AP Bhavan
-
ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించి ఎట్టకేలకు పీటముడి వీడింది. ఏపీ భవన్ విభజన అంశం పరిష్కారం అయ్యిందని తాజాగా హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్- జీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 11.536 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్రం ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణకు 8.245ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ-ఇక్కడ క్లిక్ చేయండి -
Delhi: ఏపీ భవన్లో యాత్ర 2 సినిమా ప్రదర్శన
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఏపీ భవన్లో శనివారం యాత్ర-2 సినిమా ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురు మూర్తి, వైఎస్ఆర్ అభిమానులు, ప్రేక్షకులు సినిమాను వీక్షించారు. సినిమా ఆసాంతం ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానులు జై జగన్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం సీఎం జగన్ సంక్షేమ యాత్ర ఇలాగే కొనసాగుతుందన్నారు. ఆయన పాదయాత్రలో నడిచే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్నా యాత్ర ఆపకుండా నడిచిన నాయకుడని కొనియాడారు. నవరత్నాల పాలనతో ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్‌ను ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారన్నారు. ఇదీ చదవండి.. గంగ పుత్రులపై పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్ -
గోనె ప్రకాష్ రావుపై దాడికి యత్నం
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash rao)పై దాడికి యత్నం జరిగింది. ఢిల్లీలో గోనెను బీసీ సంఘాల నేతలు కొందరు కొట్టేందుకు యత్నించారు. ఢిల్లీ ఏపీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన గోనె.. ఆ క్రమంలో కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అది గమనించిన బీసీ సంఘాల కార్యకర్తలు కొందరు.. గోనె ప్రకాశ్‌ను నెట్టేసి దాడికి యత్నించారు. -
Delhi: సీఎం జగన్ దినచర్య డైరీ.. ‘ప్రతి దినం ప్రజాహితం’ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్న తీరును డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం అని మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారు కార్యాలయం ప్రచురించిన "ప్రతిదినం ప్రజాహితం" వికాస వార్షిక-4వ సంవత్సరం ముఖ్యమంత్రి రోజువారి కార్యక్రమలను తెలియజేసే దినచర్య డైరీని గురువారం ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్లో ఆదిత్యనాథ్ దాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ సీఎం జగన్ రోజువారీ అధికారిక కార్యక్రమాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో, సంకలనం చేసిన విధానం, జాతీయ మీడియా సలహాదారు కార్యాలయం దానిని డైరీ రూపంలో ప్రచురించడం అభినందనీయం అని అన్నారు. తన కార్యాలయ రోజువారీ కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి దినచర్యను కూడా అనుసరిస్తూ ఒక బాధ్యతగా తీసుకుని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ డైరీ ని రూపొందించడం జరుగుతున్నది అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ డైరీ ముద్రణకు సహకరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పుస్తక రచయిత పాలెపు రాజశేఖర్‌లను సలహాదారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మీడియా సలహాదారు కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ బీఎస్ రామకృష్ణ, ఎపీఆర్వో కే. గురవయ్య పాల్గొన్నారు. -
మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఏపీ ప్రభుత్వ హెల్ప్ లైన్
సాక్షి, ఢిల్లీ: మణిపూర్‌లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారిగా మైఖేల్ అంఖమ్‌ను నియమించింది. ఏపీ భవన్లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. మణిపూర్‌లోని వివిధ యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. గిరిజన తెగల మధ్య ఘర్షణతో విద్యార్థులు భయాందోళనకు లోనవుతున్నారు. మణిపూర్‌లో హింసను అదుపు చేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగడంతో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. సహాయం కోసం డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు : 011-23384016, 011-23387089 మణిపూర్ ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ : 8399882392 , 9436034077, 7085517602 చదవండి: AP: టెన్త్‌లో పెరిగిన ఉత్తీర్ణతా శాతం.. ఫస్ట్, లాస్ట్ జిల్లాలు ఇవే -
ఏపీ భవన్.. ఆంధ్రప్రదేశ్‌కు 12.09, తెలంగాణకు 7.64 ఎకరాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలను గురువారం విడుదల చేసింది. ఏపీ భవన్‌కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీ భవన్ విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్–ఈతో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వీలైనంత త్వరగా తెలపాలని కేంద్రం కోరింది. తద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించింది. ఆప్షన్–డీలో భాగంగా పటౌడీ హౌస్ భూమి 7.64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోందని కేంద్రం తెలిపింది. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. అయితే కేంద్రం ఆప్షన్–ఈ కింద పటౌడీ హౌస్ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ కలిపి 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు అని ప్రతిపాదించింది. కేంద్ర హోం శాఖ సమావేశంలో కేంద్ర సంయుక్త కార్యదర్శులు సంజీవ్‌కుమార్ జిందాల్, జి.పార్థసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆప్షన్లు ఇవే.. ఏపీ ఆప్షన్–ఏ: తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్‌లో సగభాగం.. ఏపీకి గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ బ్లాకు, పటౌడీ హౌస్‌లో సగభాగం ఏపీ ఆప్షన్–బీ: ఏపీకి పటౌడీ హౌస్ మొత్తం, శబరి బ్లాకు, తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ తెలంగాణ ఆప్షన్–సీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్‌కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ తెలంగాణ ఆప్షన్–డీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ 12.09 ఎకరాలు, ఏపీకి పటౌడీ హౌస్ కేంద్రం ఆప్షన్–ఈ: ఏపీకి శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ సహా 12.09 ఎకరాలు.. తెలంగాణకు పటౌడీ హౌస్ 7.64 ఎకరాలు . చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ -
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కేంద్ర రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఏపీ భవన్ విభజనపై అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా తొమ్మిదేళ్లుగా ఒకే బిల్డింగ్‌లో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఏపీ భవన్‌ను విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచుకున్నాయి. తాత్కాలికంగా 58 : 42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. అయితే ఢిల్లీ ఇండియా గేట్ పక్కన 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్.. ఏడు వేల కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించట్లేదు. అయితే నేటీ సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక -
ఢిల్లీ: నేడు ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం
సాక్షి, ఢిల్లీ: నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగనుంది. బుధవారం సాయంత్రం సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. అయితే, తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్దతిలో గదుల విభజన, నిర్వహణ జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యానథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానుండగా.. తెలంగాణ సర్కార్ తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవనున్నారు. ఇక, ఏపీ భవన్ విభజనపై తొమ్మిదేళ్లుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం. -
ఏపీ భవన్ విభజన సమావేశం వాయిదా
సాక్షి, ఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందించింది హోంశాఖ. అయితే సమావేశం వాయిదాకి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఇదివరకే హోంశాఖ కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఇదీ చదవండి; ‘లింక్’ కోసం డబ్బులా? -
ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేస్తోంది. 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) న్యూఢిల్లీలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ భవన్లో పవర్ కాంట్రాక్ట్ డిమాండ్ తగ్గింపు, ఎల్ఈడీ స్టేజ్ లైటింగ్, స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్లు, వంటగదిలో ఇండక్షన్ వంట ఉపకరణాల వినియోగం, మోషన్ సెన్సార్‌ను ఇన్స్టాల్ చేయడం, బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ)తో సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లను భర్తీచేయడం, హీట్ పంపుల ఏర్పాటు వంటి మార్పులు చేయనున్నారు. బీఈఈ ద్వారా ఎంప్యానల్ చేయబడిన థర్డ్ పార్టీ ఎనర్జీ ఆడిటింగ్ సంస్థ నిర్వహించిన ఈ ఎనర్జీ ఆడిట్ ప్రకారం, ఇది సంవత్సరానికి సుమారు 1.96 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా సుమారు 139 టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపుతోపాటు రూ.39 లక్షల విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఈ లెక్కన ఇంధన సామర్థ్య చర్యల కోసం ప్రతిపాదించిన రూ.35 లక్షల పెట్టుబడి కేవలం ఏడాదిలోనే వచ్చేస్తుంది. వచ్చేనెల (మార్చి) చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) కృషిచేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేసి, కర్బన ఉద్గారాలను తగ్గించే జాతీయ లక్ష్యానికి దోహదపడే తొలి రాష్ట్ర భవన్‌గా ఏపీ భవన్ అవతరించనుంది. బీఈఈ ఆర్థిక సాయం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య చర్యలపై బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే తరఫున బీఈఈ కార్యదర్శి ఆర్.కె.రాయ్ ఆదివారం ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌తో సమావేశమయ్యారు. ఏపీ భవన్‌పై భారం లేకుండా బీఈఈ నుంచి ఏపీఎస్ఈసీఎంకు ఆర్థిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్.కె.రాయ్ ఈ సమావేశంలో చెప్పారు. బీఈఈ ఆర్థిక సహాయంతో ఏపీ భవన్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో బీఈఈ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ శర్మ, ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి పాల్గొన్నారు. -
ఢిల్లీ: ఏపీ భవన్ లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
ఢిల్లీ ఏపీ భవన్లో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..
న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్పా, మాధవ్, గురుమూర్తి, మాధవి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్య, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగాా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయల్లో వైఎస్ జగన్‌ది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ప్రతిపక్షాలు వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టాయని, అయినా వాటిని సీఎం జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్దతతో పని చేస్తున్నారని చెప్పారు. '2009లో వైఎస్ జగన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన వ్యక్తిత్వంతో పార్టీ నిలబడింది. వైఎస్ కుటుంబంతో నాది మూడు తరాల అనుబంధం. సీఎం జగన్ వందేళ్లు చల్లగా జీవించాలి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలి' అని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: CM Jagan Birthday: ఊరూవాడా సీఎం జగన్ జన్మదిన వేడుకలు -
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ..
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు చేపట్టారు. సీఎస్‌గా కె విజయానంద్‌కు తాత్కాలిక అదనపు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ ఆస్పత్రిలో ఉన్నందున కె విజయానంద్ తాత్కాలిక అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం -
ఏపీ భవన్లో ఘనంగా వైఎస్ జయంత్యుత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి, రైతు దినోత్సవ ఉత్సవాలను శుక్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రైతు సమాఖ్య కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ అని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఇది కూడా చదవండి: 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది -
ఏపీ భవన్లో తెలుగు విద్యార్థులను కలిసిన ఎంపీ సత్యవతి
సాక్షి, ఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. గురువారం.. ప్రత్యేక విమానాలలో 86 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు పెట్టుబడుల రాజధాని’ విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏపీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ, కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ కమిటీ సభ్యురాలు బి.వి.సత్యవతి.. ఏపీ భవన్లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను కలిసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. -
న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో గౌతమ్‌రెడ్డి సంతాపసభ
-
ఏపీ భవన్లో గౌతమ్‌రెడ్డి సంతాపసభ
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సంతాప సభను న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు సత్యవతి, రెడ్డప్ప, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్(మెరిట్స్) వద్ద అంత్యక్రియలు జరగనున్నాయి. సంతాప సభలో ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. చురుకైన మంత్రిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేకపాటి కుటుంబం, గౌతమ్‌రెడ్డి చేసిన కృషి అనన్య సామాన్యమని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి మరణవార్త నిజం కాకుంటే బాగుండని అన్నారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. అత్యంత క్రమశిక్షణ, ఎనర్జీ కలిగిన నేత గౌతమ్‌రెడ్డి, పాలిటెక్నిక్, ఐటిఐలను ఇంటిగ్రేట్ చేయాలన్న ఆలోచన చేశారని గుర్తుచేసుకున్నారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. తనను ఒక తమ్ముడి లాగా చూసేవారని, అనేక విషయాల్లో తనను గైడ్ చేశారని తెలిపారు. తిరుపతి ఎంఆర్ఓ సెంటర్ తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. రాష్ట్రానికి అయిదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువచ్చి నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ఎంపీ రెడ్డప్పా గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి మృతి అత్యంత దురదృష్టకరమని, చిన్న పరిశ్రమల బాగుకోసం పరితపించిన వ్యక్తి అని ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అందరికంటే ఫిట్‌గా ఉండే వ్యక్తి హఠాత్తుగా మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ వార్త అబద్దం అయితే బాగుండని అన్నారు. -
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాశ్
సాక్షి, విజయవాడ: ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను.. బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ కేంద్రం నుంచి తాజాగా దేశాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆల్ ఇండియా బిసి అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్, ఓబిసి సెంట్రల్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తదితరులు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ మరణించినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారని వారు స్మరించుకున్నారు. చదవండి: మహానేత వైఎస్సార్‌కు గవర్నర్ విశ్వభూషణ్ నివాళి -
ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం.. ఏపీ భవన్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికుల డిమాండ్ చేశారు. కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, గీత, సత్యవతి, మాధవ్, కోటగిరి శ్రీధర్, ఎంవీవీ సత్యనారాయణ, అనురాధ, తలారి రంగయ్య ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయ పోరాటం చేసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలన్నారు. సొంత గనులు ఇవ్వాలని, అప్పును ఈక్విటీగా మార్చాలని సూచించామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను ఉద్యోగుల యాజమాన్యంలో ఉంచితే బాగుంటుందని తన ఉద్దేశమన్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
అలరించిన ఏకశిల సౌందర్యం
సాక్షి, న్యూఢిల్లీ: విజయనగర సామ్రాజ్య తోరణాలు, భిన్న కళాకృతులతో కూడినస్తంభాలు, కళాకారుల ఏకవీర నాట్యం, అతిపెద్ద ఏకశిల నందితో కూడిన ఆంధ్రప్రదేశ్ శకట సౌందర్యం గణతంత్ర వేడుకల ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. న్యూడిల్లీలో మంగళవారం గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రదర్శించారు. భారతీయ శిల్పకళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిన లేపాక్షి కట్టడం స్ఫూర్తిగా రూపుదిద్దిన శకటంలో 12 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తుతో ఉన్న నంది ముందుభాగంలో ప్రధాన ఆకర్షణగా నిలించింది. నంది వెనుక ఆలయ ముఖ మండపం, అర్ధ మండపం నమూనాలు ఏర్పాటు చేశారు. లేపాక్షి శిల్పకళలో ప్రతి స్తంభానికి ఉండే ఓ విశిష్ట శైలిని కళ్లకు కట్టినట్లుగా భిన్న కళాకృతులతో ఏర్పాటు చేశారు. శివలింగంపై ఏకశిల శోభితమైన ఏడుతలల పామును వెనక భాగంలో ప్రదర్శించారు. ఇరువైపులా వినాయకుడు, గర్భగృహానికి ముందుగా వీరభద్రుడి కుడ్యచిత్రం శకటానికి మరింత అందం తీసుకొచ్చింది. శకటంపైన, ఇరువైపులా నడుస్తూ.. వీరభద్రుడిని శ్లాఘిస్తూ సంప్రదాయ వీరనాట్యం ప్రదర్శించారు. 15వ శతాబ్దం నాటి శిల్పకళా సౌందర్యాన్ని కనులారా వీక్షించిన ఆహూతులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. శకటం రాజ్‌పథ్‌లో సాగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సమాచారశాఖ సంయుక్త సంచాలకుడు కిరణ్‌కుమార్ శకట ప్రదర్శనను పర్యవేక్షించారు. మరోవైపు ఏపీ భవన్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్‌త్రిపాఠి జాతీయ జెండాను ఎగురవేశారు. రెసిడెంట్ కమిషనర్ భావనాసక్సేనా గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. -
ఏపీ భవన్లో స్వల్ప అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆదివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 908 గదిలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. -
ఏపీ భవన్‌లోని బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ
-
దుర్గాప్రసాద్ మృతి వ్యక్తిగతంగా లోటు..
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో గురువారం ఉదయం బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ , తలారి రంగయ్య, ఏపీ భవన్ ఉన్నతాధికారులు అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డి తదితరులు అంజలి ఘటించారు. (అజాత శత్రువుగా అందరివాడయ్యారు..) వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ‘బల్లి దుర్గాప్రసాద్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆయన 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిసారి నా ఆశీస్సులు తీసుకునేవారు. ఆయన కుటుంబానికే కాదు, నాకు కూడా ఈ మరణం వ్యక్తిగతంగా లోటు. పార్లమెంట్ లో అందరితో కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవారు.’ అని తెలిపారు. (తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత ) ఆయన భోళా మనిషి ‘బల్లి దుర్గాప్రసాద్ ఏదైనా భోళాగా మాట్లాడే మనిషి. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారు. ఆయన అకాల మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటు’ అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సహచర ఎంపీ దుర్గాప్రసాద్ మరణం అందరినీ ఎంతో బాధించిందని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. -
ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏపీ భవన్లో సోమవారం భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేత్వత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బెల్లాన చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగయ్య, సత్యవతి, భరత్, పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, ఎన్వీవీ సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి తదితులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారిద్దరిని హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించిన విషయం విదితమే. కాగా కాకినాడ ఎంపీ వంగ గీత సైతం ఇటీవలే మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే.