Partition Act
-
విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ సమావేశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. దాదాపురెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. 14 అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా నేతృత్వంలో భేటీ జరిగింది. సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు కరికాల వలవన్, కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు గౌరవ ఉప్పల్ పాల్గొన్నారు. చదవండి: (50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్‌లో చేరేలోపే గుండెపోటుతో మృతి) -
రెండేళ్లల్లో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి కడప: ‘‘ఈరోజు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు భూమిపూజ చేసుకున్నాం. మూడు నెలల్లోపు పనులు ప్రారంభించి, రెండేళ్లలోపు స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కుఫ్యాక్టరీకోసం గురువారం ఉదయం 11.12 గంటలకు ఆయన భూమి పూజ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తోడుగా ఉంటుందని భావిస్తే మోసగించిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల్ని అమలు చేయాలని కోరినా నిర్లక్ష్యం చేసిందన్నారు. విభజన చట్టంలో 6 నెలల్లోపు సెయిల్ నేతృత్వంలో విచారణ చేపట్టి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఉంటే, 2014 నవంబర్‌లో ఉక్కు వయబులిటీ లేదని సెయిల్ రిపోర్టు ఇచ్చిందన్నారు. అయితే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే 18.9 శాతం ఆదాయం వస్తుందని మెకాన్ సంస్థ రిపోర్టు ఇచ్చిందని, అప్పటినుంచి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని, వారడిగిన విషయాలన్నింటికీ ఓపిగ్గా 11సార్లు సమాధానం చెప్పామని, 2018 జూన్‌లో ప్రధానిమంత్రికి లేఖ కూడా రాశామని, అయినా కేంద్రం స్పందించలేదన్నారు. దీంతో కసి, బాధ, ఆవేదనతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సిద్ధమయ్యామన్నారు. ఎన్నికల ప్రచారంకోసం కాదు.... ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన ఎన్నికల ప్రచారం కోసం కాదని సీఎం అన్నారు. తన సంకల్పం వేరని, దూరదృష్టితో వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తాం. తొలివిడతలో రూ.18వేల కోట్లతో నిర్మిస్తాం. మరో ఐదేళ్లల్లో రూ.15 వేల కోట్లు వెచ్చిస్తాం. తొలివిడతగా 5వేల ఉద్యోగాలు, రెండోవిడతలో 5వేల ఉద్యోగాలొస్తాయి. పనులు ప్రారంభమైనప్పటినుంచి రెండేళ్లలోపు ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. 2020 నాటికి ఓబుళాపురం ఐరన్ ఓర్ గనులు కోర్టు వివాదం ముగిసే వీలుందని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి ఖనిజం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణం తన భుజస్కంధాలపై ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో కడప అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌గా నామకరణం చేశానని, ఆ మేరకు అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. అప్పుల ఊబిలో ఉన్నా తెలంగాణ, తమిళనాడు, కేరళ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఇంత చేస్తున్నాం.. 2014లో టీడీపీ అధికారంలోకి రాకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటో అంచనా వేయండి.. మీ తోడ్పాటు అవసరం అని ఆయన ప్రజానీకాన్ని కోరడం గమనార్హం. రాయలసీమను పరిశ్రమల గడ్డగా మారుస్తా.. రాయలసీమకు ఏమీ చేయలేదని కొంతమంది మాట్లాడుతున్నారని, గోదావరి–కృష్ణా నదులు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి, కృష్ణా డెల్టా నీరు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తీసుకొచ్చామని సీఎం అన్నారు. ఎడారిని తలపించే అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ఏర్పాటు చేశామని, జనవరిలో రోడ్డుపైకి అనంతపురంలో తయారైన కారు రానుందని చెప్పారు. భవిష్యత్‌లో రాయలసీమ హార్టికల్చర్ హబ్ కానుందని, పరిశ్రమల గడ్డగా మారుస్తానని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను సోమశిల, నాగార్జునసాగర్ రైట్ కెనాల్‌కు తీసుకెళ్లి, శ్రీశైలం నీటిని రాయలసీమకే ఉపయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, ఎంపీ రమేష్‌నాయుడు, శాసనమండలి ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బీటెక్ రవి, ఎమ్మెల్యే జయరాములు, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
విభజన హామీలపై 25న మానవహారం
వైవీయూ : విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా కోటిమందితో మానవహారం నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి. దస్తగిరి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహలు మానవహారంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేకప్యాకేజి, గిరిజన, సెంట్రల్, మైనింగ్ యూనివర్సిటీల ఏర్పాటు, పోలవరం పూర్తి, ఎయిమ్స్, మెట్రోలైన్స్, రాజధాని నిధులు తదితర హామీలను నెరవేర్చాలంటూ మానవహారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శివ, మధు, శివకుమార్, పుల్లయ్య, రాజేంద్ర, ప్రసాద్ పాల్గొన్నారు. కడప వైఎస్సార్ సర్కిల్ : విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరు తూ ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో మానవహారాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దీక్షలు చేయడం అధికారాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు సదస్సులు, చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో మైదుకూరులో సీపీఐ జిల్లా మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సభల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేశు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఆరేళ్లుగా పట్టించుకోకుండా నేడు దీక్షలా!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్ : ఆరేళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్ ఏనాడు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాట్లాడలేదని, నేడు ఆమరణ దీక్ష అంటూ డ్రామా ఆడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పుట్టపర్తి సర్కిల్లో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఎమ్మెల్యే బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే నిరుద్యోగ సమస్య పరిష్కరమవుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని తలచారన్నారు. ఆయన బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించారన్నారు. దీనికి రూ.1700 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. అయితే చంద్రబాబు కోర్టులో కేసు వేయడంతో పరిశ్రమ ఆగిపోయిందన్నారు. వైఎస్సార్సీపీ అన్ని పార్టీలను కలుపుకొని జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉద్యమాలను చేసిం దని తెలిపారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెయిల్ ప్రభుత్వ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల్లో అన్ని అంశాలపై పోరాడింది వైఎస్ జగన్ ఒక్కరే అని తెలిపారు. ఆరేళ్లుగా రాజ్యసభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ పార్లమెంట్లో ఈ ప్రాంతం గురించి, ఉక్కు పరిశ్రమ స్థాపనపై గళం విప్పలేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నాటకాలు ఆడుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ పార్టీ పోరాడుతోందో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, 29న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. నాలుగేళ్లుగా మాయమాటలు చెప్పారు నాలుగేళ్లుగా చంద్రబాబు మాయమాటలు చెప్పి కేంద్రంతో సంసారం చేశారని వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. ఎన్నికలు వస్తుండటం, జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. పార్లమెంట్లో సీఎంరమేష్ ఏ రోజన్నా జిల్లాకు ఉక్కు పరిశ్రమ కావాలని ప్రశ్నించారా? అని అన్నారు. ఎప్పుడు కాంట్రాక్టర్లు చేసుకుని డబ్బు ఎలా దోచుకుందుకే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నా రు. తమ ఎంపీలు మొదటి నుంచి ఉక్కు పరిశ్రమ కోసం మాట్లాడుతునే ఉన్నారన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు నాటకమాడుతూ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ బద్వేలు సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలే రాష్ట్ర విభజనకు కారణమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన స్టీల్ ప్లాంట్‌ను ఇవ్వలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఖనిజం మన వద్ద ఉందని తెలిపారు. -
ఉక్కు కోసం ఉద్యమిద్దాం
సాక్షి, కడప కార్పొరేషన్ : కడప ఉక్కు పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని, పార్లమెంటులో చేసిన చట్టమని, హక్కుదారులు కావాలంటే ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని అఖిపక్షనేతలు పిలుపునిచ్చారు. కడపలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రావాలని వైఎస్ఆర్ కలలు కనేవారన్నారు. ఈ మేరకే ఆయన హయాంలో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. బ్రాహ్మణి యాజమాన్యం రూ.1800కోట్లు ఖర్చు చేసి పరిశ్రమ ఏర్పాటు చేసిందని, రూ.1200కోట్లు ఖర్చు చేస్తే అది పూర్తవుతుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు మొదటి నుంచి జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. ఉక్కు పరిశ్రమను విభజన చట్టంలో పొందుపరిచారని, పరిశ్రమ స్థాపనకు కావలసిన ఎయిర్‌పోర్టు, రైల్వే, విద్యుత్, నీరు, వనరులు వంటి అన్ని అనుకూలతలు ఇక్కడ ఉన్నా అది రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీయేనని ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు కలిసి పోరాడుదామంటే ముందుకు రాని టీడీపీకి ఈరోజు ప్రతిపక్షాలు కనిపించాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి లక్షల కోట్లు పచ్చచొక్కాల వారికి పంచేసి పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు, ఉక్కు పరిశ్రమ వల్లే విశాఖపట్నం అంతపెద్ద నగరంగా అభివృద్ధి చెంది, 42 శాతం ఆదాయాన్నిస్తోందన్నారు. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తే అదే తరహాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందరూ ఐక్యంగా సైనికుల వలే పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ సభ్యుడు బండి జకరయ్య మాట్లాడుతూ జెండాలు పక్కనబెట్టి ఉక్కు పరిశ్రమే ఏకైక ఎజెండాగా పోరాడాలన్నారు. నాలుగేళ్లు ఉక్కు పరిశ్రమపై పట్టించుకోని టీడీపీ ఈనాడు అఖిలపక్షాన్ని పిలవడం సిగ్గుచేటన్నారు. బీఎస్పీ నాయకులు గుర్రప్ప మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకు అన్ని వర్గాలను ఏకం చేసి పోరాడాలని సూచించారు. జనసేన నాయకులు చలపతి మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఇన్నాళ్లు చేసిన పోరాటం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యిందన్నారు. లీగల్ సెల్ అథారిటీ కన్వీనర్ గుర్రప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ దూరదృష్టితో ఉక్కు పరిశ్రమ స్థాపించారని, రెండు పత్రికలు మాత్రం బ్రాహ్మణి మూతపడే వరకూ విశ్రమించకుండా కథనాలు రాశాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ జల్లికట్టు, తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాలని చెప్పారు. మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకోసం ప్రాణ త్యాగానికైనా, అరెస్టులు కావడానికైనా, జైలుకెళ్లడానికైనా సిద్దమేనని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఐఎన్ సుబ్బమ్మ, స్టీల్‌ప్లాంటు సాధన సమితి నాయకులు సీఆర్వీ ప్రసాద్, రైతు స్వరాజ్య వేదిక శివారెడ్డి, కిషోర్ కుమార్, చల్లా రాజశేఖర్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, టి. సునీల్, విజయ్‌కుమార్, ఖాజా, షఫీ, పత్తి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని.. బీజేపీ కళ్లున్న కబోదిలా వ్యవహరించింది. నాలుగేళ్లు కమిటీల పేరుతో కాలయాపన చేసి ఈనాడు సాధ్యం కాదని చెప్పడం దారుణం. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావలసినంత భూమి, నీరు, రైల్వేలైన్, ఎయిర్‌పోర్టు, ముడిసరుకు ఉందని.. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని ఉన్నట్లు పరిస్థితి తయారైంది. ఉక్కు పరిశ్రమ సాధనకు చేసే ఉద్యమానికి కాంగ్రెస్ పూర్తి సహకారం ఇస్తుంది. – నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్లు్యజే మద్దతు... కడపలో ఉక్కు పరిశ్రమ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసే ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్లు్యజే) పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి తెలిపారు. విభజనతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో ఉన్న ఉక్కు పరిశ్రమను ఇన్నాళ్లు ఇస్తాం, ఇస్తాం అని ఊరించిన కేంద్రం ఒక్కసారిగా సాధ్యం కాదని చెప్పడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ఎస్ రెడ్డి, జయపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి.. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి. అందుకోసం విస్తృత ప్రచారం చేయాలి. ద్రోహం చేసిన వారు, ఆ ద్రోహానికి సహకరించిన వారు కూడా దోషులే. అన్యాయం చేసేవారితో చేతులు కలపొద్దని, ద్రోహులను ఏకాకిని చేసి ఉక్కు పరిశ్రమ ఒక్కటే ఏకైక ఎజెండాగా పోరాడాలి. అమరావతికి భూమిపూజ చేసేటప్పుడు మట్టి, నీళ్లు తెచ్చి మొఖాన కొట్టిన మోడీ, ఈనాడు రాయలసీమ ఆశలపై నీళ్లు చల్లారు. – ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి -
‘టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ..!’
-
‘టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ..!’
సాక్షి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఒక అంశాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని జైరాం విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి డ్రామాలాడుతున్నారని జైరాం రమేష్ అన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో.. కడపలోని స్టీల్ ప్లాంట్, వైజాగ్‌లో పెట్రోలియం యునివర్శిటీ, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టామని జైరాం తెలిపారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు ఒక అవినీతి ప్రాజెక్టుగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తాడోపెడో తేల్చుకోవాలని జైరాం రమేష్ సూచించారు. -
రాజకీయమా.. రాష్ట్ర హితమా..!!
ఏం చర్చించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి హోదా, విభజన చట్టంలోని హామీల గురించి అడుగుతారా? లేక ఎప్పటిలానే స్వప్రయోజనాల కోసం ఫణంగా పెడతారా? కేంద్ర నిధులపై పదేపదే మాటమార్చుతున్న సీఎం భారీగా నిధులొస్తున్నాయని ప్రచారం చేసింది ఆయనే.. నాబార్డు నిధులపై కేంద్రానికి లేఖ.. మళ్లీ మభ్యపుచ్చే యత్నం హోదాపైనా, విభజనచట్టంలోని అంశాలపైనా ఏనాడూ పట్టుబట్టని బాబు.. కేంద్రంలో అధికారం అనుభవిస్తూనే అబద్దపు ప్రచారాలు సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదహారునెలల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలుస్తున్నారు. అందుకోసం నేడు ఆయన హస్తినకు పయనమౌతున్నారు. రాష్ట్రభవిష్యత్తుకు సం బంధించిన అంశాలపైనా, విభజనచట్టంలోని హామీల అమలుపైన చర్చిస్తారా అన్న ఆసక్తి రాష్ట్రప్రజలలో నెలకొంది. కేంద్రంలో భాగస్వామి కనుక ఈ ఏడాది అయినా రాష్ట్రప్రయోజనాల కోసం ఏమన్నా సాధిస్తారా అని రాష్ట్రమంతా చూస్తోంది. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి లభించిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిందిగా ఇప్పటికైనా ఆయన ప్రధానమంత్రిని కోరాలని కోట్లాదిమంది నిరుద్యోగులు ఆశిస్తున్నారు. విభజన చట్టంలోని హామీలను అమలుచేయాల్సిందిగా ఇకనైనా కేంద్రంపై ఒత్తిడి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అయినా కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి పదహారు నెలలుగా ఢిల్లీకి వెళ్లకపోవడమేమిటి? కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడమేమిటి? ఏమీ సాధించలేకపోవడమేమిటని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమేమిటి? విభజనచట్టంలోని హామీల అమలు కోసం గానీ, రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ప్రధానమైన సమస్యలపై గానీ కేంద్రాన్ని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయని ముఖ్యమంత్రి పదహారునెలల తర్వాత ప్రధానమంత్రిని కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటుకు నోటు కేసు, ఇంకా ఇతర అవినీతి కేసుల భయంతోనే ఆయన హస్తినకు దూరంగా ఉండిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రప్రభుత్వంపైనా, పరిపాలనా తీరుపైనా రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతుండడం, వందల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు పూనుకున్నారని వినిపిస్తోంది. నియోజకవర్గాలను పెంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీట్ల భద్రత కలిగించకపోతే అటు ఆ ఎమ్మెల్యేల నుంచి ఇటు సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చే వత్తిళ్లు తట్టుకోవడం కష్టమని ముఖ్యమంత్రి భావిస్తున్నారని విశ్లేషకులంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి రోజురోజుకు ప్రజా మద్దతు పెరుగుతున్నట్లు వార్తలు వస్తుండడంతో దానిని బలహీనపరచేందుకు నియోజకవర్గాల పునర్విభజన ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో కలసి పోటీ చేసిన పార్టీతో ఉమ్మడిగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ, రాష్ట్రప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 16 నెలల పాటు ప్రధానమంత్రిని కలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. దీనిని బట్టే ముఖ్యమంత్రి రాష్ట్రప్రయోజనాల కోసం ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని విమర్శకులంటున్నారు. మొదటి నుంచీ మభ్యపుచ్చే యత్నాలు.. విభజనచట్టం హామీల నుంచి కేంద్ర నిధుల వరకు ఏ అంశంపైనైనా ప్రజలను మభ్యపుచ్చడమే అడుగడుగునా కనిపిస్తుంది. ఆరోజు స్వయంగా అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అరుణ్‌జైట్లీ ప్రకటనను ముఖ్యమంత్రి స్వాగతించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా దానికి సమానమైన నిధులు ఇస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు ఇస్తానంటే వద్దంటామా? కోడలు మగపిల్లాడ్ని కంటానంటే ఏ అత్త అయినా వద్దంటుందా?అని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వ్యంగ్య వ్యాఖ్యానాలూ చేశారు. భారీ స్థాయిలో నిధులు రాబోతున్నాయని, ఈఏపీ ప్రాజెక్టుల కిందే రూ.20వేల కోట్లు రాబోతున్నాయని చంద్రబాబు ప్రచారం చేశారు. ఇపుడు మాటమార్చి అకస్మాత్తుగా ఈఏపీ ప్రాజెక్టుల కింద రూ.16,447 కోట్లు నాబార్డు ద్వారా గ్రాంటుగానైనా ఇప్పించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఇదీ మరో మభ్యపుచ్చే ప్రయత్నమే తప్ప ఎలాంటి ఉపయోగమూ లేదని ఆయనకూ తెలుసు. హోదా కోసం రాష్ట్రప్రజలు ఉద్యమిస్తున్న సమయంలో దానికోసం తానూ గొంతు కలిపి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం మానేసి ఎక్కువ డబ్బులు రాబోతున్నాయని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ నిధులివ్వడం లేదంటూ నెపం కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్యాకేజీ అనేదే లేదని, జైట్లీ ప్రకటనలోని వన్నీ విభజన చట్టంలోని హామీలేనని అర్ధం చేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కరేలేదని, అయినా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారని వారు పేర్కొంటున్నారు. ఘనమైన ప్యాకేజీ ఇచ్చారంటూ అసెంబ్లీలో తీర్మానాలు, వెలుపల భారీ సన్మాన సభలు నిర్వహించడం, అదేదో ప్యాకేజీ వచ్చేసిందంటూ చంద్రబాబు అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం తెలిసిన విషయాలే. కేంద్రంలో కొనసాగుతూనే... కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ.. మంత్రులను కొనసాగిస్తూ.. అధికారాన్ని పంచుకుంటూ.. రాష్ట్రప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్రంపై ఏనాడూ వత్తిడి చేసిన పాపాన పోలేదు. అసలు ప్యాకేజీ అనేదే లేదన్న విషయం చంద్రబాబుకు తెలుసు. కేంద్రానికీ తెలుసు. అందుకే కేంద్రం నుంచి ఎలాంటి లేఖలు వచ్చినా అందులో ప్రత్యేక ప్యాకేజీ అన్న పదమే కనిపించదు. విభజన చట్టంలోని అంశాలేవీ ప్రత్యేకంగా ఇస్తున్నవి కాదు. మనకు చట్టబద్దంగా దక్కాల్సినవే. ప్రత్యేకంగా ప్యాకేజీ అనేదేమీ లేకపోయినా ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఆ పదాన్ని చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ఉపయోగిస్తూ వచ్చారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి భారీగా మేలు జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదాను వదిలేసి ప్యాకేజీకి ఓకే చెప్పామని చంద్రబాబు అదేపనిగా ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా కేంద్రానికి లేఖలు రాస్తూ.. కేంద్రం ఇవ్వట్లేదు అంటూ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తూ.. ప్రజలను మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
-
నియోజకవర్గాల పెంపు లేనట్టే!
ఇప్పట్లో సాధ్యంకాదని తేల్చిన కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి రావడమే కారణం ఇతర రాష్ట్రాల నుంచీ డిమాండ్లు వచ్చే అవకాశం రాజ్యసభలో ముందుకు వెళ్లలేని స్థితిలో మోదీ సర్కారు విభజన చట్టంలో గడువు చెప్పలేదన్న కేంద్ర హోంశాఖ హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుం దని ఎదురుచూస్తున్న రాజకీయ నేతలకు ఇది చేదు వార్తే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఉండబోదని కేంద్ర న్యాయ, హోం మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు, ఏపీలో 175 నుంచి 225 స్థానాలకు పెంచుకోవచ్చని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన సంగతి తెలిసిందే. తదుపరి చర్యల కోసం సిద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై కేం ద్రం వివరణ కోరగా ఇరు శాఖలూ ఈ మేరకు సమాచారం పంపాయి. రాష్ట్ర విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పేర్కొన్నప్పటికీ రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ ప్రక్రియకు ఆమోదం తెలపలేమని వివరించాయి. రాజ్యాంగంలోని 82, 170 అధికరణలను సవరిస్తే తప్ప నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర న్యాయ శాఖ చెప్పింది. 2031లో జనాభా గణన పూర్తయ్యే వరకు 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టరాదని గతంలో రాజ్యాంగ సవరణ(84, 87వ రాజ్యాంగ సవరణలు) జరిగింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు సాధ్యంకాదని తేల్చింది. తొందర లేదన్న కేంద్రం నియోజకవర్గాల పెంపు కోసం అందుతున్న విజ్ఞాపనలపై కేంద్ర హోంశాఖ స్పందిస్తూ మరో విషయాన్ని ప్రస్తావించింది. కచ్చితంగా ఫలానా గడువులోగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏపీ విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని, అందువల్ల ఇప్పటికిప్పుడు ఆ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. రాజ్యాంగ సవరణ చేయాలంటే మోదీ ప్రభుత్వం ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజ్యసభలో పరి స్థితి దృష్ట్యా మరోసారి రాజ్యాంగ సవరణకు కేంద్రం ముందుకు వెళ్లబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీల్లో నియోజకవర్గాల పెంపు అంశం పార్లమెంట్ ముందుకు వస్తే.. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు రావొచ్చని కేం ద్రం భావిస్తోంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ సైతం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో కేంద్రం రాజ్యాంగ సవరణకు మొగ్గుచూపే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పోలవరం ముంపు మండలాలు, జిల్లాల పెంపు సంగతేంటి? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాలను ఏపీ లో విలీనం చేశారు. ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ చేసిన కారణంగా ఇప్పుడు ఆ గ్రామాలకు ప్రాతి నిధ్యం వహించే ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. అక్కడి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రెండు రాష్ట్రాల్లో ప్రాతినిథ్యం కల్పించాలని కోరినప్పటికీ అనుమతివ్వలేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తప్ప ఆ గ్రామాలకు ప్రజాప్రతినిధులు ఉండే అవకాశాలు లేవు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టాయి. నియోజకవర్గాల పెం పు ఇప్పట్లో ఉండదని తేలడంతో కొత్త జిల్లాల విషయంలో ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.