
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. దాదాపురెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. 14 అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా నేతృత్వంలో భేటీ జరిగింది. సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు కరికాల వలవన్, కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు గౌరవ ఉప్పల్ పాల్గొన్నారు.
చదవండి: (50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్‌లో చేరేలోపే గుండెపోటుతో మృతి)