కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఒక అంశాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని జైరాం విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు.