SATYAVATHI
-
అశ్వతీర్థం: సత్యవతి ఎలా పుట్టింది? ఎవర్ని పెళ్లాడింది?
భరత వంశంలో జన్మించిన కుశికుడు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలిగినవాడు. అతడి కొడుకు గాధి. కన్యాకుబ్జం రాజధానిగా పరిపాలన సాగించిన గాధి మహా రాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. ఆ దిగులుతో సంతానం కోసం తపస్సు చేయాలని అడవులకు వెళ్ళి, సోమయాగం చేశాడు. ఆ యాగఫలంగా సత్యవతి అనే కూతురు కలిగింది. ఆ రోజులలో భృగువంశ సంజాతుడైన చ్యవనుడికి ఋచీకుడనే కొడుకు ఉండేవాడు. ఋచీకుడు విఖ్యాతుడైన తపస్వి. గాధి కుమార్తెయైన సత్యవతిని వివాహమాడాలనే కోరికతో ఒక రోజు వెళ్ళి గాధిని అడిగాడు. ఋచీకుడిని ధన హీనుడిగా తలచిన గాధి, కన్యాశుల్కం ఇస్తేనే గాని తన కూతురిని వివాహమాడడానికి ఇవ్వనన్నాడు. శుల్కంగా ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు ఋచీకుడు. ఒక చెవిశ్యామ వర్ణంతోను, మిగతా శరీరమంతా శ్వేతవర్ణంతో చంద్రుడిలా మెరిసే వెయ్యి వేగవంతమైన గుర్రాలనుశుల్కంగా కోరాడు గాధి. అలా కోరడంలో, అది మానవ సాధ్యమయ్యే పని కాదు గనుక, ఋచీకుడు నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్ళి పోతాడని గాధి తలచాడు. కాని ఋచీకుడి తపశ్శక్తికి అది అసాధ్యం కాదని గాధి ఊహించలేదు.చదవండి: హీరోయిన్ల బాటలో 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం అష్ట దిక్పాలకులలో ఒకడైన వరుణ దేవుడిని మనస్సులో తలుచుకున్నాడు ఋచీకుడు. ఋచీకుడికి ఏది కావాలంటే అది, ఎక్కడ కావాలంటే అక్కడ లభ్యమయ్యే వరమిచ్చాడు వరుణుడు. కన్యాకుబ్జం దగ్గర గంగానది ఒడ్డున కూర్చుని తనకు కావలసింది కోరుకున్నాడు ఋచీకుడు. అలా కోరిన వెంటనే గంగానది నీళ్ళ నుండి గాధి కోరుకున్న రూపంలో కాంతులీనుతూ వేయి గుర్రాలు ఉత్పన్నమయ్యాయి. ఆ వేయి గుర్రాలను శుల్కంగా గాధికి ఇచ్చి, సత్యవతిని పరిణయమాడాడు ఋచీకుడు. పూర్వం మహాతపస్సంపన్నులైన ఋషులకు సాధ్యం కానిదేదీ ఉండేది కాదని ఈ ఐతిహ్యం చెబుతుంది. ఈ కథ కారణంగానే నేటికీ కన్యాకుబ్జం నగరం దగ్గరి గంగానది అశ్వతీర్థంగా పిలవబడుతూ ఉందని వ్యాసుడి మహా భారతం, అనుశాసనిక పర్వం, నాలుగవ అధ్యాయంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
-
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి.. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని.. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభ చర్చలో వైఎస్సార్సీపీ తరఫున ఆమె మాట్లాడారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఏపీలో జాతీయ ఆహార భద్రత రేషన్ కార్డుల కవరేజ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. తుపాన్లతో ఏపీ తరచూ తీవ్రంగా నష్టపోతోందని, తుపానుల నుంచి ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. విద్యారంగంలో, సులభతర వాణిజ్యం, మత్స్య రంగంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. -
Before Marriage Review: 'బిఫోర్ మ్యారేజ్' మూవీ రివ్యూ
చిత్రం: బిఫోర్ మ్యారేజ్ విడుదల: జనవరి 26 నటీనటులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ... గాయనీగాయకులు: మంగ్లీ, సంథిల్య పిసపాటి, అపర్ణ నందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికుమార్ గొల్లపల్లి, మ్యూజిక్: పీఆర్ డీవోపీ: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి ఎడిటింగ్: అలోష్యాస్ క్సవెర్ పబ్లిసిటీ డిజైనర్: జేకే ఫ్రేమ్స్ పీఆర్ఓ: ఆశోక్ దయ్యాల యువతను ఆకర్షించే కథ, దానికి తోడు ఓ మెసెజ్ ఇస్తే సినిమాను బ్రహ్మండంగా హిట్ చేస్తారు ప్రేక్షకులు. సరిగ్గా అలాంటి సబ్జెక్టుతో వచ్చిన మూవీ 'బీఫోర్ మ్యారేజ్'. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన మూవీ 'బిఫోర్ మ్యారేజ్'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. కథేంటి ధరణి (నవీన రెడ్డి) తన కాలేజీ ఫ్రెండ్స్ శాంతి, ప్రశాంతితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. కొత్త అలవాట్లు, ఎంజాయ్ మెంట్ కోరుకునే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ధరణి పెగ్నెన్సీ అవుతుంది. పెళ్ళి కాకుండానే తల్లి అవుతుందటంతో ఆమె జీవితం తలక్రిందులు అవుతుంది. దీంతో సామాజిక ఒత్తిడికి లోనవుతుంది. జీవితం తలక్రిందులైనట్టు మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఆమె తండ్రి ఆమెను అంగీకరిస్తారా? అలాంటి పరిస్థితిని ఎలా ఈ యువతి అధిగమిస్తుందనేదే ఈ సినిమా కథ. నటీనటులు ప్రధాన పాత్రలో నటించిన నవీన రెడ్డి క్యూట్‌గా కనిపించింది. ఈ తరం అమ్మాయిల ఆలోచన దోరణి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే చేసి చూపించింది. మెయిన్ లీడ్ పాత్రను సమర్థవంతంగా పోషించిందని చెప్పవచ్చు. అలాగే హీరో భారత్ ఆకాష్ పాత్రలో తన యాక్టింగ్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేశాడు. చక్కగా, చలాకీగా కనిపించాడు. ఇక అపూర్వ తన పాత్ర తగ్గట్టుగా నటించి మెప్పించింది. ఇతర పాత్రలు తమ పరిది మేరకు నటించి మెప్పించారు. సాంకేతిక విభాగం ఈ సినిమాకు ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ చేసిన పాటలు బాగున్నాయి. సింగర్ మంగ్లీ పాడిన పాట ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. 'ఇదేమి జిందగీ. రొటీన్‌గా ఉన్నది.." పాట బాగుంది. ఇక నాచురల్‌గా విజువల్స్ కనిపించేలా షూట్ చేసిన డీవోపీ రాజశేఖర్ రెడ్డి పనితీరు బాగుంది. అలోష్యాస్ క్సవెర్ ఎడిటింగ్ సరిగ్గా కుదిరిందని చెప్పొచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. స్క్రీన్ అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. విశ్లేషణ చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చిత్రయూనిట్ ముందే ప్రకటించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనలే ఈ సినిమాలో సన్నివేశాలుగా కనిపిస్తాయి. దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల తాను రాసుకున్న కథకు తగినట్టే తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పెళ్లికి ముందు తప్పు అనిపించని ఓ పొరపాటు.. లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తుందని చూపించిన విధానంలో ఇచ్చిన మెసెజ్ యువతకు సూటిగా తాకుతుంది. తాత్కాలిక ఆనందాల కోసం పెడదోవ పడుతున్న యువతకు ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించారు. యువత థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అని తప్పకుండా చెప్పొచ్చు. -
విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్
అనకాపల్లి: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి చెప్పారు. ఆమె సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వేజోన్ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని, భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వడ్లపూడిలో రైల్వేస్థలం 100 ఎకరాలు ఉండగా, జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని రైల్వే అధికారులకు అప్పగించినట్లు వివరించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఓఎస్డీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో నియమించిందని పేర్కొన్నారు. ప్రజల అభీష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని గౌరవించి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుంటే.. ‘ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు..’ అని చెప్పి నగదు తీసుకున్న రోజులను చంద్రబాబు మరిచిపోయినా... జనం ఇంకా గుర్తుంచుకున్నారని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముకలాంటిదని, విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి గోదావరి జలాలను ఇచ్ఛాపురం వరకూ అందించాలని పోలవరం ప్రాజెక్టును చేపడితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్న రోజులను గుర్తెరగాలని పేర్కొన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సుమారు రూ.56 వేల కోట్లు ఖర్చవుతుందని, ఈ విషయంపై కేంద్ర జలవనరుల శాఖమంత్రితో చర్చించామని ఎంపీ సత్యవతి చెప్పారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు భూసేకరణలో ఇబ్బందుల కారణంగా ముందుకు సాగలేదని, చోడవరం మండలంలో ఒక గ్రామ ప్రజలు సహకరించకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఉత్తరాం«ధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఇతర నేతలు గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్ర మంత్రులను కలిసిన పాపానపోలేదన్నారు. వారు ఈ విషయాలపై మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
98.8 శాతం హామీలను నాలుగన్నరేళ్లలో నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దే
-
తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
మహేశ్వరం: తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రూ.14 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం స్థానిక మంత్రి సబితారెడ్డితో కలసి ఆమె శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంజారాలు, ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్లను నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బంది నిరసన మహేశ్వరంలో పర్యటిస్తున్న మంత్రుల వాహనాలను అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శివగంగ రాజేశ్వరాలయం ఎదుట ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులు కాన్వాయ్కి అడ్డుగా నిలిచారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిని పక్కకు నెట్టేసి కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో దురుసుగా వ్యవహరించారని నిరసనకారులు మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీలు శాంతించారు. -
సమ్మె విరమించండి.. సమస్యలుంటే పరిష్కరిస్తాం
సాక్షి,హైదరాబాద్/ వెంగళరావునగర్: అంగన్వాడీటీచర్లు, హెల్పర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించి చర్చలతో వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన పలు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, జీఓలు జారీ అయ్యాక సమ్మెకు దిగడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం అమీర్‌పేటలోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో మంత్రి సత్యవతిరాథోడ్ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల్లో నమోదయ్యే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎక్కువమంది బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని, విధులు బహిష్కరించి సమ్మె చేయడంతో వారంతా ఇబ్బంది పడే అవకాశం ఉందని, వారి సేవలను తక్షణమే కొనసాగించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయలబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీల క్రమబద్ధీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రాష్ట్రప్రభుత్వం నెరవేర్చడం సాధ్యం కాదని చెప్పారు. అంగన్వాడీల తరపున డిమాండ్లు కేంద్రానికి నివేదిస్తామని, అవసరమైతే స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోలికేరి, జేడీ లక్ష్మీదేవీ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో 65 ఏళ్లకు రిటైర్మెంట్
సాక్షి, హైదరాబాద్/ వెంగళరావు నగర్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అదేవిధంగా పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్‌కు లక్ష రూపాయలు, మినీ అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్‌కు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించనుంది. పదవీ విరమణ పొందిన మరుసటి నెల నుంచి ఆసరా పెన్షన్ కూడా అమలు చేయనుంది. 50 సంవత్సరాలలోపు ఉన్న అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. సర్విసులో ఉన్న అంగన్వాడీ టీచర్ మరణిస్తే రూ.20 వేలు, మినీ అంగన్వాడీ టీచర్/హెల్పర్‌కు రూ.10 వేలు దహన సంస్కారాల నిమిత్తం అందజేయనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోలికేరి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతినెలా 14లోపు వేతనాలు: మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీలోపు వేతనాలు అందిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అంగన్వాడీల సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు. మంగళవారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాలను అమలు చేయాలని కోరుతూ సమ్మెకు దిగడం న్యాయసమ్మతం కాదన్నారు. ఆయా డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందని, తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ ఉన్నతాధికారులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంగన్వాడీలతో కలసి సహపంక్తి భోజనం చేశారు. -
మన పాలకులకు ప్రేమ, భక్తి ఉన్నాయి
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. -
ప్రతి నెలా 14న అంగన్వాడీ టీచర్లకు వేతనాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీన వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డుల జారీపైనా దృష్టి సారించామని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించా రు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆమె అంగన్వాడీ యూనియన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జికోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్య లు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలికెరి, జేడీ సునంద, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, టీఎన్జీవో ప్రతినిధి నిర్మల, మినీ అంగన్వాడీ అధ్యక్షురాలు వరలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 330 ఎకరాల భూమిని చూపినా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరారు. శనివారం శాసనమండలిలో ‘గిరిజన సంక్షేమం–పోడు భూములకు పట్టాల పంపిణీ’పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. పోడు భూముల వివాదాల్లో తలెత్తిన కేసులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎత్తివేసేందుకు అటవీశాఖ, డీజీపీలతో కూడిన కమిటీ కసరత్తు ప్రారంభించిందని చెప్పారు. 2023–24 లో 15 వేల మంది గిరిజన రైతుల ప్రయోజనాల కోసం ‘గిరివికాసం’కింద రూ.150 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని, 500 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ల హయాంలోనే పోడుభూములకు పట్టాలు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. -
మంత్రి సత్యవతి రాథోడ్ ఎందుకా శపథం చేశారు..?.. అసలు వ్యూహం ఏంటి?
ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాని మండలికి ఎన్నికయ్యారు.. ఎస్టీ కోటాలో మంత్రి పదవి పొందారు. తనను మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌పై స్వామిభక్తి చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. చేతి మీద అధినేత పేరుతో పచ్చబొట్టు వేసుకుని సంబరపడుతున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా చెప్పులు వేసుకోవడంలేదు. రాజకీయాల్లో పదవులు కాపాడుకోవడం, ఉనికి కాపాడుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పదవులు పొందడానికి, ఉన్న పదవిని కాపాడుకోవడానికి అధినేత మెప్పు పొందడానికి ఎన్ని బాధలైనా పడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహార సరళి గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి గులాబీ దళపతి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. గత 4 నెలలుగా పాదరక్షలు లేకుండా తిరుగుతున్న మంత్రి సత్యవతి రాథోడ్.. తాజాగా తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేసుకుని స్వామి భక్తిని మరో సారి చాటుకున్నారు. స్వామి భక్తిని చాటుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవ్వరి అంచనాలకు అందకుండా తనను మంత్రిని చేసిన కేసీఆర్‌పై సత్యవతి రాథోడ్ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. శపథానికి కట్టుబడి నాలుగు మాసాలుగా చెప్పులు లేకుండా తిరగడంతో వేసవి ఎండల దృష్ట్యా అరికాళ్లకు బొబ్బలొచ్చి కంటతడి పెట్టారు. కేసీఆర్ పై ఉన్న అభిమానం ముందు కాళ్ల బొబ్బలు పెద్ద సమస్యే కాదని భావించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారా భవన్లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకురాలైన మంత్రి సత్యవతి రాథోడ్ తన పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోవడం మానేసిన విషయాన్ని అందరూ మర్చిపోవడంతో పచ్చబొట్టు వేసుకొని తన ప్రతిజ్ఞను గుర్తుచేయడంతో పాటు.. కేసీఆర్ పట్ల ఎంతో అభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పే ప్రయత్నమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. డోర్నకల్ లేదా మహబూబాబాద్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న సత్యవతి రాథోడ్ కేసీఆర్ కరుణ కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నారని టాక్ నడుస్తోంది. చదవండి: జానారెడ్డి అసలు స్ట్రాటజీ ఇదేనా?.. సీఎం కుర్చీ కోసమేనా..? నియోజకవర్గం లేకుండా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి, డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను కాదని సత్యవతికి టిక్కెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్‌లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ పై స్వామిభక్తిని చాటుకుంటే ఎక్కడో ఓ చోట అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయంపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో నొచ్చుకున్నారట. ఏమి అడగకుండానే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకుంటే ప్రత్యర్థులు లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే పదవి బెటర్ కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి తన రాజకీయ జీవితాన్ని పటిష్టపర్చుకునేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. -
మంత్రి కఠోర దీక్ష.. కాళ్లకు బొబ్బలు
సాక్షి, మహబూబాబాద్: కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరునెలలుగా కాళ్లకు చెప్పులు వేసుకోకుండా కఠోర దీక్ష చేపడుతున్నారు. పలు అభివృద్ధి పనులు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎండలో నడవడంతో ఆమె కాళ్లకు బొబ్బలు వచ్చా యి. రాత్రి ఆమె తన కాళ్లకు ఆయింట్మెంట్ పూసుకొని ఉపశమనం పొందారు. ఈ క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కాగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా దీక్ష విరమించేది లేదని మంత్రి తెలిపారు. -
రవీంద్రభారతిలో ఘనంగా మహిళాసంక్షేమ సంబరాలు (ఫొటోలు)
-
పాలు ఎందుకు ఇవ్వడం లేదు?
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ‘మూడు నెలలుగా పాలు లేవ్’అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. గురువారం ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలకు మూడు నెలలుగా పాల సరఫరా నిలిచినందుకు గల కారణాలపై ఆరా తీశారు. పాల పంపిణీ నిలిచిపోవడంతో పిల్లలకు పౌష్టికలోపాలను అధిగమించే కార్యక్రమం నీరుగారుతుందని చెబుతూ.. తక్షణమే పాల సరఫరా పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, టెండరు ఖరారు, కాంట్రాక్టరు ఎంపిక అయ్యే వరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అందుకే పాలు సరఫరా చేయలేకపోయాం... కేఎంఎఫ్ వివరణ ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం వల్లే అంగన్వాడీ కేంద్రాలకు పాలు పంపిణీ నిలిచిపోయిందని కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్(కేఎంఎఫ్) లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న తమ సంస్థ గతేడాది సెప్టెంబర్ నెల వరకు పూర్తిస్థాయిలో పక్కాగా సరఫరా చేసినట్లు వివరించింది. గతేడాది సెప్టెంబర్‌తో కాంట్రాక్టు ముగిసిందని, కానీ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ వాఖ ప్రత్యేక ఆదేశాలతో పాల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించింది. కానీ పాడి పశువులు పెద్ద సంఖ్యలో లంపిస్కిన్ వ్యాధి బారిన పడడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని, దానికితోడు గత నవంబర్, డిసెంబర్లలో తీవ్ర వర్షాలు కురవడంతో పాల రవాణా పడిపోయిందని, దీంతో పాల కేంద్రాలకు కోటా రాలేదని వివరించింది. త్వరలోనే పాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కేఎంఎఫ్ వివరించింది. -
నారసింహుడి సేవలో ముర్ము
సాక్షి, యాదాద్రి/ సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆమె ఉదయం 9.22 గంటలకు బొల్లారం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. వారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గంలో కొండపైకి వెళారు. ఆలయంలో త్రితల రాజగోపురం వద్ద అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నారసింహుడికి ప్రత్యేక పూజలు, కేశవ నామార్చన చేశారు. తర్వాత ముఖ మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గవర్నర్ తమిళిసైలకు వేదాశీర్వచనం చేసి.. ప్రసాదాన్ని, పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి జ్ఞాపికను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రపతికి అందజేశారు. ఆలయం నుంచి బయటికి వచ్చాక ఉత్తర రాజగోపురం ముందు మంత్రులు, అధికారులు, అర్చకులు, దేవస్థానం సిబ్బందితో రాష్ట్రపతి ఫొటోలు దిగారు. కాగా.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు యాదాద్రి కొండపైకి అనుమతించలేదు. అమర సైనికుల కుటుంబాలతో భేటీ యాదాద్రి నుంచి వచ్చిన తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అమర సైనికుల కుటుంబాలను ముర్ము పరామర్శించారు. దేశం కోసం ప్రాణా లు అర్పించిన వీరులను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులతో కొంతసేపు మాట్లాడారు. వారిని సన్మానించి, బహుమతులు అందచేశారు. ప్రముఖులకు విందు రాష్ట్రంలో పర్యటన ముగుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో రాజకీయ ప్రముఖులకు ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరికొందరు మంత్రులు, ఎంపీలు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.లక్ష్మణ్, నామా నాగేశ్వర్రావు, దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు, జ్ఞాపికతో వీడ్కోలు హైదరాబాద్‌లో శీతాకాల విడిదిని ముగించుకున్న రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆమెకు గవర్నర్ తమిళిసై, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ నూతన పట్టువస్త్రాలు, జ్ఞాపిక, ఫలాలను రాష్ట్రపతికి అందచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి కలిసి వెండి వీణను బహూకరించారు. -
ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివరించారు. గురువారం రాష్ట్రపతి నిలయంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ద్రౌపదీ ముర్ము ముందు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పది గిరిజన సమూహాలైన లంబాడా, కోయ, గోండు, ఎరుకల, పర్దాన్, ఆందులు, కొలాములు, చెంచు, తోటి ఇంకా కొండారెడ్డి తెగల కోసం నాలుగు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో షెడ్యూల్ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయని, వీటిలో 3,146 గిరిజన గ్రామపంచాయతీలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని 8.5 లక్షల మంది గిరిజన, ఆదివాసీ రైతులకు ఏటా రెండు విడతలురైతుబంధు పథకం కింద ఆర్థిక సాయా న్ని చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ వర్గాలకు రూ.7,349 కోట్ల రూపాయలను వ్యవసాయ పెట్టుబడి సహాయంగా అందించామని మంత్రి.. రాష్ట్ర పతి ముర్ముకు తెలిపారు. అలాగే గిరిజన ఆవాసా లకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నామని, గిరిజనుల ఆరోగ్య వస తుల కోసం కొత్తగా 437 సబ్ సెంటర్లు, 32 బర్త్ వెయిటింగ్ హాళ్లు, 7 డయాగ్నొస్టిక్ హబ్‌లను నిర్మించామన్నా రు. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాలలో 31 పాఠశాలలు, కొలాముల సమూహం కోసం ప్రత్యేకించి ప్రైమరీ పాఠశాలలు, సైనిక్ పాఠశాల, న్యాయ విద్య, ఫైన్ఆర్ట్స్ కోసం ప్రత్యేక కళాశాలు ఏర్పాటు చేశామని, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పంచాయతీలకు పక్కా భవనాలు, రహదారుల సౌకర్యాలు.. చెంచు, కొలాములు, కొండారెడ్డి తెగలకు అటవీ ఉత్పత్తులపై ప్రభుత్వ సహకారం అందుతోందని మంత్రి సత్యవతి తెలిపారు. అలాగే 440 ఆదిమ జాతి గిరిజన గ్రామాలలో రూ.60 కోట్లతో అంతర్గత రోడ్ల సదుపాయం, 53 ఆదిమ జాతి ఆవాసాలలో రూ.2.39 కోట్లతో సౌర విద్యుదీకరణ చేపట్టి 443 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. 3,467 గిరిజన గ్రామాలకు రూ.221 కోట్లతో త్రీఫేజ్ విద్యుదీకరణ కల్పించామని, గిరిజన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేశామని, రూ.3,275 కోట్లతో 5,162 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని, 16,375 ఆదిమ జాతి పిల్లలు, గర్భిణిలు, బాలింతలకు, కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు గిరి పోషణ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి సత్యవతి వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు. -
రామప్పలో రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయా న్ని సందర్శించారు. రుద్రేశ్వర స్వామి కొలువైన, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కుటుంబసభ్యు లతో కలిసి సందర్శించడం ప్రాధాన్య తను సంతరించుకుంది. రాష్ట్రపతికి హెలిపాడ్ వద్ద గవ ర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో రామప్ప ప్రధానగేటు వద్దకు చేరుకో గానే రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ములుగు ఎమ్మెల్యే సీతక్కలు స్వాగతం పలికారు. ప్రధానగేటు నుంచి కాలినడ కన ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి పూజా రులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా ఆలయంలో రాష్ట్ర పతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి జలాభిషేకం చేశారు. అనంతరం మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గా రావు రాష్ట్రపతికి సమ్మక్క, సారలమ్మ దేవతలకు చెందిన పసుపు, కుంకుమతోపాటు పట్టుచీర అందించారు. రామప్ప ఆలయ పూజారులు శాలు వాతో సత్కరించి ఆశీర్వచనం చేశారు. అక్కడి నుంచి రామప్ప గార్డెన్‌లోని గ్రీన్హౌస్లో రాష్ట్ర పతి కొద్దిసేపు సేదదీరారు. అనంతరం గార్డెన్లో ఏర్పాటు చేసిన సభావేదిక పైనుంచి రూ.62 కోట్లతో చేపడుతున్న ప్రసాద్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. రూ.15 కోట్లతో చేపడుతున్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పరంపర కళా కారుల బృందం శివుని పాటతో పాటు ‘బ్రహ్మ మొకటే పరబ్రహ్మమొకటే’ పాటకు చేసిన నృత్యాన్ని, ఏటూరునాగారానికి చెందిన కోయ కళా కారుల కొమ్మకోయ నృత్యాన్ని రాష్ట్రపతి తిలకించారు. అనంతరం సాయంత్రం 4:20 సమయంలో హైదరాబాద్‌కు వెళ్లారు. ఎల్ఈడీ స్క్రీన్కు మంటలు రాష్ట్రపతి రామప్ప పర్యటనలో స్వల్ప అపశ్రుతి దొర్లింది. రామప్ప వేదికపై ముర్ము తదితరులు ఆశీనులై గిరిజనుల కొమ్మకోయ, పరంపర సాంస్కతిక కార్యక్రమాలు తిలకిస్తుండగా మీడియా గ్యాలరీ సమీపంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికా రులు, ఫైర్ సిబ్బంది మంటలు చెలరేగకుండా అదుపులోకి తెచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల
మహిళా సృజనకారుల గురించీ, వారి జీవించిన సమాజం గురించీ, వారి రచనా స్వేచ్ఛ గురించి పరిశోధించి పాఠకుల చేతిలో పండు వలిచి పెట్టినట్లు రాయడంలో ఎంత శ్రమ, శ్రద్ధ, ఆసక్తీ అవసరమో కదా. అటువంటి ఆసక్తీ, శ్రమా శ్రద్ధల సమ్మేళనమే మృణాళిని ‘విశ్వమహిళా నవల’. ఇందులో జాపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలలో తొలి నవలా రచయిత్రుల పరిచయం, వారి జీవించిన కాలంలో స్త్రీలకుండే పరిమితులూ, రచయిత్రుల జీవన శైలీ, రచనా శైలీ, వస్తువూ అన్నిటినీ విస్తృతంగా చర్చించారు మృణాళిని. ప్రపంచ సాహిత్యంలోనే మొదటి నవల రాసిన జాపనీస్ రచయిత్రి లేడీ మూరసాకీ (978–1014) నుంచి ఫ్రెంచ్ రచయిత్రి జార్జ్ సాండ్ (1804 –1876) వరకూ పదముగ్గురు రచయిత్రుల పరిచయం స్త్రీల సాహిత్య చరిత్రను మనముందు ఉంచుతుంది. లేడీ మూరసాకి వ్రాసిన ‘ది టేల్ ఆఫ్ గెన్జి’ ప్రపంచ భాషల్లోనే తొలి నవల అని విమర్శకులు గుర్తించారు. వెయ్యి పేజీల ఈ వచన రచన అప్పటికింకా ప్రాచుర్యంలో లేని నవలా ప్రక్రియను అవలంబించింది. 1వ శతాబ్దం మొదలు 19వ శతాబ్దం వరకూ ఆయా దేశాలలో ఉండే మహిళా రచయిత్రులు అక్కడి రాజకీయ పరిస్థితులు, సామాజిక నియమ నిబంధనలు, పితృస్వామ్యం... వీటన్నిటినీ తట్టుకుని నవలలు రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. కొంతమంది రచయిత్రుల కృషి వారి జీవిత కాలంలో గుర్తింపబడకపోయినా... తరువాత కొంతమంది సద్విమర్శకుల వలన, స్త్రీవాదుల వలన గుర్తించబడింది. స్త్రీలు తమ స్వంత పేర్లతో రాయడానికి జంకి పురుషుల పేర్లతో రాయడం లేదా అనామకంగా రాయడం, ఎప్పుడైనా ధైర్యంగా రాయడం, రాజకీయాలను గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం... చివరకు నెపోలియన్నే నిలదీసి ఆయన ఆగ్రహానికి గురి కావడం ఈ పుస్తకంలో చూస్తాం. త్రికోణ ప్రేమ కథలు, హారర్ కథలు రాసిన తొలి రచయిత్రులు కూడా వీరు అయ్యారు. పల్లె సీమల అందాలని రొమాంటిసైజ్ చేయడం కాక అక్కడి ప్రజా జీవనాన్ని చిత్రించారు. కొందరు రచయిత్రులు ప్రఖ్యాత పురుష రచయితలకు ప్రేరణ కూడా అయ్యారు. సమాజం విమర్శించే జీవన శైలులు కూడా అవలంబించారు. ఈ పుస్తకానికి ఓల్గా కూలంకషమైన పరిచయం రాశారు. రచయిత్రుల జీవన కాలం, రచనా కాలం, వారి జీవిత విశేషాలు, అనుభవాలు... ఏదీ వదలకుండా ఒక సంపూర్ణ చరిత్రను... అందులోనూ ప్రపంచ మహిళా రచయితల చరిత్రను ఇష్టంగా మనకు అందించిన మృణాళినికి అభినందలు లేదా కృతజ్ఞతలు అనేవి చాలా పేలవమైన మాటలు. ప్రస్తుతం అన్ని విశ్వ విద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలు ఉంటున్నాయి. ఆ కేంద్రాలలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) ఇటువంటి వ్యాస సంపుటులు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ తెలుగులో ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. ఇంగ్లిష్‌కన్నా తెలుగులో చదువుకోవడం సులభం కనుక యిది సాహితీ ప్రేమికులకూ చరిత్ర అభిమానులకూ మంచి కానుక. మరొక విషయమేమిటంటే ఇందులో మృణాళిని ప్రతి విదేశీ పదానికీ సరి అయిన ఉచ్ఛారణ ఇచ్చారు. ధృతి పబ్లికేషన్స్ ప్రచురించిన ‘విశ్వ మహిళా నవల’ హైదరాబాద్‌లోని నవోదయలో కొనుక్కోవచ్చు. చదువుతూ నాణ్యమైన సమయం గడపవచ్చు. - పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి -
మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెదక్‌జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా ప్రార్థనలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ సాల్మన్‌రాజ్ భక్తులకు దైవ సందేశం అందించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు జననం మానవాళి అంతటికీ శుభదినం అన్నారు. భక్తులు ఏసు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు భక్తులకు చర్చి దర్శనానికి అనుమతిచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించేందుకు 15 మంది గురువులను అందుబాటులో ఉంచామని రెండో ఆరాధనలో దైవ సందేశమిచ్చిన చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జ్ జార్జ్ ఎబనైజర్రాజ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. చర్చిలో ఆలపించిన భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ సందర్భంగా కల్వరి టెంపుల్‌కు భారీగా హాజరైన భక్తులు అన్ని మతాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం: మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ గిఫ్టు ప్యాకెట్లు అందజేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి అందించాలనే ఉదేశంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఆమెతోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
గిరిజనులను మోసగిస్తున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున పెంచలేమంటూ కేంద్రమంత్రి అర్జున్ ముండా పార్లమెంటు వేది కగా ప్రకటించడం దుర్మార్గమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి 2015లో చెల్లప్ప కమిషన్ నివేదిక ఇవ్వగా, 2016లో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం సత్యవతి మీడియాతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉండాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల తీర్మానం అందలేదని చెప్పిన కేంద్రమంత్రులు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతున్నారన్నారు. గిరిజనులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లంబాడాలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు దీక్షలకు పురిగొల్పుతున్నారని, దీనిపై బీజేపీ స్పష్టతనివ్వాలన్నారు. గిరిజనుల పట్ల బీజేపీ ధోరణి మారకుంటే ఆ పార్టీ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా గిరిజనుల బతుకులు మారాలంటే బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరముందని సత్యవతి పేర్కొన్నారు. -
బీజేపీ పావుగా షర్మిల
మహబూబాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి లను బీజేపీ పావుగా వాడుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్, వైద్య కళాశాల పనులను బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర విభజన చట్టంలోని హమీల అమలు కోసం సీఎం కేసీఆర్ అనేకసార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందించని ప్రధాని మోదీ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవని షర్మిల విషయంలో స్పందించడం వెనుక ఉన్న ఆంతర్యమేమింటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇదంతా చూస్తుంటే షర్మిలను బీజేపీ పావుగానే భావించాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని, ఆ విషయంలో సహించేది లేదని హెచ్చరించారు -
పారదర్శకంగా ‘పోడు’ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: పోడుభూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా పరిశీలించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం డీఎస్ఎస్ భవన్లో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో పోడురైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని, వేగవంతంగా పరిశీలనను పూర్తి చేయాలన్నారు. పోడుభూముల సర్వే ప్రక్రియను సైతం పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. గ్రామ, డివిజన్, జిల్లా సభలను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన, సర్వే కోసం అవసరమైనచోట అదనపు బృందాలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. పోడుభూముల సర్వేతోపాటు గ్రామీణ రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు. గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం మంత్రి ఐటీడీఏ పీవోలకు ఆపిల్ ట్యాబ్‌లను అందజేశారు. -
పోడు రైతులకు వచ్చే నెలలో పట్టాలు
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు వచ్చే నెలలో పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇప్ప టికే స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పోడు భూముల సర్వే పూర్తి చేసి పట్టాలు సైతం సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సభలను నిర్వహించి తీర్మానం కాపీలను జిల్లా స్థాయి కమిటీలకు వెంటనే పంపాలన్నారు. విజ్ఞాపనల పరిశీలన, సర్వేలను వెంటనే పూర్తి చేయడానికి అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.14 లక్షల క్లెయిములు అందగా, అధిక శాతం క్లెయిముల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. అన్ని అర్హతలున్న దరఖాస్తుదారులకు పట్టాలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సీసీఎఫ్ డో బ్రియెల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
షోరూమ్ ను ప్రారంభించిన అనకాపల్లి ఎంపీ సత్యవతి
-
రిజర్వేషన్ల పెంపు చరిత్రాత్మక నిర్ణయం
మహబూబాబాద్ అర్బన్: బంజారా ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్లు పెంపు దేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజనుల జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. పోడుభూముల విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకుని సాగుదారులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు. గిరిజనులకు ఏ ప్రభుత్వం అందించని అనేక పథకాలను అమలు చేస్తూ గిరిజనులకు సీఎం కేసీఆర్ ఆరాధ్యుడిగా మారారని, తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. కేసీఆర్ తనకు పునర్జన్మనిచ్చారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం కేసీఆర్: సత్యవతి
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం (17న) సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న గిరిజన, ఆదివాసీ భవనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి ఆమె సందర్శించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీ భవనాల కోసం స్థలం కేటాయించడం గొప్ప విషయమన్నారు. ఈ రెండు భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.44 కోట్లు ఖర్చు చేసిందని, గిరిజనులు, ఆదివాసీల కోసం అత్యంత ప్రాధాన్యం ఇచ్చినందుకు సీఎంకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఈ రెండు భవనాల ప్రారంభోత్సవం తర్వాత ఎన్టీఆర్ స్టేడియం వరకు గిరిజనులు, ఆదివాసీలతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడ సభ నిర్వహిస్తున్నామని, సీఎం ముఖ్య అథితిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. -
రూ.వెయ్యి కోట్లతో తండాల అభివృద్ధి
జిన్నారం (పటాన్చెరు): రాష్ట్రంలోని అన్ని తండాలను రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల 75వ వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆమె వీక్షించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో మాట్లాడి వారికి విద్య, భోజనం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 193 గిరిజన పాఠశాలలను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
సీఎం చెప్పినా పట్టించుకోరా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులతో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని వారు గళం విప్పారు. అధికారుల తీరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి వేదికగా పోడు భూములపై వాడీ వేడి చర్చ జరిగింది. ఆవేదనతో చెబుతున్నా: వనమా పోడు భూములకు పట్టాల అంశంపై చర్చ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని తాము అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఖాతరు చేయడం లేదన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటుంటే అటవీ అధికారులు గిరిజనులను, గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. అడవి నుంచి కనీసం రోడ్డు నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకర్గంలో పలు రోడ్లకు రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరైనా అటవీ శాఖ అడ్డంకులతో పనులు జరగడం లేదన్నారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తాం: సత్యవతి రాథోడ్ పోడు అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ.. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో అనేక సమస్యలు ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించిందని తెలిపారు. ఈనెల 11న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని, 15 నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ట్రెంచ్‌లు కొట్టొద్దు: పువ్వాడ పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వివాదం లేని పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆయన అటవీ శాఖకు సూచించారు. ఎక్కడైనా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ట్రెంచ్‌లు కొడితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తామ న్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. పంటలు వేసిన తర్వాత ట్రెంచ్‌లు కొట్టడం, ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ సమస్య జటిలంగా మారుతోందని అన్నారు. -
విద్యార్థుల ప్రవర్తనపై ప్రోగ్రెస్ కార్డు ఇద్దాం.. మంత్రి సత్యవతి సూచన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల చదువుపైనే కాకుండా వారి ప్రవర్తన పట్ల కూడా ప్రోగ్రెస్ర్ కార్డు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను సూచించారు. ఈ దిశగా కార్యాచరణ రూపొందిం చాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే వారం నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కా నుండటంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడు తూ.. గ్రామీణ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. సంక్షేమ వసతిగృహాల్లో చేరి కలు పెరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే.. ‘గిరి వికాసం’ కింద గ్రామీ ణరోడ్లు, ట్రాన్స్‌పోర్టేషన్ ప్రోగ్రామ్, ట్రైకార్ క్రింద చేపట్టిన అన్ని పథకాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గిరిజన గూడేల్లో, తండాల్లో జీసీసీతో సరుకులు సరఫరా సక్రమంగా అయ్యేలా చూడాల న్నారు. గిరిజన ఆవాసాల్లో ఇంకా ఎక్కడైనా త్రీఫేజ్ విద్యుదీకరణ పనులు అవసరమైతే విద్యుత్ శాఖ సహకారంతో త్వరగా పూర్తి చేయాలన్నారు. -
గిరిజన ఆవాసాల్లో తాగునీటి సమస్యలుండొద్దు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆవాసాల్లో అసలు తాగునీటి సమస్య తలెత్తొద్దని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో 99 శాతం గ్రామాలు మిషన్ భగీరథ పథకంతో అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. మిగతా ఒక్క శాతాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. మిగిలిపోయిన 105 గ్రామాలన్నీ గిరిజన ఆవాసాలే అని తెలిపారు. ఆయా గ్రామాలు సుదూరంగా ఉండడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం ఇతర మౌలిక వసతుల సమస్యతో మిషన్ భగీరథ పనులు పూర్తికాలేదన్నారు. అత్యవసర అవసరాల కోసం ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కలి్పంచాలని మంత్రి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా జర్నలిస్టుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తాం
సనత్‌నగర్: జర్నలిజాన్ని సవాల్‌గా స్వీకరించి వృత్తిలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. తాను ఎక్కడికెళ్లినా జర్నలిస్టుల పిల్లల ఉచిత విద్యపై వినతులు వస్తున్నాయని, ఈ విషయంపై యూనియన్లు ప్రతిసారీ డీఈవోల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎంతో చర్చించి శాశ్వత పరిష్కారం జరిగేలా చూస్తానని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో రెండు రోజుల పాటు జరిగే మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ శనివారం ప్రారంభమైంది. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కొక్క రంగంలోని సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించుకుంటూ వెళ్తున్న క్రమంలో మీడియా రంగంలో పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. సత్యవతి మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి తమ శాఖ నుంచి రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఏవైనా సమస్యలుంటే ఉమెన్ కమిషన్ దృష్టికి తీసుకురావాలని సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. కార్యక్రమంలో సీనియర్ మహిళా జర్నలిస్టులు సుమబాల, స్వేచ్ఛ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత మారుతీసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
కరెంటిస్తం.. నీళ్లిస్తం..
నిర్మల్/పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తుల కష్టాలపై అధికార యంత్రాంగం స్పందించింది. స్వయంగా కలెక్టర్ ముషారఫ్‌అలీ వారి గోడు వినేందుకు చాకిరేవు కదలివచ్చారు. తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు నుంచి కలెక్టరేట్ వరకూ గ్రామస్తులు 75 కి.మీ. నడిచి మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణి సైతం.. కాళ్లకు చెప్పులు లేకున్నా.. తమ గోడును వినిపించడానికి కాలినడకన జిల్లా కేంద్రం వరకు చేరిన తీరును ‘సాక్షి’ ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేం అంతకన్న హీనమా..’శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అటవీ గ్రామాల గోడు మంత్రులు, అధికారులకు చేరేలా వినిపించింది. ‘సాక్షి’కథనం, గ్రామస్తుల గోస తో కలెక్టర్ ముషారఫ్‌అలీ బుధవారం అన్నిపనులు పక్కనపెట్టి, అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే (స్థానికసంస్థలు), డీఎఫ్ఓ వికాస్‌మీనా, విద్యుత్‌శాఖ ఎస్సీ జేఆర్ చౌ హాన్ తదితర అధికారులను వెంట తీసుకుని చాకిరేవు చేరుకున్నారు. నిర్మల్‌కు వెళ్లకుండా అక్కడే ఉన్న మిగిలిన గ్రామస్తులతో పాటు కూర్చుని వారి సమస్యలను ఆలకించారు. మీరందరూ వచ్చేయండి.. ‘తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంతదూరంలో ఉంటుంది..’అని కలెక్టర్ ముషారఫ్‌అలీ అడగటంతో ‘ఊరి నుంచి అద్ద కిలోమీటర్ దూరంల ఉన్న చిక్మన్ వాగుల కెళ్లి నీళ్లు తెచ్చుకుంటం సార్. అక్కడ పశువులు తాగే నీళ్లే మేమూ తాగుతున్నం సార్..’ అని చాకిరేవువాసులు చెప్పారు. ‘మీ ఊళ్లో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు.. స్కూల్‌కు ఎక్కడికి వెళ్తున్నారు..’అని మళ్లీ కలెక్టర్ అడగటంతో‘ఊళ్లె 15 మంది దాకా పిల్లలున్నరు సార్. స్కూల్ ఇక్కడికి దగ్గరల లేదు. కిలోమీటరు దూరంల ఉంటది. పిల్లల్ని పంపిద్దమంటే వర్షకాలం వాగుల కొట్టుకపోతరని భయం సార్’అని చెప్పారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ.. ‘మరి.. అందుకే మీరందరూ అక్కడికి (చాకిరేవు సమీపంలోని వస్పల్లికి) వచ్చేయండి. మీ అందరికీ పునరావాసం కల్పిస్తాం. మీ పొలాలు మీకే ఉండని, మీ ఇండ్లు మాత్రమే అక్కడికి షిఫ్ట్ చేద్దాం. డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తం. డెలివరీల సమయంలో ఈ వాగులు దాటుకుంటూ పోవాల్సిన కష్టమూ తప్పుతుంది. అక్కడికొస్తే కరెంటు ఉంటది, నీళ్లు ఉంటాయ్, మీ పిల్లలకు స్కూల్ దొరుకుతది, హాస్పిటల్, టీవీ, మొబైల్.. ఇలా అన్నీ దొరుకుతయ్..ఏమంటారు..!?’అని అడిగారు. ఇందుకు చాకిరేవు గ్రామస్తులు ససేమిరా.. అన్నారు. తాము ఉన్న ఊరిని, తాము అభివృద్ధి చేసుకున్న భూములను వదిలి రాలేమన్నారు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. అంటూ తేల్చిచెప్పారు. ఆరునెలల్లో కరెంటు.. చాకిరేవు వాసులు రానని అనడంతో ఆయ న వెంటనే అన్నిశాఖల అధికారులతో మాట్లాడారు. అటవీ అధికారులతో మాట్లా డి సోలార్ ఆధారిత బోర్ వేసి, ఇంటింటికీ తాగునీటి వసతి కల్పిస్తామని గ్రామస్తులకు చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే ఆరునెలల్లో కరెంటు కనెక్షన్లు కూడా ఇప్పిస్తామన్నారు. గ్రామానికి రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాలని, వాటి కోసం కూడా ప్రయత్నిస్తామన్నారు. చాకిరేవుతో పాటు చుట్టూ ఉన్న గూడేల ఇబ్బందులను సైతం పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంకా టెంట్లోనే.. తమ గ్రామంలో సమస్యలు తీరేదాకా ఇక్కడే ఉంటామంటూ.. చాకిరేవు నుంచి పాదయాత్రగా మంగళవారం నిర్మల్ చేరుకున్న వారంతా కలెక్టరేట్ ఎదుట టెంట్లోనే ఉన్నారు. కలెక్టర్ తమ గ్రామానికి వెళ్లి, హామీలు ఇచ్చినా బుధవారం రాత్రి వరకు అక్కడే ఉన్నారు. టెంట్ వద్దే వండుకుని తిన్నారు. బాధాకరం: మంత్రి సత్యవతి చాకిరేవు గ్రామస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం వారు చేసిన పాదయాత్రపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం స్పందించారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో మాట్లాడారు. చాకిరేవులో వెంటనే తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గ్రామ స్తులు తాగునీరు, ఇతర సదుపాయాల కో సం 75 కి.మీ. దూరంలోని నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచిరావడం బాధాకరమన్నారు. -
నిజమైన ‘మహిళాబంధు’ కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించే ‘మహిళాబంధు కేసీఆర్’ సంబురాల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భాగస్వాములు కావాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 6వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ సంబురాల్లో మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. వీరు శుక్రవారం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో కేసీఆర్ కిట్ ద్వారా 10లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని, ఆరోగ్య లక్ష్మీ పథకం కింద ఐదు లక్షల మంది మహిళలకు పోషకాహారం అందించామన్నారు. కేసీఆర్ పాలనలో అధికార, విపక్షాలు అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చెప్పారు. కార్యక్రమం లో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఎమ్మెల్యే బానోత్‌హరిప్రియ పాల్గొన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ వంటివి ఏర్పాటుచేశా రని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వడ్డీ లేని రుణాల ద్వారా రాష్ట్రంలోని 40.58 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతోపాటు రాజకీయ రంగంలోనూ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని సబిత పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు జరిగిన కుట్రపై విచారణ జరుగుతోందని, దోషులెవరో పోలీసులు తేల్చుతారని చెప్పారు. -
ఏపీ భవన్లో తెలుగు విద్యార్థులను కలిసిన ఎంపీ సత్యవతి
సాక్షి, ఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. గురువారం.. ప్రత్యేక విమానాలలో 86 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు పెట్టుబడుల రాజధాని’ విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏపీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ, కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ కమిటీ సభ్యురాలు బి.వి.సత్యవతి.. ఏపీ భవన్లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను కలిసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. -
మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. సత్యవతి తండ్రి లింగ్యానా యక్(85) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాలో మరణించారు. మేడారం జాతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న మంత్రికి సమాచారం అందగానే హుటాహుటీన పెద్దతండా చేరుకున్నారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తండా సమీపాన అంత్యక్రియలు నిర్వహించారు. లింగ్యానాయక్ మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మంత్రిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ కమిషన్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తదితరులు మంత్రికి ఫొన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్ అందిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరినాటికి రాష్ట్రంలో కరెంటు లేని గిరిజన ఆవాసం ఉండొద్దని, వ్యవసాయ క్షేత్రాలకు, పరిశ్రమలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ఆవాసాల విద్యుదీకరణ, గిరిజన వ్యవసాయం, పరిశ్రమలకు త్రీఫేజ్ విద్యుత్ కల్పన, గిరివి కాసం అమలుపై శని వారం మాసబ్‌ట్యాంక్ లోని దామోదర సంజీవ య్య సంక్షేమ భవన్లో అటవీ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన ఆవాసాలు, త్రీఫేజ్ విద్యుత్ కల్పించడంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి 3,467 ఆవాసాలను గుర్తించామని, వీటి విద్యుదీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు బడ్జెట్లలో రూ.221.01 కోట్లు కేటాయిం చారన్నారు. ఇందులో 2,795 గ్రామాలకు త్రీఫేజ్ విద్యుదీకరణ పూర్తయిందని, మిగిలిన 19 శాతం ఆవాసాలకు విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. విద్యుత్ లైన్లు వేయలేని గిరిజన ఆవాసాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పీసీసీఎఫ్ ఆర్.ఎం.దోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్/ములకలపల్లి: ఆదివాసీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్న గూడెం పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు గొత్తికోయ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై ఆమె స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందని హామీఇచ్చారు. అడవిలో జీవనాధారం కోసం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించామని, అయినప్పటికీ కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ.. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని విచారణ అధికారిగా నియమించింది. దీంతో ములకలపల్లి తహసీల్దార్ వీరభద్రం ఐటీడీఏ అధికారులతో కలసి దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అటవీ సిబ్బందిని విచారించారు. మరో పక్క బాధిత మహిళలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమతోపాటు ఇద్దరు బాలికలపై కూడా అటవీ సిబ్బంది దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై గొత్తికోయ మహిళలతోపాటు అటవీ సిబ్బంది కూడా తమకు ఫిర్యాదు చేశారని స్థానిక ఎస్సై తెలిపారు. మహిళలు తమ విధులకు ఆటంకం కలిగించినట్లు అటవీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. -
దళిత, గిరిజనులకు కేంద్రం చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడున్నరేళ్లుగా చేసిందేమీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హరిప్రియ నాయక్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పోడు చట్టం కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయం కూడా వారికి తెలియకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పోడు భూములపై ముఖ్యమంత్రి కేబినెట్ సబ్ కమిటీ వేశారని, అర్హులైన వారికి భూ హక్కుల కల్పన కోసం తీసుకున్న దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, పోడు భూముల హక్కుల కోసం నాలుగున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కావాలంటే కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి పెంచాలన్నారు. -
ఆంక్షల నడుమ మేడారం జాతర? మొదటివారంలో కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. కోటికిపైగా భక్తులు హాజరుకానున్న ఈ జాతర వచ్చేనెల 16వ తేదీ నుంచి 19వ తేదీవరకు నాలుగు రోజులపాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్న పరిస్థితుల్లో మేడారం జాతర వైరస్ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది.ఇందులో భాగంగా వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మొదటివారంలో ప్రత్యేక సమావేశం... వచ్చేనెలలో కోవిడ్ వ్యాప్తి తారాస్థాయికి చేరుతుందని వైద్య,ఆరోగ్య శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మాసమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ సమీక్ష కీలకం కానుంది. జాతరకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలా.. భౌతిక దూరాన్ని పాటిస్తూ అనుమతి ఇస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.. శానిటైజేషన్ ఏర్పాట్లు, మాస్కుల నిర్వహణ, తక్ష ణ వైద్య సేవల కల్పన తదితర అంశాలపై లోతు గా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వడివడిగా నిర్మాణ పనులు ప్రస్తుతం జాతర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 21 ప్రభుత్వ విభాగాలకు రూ.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం వివిధ పనులు నిర్దేశించింది. కోటికి పైగా భక్తులు/పర్యాటకులు హాజరు కానుండటంతో ప్రభుత్వం అక్కడ రవాణా, వసతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతోపాటు తాగునీటి సరఫరా, భద్రత చర్యలు కీలకం కానున్నాయి. జాతరకు మంజూరు చేసిన మొత్తంలో దాదాపు 50శాతం నిధులు ఈ మూడు శాఖలకే ఖర్చు చేయనుంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. -
అనాథలకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్, వెంగళరావునగర్: రాష్ట్రంలోని అనాథలను సంరక్షించేందుకు దేశం గర్వించేలా సమగ్ర చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిలా ఉన్న తెలంగాణ అనాథల విషయంలో తల్లిదండ్రులుగా మరో అద్భుత విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో అనాథలు ఉండొద్దనే సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తామన్నారు. అనాథల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించి జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక రక్షణ కల్పిస్తామన్నారు. సబ్ కమిటీ సమావేశం అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రిగార్డెన్ను కేటీఆర్ సందర్శించి కమిషనర్‌ను అభినందించారు. సబ్ కమిటీ సూచనలు... ♦అనాథ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందించాలి. ♦అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడంతోపాటు వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలి. ఈ కార్డులు ఉంటే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ముస్లింలలో అనాథలను చేరదీసే విధంగా నిర్వహిస్తున్న యతీమ్ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలబడాలి. ♦ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ చానల్లో పెట్టాలి. ఆ ఏడాది నిధులు ఖర్చుకాకపోతే వచ్చే ఏడాది ఉపయోగించుకొనే విధానం పెడితే వారికి శాశ్వత ఆర్థిక భద్రత లభిస్తుంది. ♦ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ హోమ్స్‌లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. -
అంగన్వాడీలకు చేనేత చీరలు
సాక్షి, హైదరాబాద్: చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేనేత చీరలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యా దేవరాజన్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 67,411 మంది టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా చేనేత వస్త్రాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు మూడు పర్యాయాలు వేతనాలు పెంచి, 30శాతం వేతన సవరణ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విభాగంపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ అన్నారు. ట్రాన్స్జెండర్లు తయారు చేసిన జనపనార బ్యాగులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. -
కళ్లు తెరిపించే కథా రచయిత్రి
సమకాలీన తెలుగు సాహిత్యంలో రచయిత్రిగా పి.సత్యవతి స్థానం ప్రత్యేకమైనది. కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు వ్రాశారు. అనువాదాలు కూడా చేశారు. ఏ ప్రక్రియ చేపట్టినా, స్త్రీ జీవితమే ప్రధానంగా రచనలు చేస్తూ వచ్చారు. ఆమె వ్రాసిన ‘ఇల్లలకగానే’ కథ తెలుగు కథాసాహిత్యంలోనే మైలురాయిగా నిలిచిపోతుంది. రచయిత్రిగా పలు అవార్డులు, సత్కారాలు పొందిన పి.సత్యవతికి ఇటీవల ‘కువెంపు జాతీయ పురస్కారం’ లభించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పాఠకుల కోసం ఆమెను ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూ... పి. సత్యవతి ప్రధానంగా కథా రచయిత్రి. నవలలు వ్రాశారు. అనువాదాలు చేశారు. సాహిత్య సమీక్షా వ్యాసాలు ప్రచురించారు. ప్రక్రియ ఏదైనా స్త్రీ జీవితమే అన్నిటికీ కేంద్రబిందువు. కుటుంబం మొదలుకొని ప్రపంచీకరణ సంస్కృతి వరకు స్త్రీల జీవితాన్ని హింసామయం చేస్తున్న వ్యవస్థలను గుర్తించి గురిచూడటమే ఆమె సాహిత్యతత్వం. తల్లి చదువుకోటానికి లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చే అలవాటు, తండ్రి శిక్షణ హైస్కూల్ చదువులనాటికే ఆమెలో సాహిత్య అధ్యయన ఆసక్తులు స్థిరపడటానికి కారణం అయ్యాయి. మాలతీ చందూర్, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి రచయితలను ఇష్టంగా చదువుకొన్నారు. హైదరాబాద్‌లో మేనమామగారింట ఉండి చదువుకొన్న కాలంలో ఇంగ్లీష్ సాహిత్య అధ్యయనం పెరిగింది. నిరంతర అధ్యయనం వల్ల ఏర్పడిన కొత్త చూపు, తన జీవితంతో సహా చుట్టూ జీవితాలను నిశితంగా పరిశీలించే గుణం వల్ల సాంద్రమైన అనుభవ కోణం ఆమె కథా బలం. జీవితం, ఘటనలు, మనుషులు, ప్రవృత్తులు, ప్రవర్తనలు, పరిణామాలు ఒత్తిడి పెడితే తప్ప వ్రాయని రచయిత కనుక ఆమె కథలలో గాఢత ఉంటుంది. జీవితాన్ని ప్రేమించే మనిషి కనుక కథను నిర్మించటంలో, నిర్వహించటంలో సున్నితత్వం ఉంటుంది. జీవితం ఎంత కష్టభూయిష్టం అయింది అయినప్పటికీ మంచికి దానిని మార్చుకొనే చేవ పొందటానికి మనుషులు ఎవరి పరిధిలో వాళ్ళు ప్రయత్నపరులు కావాలనే సందేశాన్ని ఇస్తుంటాయి అవి. ఇరవైఏళ్ల వయసులో ప్రారంభమైన సత్యవతి సాహితీ సృజన శక్తుల విన్యాసం షష్టిపూర్తి వేళ కూడా నవయౌవన ఆరోగ్యంతో తళతళ లాడుతూనే ఉంది. అప్పటికి ఎనిమిదేళ్లుగా మహిళా జనజీవన సమస్యల అధ్యయన, ఆచరణ మార్గంలో నడుస్తున్న నేను 1990 ఇల్లలకగానే కథ చదివి సహజంగానే సత్యవతి గారితో ప్రేమలో పడ్డాను. ఆ తరువాత మంచి స్నేహితులమూ అయ్యాము. స్త్రీ తనను తాను తెలుసుకొని తనను తాను నిర్వచించుకొనే స్వీయ సత్తా సంపాదించు కొనాలనే విషయం పట్ల అవగాహన కలిగించటానికి ఎన్ని సభలలో , ఎన్ని తరగతి గదులలో ఇల్లలకగానే కథను పాఠంగా చెప్పానో లెక్కలేదు. తెలుగు కథా సాహిత్యంలో అది ఒక మాగ్నమ్ ఓపస్. ఈ కథకు ముప్ఫయి ఏళ్ల ముందు ముప్ఫయి ఏళ్ల తరువాత సత్యవతి కథా ప్రపంచం విస్తరించి ఉంది. ప్రతిష్ఠాత్మక కువెంపు జాతీయ పురస్కారం అందుకొంటున్నవేళ ‘సాక్షి’ పక్షాన ఆమెతో స్నేహ సంభాషణ నాకు సంతోషకరం. సత్యవతిగారూ నమస్కారమండీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితం మీది. ఈ కృషికి గాను మీరు ఇదివరకు ఎన్నో పురస్కారాలను అందుకొన్నారు. ఇప్పుడు కువెంపు జాతీయ పురస్కారం వరించిన సందర్భంలో మీ అనుభూతి ఏమిటి? చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా కువెంపు గారు సంచరిచిన ప్రదేశం చూడడం, అక్కడి గాలి పీల్చడం నా కొచ్చిన అద్భుతమైన అవకాశంగా భావిస్తునాను. ఒక గొప్ప కవి పేరుమీద పురస్కారం అందుకోడం చాలా ఆనందం కదా! వ్యక్తిగతం అంతా రాజకీయమే అన్న స్త్రీవాద సూత్రం తెలిసి రాసినట్లు ఉంటాయి మీ కథలు. స్త్రీవాదం మీ కథల చోదకశక్తి ఎప్పటినుండి అయింది? ఎలా? ముందు నుంచి నేను స్త్రీ కేంద్రక కథలే ఎక్కువ వ్రాశాను. నాకు తెలిసిన, నేను చూసిన స్త్రీల అనుభవాలు కథలుగా రాశాను. అయితే స్త్రీవాదం నాకు సిద్ధాంతంగా తెలిసి వచ్చింది మాత్రం ఆంధ్ర దేశంలో అంటే తెలుగు లో స్త్రీ వాద సాహిత్యం ఒక అలలాగా వచ్చిన 80 వ దశకంలోనే. నేను ఆ కవితలనీ కథలనూ చదివి స్త్రీవాద సిద్ధాంతాలను అధ్యయనం చెయ్యడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నేను స్త్రీల జీవితాల మీద దృష్టి పెట్టాను. సమస్యల మూలాలను తెలుసుకోడం మొదలు పెట్టాను. స్త్రీల జీవితాన్ని హక్కుల స్పృహతో కథా వస్తువును చేయటానికి మిమ్మల్ని ప్రభావితం చేసినది స్త్రీవాదమే కదా! స్త్రీవాదంతో మీ పరిచయం ఎప్పటినుండి? అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? ఇందాక చెప్పినట్లు స్త్రీ వాదంతో నా పరిచయం అధ్యయనం 80ల తరువాతే. అయితే 90లో నేను ద సెకండ్ సెక్స్ చదివాను. ఆ తరువాత వరుసగా సెకండ్ వేవ్ ఫెమినిజంలో ప్రఖ్యాతమైన పుస్తకాలు కొనుక్కుని చదివాను. సెకండ్ సెక్స్ చాలా ప్రభావవంతమైన పుస్తకం. ఇప్పుడు ఫెమినిజం ఆ స్థాయిలన్నీ గడిచింది. ఇంటర్ సెక్షనాలిటీ మొదలైన అంశాలన్నీ ముందుకొచ్చాయి. ఏది ఏమైనా హక్కులతో పాటు తనను గురించిన బాధ్యత కూడా తను తీసుకోగల స్థాయికి స్త్రీలు ఎదగడానికి పోరాడాలి. తనను తను ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఇల్లలకగానే కథ ద సెకండ్ సెక్స్ చదివాక వ్రాశారా? సెకండ్ సెక్స్ ప్రభావవంతమైన పుస్తకం అన్నారు. ఆ ప్రభావశీలత గురించి కాస్త వివరిస్తారా? ఈ కథ నిజానికి చదవక ముందు వ్రాసినదే. అనేకమంది స్త్రీలను చూసి వ్రాసినది. 90లో వచ్చింది. మీ కథలలో స్త్రీవాదానికి ప్రాతినిధ్య కథలు ఏవని మీరనుకొంటారు? ఇల్లలకగానే, సూపర్ మామ్ సిండ్రోం, దమయంతి కూతురు, గాంధారి రాగం ఇట్లా ... మధ్యతరగతి స్త్రీ కేంద్రంగా భిన్న వ్యాసార్ధాలతో గీసిన చైతన్య వృత్తాలు మీ కథలు అనిపిస్తుంది. ఆ దృష్ట్యా వాటిలో మీరు ఉత్తమం అనుకొనేవి ఏవి? నేను నాకు తెలిసిన జీవితాలనే నాకున్న పరిధి మేరకే వ్రాశాను. స్థల కాలాలకు అతీతంగా వ్రాయలేదు. పాఠకులు ఎక్కువగా కనెక్ట్ అయిన కథే నాకూ బాగా నచ్చిన కథ. ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేను. ఎవరి కథలు వారికి ముద్దు కదా? మీ కథలు కొన్నిటిలో శ్రామిక వర్గ స్త్రీల జీవితాలు కనిపిస్తాయి. వాటికి అవి స్వతంత్రాలా లేక మధ్యతరగతి స్త్రీల జీవిత సాపేక్షతలో భాగమా? వాటికి అవి ప్రత్యేకమే. స్వర్ణ అనే అమ్మాయి ప్రధాన పాత్రగా వ్రాసిన కథలన్నీ శ్రామిక వర్గానికి చెందినవే . సమాజంలో ఒక వర్గం ఎప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు సాగకుండా వుంటుంది. అనేక పథకాలు వున్నా ఆ వర్గపు ఆడపిల్లల జీవితం మెరుగు పడటం లేదు. అందుకు కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. కొన్ని అంటే, సీపురు, సప్తవర్ణ సమ్మిశ్రితం లాంటివి మధ్యతరగతి జీవిత సాపేక్షతలో భాగం కావచ్చు. మీరు ఏడు నవలలు వ్రాశారు కదా? వాటిలో గొడుగు నవలను తప్ప మరి దేనినీ మీరు ఓన్ చేసుకోరు అన్న మాట ఎక్కడో చదివాను. అది నిజమేనా? ఎందువల్ల? కాస్త వివరిస్తారా? ఆ నవలలన్నీ 90ల ముందువి. నవలా రచన గురించి ఏ మాత్రం తెలుసుకోని సందర్భం... వాటిని ఇంకా బాగా వ్రాయొచ్చు అనిపిస్తుంది. గొడుగు నవల కూడా 1990 కి ముందుదే కదా! అవును. 1978 లో వచ్చింది. గొడుగు కూడా ఇప్పుడు వ్రాస్తే ఇంకొంచెం మంచిగా వ్రాయగలనేమో! అప్పటికి ఆ వస్తువు, ఆ జీవితం నేను దగ్గరగా చూసినది కనుక ఆ నవలన్నా అందులో ప్రధాన పాత్ర అన్నా నాకు చాలా ఇష్టం. స్త్రీల జీవితాలలోని అసంతృప్తుల ఒత్తిడి , వాటి నుండి విముక్తికి వెతుక్కొనే దోవలు, వేసే తప్పటడుగులు, అన్నీ తెలిసి పరువు కోసం నిలుపుకొనే కాపురాలు ఎన్నో ఉన్నాయి. అవి కావ్యవస్తువు కాలేకపోయాయి. గొడుగు నవలలో దానిని చూపించగలిగాను. 1990ల తరువాత కూడా దాని ప్రాసంగికత వుంది అనిపిస్తుంది. అప్ప టికీ ఇప్పటికీ స్త్రీలు కొంచమైనా మారారు. సమాజంలో కూడా మార్పు వచ్చింది. నాకు క్లుప్తత అలవాటు. అందుకే కథ వ్రాయడం సులువు. నవల వ్రాయలేను. మీరు ఇస్మత్ చుగ్తాయ్, ఒక హిజ్రా ఆత్మకథ వంటి అనేక అనువాదాలు చేశారు. ప్రపంచ వ్యాపిత స్త్రీవాద సిద్ధాంతకర్తలను తెలుగువాళ్ళకు సరళ సుందరంగా పరిచయం చేశారు. సాహిత్య విమర్శలు వ్రాశారు. ఇలా భిన్నప్రక్రియలలో అభినివేశం మీ ఆంగ్ల అధ్యాపక వృత్తి లక్షణమా కాక నిర్దిష్ట సాహిత్య ప్రయోజన లక్షితమా ? అనువాదాలు ఇష్టపడి చేశాను. ఆంగ్ల అధ్యాపక వృత్తికీ నా సాహిత్య సృజనకీ సంబంధం లేదు. మొదటినుంచీ నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం. నేను నా మేనమామ ఇంట్లో వుండి చదువుకున్నాను. ఆయన ఇంగ్లీష్ అధ్యాపకుడు. మంచి చదువరి. అప్పటినుంచీ నేను ఇంగ్లీష్ నవలలు అవీ ఎక్కువ చదివేదాన్ని. స్త్రీవాద సాహిత్య గ్రంథాలు చదినప్పుడు అవి మన పాఠకులకి పరిచయం చెయ్యాలనిపించింది. భూమిక పత్రికలో వరుసగా వ్రాశాను. సరళంగా చెబితేనే అర్థం అవుతాయని ఆ ప్రత్యేకమైన పరిభాష వాడలేదు. మీరు స్త్రీవాద సిద్ధాంత రచనలు పరిచయం చేయటమే కాదు. తెలుగులో కథలు నవలలు వ్రాసిన స్త్రీలను పరిచయం చేస్తూ వ్యాసాలు కూడా వ్రాసారు.ఇదంతా ‘సిస్టర్ హుడ్’ భావన ను ఆచరణాత్మకం చేయటం అనవచ్చా? మీ కథలలో కూడా అది అంతర్భాగమే కదా! అవును. స్త్రీలమధ్య సహకారం స్నేహం వుండాలని నా ఆకాంక్ష. స్త్రీల మధ్యే కాదు, స్త్రీ పురుషుల మధ్య కూడా. పతిభక్తి కథలో మతం, ఆచారాలు స్త్రీల మీద ఎంత బరువై కూర్చుంటున్నాయో అలవోకగా చెప్పారు. జెండర్ అణచివేతలో కులం, మతం వహిస్తున్న పాత్ర గురించి కాస్త వివరిస్తారా? ఈ కోణం నుండి వ్రాయవలసిన కథల గురించి కూడా సూచించండి. ఇళ్ళల్లో సంప్రదాయపరంగా జరిగే క్రతువుల గురించి కూడా స్త్రీలే భారం వహించాలి. సంప్రదాయాలంటూ ఇంకా వాళ్ళమీద అనేక బాధాకరమైన ఆచారాలు రుద్దుతున్నారు. ఇందులో స్త్రీలు కూడా పాత్ర వహించడం చూస్తే వాళ్ళ మెదళ్ళు ఎంతగా నియంత్రించబడ్డాయో అర్థమౌతుంది. ఈ మధ్య ప్రవచనాల పేరిట మతపరమైన నమ్మకాలని బాగా ఎక్కిస్తున్నారనిపిస్తున్నది. స్త్రీలు, అందునా మధ్య తరగతి, ఆపై తరగతి స్త్రీలు చేసే వేడుకలు, బాగా ఖర్చుపెట్టి చేసే పెళ్ళిళ్ళూ, అలంకరణలు చూసినప్పుడు, జాతకాలూ జ్యోతిష్యాల వెనక పడుతున్నప్పుడు ఇన్ని వ్రాసిన, ఇంత పోరాడిన అన్ని తరాల స్త్రీల కష్టం తలచుకుంటే బాధ అనిపిస్తుంది. ఈ మాయ నుంచి ఎలా బయట పడతారా అనిపిస్తుంది. మాయపొరలు చీల్చేందుకు ఎన్ని కథలైనా రావాల్సే ఉంది. సత్యవతిగారూ పితృస్వామ్య మాయ దగ్గరనుండి, ప్రపంచీకరణ మాయను, వస్తువినిమయ మాయను, హిందుత్వ మాయను బద్దలు కొట్టటానికి నిరంతర కథా దీప ధారులైన మీతో ఈ సంభాషణ ఎంతో బాగుందండి. మీ సమయాన్ని ‘సాక్షి’ పాఠకుల కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. - కాత్యాయనీ విద్మహే -
మంత్రి కేటీఆర్‌పై సమంత క్రేజీ పోస్ట్.. వైరల్
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. పర్సనల్ విషయాలతో పాటు వివిధ అంశాలపై స్వేచ్ఛగా పోస్టులు పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను నిన్న ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు. సత్యవతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మంత్రి సత్యవతి గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. మంత్రి కేటీఆర్ చేసిన ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా ప్టోరీలో పెట్టి, దండం పెడుతూ చప్పట్లు కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సమంత విషయానికొస్తే.. విడాకుల తర్వాత వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. మరోవైపు పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సాంగ్ కోసం సమంత దాదాపు కోటిన్నర పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఏకలవ్య గురుకులాలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(ఈఎంఆర్ఎస్)లకు వీలైనంత త్వరగా శాశ్వత భవనాలను నిర్మించాలని రాష్ట్ర గిరిజన, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంనుంచి ఈఎంఆర్ స్కూళ్లన్నీ శాశ్వత భవనాల్లోనే కొనసాగించాలని, అందుకోసం పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం 44 విద్యా సంస్థల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిలో 21 భవనాల నిర్మాణం పూర్తి అయ్యిందని, మరో 23 భవనాలు వివిధ దశల్లో ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు త్వరలో శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కొత్త భవనాల్లో వీలైనంత త్వరలో వేడినీటి వసతి కల్పించాలని రెడ్కో ప్రతినిధులను సూచించారు. ఈ సమీక్షలో గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్, చీఫ్ ఇంజనీర్ శంకర్ తదితరులు ఉన్నారు. -
పులకించిన పీపుల్స్ ప్లాజా
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా రాగరంజితమైంది. పూల శోభతో పులకించిపోయింది. బతుకమ్మ ఆట పాటలు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించింది. మంగళవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనిత, నగర గ్రంథాలయ చైర్పర్సన్ ప్రసన్న, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం
ఇల్లెందు: హైదరాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన గిరిజన బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు వచ్చిన మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని తెలిపారు. అలాగే, చిన్నారి కుటుంబానికి ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా ప్రభుత్వ సాయం అందిస్తుందని చెప్పారు. ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. -
వర్షాలపై అప్రమత్తం: మంత్రి సత్యవతి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రతిరోజు తన కార్యాలయానికి నివేదికలు పంపాలని సూచించారు. గురువారం ఆమె తన కార్యాలయం నుంచి ఐటీడీఏ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీలను వారి ప్రసవ గడువు తేదీల ప్రకారం ఆస్పత్రుల్లో చేర్పించే చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం కలిగినా, ప్రమాదం జరిగినా రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి మండలానికి ఒక అధికారిని ఇన్‌చార్జీగా నియమించి, బాధ్యతలు ఇవ్వాలన్నారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనకపల్లె ఎంపీ సత్యవతి ప్రసంగం
-
ఆడి పాడిన మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, వరంగల్: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు వాటిని అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ‘బంజారా గోత్రాల క్యాలెండర్-2021’ మంత్రి ఆవిష్కరించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేయనన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. చదవండి: వ్యాక్సిన్ : వరంగల్‌లో హెల్త్ వర్కర్ మృతి! ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా మారి.. లంబాడీల స్వయం పాలన కిందకు వచ్చాయన్నారు. అక్కడక్కడ గిరిజనుల పట్ల దాడులు జరగడం దురదృష్టకరమని, వీటిని నిరోధించేందుకు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, బంజారా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేసిన గిరిజన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. చదవండి: వాళ్లు సమాజానికి మూలస్తంభాలు -
ప్రశాంత సుందరి
ఆర్.శాంతసుందరి(8 ఏప్రిల్ 1947 – 11 నవంబర్ 2020) చాన్నాళ్ల క్రిందట కేవలం వరూధిని గారిని, శాంతసుందరి గారిని మొదటిసారి కలవడానికే తెనాలిలో ఒక సమావేశానికి వెళ్ళాను. అప్పటికే ఆవిడ కేవలం కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి కాదు. మంచి అనువాదకురాలు. నిజం చెప్పొద్దూ, నేను నాకెంతో ఇష్టమైన కుటుంబరావు గారి భార్యనీ, కూతురునీ కలవాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను. ఆ విషయం వాళ్ళిద్దరితో అన్నాను. మిమ్మల్ని చూస్తే కుటుంబరావు గారిని చూసినట్లే వుంది అన్నాను కూడా. శాంత నవ్వేశారు. ఆవిడ అలా ఎప్పుడూ నవ్వుతూ వుంటారని తరువాత అర్థమైంది. ఆవిడ ప్రశాంతసుందరి. హాస్యప్రియ. సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యత, ప్రేమల కలబోత. ఈ విషయాలన్నీ ఆవిడతో నా పదిహేనేళ్ల స్నేహంలో అర్థమయ్యాయి. ఆ తెనాలి సభ పరిచయం స్నేహం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నా స్నేహం కుటుంబరావు అమ్మాయితో కాదు శాంతతోనే. ఆవిడకి తన మాతృభాష అయిన తెలుగులో వున్నంత అభినివేశం, అభిమానం హిందీ పట్ల కూడా వున్నాయి. అందుకే అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ అలవోకగా అనువాదాలు చేశారు. వృద్ధురాలైన తల్లిని చూసుకుంటూ, ఇంటిని నిర్వహించుకుంటూ, స్నేహాలు కాపాడుకుంటూ, అనుకున్న సమయానికి పబ్లిషర్స్‌కి అనువాదం అందిస్తూ ఒక్క నిమిషం కాలం వృ«థా కాకుండా జీవించిన ఆవిడ ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోవడం ఆమెను ఇష్టపడే వారికి కష్టమే. ఆమె ప్రయాణంలో ఆమె సహచరుడు గణేశ్వరరావు గారి సహకారం గొప్పది. వాళ్ళది స్నేహమయ సహజీవనం. ఆమె జబ్బుపడిన ఈ కొద్ది కాలంలో వాళ్ళ అమ్మాయి వచ్చేవరకూ ఆయన ఒక్కరే కాచుకున్నారు. ఆమె భౌతిక నిష్క్రమణను ఆయన ఎలా తట్టుకుంటారా అని బెంగ. శాంత తెలుగు నుంచి హిందీకి చేసిన ‘కాలుతున్న పూలతోట’ (సలీం రచన)కు కేంద్ర మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగే భారతీయ అనువాద్ పరిషత్ ‘డాక్టర్ గార్గీ గుప్త ద్వివాగీశ్ పురస్కార్’తో సత్కరించింది. ‘ఇంట్లో ప్రేమచంద్’ హిందీ నుంచి చేసిన తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం కూడా అందుకున్నారు. ‘బేబీ హాల్దార్’ హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. తెలుగు రచయిత్రుల కథల సంకలనం, కవితల సంకలనం కూడా హిందీలోకి తెచ్చారు. అనేక మంది కవుల కవిత్వాన్ని, ముఖ్యంగా శివారెడ్డి, పాపినేని శివశంకర్, ఎన్.గోపి కవిత్వం హిందీలోకి అనువదించారు. ఆమె అనువాదాలు అందరికీ అర్థమయ్యేలాగా అలతి పదాలతో చదవచక్కగా వుంటాయని అంతా ఒప్పుకుంటారు. శాంత తమిళం నుంచి వైరముత్తు కవితలు కూడా తెలుగు చేశారు. ఏదైనా రచన తనకు నచ్చితేనూ, ఆలోచనా విధానం పాఠకులకు ఎంతో కొంత ప్రయోజనం వుంటేనే అనువాదం చేస్తానని చెప్పారు. శాంత సుందరి ఇంగ్లిష్ నుంచి చాలా అనువాదాలు చేశారు. అవన్నీ బహుళ జనాదరణ పొందిన పుస్తకాలు. ఎక్కువమంది చదివిన ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’ లాంటి డేల్ కార్నిగీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ లాంటి చేతన్ భగత్ నవలలు, పలువురి ప్రశంసలు పొందిన ఆనంద్ నీలకంఠన్ ‘అసురుడు’, ‘అజేయుడు’ వంటి పుస్తకాలే కాక ప్రపంచ ప్రశంస పొందిన ‘సేపియ’(యువల్ నోవా హరారీ) కూడా తెలుగు పాఠకులకు కానుక చేశారు. ఆ పుస్తకం సీక్వెల్‌ను అనువాదం చేస్తూవుండగా కేన్సర్ వ్యాధికి ఆమె మెదడు మీద అసూయ కలిగింది. ‘ఇక చాల్లే కలం ముయ్’ అని కసిరేసింది. అసూయ పుట్టదా మరి! హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి, ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేస్తే! భర్త గణేశ్వరరావు సహకారం గురించి చెబుతూ, ఆయన తన ఎడిటర్, క్రిటిక్ కూడా అనీ, మార్పు, చేర్పులపై చర్చించుకునే వాళ్ళమనీ, ఆయన సలహా సహకారం లేనిదే నేను ఇంత చేయగలిగే దాన్ని కాను అంటారు చాలా నిజాయితీగా. ఆమె ముక్కుసూటి మనిషి. తనకు నచ్చనిది మొహమాటానికి అసలు ఒప్పుకోరు.ఎంత మృదువుగా వుంటారో అంత పట్టుదలగా కూడా వుంటారు. శత వర్షాలకు చేరువగా వస్తున్న వరూధిని గారు, దశాబ్దాల సహజీవనం తరువాత ఈ ఎడబాటును తట్టుకోవలసిన గణేశ్వరరావు గారు కంటి ముందు మెదులుతూ వుంటే ఇంత హఠాత్తుగా నిష్క్రమించడం ఏం బాగుంది శాంత గారూ? -పి.సత్యవతి 9848142742 -
గిరిజన రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6.5 శాతంగా ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే రిజర్వేషన్లు 9.08 శాతంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం కేంద్రానికి సమర్పించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాన్క్లేవ్లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రం త్వరితంగా అనుమతులిస్తే వర్సిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
‘కేసులు దాచిపెట్టాల్సిన అవసరం లేదు’
సాక్షి, విశాఖ : రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా నియంత్రణలో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావడం అభినందనీయమని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పారిశ్రామికవేత్తల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. లాక్డౌన్ సమయంలో కరోనా నియంత్రణ కోసం కష్టపడుతున్న పోలీస్ శాఖ, రెవెన్యూ, మున్సిపల్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. విశాఖలో కరోనాని కట్టడి చేయడంలో కలెక్టర్‌తోపాటు పోలీస్ కమీషనర్, ప్రజల కృషి మరువలేనిదన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు దాచిపెట్టారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసులు దాచిపెట్టాల్సిన తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 20 పాజిటివ్ కేసుల్లో పది మంది కోలుకుని ఇళ్లకి వెళ్లిపోయారని, మిగిలిన వారంతా కోలుకుంటున్నారని తెలిపారు. మరో వారం రోజుల్లో కరోనా ఫ్రీ జోన్‌గా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో విశాఖ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
90 శాతం స్థానాల్లో విజయం వైఎస్సార్సీపీదే : ఎంపీ
సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ సత్యవతి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ విజయానికి మూలం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 87 శాతం ఎమ్మెల్యేలను ఏ విధంగా గెలిచామో.. అదే విధంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను తమ పార్టీ గెలవడం ఖాయమన్నారు. గడిచిన 9 నెలల్లో సీఎం జగన్ అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రజల్లోకి వెళతామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. (‘టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని బాబే చెప్పారు’) నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను జాన్ -
కర్నూలు యువతిని ఇండియాకు తీసుకోస్తామని మంత్రి హామీ
-
జ్యోతి కుటుంబానికి కేంద్ర మంత్రి భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని కర్నూలుకు రప్పించాలని నంద్యాల, అనకాపల్లి ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ వెంకట సత్యవతి పార్లమెంటులో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయజంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా చైనాలో ఉన్న జ్యోతితో మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. విద్యార్థి ఆందోళన చెందవద్దని, త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చైనా ఎంబసీతోనూ మంత్రి జయశంకర్, ఎంపీ పోచా బ్రహ్మనంద రెడ్డి మాట్లాడారు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కర్నూలులో జ్యోతి తల్లి ప్రమీలాదేవి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో మాట్లాడుతుంటే అస్వస్థతకు గురయ్యారు. -
ఇది ప్రారంభం మాత్రమే: కేటీఆర్
సాక్షి, వరంగల్: మడికొండ ఐటీ సెజ్‌లో నిర్మించిన టెక్ మహీంద్ర, సైయంట్ ఐటీ సెంటర్లను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. తెలంగాణలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు. వరంగల్-హైదరాబాద్ హైవేను పారిశ్రామిక కారిడార్‌గా మార్చివేస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ చెప్పినట్లుగా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి వరంగల్, కరీంనగర్‌తో పాటు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలో కూడా కంపెనీలను ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అడిగిన వెంటనే తెలంగాణలో కంపెనీలు నెలకొల్పిన టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని, సైయంట్ ఎండీ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు నినాదమే తెలంగాణ ఆవిర్భావం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమానికి పెట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. 12-13 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో లైఫ్ సైన్స్ పరిశ్రమలు కూడా వస్తాయి. తెలంగాణలోని గ్రామీణ యువతకు మంచి స్కిల్‌తో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పరిశ్రమల్లో సింహభాగం మన తెలంగాణ యువతకే వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. మిల్లు స్థానంలో మెగా టెక్స్టైల్ పార్క్ ‘యాదాద్రి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పరకాల లాంటి చిన్న ప్రాంతాల్లోనూ చేనేత పరిశ్రమలను నిర్మిస్తాం. వరంగల్‌లో అజంజాహి మిల్లు స్థానంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తున్నాం. మహబూబాబాద్‌లో ఆహార శుద్ధి పరిశ్రమ సెంటర్, ఖమ్మం, కరీంనగర్లో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం. టెక్ మహీంద్రా సీఈఓ గుర్నాని సలహా మేరకు మామూనూర్ ఎయిర్‌పోర్టు పునరుద్దరణతో పాటు హెలిపాడ్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీపీ గుర్నా, సైయంట్ ఎండీ మోహన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని కంపెనీలు రావాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఐటి మంత్రి కేటీఆర్ చొరవతో వరంగల్‌కు టెక్ మహీంద్రా, సైయంట్ వంటి రెండు పెద్ద కంపెనీలు రావడం ఆనందంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే మరిన్ని పరిశ్రమలు, కంపెనీలు రావాలని కోరుతున్నామన్నారు. గ్రామీణ యువత కోసం ప్రణాళికలు రూపొందించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పరిశ్రమలు అనగానే ఒక్క హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు కేటీఆర్ చొరవతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు రావడం గొప్ప విషయం. ఇవి గ్రామీణ యువతకు ఉపయోగపడేలా కృషి చేయాలి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్లో చదువుకున్న గ్రామీణ యువత సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఈటల కోరారు. చదవండి: స్టార్టప్‌ల రాష్ట్రంగా తెలంగాణ -
ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు : ఎంపీ
సాక్షి, మహబూబాబాద్ : ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకుల ఉచ్చులో పడవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విజఒప్తి చేశారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో ఎంపీ మాలోతు కవితతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 91 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అనేక సమస్యలు వస్తాయి. 5100 ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టింది ప్రజల ఇబ్బందులు తొలగించడానికే. గత ప్రభుత్వాలు చిరుద్యోగుల విషయంలో చేసిన అనేక తప్పులను సవరించి వారికి జీతాలు పెంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సమ్మె చేయడానికి ఇది సరైన సమయ కాదు. నేటితో కార్మికులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలి. ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లేదు అనడానికి హుజూర్నగర్ ఉప ఎన్నికలే నిదర్శనం. సీఎం ఎక్కడో ఉండి పిలుపునిచ్చినా ప్రజలు 43 వేల భారీ మెజార్టీతో గెలిపించారు. బీజేపీ రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నా. దోషులను కఠినంగా శిక్షిస్తామ’ని వెల్లడించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఎంతో అనుభవం ఉన్న సీఎం కేసీఆరకు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని అభిప్రాయపడ్డారు. అశ్వత్థామ రెడ్డి కార్మికుల పుణ్యమా అని హైలెట్ అవుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ పార్టీలను చూసి పనిచెయ్యడు. ప్రజలను చూసి పని చేస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బిందు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
అమ్మో! సత్యవతమ్మ చూస్తుంది..!
తన ఇల్లే కాదు కాలనీల రోడ్లూ అద్దంలా ఉండాలని సత్యవతమ్మ తపన. అందుకే, తెల్లవారకముందే రోడ్డెక్కుతుంది. కూడళ్ల వద్ద కాపుకాస్తుంది మున్సిపల్ ఆటోలు వస్తున్నాయా లేదా చెక్ చేస్తుంది. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు అందిస్తుంది ఇదంతా ఎందుకంటే.. రోడ్ల మీద, కూడళ్లలో ఎవ్వరూ చెత్త వేయకూడదు. ఇప్పుడిక అక్కడ ఎవరైనా చెత్త వేయడం కాదు వేయాలనే ఆలోచనే మానుకున్నారు. ఎందుకంటే చెత్త వేస్తే.. ‘అమ్మో, సత్యవతమ్మ చూస్తుంది’ అని వారికి భయం. సత్యవతి... జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ఈ పేరు తెలియనివారుండరు. ఎందుకంటే నిరంతరం చెత్త సమస్యపై మున్సిపల్ కార్యాలయం, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతిపత్రాలు అందిస్తుంటోంది. అధికారులే కాదు ప్రజాప్రతినిధులనూ కలిసి చెత్త సమస్యకు పరిష్కారం చూపమంటూ డిమాండ్ చేస్తుంటోంది. ఇటీవలి కాలంలో తమ కాలనీలో చెత్త సమస్యకు ఆమె ఓ పరిష్కారం చూపింది. మున్సిపల్ నుంచి ఆటో రెగ్యులర్‌గా నడపాలని, రోడ్డుపై, కూడళ్ల వద్ద ఎవ్వరూ చెత్త వేయకుండా చూసే బాధ్యత తనదంటూ సత్యవతి శపథం చేసింది. కూడళ్ల వద్ద చెత్త వేస్తే రూ.50 జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే ఆమె ఆ కూడళ్ల వద్ద కాపుకాస్తోంది. దీంతో ‘అమ్మో సత్యవతమ్మ చూస్తుంది’ అన్న భయంతో కాలనీ వాసులు చెత్త వేయడం మానేశారు. పొరపాటున ఎవరైనా తను చూడనపుడు చెత్త వేస్తే ఆమె స్వయంగా వెళ్లి ఆ చెత్తను తీసి ఆటోల్లో వేసి వస్తుంటుంది. ఏడుపదుల వయసులోనూ.. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివసించే డి.సత్యవతి కుటుంబం భువనగిరి నుంచి 1975లో కామారెడ్డికి వలస వచ్చింది. కొన్నాళ్లు ప్రైవేటు పాఠశాలను నడిపింది. 1985లో పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన సత్యవతి ఐదేళ్ల పాటు పనిచేసింది. పంచాయతీ సభ్యురాలిగా పనిచేసిన సమయంలో, తరువాతి కాలంలోనూ ఆమె సామాజిక బాధ్యతను విస్మరించలేదు. తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతోంది. ఏడు పదుల వయసులోనూ ఆమె నిరంతరం సామాజిక సమస్యలపై సమరం సాగిస్తోంది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొనే పారిశుద్ధ్యం సమస్య, తాగునీటి సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంది. ఏడు పదుల వయసులోనూ ఆమె తన మార్గాన్ని వీడకుండా ప్రజల సమస్యలపై స్పందిస్తోంది. ‘ప్రజాప్రతినిధులు, నాయకులు మున్సిపల్ కార్మికులను తమ ఇళ్లలో ఊడిగం చేయించుకుంటున్నారని, వారిని వదిలేస్తే పారిశుద్ధ్య సమస్య ఉండద’ని సత్యవతి చెబుతుంటోంది. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి ఈ సమస్యపై వందల సార్లు ఫిర్యాదులు చేశానని, ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినా, తన పట్టుదల విడువనని చెబుతోంది సత్యవతమ్మ. తాను నివసించే శ్రీరాంనగర్ కాలనీ డెవలప్మెంట్ వర్కింగ్ కమిటీకి అధ్యక్షురాలిగా సత్యవతి కాలనీలోని సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని చెబుతోంది. మున్సిపల్లో అక్రమాలపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంచుతుంటుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం, కాని పక్షంలో నిరసన తెలుపుతూ తన పంథాను కొనసాగించడం సత్యవతమ్మ ముందున్న మరో పని. ఇంటింటికీ తిరుగుతూ.. శ్రీరాంనగర్ కాలనీలో స్థానికులు పలు కూడళ్లు, రోడ్లపై చెత్త వేయడంతో అక్కడ వాతావరణం అపరిశుభ్రంగా తయారవుతోందని గుర్తించిన సత్యవతమ్మ చెత్త వేయవద్దని కాలనీ వాసులకు ఇంటింటికీ తిరుగుతూ విన్నవించింది. అయినా చాలా మంది చెత్త వేస్తుండడంతో ఆమె సొంత డబ్బులతో ఫ్లెక్సీలు, బోర్డులు తయారు చేయించి ఆ కూడళ్ల వద్ద కట్టింది. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తెల్లవారుజామునే ఆమె కూడళ్ల వద్ద తిరుగుతూ ఎవరూ చెత్త వేయకుండా కట్టడి చేస్తుంటుంది. పొరపాటున ఎవరైనా చెత్త వేస్తే తానే వెళ్లి ఆ చెత్తను తొలగిస్తూ మున్సిపల్ ఆటోలో పడేస్తున్న సత్యవతమ్మను చూసి ఎవరూ చెత్త వేయడానికి సాహసించడం లేదు. సత్యవతమ్మ తపనను అర్థం చేసుకున్న కాలనీల వాసులు తమ చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలనే అవగాహనను ఏర్పరచుకున్నారు. దీంతో ఇంతకాలం చెత్తతో అధ్వాన్నంగా తయారైన ఆ కూడళ్లు ఇప్పుడు పరిశుభ్రంగా మారాయి. సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి ఫోటోలు: అరుణ్ ►చెత్తను ఎక్కడ చూసినా ఇబ్బందే. మా కాలనీలలో అలాగే కనిపించేది. పేరుకుపోయిన చెత్త తీసేయాలని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాను. అయినా నా ప్రయత్నం మానలేదు. మున్సిపల్ ఆటోలోనే చెత్త వేయాలని కాలనీ వాసులకు నచ్చజెప్పాను. మొదట్లో నా మాటలు వినిపించుకోకపోయినా ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. అయినప్పటికీ మానవనైజం నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే చెత్త వేయకూడదంటూ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చే సి నియంత్రించే ప్రయత్నం చేశాను. మున్సిపల్ కార్మికులు ప్రజాప్రతినిధులు, నాయకుల ఇళ్లలో పనిచేస్తున్నారు. వారిని విముక్తి చేయాలి. ఇప్పుడు ఉన్న కార్మికులు పట్టణానికి సరిపోవడం లేదు. ఎవరో ఒకరు పూనుకుంటేనే ఎంతటి సమస్య అయినా పరిష్కారమవుతుంది. సత్యవతమ్మ, స్వచ్ఛ సేవకురాలు, కామారెడ్డి -
అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు మహేశ్ బాబు
‘నా కష్టసుఖాల్లో నాన్న అండగా ఉంటాడు.. నేను చేసే పనుల్లో మంచి చెడు విడమరిచి చెప్పే విమర్శకుడు.. సాయం కోసం మనల్ని నమ్మి ఎవరైనా వస్తే రెండో సారి రాకుండా పని చేయాలని సునిశితంగా మందలిస్తారు.. ఓ రకంగా చెప్పాలంటే ఆయనే నాకు అండాదండ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నాకు అక్కాచెల్లెళ్లతో ఆడుకున్న ఆటపాటలు, అన్నయ్యతో కలిసి సైకిల్‌పై వెళ్లి చూసిన సినిమాలు అన్నీ గుర్తున్నాయి’ – ‘సాక్షి పర్సనల్ టైమ్’లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వరంగల్ సాక్షి ప్రతినిధి: నలుగురం అక్కాచెల్లెళ్లం కురవి మండలం గుండాత్రిమడుగు పక్కన ఉన్న పెద్ద తండాలో వ్యవసాయ చేసుకునే గిరిజన కు టుంబం మాది. నాన్న లింగయ్యనాయక్, అమ్మ దశిమి. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. ఒక అన్నయ్య. నేను అందరి కంటే చిన్నదాన్ని. మా పెద్ద తండా నుంచి 5 కి.మీ దూరంలో ఉండే గుండాత్రిమడుగుకు వెళ్లి చదువుకున్నా. ఐదో తరగతిలో ఉన్నప్పుడు వరంగల్‌లోని సంక్షేమ హాస్టల్లో చేర్పిస్తే తిండి బాగాలేదని ఇంటికి పారిపోయి వచ్చా. ఏడో తరగతి వరకు గుండాత్రిమడుగులో చదువుకున్నా. నాది బాల్యవివాహం. ఏడో తరగతి పూర్తికాగానే లగ్గమైంది. మా అన్న స్నేహితుడైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైల్వే ఉద్యోగి గోవింద్ రాథోడ్‌తో 1982లో వివాహమైంది. ఆ తర్వాతే పదో తరగతి పరీక్ష పూర్తి చేశా. అనంతరం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాను. ఇక రాజకీయాల్లో బిజీ కావడంతో చదువు అంతకంటే ముందుకు సాగలేదు. నాన్న సహకారం మరవలేనిది నేను రాజకీయాల్లోకి రావటానికి, రాణించటానికి, ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండటానికి నాన్న లింగ్యనాయకే కారణం. ఎందుకు ఇలా చెప్పుతున్నానంటే.. చాలామంది కార్యకర్తలు, ప్రజలు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు కదా. వారందరినీ నాన్న గమనిస్తూ ఉండేవారు. అలా ఎవరైనా ఒకటి, రెండుసార్లకు మించి వస్తే గమనించి నాకు చెప్పేవాడు. మనపై నమ్మకంతో సహాయపడుతామని ఎందరో వస్తుంటారు. పని ఐతే ఐతది, లేకపోతే కాదు అని చెప్పాలే తప్ప తిప్పించుకోవద్దని సూచిస్తారు. నీ వల్ల అయ్యేటట్లు ఉంటే ఖచ్చితంగా సాయం చేయాలని, ఇప్పటికి కూడా నేను చేసే పనులను గమనిస్తూ నన్ను హెచ్చరిస్తూ, సలహాలు ఇస్తాడు. మా నాన్న నాకు పెద్ద విమర్శకుడు, మార్గదర్శి. నాగలి దున్నుతా... వ్యవసాయ కుటుంబం కావటంతో చిన్నప్పుడు పొలం పనులకు అమ్మవాళ్లతో వెళ్లేదాన్ని. నాకు నాగలి దున్నటం, నాట్లు వేయటం, నీళ్లు పెట్టడం.. ఒక్కటేమిటి వ్యవసాయ పనులన్నీ వచ్చు. నిజంగా ఆ రోజుల్లో జీవితం చాలా అందంగా ఉండేది. అరమరికలు లేకుండా అందరం కలిసి మెలిసి జీవించేటోళ్లం. చిన్నప్పుడు మా అక్కలతో, అన్నలతో తీరొక్క ఆటలు ఆడేవాళ్లం. ఈత కొట్టడం కూడా వచ్చు. మగరాయుడిలా పెరిగా ఇంట్లో అన్నయ్యతో పాటు నలుగురం ఆడపిల్లలం. కానీ నేను చిన్నప్పటినుంచి మగరాయుడిలాగే పెరిగా. ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. మా కజిన్స్‌తో ఎక్కువగా తిరిగేది. నా బలం, బలహీనత గిరిజన మహిళను కావటమే. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా ధైర్యంగా పెరగటం వల్లే ఈ స్థితికి చేరుకోగలిగిను. అలాగే మహిళను కావడం వల్ల చాలా ఇబ్బందుల సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందనిపిస్తుంది. నాకు మొదటి నుంచి అన్ని మతాలు, దేవుళ్లను ఆరాదించటం అలవాటు. కురవి వీరన్న ఇష్టదైవం. అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు మహేశ్ బాబు చిన్నప్పుడు మా అన్నయ్యతో కలిసి సైకిల్ మీద, ఎండ్లబండి మీద మహబూబాబాద్, బయ్యారం వెళ్లి సినిమాలు చూసేది. నాకు ఇంకా గుర్తుంది.. నేను మొదట చూసిన సినిమా లవకుశ. మా ఆయనకు తెలుగు రాకపోవటంతో ఇద్దరం కలిసి హిందీ సినిమాలు బాగా చూసేవాళ్లం. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో ఎక్కువగా చూడలేకపోయినా. అప్పుడు ఎన్టీఆర్, ప్రస్తుతం మహేష్‌బాబు అంటే ఇష్టం. హీరోయిన్లలో జయసుధ, జయప్రద అంటే ఇష్టం. జయప్రద తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి పనిచేశా. ఇటీవల ఫిదా, బాహుబలి సినిమాలను మా కొడుకులు, కోడళ్లతో కలిసి చూశాను. నా జీవితాంతం వెంటాడుతుంది మా ఆయన అకాల మరణం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నా జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన అదే. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సునీల్‌కుమార్ రాథోడ్, చిన్నవాడు సతీష్ రాథోడ్. పెద్దకుమారుడు, కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు. చిన్నబ్బాయి ఇక్కడే మహబూబా బాద్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే.. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే పెరిగాను. ఎన్టీఆర్ ప్రజలకు పాలన చేరువ చేశారు. మా అన్న గోవింద్నారాయణ లడ్డా సహకారంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఎన్టీఆర్ తరువాత, ప్రజలకు పరిపాలన దగ్గర చేసిన సీఎం కేసీ ఆర్. ప్రజలకు ఏం అవసరమో తెలిసిన నాయకుడు. నన్ను తన సొంత బిడ్డ్డలా చూసుకుంటాడు. ఇంటికి వెళ్తే భోజనం చేయకుండా వెళ్లనివ్వరు. రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా.. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చి, సర్పంచ్, జెడ్పీటీసీగానే కాకుండా పార్టీల్లో వివిధ పదవులు చేపట్టినా. 2004–05 ప్రాంతంలో పిల్లల చదువు కోసమైతేనేమి,ఇతరత్రా ఇబ్బందులతో రాజకీయాలు నాకు సరిపడవు.. తప్పుకుందాం అని అనుకున్నా. కానీ అనూహ్యంగా చంద్రబాబు 2006లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేయించారు. జెడ్పీటీసీగా గెలిచి స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పనిచేశా. ఈ నేపథ్యంలో 2009లో డోర్నకల్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందటం నా జీవితంతో అత్యంత ఆనందకరమైన విషయం. ఈ స్థితికి చేరుకోవటమే గొప్ప నేను సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థితికి చేరుకోవటమే గొప్పగా భావిస్తున్నా. ఉన్నత పదవులు ఆశించాలని కోరిక ఏమీ లేదు. కేసీఆర్ ఇప్పటి వరకు నాపై నమ్మకంతో ఇచ్చిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాను. నన్ను గుర్తుపెట్టుకుని మరీ నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా శిరసావహిస్తా. జగన్ పరిపాలన బాగుంది తండ్రిలాగ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన మంచి భవిష్యత్ ఉంటుంది.రాజకీయాలు పక్కకు పెడితే తను అనుకున్న లక్ష్యం కోసం ఎన్నికష్టాలైనా ఎదుర్కొని సాధించటం అనేది చాలా గొప్ప విషయం. కష్టాలు ఎదురైతే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటేనే విజయం వరిస్తుందని జగన్ నిరూపించారు. -
ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
-
జగనన్న పోరాటమే స్ఫూర్తిగా..
ఆ నియోజకవర్గంలో అందరూ ఆమెను సత్యవతమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. లక్ష ప్రసవాలు చేసిన వైద్యురాలిగా అనకాపల్లి, ఆ చుట్టపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధిచెందారు. అన్నింటా ఆదర్శ జీవితం అక్కడి ప్రజలకు ఆమెను చేరువచేసింది. వైద్యం ఖరీదైన రోజుల్లోను కేవలం రూ.30 ఫీజుగా తీసుకుంటూ ఎందరో పేదలకు ఆప్తురాలిగా మారారు. ఆమె ఎవరో కాదు.. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి భీశెట్టి వెంకట సత్యవతి. అజాత శత్రువుగా, సంఘ సేవకురాలిగా, వైద్యురాలిగా పేరొందిన సత్యవతి ప్రజలకు మరింత సేవా చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజల కోసం వైఎస్ జగన్ చేస్తున్న అవిశ్రాంత పోరాటం, దేనికీ వెరవని ధీరత్వం, రాజీలేని వ్యక్తిత్వం తనను ఆయన అడుగులో అడుగేశాలా చేశాయంటున్న డాక్టర్ సత్యవతి అంతరంగం ఆమె మాటల్లోనే.. ‘‘ప్రజా సేవ చేయాలనే ఆకాంక్షతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నన్ను వైఎస్ జగన్ దృఢ సంకల్పం, పట్టుదల, ప్రజల కోసం ఆయప పడుతున్న తపన ఎంతో ఆకట్టుకుంది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన రాజీలేని పోరాటం నాపై చెరగని ముద్రవేసింది. నిర్ధిష్టమైన లక్ష్యాలతో జగనన్న ముందుకెళ్తున్న తీరు ఆలోచింపచేసింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన వెనుకంజ వేయలేదు. జన క్షేమం కోసం ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుదిరిగి చూడరు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పాలనకు ముగింపు పలికి అసెంబ్లీకి సీఎంగా వస్తానని శపథం చేసిన జగనన్న గత తొమ్మిదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ మాలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. జగనన్న నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతా అనకాపల్లి ఎంపీ స్థానానికి నన్ను ఎంపిక చేశారని తెలియగానే నా ఆనందానికి అవధులు లేవు. పార్లమెంట్‌కు పోటీ చేస్తే జాతీయస్థాయి సమస్యలపై పోరాడవచ్చు. ప్రత్యేకహోదా సాధనకు కృషి చేయొచ్చు. విద్య, వైద్య రంగాల్లో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రానికి రావాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వాటి సాధన కోసం, రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై పోరాడవచ్చు. అందుకే ఆయన నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నా. రాజకీయాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేది నా ఆకాంక్ష. అవకాశమిస్తే ఆకాశంలో సగంగా ఎదగడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగా విశాఖ జిల్లాలో నలుగురు మహిళలకు వైఎస్ జగన్ సీట్లు ఇచ్చారు. నూటికి 85 శాతం సాధారణ ప్రసవాలే... అనకాపల్లి మెటర్నటీ ఆస్పత్రిలో 1993 నుంచి 99 వరకూ గైనకాలజిస్టుగా పనిచేశా. ఆ సమయంలో ప్రసవానికి వచ్చే వారి కుటుంబ సమస్యలపై అవగాహన ఏర్పడింది. ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చేవారిని చూసి మనసు చలించేది. అందుకే ఎక్కడ పనిచేసినా తక్కువ ఖర్చుతోనే సేవలందించాలని నిర్ణయించుకున్నా. 2000లో భర్త విష్ణుమూర్తి సహకారంతో అనకాపల్లిలో వివేకానంద ఆస్పత్రిని ప్రారంభించా. అప్పట్లో కేవలం రూ.10 తీసుకుని వైద్యసేవలందించేవాళ్లం. లక్షకు పైగా ప్రసవాలు చేసే అదృష్టం నాకు దక్కింది. వివేకానంద చారిటబుల్ ట్రస్టు తరఫున ఆధ్యాత్మిక, వైద్య, విద్య రంగాల్లో సేవలందిస్తున్నాం. వైద్యాన్ని కేవలం సేవగానే భావించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నా. నా వద్దకు వచ్చే ప్రసవాల కేసుల్లో వందకు 15 మాత్రమే సిజేరియన్లు చేస్తా. వీలైనంత వరకూ సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనిస్తా. ప్రజాసేవ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా మా తల్లిదండ్రులు భీశెట్టి జగన్నాథరావు, దేముళ్లమ్మ. వారి ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ చదివా. పెద్దల అంగీకారంతో సహ విద్యార్థినే పెళ్లి చేసుకున్నా. మా అత్తగారి కుటుంబంలో పలువురు రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. వారిని దగ్గరినుంచి చూసిన నాకు రాజకీయాలతోనే ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని అర్థం చేసుకున్నాను. 1992లో నా మనసులో మెదిలిన రాజకీయ ప్రస్థానం ఆలోచన ఆరేళ్ల క్రితం సాకారమైంది. చట్టసభలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. జగనన్న నాకు ఆ అవకాశం కల్పించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా కుటుంబీకులు, స్నేహితులు, సహచర వైద్యులున్నారు. మా నాన్నగారు కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగిగా పని చేసేటప్పుడు చోడవరం కేంద్రంగా విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో మాడుగులలో చదువుకోవడంతో అక్కడ కూడా మంచి పరిచయాలున్నాయి’’ – దాడి కృష్ణ వెంకట్రావు, అనకాపల్లి -
వనమాత ఇల్లు చల్లన.. నేలతల్లి పచ్చన
ఏడు ఎకరాల పొలం. సగం చేపల చెరువు,సగం పచ్చని పంటలు. పొలం మధ్యలో చిన్న దీవి.ఆ దీవిలో అందమైన పొదరిల్లు. నిద్ర లేచేది పొలంలోనే,రోజంతా శ్రమించేది పొలంలోనే. విశ్రమించేదీ పొలంలోనే. హరిత విప్లవం, నీలివిప్లవాలను ఇరుగుపొరుగున నడిపిస్తున్న రైతు ఆమె. పేరు దంతులూరి సత్యవతి, వయసు డెబ్భై రెండేళ్లు. ఊరు గుంటూరు జిల్లా, అమర్తలూరు మండలం, పెదపూడి గ్రామం. భర్త వాసుదేవరాజు, సత్యవతి.. ఇద్దరే ఉంటారా ఇంట్లో. ఇంటి చుట్టూ ఉన్న పొలంలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లతోపాటు కొబ్బరి, అరటి, సపోటా, బత్తాయి, నిమ్మ, పైనాపిల్, మామిడి, పనస, బొప్పాయి, జామ, చెర్రీ వంటి పండ్ల చెట్లున్నాయి. వాటి మధ్యలో లవంగాలు, కలబంద, కొండపిండాకు, తిప్పతీగ, నేల ఉసిరి, వావిలాకు, తులసి, తుంగకాయలు, పిప్పళ్లు, కచోరాలు, నేలవేము, పెద్ద ఉసిరి వంటి ఔషధ మొక్కలున్నాయి. చింత, కర్రపెండలం, తమలపాకు, కందిమొక్కలు, రకరకాల కూరగాయల మొక్కలు అల్లం, పసుపు... ఇదీ అదీ అని చెప్పడానికి వీల్లేనన్ని రకాలున్నాయి. మామిడిలో ఆరు రకాలు, అరటిలో ఐదు రకాలున్నాయి. మామిడి అల్లం, నిమ్మగడ్డిని కూడా పెంచుతున్నారు. ఇంకా ఆశ్చర్యంగా కుంచె చీపుళ్ల గడ్డి చెట్లు కూడా గట్ల మీద ఉన్నాయి. కరివేపాకు, తోటకూర, పెరుగు ఆకు, పాల ఆకు, మెంతి ఆకు, పుదీన, కొత్తిమీర వంటి వంటల ఆకులతోపాటు దవనం, మరువం వంటి సువాసన భరితమైన ఆకులు కూడా ఉన్నాయి. ఇన్ని రకాల చెట్లుంటే తేనెటీగలు ఊరుకుంటాయా. తేనెపట్టు పెడతాయి. వాటి నుంచి తేనె తీయించి స్వయంగా మందులు తయారు చేస్తారు సత్యవతి. తన పొలంలో ఉన్న ఔషధ మొక్కల గింజలు, ఆకులతో (32 రకాల దినుసులు) ఔషధనూనె తయారు చేయడంలో నేర్పరి ఆమె. ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చుండ్రు, సోరియాసిస్ పోవడానికి రకరకాల ఔషధాల కాంబినేషన్లో నూనెలు చేస్తారామె. ఔషధాల ఆకులను మూడు గంటల సేపు ఉడికించి చల్లార్చి తైలాన్ని తీస్తారు. ముఖం మీద మచ్చలు పోవడానికి కూడా ఆమె దగ్గర ఓ ఫార్ములా ఆయిల్ ఉంది. దేహారోగ్యం కోసం మాదీఫల రసాయనం చేసి రుచి చూపిస్తారు. మేధో వికాసానికి సరస్వతి లేహ్యం చేసిస్తారు. అడిగిన వారికి వీటన్నింటినీ చేసివ్వడం ఆమెకిష్టమైన వ్యాపకం. ‘‘ఉచితంగా చేసివ్వడం ఎందుకు, ముంబయిలో వీటికి మంచి మార్కెట్ ఉంది, కేరళ వాళ్లు అమ్మేది వీటినే. ముంబయికి రండి’’ అని ఆహ్వానం వచ్చిందామెకి. ‘‘నా పొలాన్ని వదిలి ఎక్కడికీ వచ్చేది లేదు. నేను వీటిని డబ్బు కోసం చేయడం లేదు. ఇష్టం కాబట్టి చేస్తున్నాను. వ్యాపారం కోసం కాదు’’ అన్నారామె. ఒంటికి రోజూ పని ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా ఇన్ని పనులు చక్కబెట్టడం వెనుక ఆమె ఆరోగ్య రహస్యం రోజూ శ్రమించడమే. ఆమె ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తారు. ఏడు గంటలకు రాగి జావ తాగుతారు. పదకొండు గంటలకు భోజనం, మధ్యాహ్నం మూడు గంటలకు రాగి లేదా జొన్న అట్టు, సాయంత్రం ఐదు గంటలు దాటితే భోజనం. ఇది ఆమె రాత్రి భోజనం. మధ్యలో పండ్లు తీసుకుంటారు. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత తొమ్మిది లోపు నిద్రపోతారు. పాలిష్ పట్టని బియ్యపు వరి అన్నం, రాగి, జొన్న అన్నం తింటారా దంపతులు. ఎంత ఆశ్చర్యంగా అనిపించినా సరే. ఆమె మాంసం మానేసి యాభై ఏళ్లయింది, ఆరేళ్ల నుంచి చేపలు కూడా మానేశారు. ఏడాది కాలంగా గుడ్డునూ వదిలేశారు. ఇప్పుడామె పూర్తి శాఖాహారి. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల పొడ కూడా సోకని పూర్తి సేంద్రియ సేద్యం ఆమెది. వ్యయసాయ ప్రస్థానం ఈ వనమాత వ్యవసాయ కుటుంబంలో పుట్టి, వ్యవసాయ కుటుంబంలో అడుగుపెట్టి, సాగుతోనే జీవితాన్ని నిలబెట్టుకున్నారు. రెండు జతల ఎడ్లు, పాతిక గేదెలు, వంద గొర్రెలు, లెక్కపెట్టలేనన్ని కోళ్లు ఆమె ప్రపంచం. రాజుగారు (ఆమె భర్త) ప్రయాణించడానికి ఓ గుర్రం ఉండేది. ఆ జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నారామె. ‘‘మాది బాపట్ల దగ్గర మంతెనవారి పాలెం. అన్ని రకాల పండ్లు తిన్న బాల్యం నాది. అత్తగారిల్లు తెనాలి దగ్గర చిన గాదెలవర్రు. నేను, నా భర్త 1967 నుంచి సొంతంగా సేద్యం చేస్తున్నాం. సత్తెనపల్లిలో పన్నెండెకరాలు కొని చెరకు, పసుపు వంటి రకరకాలు పండించాం. ఆ పొలాన్ని అమ్మేసి 1983లో పెదపూడికి వచ్చి ఏడెకరాల బంజరు భూమిని కొన్నాం. నేలను చదును చేసి, ఒక రూపానికి తెచ్చి సగం చేపల చెరువు పెట్టి, మిగిలిన పొలంలో సాగు చేస్తున్నాం. గట్ల వెంట నూట పాతిక కొబ్బరి చెట్లు పెట్టాం. రకరకాల పంటలతో నిత్యం సాగులోనే ఉంటుంది మా భూమి. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో సదస్సులు పెట్టినప్పుడు ఇద్దరం వెళ్తాం. ఆ పుస్తకాల్లో చెప్పిన పద్ధతుల్లో సాగు చేస్తున్నాం. అలా చేస్తున్నందుకు నాకు అవార్డు కూడా వచ్చింది. ‘సంప్రదాయ విజ్ఞానాన్ని ఆచరిస్తున్న మహిళా రైతు’ అని అవార్డు ఇచ్చారు. అంతకు ముందొకసారి మత్స్యశాఖ పరిజ్ఞాన సంస్థ (కాకినాడ) స్వర్ణోత్సవాల పుస్తకంలో (సావనీర్) ఉత్తమ మహిళారైతు అని నా గురించి రాశారు. నేను పుస్తకం చదవడానికి కంటి అద్దాలక్కర్లేదు. రోజంతా పొలంలో మరీ ఎక్కువగా తిరిగినప్పుడు మోకాళ్ల నొప్పులు వస్తాయి. నేను తయారు చేసుకున్న ఔషధ తైలంలో కర్పూరం కలిపి రాసుకుంటాను. సాగు పాఠాలు మా సాగును చూడడానికి అధికారులు వస్తుంటారు. మేము ఏయే పంటలు సాగు చేస్తున్నాం, ఎలా చేస్తున్నామని అడుగుతారు. పొలాన్ని ఫొటోలు తీసుకుని పోతారు. వ్యవసాయం చేస్తున్న కొత్త పిల్లలు పని సులువు కోసం చేయరాని పనులన్నీ చేసి నేలతల్లిని క్షోభ పెడుతున్నారు. తెగుళ్లను ఆపడానికి గుళికలు వేస్తే మట్టి విషమైపోతుంది. కలుపు మొక్కలు తీయడానికి కూలీలకు డబ్బులు లెక్క చూసుకుని తక్కువ ఖర్చులో పనిపూర్తవుతుందని కలుపు మందులు చల్లుతున్నారు. మందు చల్లితే కలుపు మొక్క ఒక్కటే పోతుందా, మట్టిలో జీవం కూడా పోతుంది. మొలకెత్తే గుణాన్ని హరించి వేశామంటే భవిష్యత్తు ఏమవుతుంది? భూమిని ఇలాగే బీభత్సంగా నాశనం చేస్తుంటే కొన్నాళ్లకు మట్టిలో బీజం వేస్తే మొలకెత్తడం మానేస్తుంది. అప్పుడు జనం ఏం తిని బతుకుతారు? అందుకే మనకున్న మొక్కలన్నింటినీ కాపాడుకోవాలి, భూమి తల్లిని రక్షించుకోవాలి? నేను ఈ భూమితోనే పెరిగాను, ఇందులోనే బతికాను, హాయిగా జీవిస్తున్నాను’’ అన్నారు సత్యవతి.ఆమె పిల్లలు బెంగళూరు, బాపట్ల, హైదరాబాదుల్లో ఉన్నారు. వాళ్లు వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూనే వ్యవసాయం కూడా చేస్తున్నారు. మనిషి ఎంత ఎదిగినా నేల విడిచి సాము చేయకూడదు. పాదాలు నేల మీదనే ఉండాలి, నేల ఆధారంతోనే ఎదగాలి. అప్పుడే జీవితాల్లో సంక్రాంతి వెల్లివిరుస్తుంది... అని సత్యవతి నమ్ముతారు, ఆమె మాటలను ఆమె పిల్లలు విశ్వసిస్తున్నారు. ‘‘మా అమ్మలో మంచి రైతు, గొప్ప వైద్యురాలే కాదు సాగును ఆరోగ్యాన్ని కలగలిపి ఔషధాలతో ఆహారాన్ని తయారు చేసే ఎక్స్పర్ట్ కూడా ఉంది’’ అంటారు. – వాకా మంజులారెడ్డి పిల్లల ఆరోగ్యం తల్లి చేతిలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు మారాల్సిందే. అయితే ఆ మార్పు మనకు మంచి చేసేదై ఉండాలి. మా చిన్నప్పుడు పండ్లతో చేసే జామ్‌ల గురించి తెలియదు. ఇరవై ఏళ్ల నుంచి నేను మా పొలంలో పండిన పండ్లతో జామ్‌లు చేస్తున్నాను. ఉసిరి, బొప్పాయి జామ్‌లు ఎప్పుడూ ఉంటాయి. కలబంద గుజ్జు, పటిక బెల్లం, గోధుమపిండి, నెయ్యి కలిపి హల్వా చేసి ఆడపిల్లలకు పెడతాను. అది తింటే గర్భాశయ సమస్యలు ఇట్టేపోతాయి. నా దగ్గర లేని మొక్క ఎక్కడ కనిపించినా తెచ్చుకుంటాను. బళ్లారి నుంచి గాయం ఆకు, శ్రీశైలం అడవుల నుంచి సరస్వతి ఆకు తీగలు తెచ్చుకున్నాను. నా దగ్గర నల్లమందు ఆకు కూడా ఉంది. ప్రకృతి మనకు నల్లమందు ఆకునిచ్చింది మత్తు కోసం కాదు, వైద్యం కోసం. ఆ ఆకుని పూత మందుల్లో వాడితే గాయం ఇట్టే మాడిపోతుంది. నేలతల్లి మనకు అన్నీ ఇచ్చింది. ఆ నేలతల్లిని కాపాడుకోవాలి. మంచి పంటల్ని పండించుకుని, చక్కగా వండుకుని తిని హాయిగా బతకాలి. రోజంతా ఒంటిని కష్టపెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలి. అంతే తప్ప... తల్లులు టీవీల ముందు కూర్చుని పిల్లలకు అడిగినంత డబ్బిచ్చి బేకరీలకు పంపిస్తే వాళ్లు మంచి తిండి తింటారా? పిల్లల ఆయుష్షు పెంచడం, తుంచడం తల్లి చేతిలోనే ఉంది. సిటీల్లో నేల లేకపోతే కుండీలోనే చిన్న వేపమొక్కను పెట్టి, రోజూ నాలుగు ఆకులు తింటుంటే పిల్లలకు పళ్లు పాడవుతాయా? -
అగ్నిదేవుడికి నమస్కారం
నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం. అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. ‘అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి?’ మన ఇన్సైడ్. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని... ఇదిగో ఈ ప్రవచనకారులు ఇలాగే చెప్తారు కానీ.. భోగిమంట వేశారా? అయితే అగ్నిదేవుడికి ఒక నమస్కారం చేసెయ్యండి. ఎందుకంటారా? నేడొక్కరోజే సూర్య ఇక్కడుండేది. ‘ఏంటి!, అల్లుడుగారు అప్పుడే డ్యూటీకి హైదరాబాద్ వెళ్లిపోతాడా! సంక్రాంతికి అరిసెల పని పట్టకుండా, కనుమకు నాన్‌వెజ్‌ను చీల్చి చెండాడకుండా!’. అల్లుడు సూర్య సంగతి కాదు. లోకానికి కాంతినిచ్చేవాడు, తొమ్మిదివేల యోజనాల పొడవైన రథం గలవాడు, రథానికి సప్తాశ్వాలు ఉన్నవాడు, విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహమాడినవాడు, హనుమంతుడికి యాజ్ఞవల్క్యుడికి వేదశాస్త్రాలు నేర్పినవాడు.. ఆ సూర్యుడు. అతడు వెళ్లిపోతున్నాడు నేడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఏగుతున్నాడు. ఏం గొప్ప? భూమధ్య రేఖ మీద ఇటు సౌత్‌లో అడుగు తీసి అటు నార్త్‌లో అడుగు వెయ్యడమేగా. టోల్గేట్లు ఉంటాయా, ట్రాఫిక్‌జామ్‌లు ఉంటాయా? గగన విహారమే కదా లార్డ్ సూర్య చేసేది. అల్లుడుగారొచ్చిన రూట్లో జర్నీ చేస్తే తెలుస్తుంది.. అల్లుడు గొప్పో, సూర్యుడు గొప్పో.‘ఓ గొప్ప అల్లుడుగారు.. లేవండి, లేవండి, అమ్మాయి భోగి మంటలు రాజేస్తోంది. మీరూ ఒక ఎండు పుల్ల వేసి భగ్గుమనిపిద్దురు రండి. మంచుకు చలి కాపుదాం రండి, చేతులు రుద్దుకుని వేకువ చెవులకు అద్దుదాం రండి. ఎంత మంచి సంప్రదాయమోనండీ..’ఇంకెక్కడి అల్లుడుగారు. చలిలో ఇంద్రా బస్సు దిగి, నేరుగా పడమటి దిక్కున పడగ్గదిలో వాలిపోయాడు. లేపండి లేపండి. అగ్ని లేకుండా భోగి లేదు. అల్లుడు లేవకుండా చిటపటల్లేవు. ‘భోగి మంటలు ఎందుకేస్తారు?’ ఎవర్రా అడిగింది? అల్లుడు గారు కాదు. ఎవరో పిలగాడు. అల్లుడుగారు మాత్రం పిలగాడు కాదా. పిలగాడేంటి? పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరైతేనూ. ఇంజనీరే, సాఫ్టువేరే. అయినా పిలగాడే. ఎందుకయ్యాడు పిలగాడు? భోగిమంటలు ఎందుకేస్తారని అడిగింది అల్లుడుగారేనట. ఎవర్నడిగారట? అమ్మాయినడిగాడట. అమ్మాయి ఏం చెప్పిందట. అడిగి చెప్తానందట. ఎవర్నడిగి చెప్తానందట? భోగిమంటను అడిగి, అగ్నిదేవుళ్లను అడిగి. అగ్నిదేవుళ్లా. ఒక్కడే కదా అగ్నిదేవుడు. అతడే కదా అష్టదిక్పాలకులలో ఒకడు. ‘మరి అగ్నికేతుడు, అగ్నితీర్థుడు, అగ్నిదత్తుడు, అగ్నిదేశ్యుడు, అగ్నిద్యోతనుడు, అగ్నిపూర్ణుడు, అగ్నిముఖుడు, అగ్నివేశుడు, అగ్నివర్ణుడు, అగ్నిసంభవుడు, అగ్నిసోముడు, అగ్నిహోత్రుడు .. వీళ్లంతా ఎవరు? సూర్యుడికి సినానిమ్స్ కాదా!’ కాదు. పేరులో ఫైర్ ఉంటే, తీరులో ఫైర్ ఉన్నట్లేనా? అగ్నిదేవుడు ఒక్కడే. ఫైర్ ఉన్నది ఆ ఒక్కడిలోనే. మరి జమదగ్ని ఎవరు? గాడ్.. అతడు సన్నాఫ్ సత్యవతి, రుచీక. విశ్వామిత్రుడికి మేనల్లుడు. జమదగ్ని భార్య రేణుక. చిత్రరథుడు అనే వ్యక్తి మీద ఆమె మనసు పడిందని అనుమానించి, ‘ఏరా బళ్లా. మీ అమ్మణి చంపాళని నీకెప్పుడైనా అనిపించిందా’ అని నాజర్, రానాని ‘బాహుబలి 2’లో అడిగినట్లు తన కొడుకుల్ని అడిగాడు జమదగ్ని. ‘అనిపించలేదు’ అన్నారు కొడుకులంతా. ‘అనిపించింది’ అన్నాడు ఇంకో కొడుకు పరశురాముడు. ‘అయితే వధించు’ అన్నాడు జమదగ్ని. తల్లిని వధించాడు పరశురాముడు. తర్వాత బోరుమన్నాడు. ‘ఏడ్వకు. వరం కోరుకో’ అన్నాడు జమదగ్ని పరశురాముడితో. ‘నా తల్లిని బతికించు నాన్నా. అదే నాకు వరం’ అన్నాడు పరశురాముడు. రేణుక బతికింది. ‘అవునా! దెన్, హూ ఈజ్ జటాగ్ని?’ జటాగ్ని ఎవరూ లేరు. జటాయువు ఉన్నాడు. జటాలిక ఉంది. జటాసరుడు ఉన్నాడు. వీళ్లెవరిలోనూ ఫైర్ లేదు. జఠరాగ్నిలో ఫైర్ ఉంది కానీ, అది కడుపులోని అగ్ని. డైజెస్టివ్ ఫైర్. కడుపులో ఏదైనా పడితేనే అది చల్లారుతుంది. ఏది అందుబాటులో ఉంటే అది వేసేయాలి. పిజ్జా ఉంటే పిజ్జా. బర్గరుంటే బర్గర్. వేరేదీ దొరక్కపోతే మ్యారీగోల్డ్. ‘అయితే ఈ స్వామీజీలంతా ఏంటి మరీ.. కడుపులో ఇంత పడేయండి అనకుండా, కడుపులో ఉన్న దాన్ని తీసి బయట పడేయండి అంటారు!’ఎవరు? జగ్జీ వాసుదేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ వీళ్లేనా? వీళ్లు స్వామీజీలు కాదు. జ్ఞానాగ్ని పుత్రులు. అహాన్ని దగ్ధం చేసుకుని.. మహోన్నతిని, మహోజ్వలతను, సాక్షాత్కారం చేయిస్తున్నవారు. అవును వీళ్లే. భోగి వచ్చిన ప్రతిసారీ ఇదే ప్రవచనం, ఇదే ప్రబోధన. ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తాం కదా, అలాగే ఒంట్లోని పనికిమాలిన ఫీలింగ్స్ అన్నిటినీ మంటల్లో వేయమంటారు? ఎలా సాధ్యం? ఎండు పుల్లల్ని, పాత చీపుళ్లను, పిడకల్ని, చెక్క ముక్కల్ని వేసినట్లు మనసు లోపలి భావాలను అగ్నికి ఎలా ఆహుతి చెయ్యగలం? అవి భౌతికమైనవి కావే... చేత్తో పట్టుకుని, మంటల్లో వెయ్యడానికి! నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం. అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి? మన ఇన్సైడ్. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని.. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను అందులో కాల్చి బూడిద చేసుకోవాలి. అప్పుడు క్లీన్ అయిపోతాం. న్యూ లుక్ వచ్చేస్తుంది. కొత్త సంక్రాంతి లుక్. పండక్కి అల్లుడొచ్చాక ఇంటికి వస్తుంది కదా ఆ లుక్. రైతులు పాడి పశువులకు స్నానం చేయించి, ఎండకు మిలమిల్లాడిస్తారు కదా ఆ లుక్. కానీ ఆ తల్లిని అనుమానించడం బాధగా ఉంది. ఏ తల్లి? జమదగ్ని భార్య రేణుకేనా? మళ్లీ అక్కడికెందుకు వెళ్లాల్సి వచ్చింది? రేణుక చేసిందని జమదగ్ని అనుమానించిన తప్పు కన్నా, రేణుకను అనుమానించడం జమదగ్ని చేసిన పెద్ద తప్పుగా అనిపిస్తోంది. ముందు అనుమానాన్ని మంటల్లో వెయ్యాలి. అనుమానం నుంచే ఈ చెడంతా. భర్త భార్యను అనుమానిస్తాడు. పెద్దలు పిల్లల్ని అనుమానిస్తారు. యజమాని సేవకుడిని అనుమానిస్తాడు. మంచిని చెడు అనుమానిస్తుంది. లేమిని కలిమి అనుమానిస్తుంది. ద్వేషం ప్రేమను అనుమానిస్తుంది. ఒక దేశం ఇంకో దేశాన్ని అనుమానిస్తుంది.ఎటు వెళ్తున్నాం. వెళ్లడం లేదు. వచ్చేశాం. ముంగిట్లోని భోగిమంటల దగ్గరికి. ఈ మంటల వెలుగుల్లో ముఖాలు ఎంత స్వచ్ఛంగా మారుతున్నాయి! వెలుగు స్నానం మురికిని తొలగిస్తోంది. మెల్లిగా వేకువ అవుతోంది. ఇక చాలు లేవండి, నేనొచ్చేస్తున్నాను కదా అంటున్నాడు ఆదిత్యుడు. అవునవునని తలూపుతూ వస్తున్నాయి.. ఆవూ లేగదూడ. అవునూ.. భోగి మంటలు ఎందుకు వేస్తారు? కడుపులో ఉన్న కోపం, అసూయ, ద్వేషం.. ఇలాంటివి తీసి పడేయడానికి అని చెప్పారు నిజమే. ఫిలసాఫికల్‌గా కాకుండా, పిలకాయలకు అర్థమయ్యేలా చెబుదురూ. పంటొచ్చే వేళ ఇంటికి పురుగూ వస్తుంది. సూర్యుడు మకరరాశిలోకి వెళ్లే వేళ చలి శిఖరానికి చేరుతుంది. పురుగును తరిమికొట్టడానికి, సంక్రాంతి నుంచి మొదలయ్యే ‘కొత్త వేడి’కి అలవాటు పడటానికే భోగి మంట. ‘అమ్మా.. అల్లుడుగారు లేచారా?’‘లేచారు నాన్నా.. స్నానం చేశాక భోగి మంట దగ్గరికి వస్తారట. ఈలోపు కర్పూరం తెమ్మని పంపించారు.’అవును. అదే సంప్రదాయం. స్నానం చెయ్యకుండా దేవుడి పటం ముందుకు వెళ్లం. స్నానం చేయకుండా భోగిమంటల దగ్గరికి వెళ్లకూడదు. భోగిమంటల్ని కర్పూరంతో వెలిగించాలి. కిరోసిన్‌తో, పెట్రోల్‌తో కాదు. మరి ఇంత తెలిసినవాడు భోగిమంటలు ఎందుకేస్తారని అమ్మాయిని ఎందుకు అడిగాడు! అమ్మాయికి తెలుసో లేదో తెలుసుకుందామనీ. -
నావద్ద ఏమియునూ లేదు...
అనారోగ్యం మాటేమిటోగానీ అప్పుడయాన యుద్ధానికి వెళుతున్న చక్రవర్తిలా ఉన్నాడు. తెలియని ఉత్సాహం ఏదో అతని కండ్లలో వెలుగుతుంది.కళాకారులకు పెద్దగా ఏమీ అక్కర్లేదనుకుంటా.... చప్పట్లు చాలు, వన్స్మోరు కేకలు చాలు! ఈ మాత్రం దానికే ఆ కొద్దిసేపు వాళ్లు రాజ్యాలను జయించే చక్రవర్తులవుతారు. కుబేరుణ్ణి తలదన్నే అపరకుబేరులవుతారు.జీవితసార్థకతను ప్రేక్షకుల చప్పట్లలో కొలుచుకొని పదేపదే మురిసిపోతారు. అలాంటి ఒక కళాకారుడు సత్యవతి వాళ్ల నాన్న. ఆయన స్టేజీ ఎక్కితే, స్టేజీ మాయమై మరోలోకం కనిపిస్తుంది. ఆయన ప్రేక్షకులను ఎటో తీసుకువెళతాడు.ఈసారి మాత్రం అలా జరగలేదు. ఆయనే ఎక్కడికో వెళ్లిపోయాడు.సత్యహరిశ్చండ్రి వేషంలో ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కుండతో ఉత్సాహంగా స్టేజీ వైపు పరుగులాంటి నడకతో వెళుతున్నాడు ఆయన. కూతురు సత్యవతి ‘నాన్నా!’ అని అరుస్తూ ఆయన దగ్గరకు వచ్చింది.‘‘ఏమిటమ్మా?’’ అడిగాడు ఆయన.‘‘మాత్రలు వేసుకోవడం మరిచిపోయావు నాన్నా’’ అని గుర్తు చేసింది ఆమె.కూతురికి తన ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధకు ఒకవైపు మురిసిపోతూనే...‘‘ఆ డాక్టర్ చాదస్తం సగం నీకు వచ్చినట్లుందమ్మా’’ అంటూ చేతిలోని కుండను ఆమెకు ఇచ్చి మాత్రలు వేసుకొని గ్లాసులో నీళ్లుతాగి స్టేజీవైపు నడిచాడు. తండ్రి ఉత్సాహన్ని చూస్తూ తనలో తాను చిన్నగా నవ్వుకుంది సత్యవతి.నాటకం మొదలైంది.‘‘మాలిని... ఎవరైనసరే కాటి సుంకం చెల్లించిగానీ దానకార్యమునకు ఉపక్రమించను’’ అని తేల్చేశాడు హరిశ్చంద్రుడు.‘‘అయ్యా! కాటిసుంకంమును చెల్లించుటకు నా వద్ద ఏమియునూ లేదే’’ అని అసలు విషయం చెప్పింది చంద్రమతి.‘‘నేనిది బొత్తిగా నమ్మను. ఆలోచించు’’ అని కంఠంలో కాస్త కోపాన్ని కొని తెచ్చుకున్నాడు హరిశ్చంద్రుడు. ఇద్దరి మధ్య కాసేపు పదునైన పద్యాల యుద్ధం జరిగింది. ‘‘అయ్యా! నా వద్ద ఏమియు లేదన్నా నన్ను ఏల బాధించెదరు?’’ శోకతప్తహృదయంతో నిలదీసింది ఆమె.ఆమె శోకంతో తనకు బొత్తిగా పనిలేదన్నట్లు...‘‘అది మాంగల్యం కాబోలు. ఏ వెలకైనా దాన్ని తెగనమ్మి నీ సుతునికై వెచ్చించు... వెచ్చించు.. ఆ...ఆ...ఆ...’’ అంటూ రాగం తీశాడు హరిశ్చంద్రుడు.వినలేనిదేదో విన్నట్లు ‘అయ్యో! దైవమా’ చెవులకు చేతులు అడ్డం పెట్టుకుంది చంద్రమతి.తరువాత ఆలోచించింది.‘‘నా పతికి తక్క అన్యులకు గోచరించని నా దివ్యమాంగల్యం.... కాదు కాదు కాదు... ఇతడు ఛండాలుడు కాదు. నా మంగల్యం కనుగొన్న ఇతడు నా పతి హరిశ్చంద్రుడు. స్వామి... నేను స్వామి నీ చంద్రమతిని’’ అంటూ భర్త దగ్గరకు వచ్చింది.‘‘దేవీ నువ్వా! నా చంద్రమతివా? అటులైన వీడు?’’ అని కుర్రాడి శవాన్ని చూస్తూ అడిగాడు హరిశ్చంద్రుడు.‘‘మన కుమారుడు లోహితుడు’’ అంటూ ఆమె దీర్ఘమైన పద్యం ఒకటి పాడింది.హరిశ్చంద్ర– చంద్రమతులు కుమారుడి తలనిమురుతూ ‘హా లోహితా! లోహితా’ అని కంటికి మింటికి ధారగా ఏడుస్తున్నారు.ప్రేక్షకుల్లో ఏడ్వనివాడు పాపాత్ముడు!‘వన్స్‌మోర్’ అంటూ ఈలలు.పాత్రకు ప్రాణం పోస్తూ .... ఏడుస్తూ ఏడుస్తూ.... ఒక్కసారిగా స్టేజీపైనే కూలిపోయాడు సత్యవతివాళ్ల నాన్న. ‘నాన్న... నాన్న’ అంటూ ఆందోళనగా పరుగెత్తుకు వచ్చింది కూతురు.‘‘ఈసారి చాలా ఉధృతంగా వచ్చింది. వెంటనే బస్తీకి తీసుకెళ్లి పెద్ద డాక్టర్‌కు చూపించాలి’’ అని చెప్పాడు ఆ ఊరివైద్యుడు. ఆయన్ను ట్రాక్టర్లో ఎక్కించి తీసుకెళుతున్నారు. ‘‘ఏంకాదమ్మా’’ అంటూ పోస్ట్ మాస్టర్ బాబాయ్ సత్యవతికి ధైర్యం చెబుతున్నాడు. ఏమైందో ఏమో ట్రాక్టర్ మధ్యలోనే ఆగింది.మెకానిక్‌ను తీసుకొస్తానంటూ డ్రైవరు కుర్రాడు పరుగెత్తుకు వెళ్లాడు. ఏడుపులు విని... అటుగా వెళుతున్న రమేష్ ‘‘ ఏమైంది?’’ అని అడిగాడు.‘‘మావాడు చావుబతుకుల మధ్య ఉన్నాడు... ట్రాక్టరేమో చెడిపోయింది. అర్జంటుగా పట్నానికి తీసుకెళ్లాలి’’ అని చెప్పాడు బాబాయ్.రమేష్ మెకానిక్ అవతారమెత్తి ట్రాక్టర్లో కదలిక తెచ్చాడు.‘‘ఆ డ్రైవర్ ఎప్పుడొస్తాడో ఏమో... నేను తీసుకెళ్తాను పదండి’’ అంటూ డ్రైవర్ సీట్లో కూరున్నాడు రమేష్. ట్రాక్టర్ పట్నం రోడ్డు మీద అడుగుపెట్టగానే ఊరేగింపు ఒకటి కనిపించింది. తెల్లటి పొడవాటి బ్యానర్లపై‘ప్రభుత్వ వైద్యుల సమ్మె’ అనే నీలిరంగు అక్షరాలు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్ గవర్నమెంట్ ఆస్పత్రి ముందు ఆగింది. ‘‘సీరియస్ కేసు సార్. మీరు వెంటనే అడ్మిట్ చేసుకోవాలి’’ అని ఆస్పత్రి ఉద్యోగిని అభ్యర్థించాడు పోస్ట్‌మాస్టర్ బాబాయ్.‘‘ఏంలాభం లేదండీ. డాక్టర్లెవరూ లేరు. బోర్డ్ చూడలేదా!’’ అని చావుముందు కబురు చల్లగా చెప్పాడు ఆ ఉద్యోగి.‘‘ప్రజలకు ప్రాణం పోయాల్సిన డాక్టర్లు సమ్మె చేయడం ఏమిటి?’’ అని అంతెత్తు లేచాడు రమేష్. సమాధానం చెప్పేవారు లేరక్కడ.‘‘పోనీ... చుట్టుపక్కల వీధిలో ప్రైవేట్ డాక్టర్ ఎవరు లేరా?’’ ఆరా తీశాడు బాబోయ్.ఆ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోయే సమయానికే సత్యవతి నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.స్టేజీపై ఆయన పాడిన పద్యం గాలిలో లీలగా వినిపిస్తుంది.‘నా ఇల్లాలని... నా కుమారుండని.... ఎంతో అల్లాడిన ఈ శరీరం... ఒంటరిగా కట్టెలలో కాలుచున్నది. ఆ ఇల్లాలు రాదు.... పుత్రుడు తోడై రాడు’ -
ఎదిగిన పిల్లలు
తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో... సెల్లో తక్కువ శబ్దంలో పాట వింటున్నాను. అలజడిగా ఉన్నప్పుడు పాట వింటాను. అలజడిగా ఉన్నప్పుడే అన్నయ్య ఫోన్ కూడా వస్తుంది. ఎలా తెలుసో వాడికి ఇప్పుడు చేయాలని. ‘ఏంటమ్మడు సంగతులు?’ ‘ఏంటంటున్నాడు మీ ట్రంపు?’ హుషారు తెచ్చుకుంటూ అన్నాను. ‘వద్దులే... పాయింటుకురా. గొంతులో వేరియేషన్స్ మార్చి ఎందుకు అవస్థలు పడతావు. ఏమంటున్నాడు సామర్లకోట పెళ్లికొడుకు’ ‘చేసుకుంటానన్నాడు’ ‘గుడ్’ ‘అయితే చిన్న డౌటండీ... మీ అమ్మ నిజంగానే చచ్చిపోయిందా లేదంటే అందరూ అనుకున్నట్టుగా అని మూడు చుక్కలు పెట్టాడు’ ‘ఏమన్నావు’ ‘మూడు చుక్కలే నిజమండీ అన్నాను. అయినా మీకు ఆ మూడు చుక్కలే అభ్యంతరం అయితే మన పెళ్లి జరగదండీ అని కూడా చెప్పాను. కాఫీ తాగాక ఆలస్యం చేయకుండా బయల్దేరమన్నాను’ ‘బెదరగొట్టుంటావ్’ ‘లేదులే. కుర్రాడు గట్టాడు. మా అమ్మకు నేను సర్ది చెప్తానండీ. అదంతా నాకు ఇష్యూ కాదు. నేను మిమ్మల్ని తప్పక చేసుకుంటాను. మీరు నాకు నచ్చారు అన్నాడు’. ‘అయితే గట్టాడు కాదు... తెలివైనాడు. నువ్వు చదువులో బ్రిలియెంట్. అదిరిపోయే ఉద్యోగం ఉంది. కష్టపడి ఫ్లాట్ కొనుకున్నావు. అంతర జ్ఞానంతోనో ఆత్మ విశ్వాసంతోనో నువ్వు అతడితో భుజం భుజం రాసుకుని నిలబడినప్పుడు ఇద్దరూ సమానం అని అన్నప్పుడు... హు... నువ్వు ఫలానా ముడుచుక్కలదాని కూతురువి నేను దయదలిచి చేసుకున్నాను అని ఒక దెబ్బ కొడతాడు. లేవకుండా పడి ఉంటావు. ఆ ప్రమాదమైతే నీకు ఎప్పుడూ ఉంటుంది. ఫరెవర్. దానికి ప్రిపేరవ్వు. అదీగాక’.... ఫోన్ కట్ అయ్యింది. యు.ఎస్ కాల్ ఒకసారైనా కట్ అయితేనే దానికి గౌరవం. మళ్లీ వచ్చేదాకా ఎదురు చూసేలా చేయడం అంటే దానికి ఆట. అమ్మ కూడా అలా ఆట ఆడిందా? ఆటేమో అనుకున్నాను చిన్నప్పుడు. ఇవాళొస్తుంది... రేపొస్తుంది అనుకున్నాను. కాని రాలేదు. ఆట కాదు. నిజమే. నాన్నకు ఉత్తరం రాసి వెళ్లిపోయిందట. మొగుడు పోయిన మేనత్త ముక్కు చీదుతూ వచ్చి దగ్గరకు తీసుకుంది. వంట చేసింది. నచ్చలేదు. దగ్గరకు తీసుకోవాలని చూసింది. నచ్చలేదు. అమ్మ కావాలి... నాకు అమ్మ కావాలి... ఏడుస్తూనే ఉన్నాను. నాకంటే నాలుగేళ్ల పెద్దవాడు అన్నయ్య. ఇద్దరం ఎంత వయసు పిల్లలమని? ఏడుస్తూనే ఉన్నాం. శవం లేచిన ఇంటిదైతే అదో తీరు. నాల్రోజులు ఏడుస్తారు. వదిలేస్తారు. ఇదలా కాదు. మనిషి మాయమైన ఇల్లు. స్త్రీ మాయమైన ఇల్లు. భార్య మాయమైన ఇల్లు. తల్లి మాయమైన ఇల్లు. ఇంటి మర్యాద మాయమైన ఇల్లు. అమ్మ మీద కోపంతో ఆమె ఫొటో తగలబెట్టబోయాను. అంతలోనే గుండెలకు గట్టిగా ఆన్చుకుని పెద్దగా ఏడ్చాను. దానిని జాగ్రత్తగా ప్రాణం కంటే మిన్నగా పుస్తకంలో దాచుకుని. బయట స్నేహితులతో ఆడుకుంటుంటే అమ్మ గుర్తుకొచ్చేది. వాకిలిలోని జాజితీగ మొదటి గుబురు వేస్తే అమ్మ గుర్తుకొచ్చేది. పాల గ్లాసులో ఇంకొంచెం పాలు మిగిల్చి కుర్చీలో గిరాటేసే అలవాటు మానుకుని అత్తయ్య కోసం దానిని శుభ్రంగా కడిగి వంటింట్లో పెడుతున్న ప్రతిసారీ అమ్మ గుర్తుకొచ్చేది. అమ్మా... అమ్మా... ఎందుకు వదిలేసి పోయావు. ఫోన్ మోగింది. ‘కట్ అయ్యింది అమ్మడు’... ‘ఊ...ఊ’... ‘ఏంటి ఏడుస్తున్నావా? నువ్వు పేరు మార్చుకుని ట్యాప్రాణి అని పెట్టుకోవే. కళ్ల మీదే ఉంటాయి నీకు ట్యాప్స్’ నవ్వాడు. ‘ఎందుకలా చేసిందన్నయ్య అమ్మ’ ఎన్నిసార్లు అడిగిందో తను. ఎన్నిసార్లు అడిగినా విసుక్కోడు అన్నయ్య. ‘చేసిందమ్మా. ఏం చేస్తాం’ ‘లీగల్‌గా విడిపోయి ఉండొచ్చుగా... అంతగా ఇష్టం లేకపోతే.’ ‘అదంతా సులభమా తల్లీ మన దేశంలో. మొగుడు ఇవ్వాలి. బంధువులు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు అత్తామామలు... తంతు నడిచే దాక సలహాలు సంప్రదింపులు...’ ‘పోనీ నిన్ను నన్నూ తీసుకెళ్లి ఉండొచ్చుగా’ నవ్వాడు. ‘నాన్న రెండో పెళ్లి చేసుకొనొచ్చి ఈమెనే మీ అమ్మ అనుకో అనంటే అనుకోగలిగావా. నోరారా ఒక్కసారి అమ్మా అని పిలువలేదు. ఆమె నిన్ను తీసుకెళ్లి ఈయనే నాన్ననుకో అనంటే అనగలిగేదానివా. అందుకే తీసుకెళ్ల లేదేమో’ ‘అసలు అంత కొంపలేం మునిగిపోయాయి అని’ ‘తెలియదమ్మా. అది అమ్మకూ నాన్నకే తెలియాలి. ఆమె ఆశలూ ఆకాంక్షలు ఎలా ఉన్నాయో. ఆయన బిహేవియర్ ఎలా ఉందో. జీవితంలో ఒక్కసారైనా కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకున్నారో లేదో. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారో లేదో. అమ్మకు ఒక మనసు ఉందని ఆయన గ్రహించాడో లేదో. పెళ్లాం ఒక బాధ్యత మాత్రమే అనుకున్నాడో ఏమో. నీకు గుర్తుందా. నాన్న కాఫీ తాగాక తాగిన సిగరెట్ పీకను ఆ కప్పులోనే నులిమేవాడు. దానిని కడిగే ప్రతిసారీ అమ్మ వాంతి చేసుకున్నట్టు మొహం పెట్టేది. విముఖత్వానికి తాటిచెట్లే అడ్డం పడాలని లేదమ్మా. దారితీగ కూడా చాలు. పేపర్లలో వార్తలు చూస్తుంటాం. ఏదో ఇంట్లో ఎవరో హత్యో ఆత్మహత్యో చేసుకుంటారు. ఇరుగు పొరుగువాళ్లు మాత్రం ఇద్దరూ బాగానే ఉండేవారండీ అని అంటారు. అరుపులు కేకలు వేసుకుంటేనే ఇద్దరికీ సరిపడనట్టు కాదు. నిశ్శబ్దంలో కూడా బోలెడంత అశాంతి ఉంటుంది’... ‘నేను అమ్మను క్షమించనన్నాయ్యా’ ‘అలా అనకమ్మా. తను ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకో’ ‘మరి నేను పడిన క్షోభ?’ ‘నీ స్వార్థం నువ్వు చూస్తున్నావు. తను మనిషి కాదా. తన స్వార్థం తాను చూసుకోకూడదా. ఆమె మన దగ్గరే ఉండిపోయింది అనుకుందాం. అప్పుడు ఇన్నాళ్లు తను అనుభవించాల్సిన క్షోభ. దానికేమంటావ్’ నా దగ్గర సమాధానం లేదు. కథ ముగిసింది. పి.సత్యవతి రాసిన ‘దమయంతి కూతురు’ కథ ఇది. స్త్రీ, పురుషుల విభేదాలు, ఎడబాట్ల విషయంలో బ్లేమ్‌గేమ్ ఎవరి మీద సాగుతుందో మనం జాగ్రత్తగా గమనించాలి. స్వేచ్ఛను, తెగింపును, తిరుగుబాటును ప్రదర్శించిన ప్రతిసారీ నిందను స్త్రీ మీద వేసి ఆమెను విక్టిమ్ చేయడం గమనిస్తాం. సమాజం, చట్టం అంగీకారంతో స్త్రీ స్వేచ్ఛను పొందవచ్చు. కాని అది జటిలమనుకుని అడుగు ముందుకేసిన స్త్రీలను మనం ఎదిగి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎదిగిన పిల్లలు మనకు చెబుతున్నది అదే. -
బంగారం కోసమే హతమార్చారు
మాజీ కార్పొరేటర్ హంతకుల అరెస్ట్ ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం) : నగరంలోని అల్లిపురం మార్కెట్ ప్రాంతంలో సంచలనం సష్టించిన టీడీపీ మాజీ కార్పొరేటర్ చిల్లా సత్యవతి (70) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారంపై ఆశతో ఆ ఇంటి మేడపై అద్దెకు ఉంటున్న దంపతులే హతమార్చారని, వారికి ఓ మైనర్ బాలుడు సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలను శాంతి భద్రతల డీసీపీ నవీన్ గులాఠీ వెల్లడించారు. అల్లిపురం మహాత్మాగాంధీ మార్కెట్‌కు ఎదురుగా ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న సత్యవతి ఈ నెల 13న రాత్రి హత్యకు గురైంది. ఆమెకు కుమార్తె వరుసైన దాసరి కనకమహాలక్ష్మి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగర నేరపరిశోధన విభాగం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా సత్యవతికి తోడుగా ఉండే పప్పులమ్మ రామలక్ష్మిని ముందుగా విచారించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులను విచారించారు. చివరకు అదే ఇంటి పై భాగంలో అద్దెకు ఉంటున్న దంపతులు సంగు నాగరాజు (25), సంగు పద్మ (24) సత్యవతిని హత్య చేసినట్టు నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత మృతురాలి చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు, బంగారు చైన్‌తో పాటు రూ.10,500 నగదు దొంగిలించారని నిర్ధారించారు. బంగారంపై ఆశతోనే... పెళ్లైన కొత్తలోనే భర్తను కోల్పోయిన సత్యవతి అల్లిపురం మార్కెట్ సమీపంలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు పరిచయమైన పప్పు లు అమ్ముకునే రామలక్ష్మి అనే మహిళ తోడుగా ఉంటుండేది. సత్యవతి నివాసం ఉంటున్న భవనం రెండో అంతస్తులో బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 15 మంది క్యాటరింగ్ వర్కర్లు అద్దెకు ఉంటున్నారు. అదే భవనం రెండో వైపున నిందితులు తమ ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. అదేవిధంగా 17 సంవత్సరాల మైనర్ బాలుడు పేయింగ్ గెస్ట్‌గా మరో గదిలో ఉంటున్నాడు. నిందితుల పది సంవత్సరాల కుమారుడు హత్య జరగడానికి ముందు రెండు రోజుల నుంచి సత్యవతి గదిలో ఆమెకు తోడుగా నిద్రిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమె బంగారంపై కన్నేసిన నాగరాజు, పద్మ దంపతులు 13న రాత్రి హత్యకు పాల్పడ్డారు. ఇందుకు వారికి ఓ మైనర్ బాలుడు సహకారం అందించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 14న ఉదయం 11 గంటల సమయంలో సత్యవతి హత్యకు గురైన విషయాన్ని కేటరింగ్ యువకులతో పాటు స్థానికులు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్లో సంగు నాగరాజును కురుపాం మార్కెట్ వద్ద, అతడి భార్య పద్మను ఇంట్లో, మైనర్ బాలుడిని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 తులాల బరువున్న నాలుగు బంగారు గాజులు, చైన్‌తో పాటు రూ.10,500 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో చురుగ్గా పాల్గొని నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు. విలేకరుల సమావేశంలో ఏడీసీపీ వరదరాజులు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, క్రై ం ఏసీపీ ఫల్గుణరావు, సీసీఎస్ ఏసీపీ గోవిందరావు, రెండో పట్టణ పోలీసులు పాల్గొన్నారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో..
ఖమ్మం: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం మొడికట్ట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ(45) మద్యానికి బానిసై భార్య సత్యవతితో తరచు గొడవ పడుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాఖీ వేడుకల్లో మంత్రి పోచారం
బాన్సువాడ: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు శనివారం బాన్సువాడలోని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన అక్క సత్యవతి రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి స్థానిక వెంకటేశ్వర మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఐదేళ్ల బాలుడి కిడ్నాప్
రాజమండ్రి క్రైం : బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి బస్సు ఎక్కించి ఎత్తుకుపోయిన ఘటన రాజమండ్రిలో మంగళవారం రాత్రి జరిగింది. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఆదెమ్మదిబ్బ సమీపంలోని కృష్ణానగర్‌కు చెందిన కోరుకొండ సత్యవతి, రాజులకు హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు ఉన్నాడు. రాజు పెయింటింగ్ పని చేస్తుండగా... కంబాలచెరువు సమీపంలోని చిరంజీవి బస్టాండ్ పార్కు సమీపంలో సత్యవతి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. సత్యవతి తనతోపాటు హేమంత్‌ను కూడా కిళ్లీ కొట్టు వద్దకు తీసుకువచ్చింది. బయట ఆడుకుంటుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హేమంత్‌తో ఆడుకున్నాడని, కొద్ది సేపటి తరువాత చూస్తే సదరు వ్యక్తితోపాటు తన కుమారుడు హేమంత్ కూడా కనిపించకుండా పోయాడని సత్యవతి, రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు. కోరుకొండ వైపునకు వెళ్లే బస్సు ఎక్కించుకుని పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు కోరుకొండ, గోకవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ధవళేశ్వరం, రాజానరం, కడియం బొమ్మూరు పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు. ఇదిలా ఉంటే తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో సత్యవతి, రాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు
భద్రాచలం, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో పార్టీ పదవుల పందేరం చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకం విషయంలో చెలరేగిన వివాదం.. చివరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికే అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసేంత వరకు వచ్చింది. ఇది ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వనమాకు ఆయన వర్గమంతా వెన్నుదన్నుగా నిలిచింది. అవసరమైతే పీసీసీ పెద్దలను కలిసి, జరిగిన పరిణామాలను వివరించేందుకు వనమా వర్గీయులు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై తలెత్తిన వివాదం రాజధానికి చేరింది. పార్టీకి ఎంతోకాలంగా నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఏకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నోటీసును ఆయన ‘పరాభవం’గా భావిస్తున్నారని, ఇదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దల వద్ద చెప్పుకుని వాపోయారని తెలిసింది. తెలంగాణపై మంత్రుల బృందాన్ని కలిసేందుకని సోమవారం ఢిల్లీకి బయలుదేరుతున్న జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. అక్కడ పార్టీ పెద్దలతో భద్రాద్రి పంచాయితీపై కూడా చర్చించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ‘ఎమ్మెల్యే సత్యవతి రాద్ధాంతం సరికాదు..’ కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే సత్యవతి (కాంగ్రెస్) రాద్ధాంతం చేయడం సరికాదని ఆ పార్టీ డివిజన్ నాయకులు కొందరు అన్నారు. వారు ఆదివారం భద్రాచలంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆమె (సత్యవతి) ఏకపక్ష ధోరణి కారణంగానే సమస్య ఇంతవరకూ వచ్చిందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కన్వీనర్ మైథిలిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన నక్కా ప్రసాద్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేశారని చెప్పారు. ఆ స్థానంలో తాండ్ర నర్సింహారావును వనమా నియమించారని చెప్పారు. ‘ఈ నియామకంపై డివిజన్లోని పార్టీ నాయకులతో కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ చర్చించారు. ఆ తరువాతనే, తాండ్ర నర్సింహారావును నియమించాలంటూ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావుకు సిఫారసు లేఖ ఇచ్చారు. దాని ఆధారంగానే, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా తాండ్ర నర్సింహారావును వనమా నియమించారు. అది కూడా.. పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పేర్కొంటూ ఉత్తర్వు ఇచ్చారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సత్యవతి ఇంత రాద్ధాంతం చేయటం సరికాదు’ అన్నారు. ‘పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బొలిశెట్టి రంగారావును నియమించేప్పుడు డీసీసీ అధ్యక్షుడు వనమాతోగానీ, పార్టీ డివిజన్ బాధ్యతలు చూస్తున్న మాతోగానీ ఆమె చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన విషయం వాస్తవం కాదా..?’ అని వారు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతి మధ్యనున్న ఆధిపత్య పోరులో వనమాను ఇరికించటం సరికాదని మైథిలిరెడ్డి అన్నారు. ‘వనమాకు ఇచ్చిన షోకాజ్ నోటీసును పార్టీ పెద్దలు వెంటనే ఉపసంహరించుకోకపోతే డివిజన్వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడరంతా రాజీనామా చేస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.