రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదహారునెలల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలుస్తున్నారు. అందుకోసం నేడు ఆయన హస్తినకు పయనమౌతున్నారు. రాష్ట్రభవిష్యత్తుకు సం బంధించిన అంశాలపైనా, విభజనచట్టంలోని హామీల అమలుపైన చర్చిస్తారా అన్న ఆసక్తి రాష్ట్రప్రజలలో నెలకొంది. కేంద్రంలో భాగస్వామి కనుక ఈ ఏడాది అయినా రాష్ట్రప్రయోజనాల కోసం ఏమన్నా సాధిస్తారా అని రాష్ట్రమంతా చూస్తోంది. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి లభించిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిందిగా ఇప్పటికైనా ఆయన ప్రధానమంత్రిని కోరాలని కోట్లాదిమంది నిరుద్యోగులు ఆశిస్తున్నారు. విభజన చట్టంలోని హామీలను అమలుచేయాల్సిందిగా ఇకనైనా కేంద్రంపై ఒత్తిడి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అయినా కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి పదహారు నెలలుగా ఢిల్లీకి వెళ్లకపోవడమేమిటి? కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడమేమిటి? ఏమీ సాధించలేకపోవడమేమిటని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Published Fri, Jan 12 2018 7:17 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement