
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం యాత్ర-2 సినిమా ప్రదర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ గురు మూర్తి, వైఎస్‌ఆర్ అభిమానులు, ప్రేక్షకులు సినిమాను వీక్షించారు. సినిమా ఆసాంతం ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానులు జై జగన్ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం సీఎం జగన్ సంక్షేమ యాత్ర ఇలాగే కొనసాగుతుందన్నారు. ఆయన పాదయాత్రలో నడిచే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్నా యాత్ర ఆపకుండా నడిచిన నాయకుడని కొనియాడారు. నవరత్నాల పాలనతో ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్‌ను ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారన్నారు.