
సాక్షి, మహబూబాబాద్: కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరునెలలుగా కాళ్లకు చెప్పులు వేసుకోకుండా కఠోర దీక్ష చేపడుతున్నారు. పలు అభివృద్ధి పనులు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎండలో నడవడంతో ఆమె కాళ్లకు బొబ్బలు వచ్చా యి.
రాత్రి ఆమె తన కాళ్లకు ఆయింట్‌మెంట్ పూసుకొని ఉపశమనం పొందారు. ఈ క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కాగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా దీక్ష విరమించేది లేదని మంత్రి తెలిపారు.