ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ | Union Home Ministry Release Order Of Division Of AP Bhavan | Sakshi
Sakshi News home page

ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ

Published Sat, Mar 16 2024 1:34 PM | Last Updated on Sat, Mar 16 2024 4:37 PM

Union Home Ministry Release Order Of Division Of AP Bhavan - Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ భవన్ విభజనకు సంబంధించి ఎట్టకేలకు పీటముడి వీడింది. ఏపీ భవన్‌ విభజన అంశం పరిష్కారం అయ్యిందని తాజాగా హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్- జీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 11.536 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్రం ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.

అదేవిధంగా తెలంగాణకు 8.245ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ-ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement