
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కేంద్ర రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.
ఏపీ భవన్ విభజనపై అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా తొమ్మిదేళ్లుగా ఒకే బిల్డింగ్‌లో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఏపీ భవన్‌ను విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచుకున్నాయి. తాత్కాలికంగా 58 : 42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది.
చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
అయితే ఢిల్లీ ఇండియా గేట్ పక్కన 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్.. ఏడు వేల కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించట్లేదు. అయితే నేటీ సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
చదవండి: Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంక