చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం | Satyavathi Rathod: Molestation Case In Singareni Colony Hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం

Published Mon, Sep 13 2021 2:41 AM | Last Updated on Mon, Sep 13 2021 7:38 AM

Satyavathi Rathod: Molestation Case In Singareni Colony Hyderabad - Sakshi

ఇల్లెందు: హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన గిరిజన బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు వచ్చిన మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని తెలిపారు. అలాగే, చిన్నారి కుటుంబానికి ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా ప్రభుత్వ సాయం అందిస్తుందని చెప్పారు. ఆ కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement