
సాక్షి, ఢిల్లీ: మణిపూర్‌లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారిగా మైఖేల్ అంఖమ్‌ను నియమించింది. ఏపీ భవన్‌లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.
మణిపూర్‌లోని వివిధ యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. గిరిజన తెగల మధ్య ఘర్షణతో విద్యార్థులు భయాందోళనకు లోనవుతున్నారు. మణిపూర్‌లో హింసను అదుపు చేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగడంతో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి.
సహాయం కోసం డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు : 011-23384016, 011-23387089
మణిపూర్ ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ : 8399882392 , 9436034077, 7085517602
చదవండి: AP: టెన్త్‌లో పెరిగిన ఉత్తీర్ణతా శాతం.. ఫస్ట్, లాస్ట్ జిల్లాలు ఇవే
Comments
Please login to add a commentAdd a comment