
నేటినుంచి టీజీఎప్‌సెట్ పరీక్షలు
విద్యారణ్యపురి : రాష్ట్రంలో 2025–26 విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న టీజీఎప్‌సెట్ పరీక్షలు నేటినుంచి జరుగనున్నాయి. ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు. మే 2నుంచి 4వతేదీ వరకు ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఎప్‌సెట్ పరీక్ష జరుగనుంది. ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. సీబీటీ ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షలకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హాల్‌టికెట్లపై క్యూ ఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. దీని ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. వరంగల్ జోన్‌లోని పలు పరీక్ష కేంద్రాల్లో అగ్రికల్చరల్, ఫార్మసీలో ప్రవేశాలకు 5,845 మంది, నర్సంపేటలో 1,078 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను వరంగల్ జోన్ పరిధిలో 11,785 మంది, నర్సంపేట జోన్‌లో 2,158 మంది విద్యార్థులు రాయబోతున్నారని కన్వీనర్ కుమార్ తెలియజేశారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
ఆయా పరీక్ష కేంద్రాలకు నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించబోరు. ఉదయం సెషన్‌కు ఉదయం 7:30 గంటల కల్లా చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సెషన్‌కు 1:30గంటల కల్లా విద్యార్థులు చేరుకోవాలి. ఫొటో ఐడీ, హాల్‌టికెట్‌తో పాటుగా బాల్ పాయింట్ పెన్‌ను తీసుకెళ్లాలి.
సీపీని కలిసిన
వరల్డ్ పీస్ బాధ్యులు
హన్మకొండ చౌరస్తా : వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ బాధ్యులు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. శాంతి కార్యక్రమాలను సీపీకి వివరించగా సమాజహితానికి చేపట్టే సంస్థలకు సహాకారం అందిస్తామని అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న మన పండుగలు కార్యక్రమానికి ఆహ్వానించారు. బి.సురేష్‌లాల్, సంస్థ వ్యవస్థాపకుడు సిరాజుదీ ్ద న్, విష్ణువర్ధన్, పీఆర్‌ఓ నివాస్ పాల్గొన్నారు.
● రెండ్రోజులు అగ్రికల్చరల్, ఫార్మసీ
● 2నుంచి ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు..
● నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

నేటినుంచి టీజీఎప్‌సెట్ పరీక్షలు