
అంతర్జాతీయ భారత్ సమ్మిట్‌లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: హైదరాబాద్ నోవ హోటల్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ భారత్ సమ్మిట్‌లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ సమాఖ్య అభివృద్ధిపై సమగ్ర భారత నిర్మాణంలో యువత పాత్రపై తన అభిప్రాయం వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే.. దేశ భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను బలంగా నిరోధించాలన్నారు. దేశ విభజన కోరే శక్తులకు కఠినంగా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించారు.