
పశువైద్యుల సేవలు అమూల్యమైనవి
● జగన్‌మోహన్ రావు
హన్మకొండ: మూగజీవాలకు సేవలందిస్తున్న పశువైద్యుల సేవలు అమూల్యమైనవని, దేశ జీడీపీలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ పాత్ర ప్రముఖమైందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆడిటోరియంలో తెలంగాణ వెటర్నరీ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ పశు వైద్యదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. పశు వైద్యవృత్తి చేసే వారికి సరైన గుర్తింపు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ రీఆర్గనైజేషన్ చేయడానికి జేఏసీ డిమాండ్‌లో ఈ అంశాన్ని పొందుపరుస్తామని చెప్పారు. ఎంజీఎం సమీపంలోని వెటర్నరీ అసోసియేషన్ బిల్డింగ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వెంటర్నరీ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ రాము మాట్లాడారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన పశు వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి కిరణ్ కుమార్, హ నుమకొండ జిల్లా అధికారి డాక్టర్ విజయభాస్కర్, ములుగు జిల్లా అధికారి డాక్టర్ కొమురయ్య, టీజీఓ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అ ధ్యక్షుడు డి.మురళీధర్ రెడ్డి, తెలంగాణ వెటర్న రీ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి డాక్టర్ బాలోజీ, డాక్టర్ ప్రవీణ్ కుమార్, కృష్ణమూర్తి, ప్రకాశ్, శ్రీనివాస్, రవికుమార్, గోపాల్ రావు, వినయ్, రాజేష్, నరేష్, విజయ, నాగమణి, ఊర్మిళ, మాలతి పాల్గొన్నారు.
ప్రశాంత సమాజ స్థాపనకు
కృషి చేయాలి
నయీంనగర్: ప్రస్తుత సమాజంలో భార్యభర్తలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య తగాదాలు పెరుగుతున్నాయని.. వీటికి కమ్యూనిటీ మధ్యవర్తిత్వం మెరుగైన పరిష్కారమని, ప్రశాంతమైన సమాజ స్థాపనకు పెద్దలు నడుం బిగించాలని ఫస్ట్ ఏడీజే జడ్జి బి.అపర్ణ దేవి అన్నారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లుగా శిక్షణ పొందిన పరికిపండ్ల వేణు, తేరాల యుగంధర్, పాశం సంజీవరెడ్డి, తూడి విద్యాసాగర్ రెడ్డి, యాదగిరి 53వ డివిజన్ ఆదర్శకాలనీలో నిర్వహించనున్న ఆదర్శ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం జడ్జి అపర్ణ దేవి మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు, సమూహాల మధ్య ఏర్పడే వివాదాలను కమ్యూనిటీ మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుతంగా పరిష్కరించగలిగితే సత్ఫలితాలు ఉంటాయన్నారు. 2023 లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లుగా శిక్షణ పొందిన పరికిపండ్ల వేణు, తేరాల యుగంధర్, పాశం సంజీవరెడ్డి, తూడి విద్యాసాగర్ రెడ్డి, యాదగిరి, హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరి క్షమాదేశ్ పాండే, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ సాయికుమార్, ఎస్‌ఐ సదానందం, దామెర నరసయ్య, దామోదర్, విద్యాసాగర్ రెడ్డి, నరసింహస్వామి పాల్గొన్నారు.
సమాజానికి ఉపయోగపడే
పరిశోధనలు చేయాలి
కేయూ క్యాంపస్: సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ చిన్నాల బలరాములు అన్నారు. ఆ విభాగంలో పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై నిర్వహిస్తున్న తరగతుల్లో భాగంగా ఆయన శనివారం పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సామాజిక సమస్యలపై పరిశోధనలు చేసి సానుకూల పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. సమావేశంలో విభాగం అధిపతి ప్రొఫెసర్ పెదమళ్ల శ్రీనివాస్ రావు, బీఓఎస్ చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీనివాసులు, అధ్యాపకులు చీకటి శ్రీను, బుర్రి ఉమాశంకర్, ఒడపెల్లి మోహన్, స్కాలర్స్ పాల్గొన్నారు.

పశువైద్యుల సేవలు అమూల్యమైనవి