
బొమ్మకూర్‌లో నవీన యుగంనాటి శిలలు
● డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి
నర్మెట : జనగామ జిల్లా నర్మెట మండల పరిధి బొమ్మకూర్‌లో నవీన శిలాయుగం నాటి అరుదైన శిలలు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ఆయన నవీన శిలాయుగం నాటి సంగీతం వినిపించే అరుదైన రాతి కళాఖండాన్ని గుర్తించారు. అనంతరం రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ..బొమ్మకూర్ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, జిల్లాలోనే పూర్వకాలం అతిపెద్ద ఇనుము, లోహ పరిశ్రమ ఇక్కడ విలసిల్లిందని పేర్కొన్నారు. 15కిలోల బరువున్న చిట్టెపు రాళ్లు ఇక్కడ ప్రసిద్ధి అని తెలిపారు. అరుదైన రాతి పనిముట్లు, ధాన్యాన్ని నూరే, సంగీతం పలికే శిలలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. అరుదైన శిలాసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.