మహబూబాబాద్ అర్బన్: బంజారా ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్లు పెంపు దేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజనుల జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు.
పోడుభూముల విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకుని సాగుదారులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు. గిరిజనులకు ఏ ప్రభుత్వం అందించని అనేక పథకాలను అమలు చేస్తూ గిరిజనులకు సీఎం కేసీఆర్ ఆరాధ్యుడిగా మారారని, తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. కేసీఆర్ తనకు పునర్జన్మనిచ్చారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment