సాక్షి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఒక అంశాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని జైరాం విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి డ్రామాలాడుతున్నారని జైరాం రమేష్ అన్నారు.
టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో.. కడపలోని స్టీల్ ప్లాంట్, వైజాగ్‌లో పెట్రోలియం యునివర్శిటీ, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టామని జైరాం తెలిపారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు ఒక అవినీతి ప్రాజెక్టుగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తాడోపెడో తేల్చుకోవాలని జైరాం రమేష్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment