Union Home Ministry New Proposal On Division Of Ap Bhavan - Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌.. ఆంధ్రప్రదేశ్‌కు 12.09, తెలంగాణకు 7.64 ఎకరాలు

Published Thu, May 4 2023 6:09 PM | Last Updated on Fri, May 5 2023 9:55 AM

Union Home Ministry New Proposal On Division Of Ap Bhavan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలను గురువారం విడుదల చేసింది. ఏపీ భవన్‌కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీ భవన్‌ విభజనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్‌–ఈతో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వీలైనంత త్వరగా తెలపాలని కేంద్రం కోరింది. తద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించింది. ఆప్షన్‌–డీలో భాగంగా పటౌడీ హౌస్‌ భూమి 7.64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్‌ హాస్టల్‌తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోందని కేంద్రం తెలిపింది.

జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. అయితే కేంద్రం ఆప్షన్‌–ఈ కింద పటౌడీ హౌస్‌ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్‌ హాస్టల్‌ కలిపి 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు అని ప్రతిపాదించింది. కేంద్ర హోం శాఖ సమావేశంలో కేంద్ర సంయుక్త కార్యదర్శులు సంజీవ్‌కుమార్‌ జిందాల్, జి.పార్థసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, రెసిడెంట్‌ కమిషనర్‌ ఆదిత్యనాథ్‌ దాస్, అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్, తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆప్షన్లు ఇవే..

ఏపీ ఆప్షన్‌–ఏ: తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్‌లో సగభాగం.. ఏపీకి గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకు, 
పటౌడీ హౌస్‌లో సగభాగం ఏపీ ఆప్షన్‌–బీ: ఏపీకి పటౌడీ హౌస్‌ మొత్తం, శబరి బ్లాకు, తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ 

తెలంగాణ ఆప్షన్‌–సీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్‌కు నర్సింగ్‌ హాస్టల్, పటౌడీ హౌస్‌ 
తెలంగాణ ఆప్షన్‌–డీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్‌ హాస్టల్‌ 12.09 ఎకరాలు, ఏపీకి పటౌడీ హౌస్‌ 

కేంద్రం ఆప్షన్‌–ఈ: ఏపీకి శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్‌ హాస్టల్‌ సహా 
12.09 ఎకరాలు.. తెలంగాణకు పటౌడీ హౌస్‌ 7.64 ఎకరాలు . 

చదవండి: CM Jagan: ‘జగన్‌ పట్టుదలకు శెభాష్‌ అనాల్సిందే!’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement