
సాక్షి, ఢిల్లీ: నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగనుంది. బుధవారం సాయంత్రం సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు.
అయితే, తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్‌లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్దతిలో గదుల విభజన, నిర్వహణ జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యానథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానుండగా.. తెలంగాణ సర్కార్ తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవనున్నారు. ఇక, ఏపీ భవన్ విభజనపై తొమ్మిదేళ్లుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం.