
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. పర్సనల్ విషయాలతో పాటు వివిధ అంశాలపై స్వేచ్ఛగా పోస్టులు పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను నిన్న ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు.
సత్యవతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మంత్రి సత్యవతి గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. మంత్రి కేటీఆర్ చేసిన ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా ప్టోరీలో పెట్టి, దండం పెడుతూ చప‍్పట్లు కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సమంత విషయానికొస్తే.. విడాకుల తర్వాత వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. మరోవైపు పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సాంగ్ కోసం సమంత దాదాపు కోటిన్నర పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment