కూడా చేయనుందని తెలిపారు. 43 శాతం బరువు తక్కువ చిన్నారులు యునిసెఫ్ లెక్కల ప్రకారం దేశంలోని 20 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. ప్రపంచంలోనే ఇలా బక్కచిక్కుతున్న చిన్నారుల్లో మూడోవంతు పిల్లలు మనదేశంలోనే ఉన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 43 శాతం మంది.. ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువున్నారు. అంటే ప్రతి 10 మందిలో కనీసం నలుగురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహార లోపం సమస్య పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోతోంది. ఏటా దేశంలో 7.4 మిలియన్ల బరువు తక్కువ చిన్నారులు ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలోనే జన్మిస్తున్నారు. 33 శాతం మంది చిన్నారులు మాత్రమే అంగన్వాడీ సేవలు పొందుతున్నారు. అందులో 25 శాతం మంది ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు దేశంలోని పేదలకు ప్రోటీన్ సహిత పౌష్టికాహారాన్ని చవకగా పంపిణీ చేయడమే మార్గమనే ఆలోచనకు నీతి ఆయోగ్ వచ్చింది. అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందని అంచనా. అందులో పీడీఎస్ ద్వారా గుడ్లు, చికెన్, మాంసం, చేపలను పంపిణీ చేయాలనే ప్రతిపాదన చేస్తుందని భావిస్తున్నారు. -
ఐపీఎల్లో ‘పవర్ ప్లేయర్’
ముంబై: అభిమానుల ఆదరణలో శిఖరాన ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక ఆసక్తికర మార్పు గురించి గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచిస్తోంది. లీగ్‌లో తొలిసారి ‘పవర్ ప్లేయర్’ పేరుతో అదనపు ఆటగాడిని మ్యాచ్ మధ్యలో తుది జట్టులో ఆడించవచ్చనేదే ఈ కొత్త ప్రతిపాదన. దీనిపై బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నేడు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగనుంది. ఎప్పుడైనా బరిలోకి... ఈ ప్రతిపాదన ప్రకారం... మ్యాచ్‌కు ముందు 11 మందితో కాకుండా 15 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. మ్యాచ్ కీలక సమయంలో తుది జట్టులో లేని ఒక ఆటగాడి అవసరం జట్టుకు ఉందని భావిస్తే డగౌట్ నుంచి అతడిని పిలిపించి నేరుగా ఆడించవచ్చు. ఇది వికెట్ పడినప్పుడు గానీ, ఓవర్ ముగిసినప్పుడు కానీ చేయవచ్చు. ఉదాహరణకు ఆండ్రీ రసెల్‌లాంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో బయటే కూర్చున్నాడు. కానీ చివరి ఓవర్లో జట్టు విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో క్రీజ్‌లో ఉన్నవారిపై నమ్మకం లేకపోతే రసెల్‌ను పిలిచి బ్యాటింగ్ చేయించవచ్చు. అదే విధంగా చివరి ఓవర్లో ప్రత్యర్థి 6 పరుగులు చేయాల్సి ఉండగా... తుది జట్టులో లేకపోయినా బుమ్రాలాంటి బౌలర్ అందుబాటులో ఉంటే అతడిని మైదానంలోకి పిలిచి బౌలింగ్ చేయించవచ్చు. ఐపీఎల్‌కంటే ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో దీనిని ప్రయోగాత్మకంగా వాడాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అయితే మాటల్లో చెప్పుకునేందుకు ఆసక్తికరంగా అనిపిస్తున్నా... మ్యాచ్‌ను గందరగోళంగా మార్చే ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు రావచ్చు. పైగా ఐపీఎల్ పూర్తిగా ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే సాగే టోర్నీ. ఐసీసీలో లేని నిబంధనను ఇందులో కొత్తగా చేరిస్తే టోర్నీ విలువ అర్థరహితంగా మారిపోయే ప్రమాదమూ ఉంది! -
ముందుగా రాష్ట్రానికి 459 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది నీటిని వాడుకునే విషయంలో ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన వల్ల రాష్ట్రానికి కొంతలో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతం నుంచి మనకు రావాల్సిన 459 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాతే ఎగువ రాష్ట్రాలు నీటిని వాడుకోవాలని ట్రిబ్యునల్ తాజాగా సూచించింది. ఈ ప్రతిపాదనపై మూడు రాష్ట్రాలు ఈ నెల 24, 25 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నాయి. ఈ చర్చల సారాంశాన్ని 26న ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. కృష్ణా నదిలో 75 శాతం డిపెండబులిటీ ప్రకారం 2,130 టీఎంసీల నీరు ఉన్నట్టు ట్రిబ్యునల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నీటిలో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మన రాష్ట్రానికి 811 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే మన రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నీటిలో ఎగువ ప్రాంతం (మహారాష్ట్ర, కర్ణాటక) నుంచి 459 టీఎంసీలు రావాల్సి ఉంది. మిగిలిన 352 టీఎంసీల నీరు మన రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసే వర్షపు నీరు ద్వారా రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండిన తర్వాతే మన రాష్ర్టంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే 65 శాతం డిపెండబులిటీ ప్రకారం కృష్ణా నదిలో 2,578 టీఎంసీల నీరు ఉన్నట్టు బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనినే పరిగణనలోకి తీసుకుని మూడు రాష్ట్రాలకు అదనపు కేటాయింపుల్ని కూడా చేసింది. అంటే...ఇప్పటివరకు మనకే వాడుకునే స్వేచ్ఛ ఉన్న మిగులు జలాల్ని ఎగువ రాష్ట్రాలు కూడా ఉపయోగించుకునే విధంగా మధ్యంతర తీర్పును వెల్లడించారు. దీనిపై మన రాష్ర్టం తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దాంతో 75 శాతం డిపెండబులిటీ నీటి లభ్యత ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 459 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాతే....65 శాతం డిపెండబులిటీ నీటిని (మిగులు జలాలు) ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని ట్రిబ్యునల్ సూచించింది. రాష్ట్రానికి కొంత మేలే... నిపుణులు: ట్రిబ్యునల్ సూచనల మేరకు ఎగువ రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకోవాలంటే.. మనకు ముందుగా నికర జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ట్రిబ్యునల్ సూచించిన ఈ కొత్త ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే విషయమై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రతిపాదన వల్ల కలిగే లాభ నష్టాలను అంచనా వేస్తూ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ప్రకారం ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగే సమావేశంలో అధికారులు రాష్ట్ర అభిప్రాయాన్ని చెప్పనున్నారు. తుది తీర్పు దిశలో ట్రిబ్యునల్: బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పును వెల్లడించడానికి సిద్ధమవుతోంది. 2010 డిసెంబర్లో ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సవరణల కోసం ఈ మూడేళ్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు విన్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ట్రిబ్యునల్ తాజా గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఆ లోపు తుది తీర్పును వెల్లడించాలని ట్రిబ్యునల్ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ నెల 26న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. -
తెలంగాణలో ఉత్తరాంధ్ర కలపాలి: భట్టి విక్రమార్క
ఆంటోనీ కమిటీకి భట్టి విక్రమార్క కొత్త ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కూడా కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కొత్త ప్రతిపాదన తెరపైకి వస్తోంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఈ మేరకు ఒక నివేదిక ఇవ్వాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఆయన ఇప్పటికే రూపొందించారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కూడా ఇప్పటికే దీనిపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను తెలంగాణతో కలపాలని, తద్వారా కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఆస్కారం ఉంటుందని డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కతో సహా తెలంగాణలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ‘ఉత్తరాంధ్ర జిల్లాలను కలపడం వల్ల అనేక సహజ వనరులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు సముద్రంతో సంధానం లేకుండాపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలను కలిపితే విశాఖ నుంచి సముద్రం, పోర్టులు అందుబాటులో ఉంటాయి. ఇది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది’ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరు నేతలతో భట్టి చర్చించారు. వారి నుంచి సానుకూలత వ్యక్తమవడంతో ఈ దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. ఆంటోనీ కమిటీని కలసి తమ ప్రతిపాదన అందించేందుకు భట్టి విక్రమార్క సహా కొందరు నేతలు ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.