
సాక్షి, ఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. గురువారం.. ప్రత్యేక విమానాలలో 86 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు.
చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు పెట్టుబడుల రాజధాని’
విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏపీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ, కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ కమిటీ సభ్యురాలు బి.వి.సత్యవతి.. ఏపీ భవన్‌లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను కలిసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment