Rathod
-
సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్ విద్యార్థి..
మంచిర్యాల: పదో తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ నెల 9న హైదరబాద్‌లోని రవీంద్రభారతీలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడని పాఠశాల హెచ్ఎం గుండ రాజన్న తెలిపారు.కార్యక్రమం అనంతరం విద్యార్థిని, తల్లిదండ్రులను ముఖ్యమంత్రి సన్మానిస్తారని తెలిపారు. ఈ నెల 10న హరిహర కళాభవన్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులను సత్కరిస్తారని పేర్కొన్నారు. వందేమాతరం, విద్యాదాత పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. విద్యార్థిని శుక్రవారం ఎంఈవో విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు దాముక కమలాకర్, కమిటీ చైర్మన్ మంగ, ఉపాధ్యాయులు అభినందించారు. -
బీజేపీలోకి జనార్దన్ రాథోడ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ శనివారం కమలం గూటికి చేరారు. హైదరా బాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ని ర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు ఉట్నూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూ లమాలలేసి నివాళులర్పించారు. బంజారా సంప్రదాయ నృత్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని యా వత్ దేశం స్వాగతిస్తుందన్నారు. పార్టీ ఏ బాధ్యత అ ప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందు కు సాగుతానని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పతంగే బ్రహ్మా నంద్, వకుళాభరణం ఆదినాత్ పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘హస్త’వాసి ఎవరో..? -
'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్!
ఆదిలాబాద్: రిమ్స్‌లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్ రాహుల్‌రాజ్ సీరియస్ అ య్యారు. డైరెక్టర్ జైసింగ్ రా థోడ్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్సోర్సింగ్ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
మంత్రి సత్యవతి రాథోడ్ ఎందుకా శపథం చేశారు..?.. అసలు వ్యూహం ఏంటి?
ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాని మండలికి ఎన్నికయ్యారు.. ఎస్టీ కోటాలో మంత్రి పదవి పొందారు. తనను మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌పై స్వామిభక్తి చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. చేతి మీద అధినేత పేరుతో పచ్చబొట్టు వేసుకుని సంబరపడుతున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా చెప్పులు వేసుకోవడంలేదు. రాజకీయాల్లో పదవులు కాపాడుకోవడం, ఉనికి కాపాడుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పదవులు పొందడానికి, ఉన్న పదవిని కాపాడుకోవడానికి అధినేత మెప్పు పొందడానికి ఎన్ని బాధలైనా పడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహార సరళి గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి గులాబీ దళపతి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. గత 4 నెలలుగా పాదరక్షలు లేకుండా తిరుగుతున్న మంత్రి సత్యవతి రాథోడ్.. తాజాగా తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేసుకుని స్వామి భక్తిని మరో సారి చాటుకున్నారు. స్వామి భక్తిని చాటుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవ్వరి అంచనాలకు అందకుండా తనను మంత్రిని చేసిన కేసీఆర్‌పై సత్యవతి రాథోడ్ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. శపథానికి కట్టుబడి నాలుగు మాసాలుగా చెప్పులు లేకుండా తిరగడంతో వేసవి ఎండల దృష్ట్యా అరికాళ్లకు బొబ్బలొచ్చి కంటతడి పెట్టారు. కేసీఆర్ పై ఉన్న అభిమానం ముందు కాళ్ల బొబ్బలు పెద్ద సమస్యే కాదని భావించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారా భవన్లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకురాలైన మంత్రి సత్యవతి రాథోడ్ తన పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోవడం మానేసిన విషయాన్ని అందరూ మర్చిపోవడంతో పచ్చబొట్టు వేసుకొని తన ప్రతిజ్ఞను గుర్తుచేయడంతో పాటు.. కేసీఆర్ పట్ల ఎంతో అభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పే ప్రయత్నమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. డోర్నకల్ లేదా మహబూబాబాద్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న సత్యవతి రాథోడ్ కేసీఆర్ కరుణ కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నారని టాక్ నడుస్తోంది. చదవండి: జానారెడ్డి అసలు స్ట్రాటజీ ఇదేనా?.. సీఎం కుర్చీ కోసమేనా..? నియోజకవర్గం లేకుండా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి, డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను కాదని సత్యవతికి టిక్కెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్‌లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ పై స్వామిభక్తిని చాటుకుంటే ఎక్కడో ఓ చోట అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయంపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో నొచ్చుకున్నారట. ఏమి అడగకుండానే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకుంటే ప్రత్యర్థులు లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే పదవి బెటర్ కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి తన రాజకీయ జీవితాన్ని పటిష్టపర్చుకునేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. -
మంత్రి కఠోర దీక్ష.. కాళ్లకు బొబ్బలు
సాక్షి, మహబూబాబాద్: కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరునెలలుగా కాళ్లకు చెప్పులు వేసుకోకుండా కఠోర దీక్ష చేపడుతున్నారు. పలు అభివృద్ధి పనులు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎండలో నడవడంతో ఆమె కాళ్లకు బొబ్బలు వచ్చా యి. రాత్రి ఆమె తన కాళ్లకు ఆయింట్మెంట్ పూసుకొని ఉపశమనం పొందారు. ఈ క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కాగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా దీక్ష విరమించేది లేదని మంత్రి తెలిపారు. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్‌పూర్‌లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్‌కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
డేట్‌కు వెళ్లి హత్యకు గురైన భారత విద్యార్థి
మెల్బోర్న్ : డేటింగ్ సైట్లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 25 ఏళ్ల మాలిన్ రాథోడ్ ఆస్ట్రేలియాలో అకౌంట్స్ విద్యను అభ్యసిస్తున్నాడు. మెల్బోర్న్లోని మెల్బోర్న్లోని సన్బరీ సబర్బ్ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, ఏం జరిగిందో ఏమోగానీ రాథోడ్ తీవ్ర గాయాలతో ఆమె ఇంట్లో పడివున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు రాథోడ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాథోడ్ ప్రాణాలు విడిచాడు. సదరు అమ్మాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరపర్చారు. జడ్జి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. రాథోడ్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఇకపై ఏటా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’
న్యూఢిల్లీ: జాతీయ క్రీడల్లాగే ఇకపై ‘ఖేలో ఇండియా’ స్కూల్, కాలేజ్ గేమ్స్ నిర్వహిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. ఈనెల 6 నుంచి జరుగనున్న ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఫుట్‌బాల్ జట్టును మంగళవారమిక్కడ సన్మానిం చారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లా డుతూ ‘దేశ క్రీడల ముఖచిత్రాన్ని మార్చనున్నాం. అందరి సహకారంతో క్రీడల్లో భారత్‌ను మరో దశకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. కుర్రాళ్లు చిరు ప్రాయంలోనే క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు చక్కని ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిసారిగా ఈ ఏడాది ‘ఖేలో ఇండియా’ జాతీయ స్కూల్ గేమ్స్‌ను ఈ డిసెంబర్లో నిర్వహిస్తాం. అలాగే కాలేజ్ గేమ్స్‌ను వచ్చే జనవరిలో నిర్వహిస్తాం. ఇకపై క్రమం తప్పకుండా ప్రతిఏటా ఈ గేమ్స్ నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. తద్వారా పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలుగులోకి తెస్తాం’ అని అన్నారు. ఆసియా గేమ్స్, పాన్ అమెరికా గేమ్స్‌లా ఈ ఈవెంట్లను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పలు కార్పొరేట్ సంస్థల సౌజన్యంతో అట్టహాసంగా నిర్వహించే ఈ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసి తదుపరి ఉత్తమ శిక్షణకు రూ. 5 లక్షలు చొప్పున ఎనిమిదేళ్ల పాటు ఇస్తామన్నారు. భారత ఫుట్‌బాలర్లను ఉద్దేశించి ‘మైదానంలోకి దిగాక మీరు ఈ మ్యాచే మీ కెరీర్ చివరిదన్నట్లు పోరాడండి. మీరు ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలను గుర్తుకుతెచ్చుకోండి. అప్పుడే అసాధారణ ఫలితాలు సాధిస్తారు’ అని ఉత్తేజపరిచారు. -
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదు
-
అవినీతి నిర్మూలనపై మోడీకే అధికారాలు
ఐఏఎస్‌ల క్రమశిక్షణా చర్యల పై పీఎం నిర్ణయమే కీలకం న్యూఢిల్లీ: లోక్‌పాల్, కేంద్ర విజిలెన్స్ కమిషన్, అవినీతి వ్యతిరేక చ ట్టం తదితర అంశాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్వాధికారిగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. తన అజమాయిషీలో ఉన్న సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, ప్రజా సమస్యల, పెన్షన్ల వ్యవహారాల మంత్రిత్వశాఖ (డీఓపీటీ) ఆద్వర్యంలో ప్రధాని ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. సవూచార హక్కు (ఆర్టీఐ), కొత్త అఖిల భారత సర్వీసుల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానిదే తుదినిర్ణయం కాబోతోంది. ఇటీవల అంతర్గతంగా జరిగిన అధికారాల పంపిణీతో, తన పరిధిలో పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోబోయే వివిధ అంశాలను వివరిస్తూ డీఓపీటీ తన అధికారులందరికీ ఒక సర్క్యులర్ జారీచేసింది. సర్క్యులర్ ప్రకారం... ఐఏఎస్ అధికారులు, కేంద్ర సచివాలయ అధికారులు, గ్రేడ్-వన్ ఆపై హోదాకలిగిన అధికారులు, సీబీఐ గ్రూప్ ఏ అధికారులపై క్రమశిక్షణ చర్యల కేసులపై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి చైర్మన్, సభ్యుల నియామకం, రాజీనా మా, బర్తరఫ్ తదితర అశాలు, అవినీతి వ్యతిరేక చట్టం, విధానపరమైన అంశాలు, లోక్‌పాల్ చట్టం, కేబినెట్ నోట్ రూపకల్పన, కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) అధికారాలపై ప్రధానిదే నిర్ణయం. సీబీఐలోని ఐపీఎస్ అధికారుల నియామకం, సర్వీసు పొడిగింపునకు ఏసీసీనుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. ‘కోడ్’ కేసు మూసివేతకు అభ్యంతరం లేదు అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ప్రధాని నరేంద్ర మోడీపై దాఖలైన కేసును మూసివేయడంపై తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని అహ్మదాబాద్ నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసు ఇన్స్పెక్టర్ హెచ్ఏ రాథోడ్ కోర్టుకు నివేదించారు. అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎంహెచ్ పటేల్ కోర్టులో రాథోడ్ ఈ మేరకు నివేదించారు. మోడీ ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని గుజరాత్ పోలీసులు ఈ నెల 8న కోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, న్యాయప్రక్రియ లాంఛనంలో బాగంగా రాథోడ్ కోర్టుకు సమాధానాన్ని దాఖలు చేశారు. -
చేతులెత్తేసిన ‘దేశం’
రాథోడ్‌కు ఎదురుగాలి కనుచూపు మేరల్లో కనిపించని విజయం ఒక్కచోట మినహా ఎమ్మెల్యే అభ్యర్థులది అదేతీరు.. టీడీపీ దోస్తీతో వాడిన కమలం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో గెలుపు ధీమా కనిపించడం లేదు. విజయావకాశాలు కనిపించక పోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు రెండు రోజుల క్రితమే చేతులెత్తేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు దూరమైనా.. మోడీ హవా కలిసొస్తుందని భావించారు. కానీ ఈ పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు దూరం కాగా, మోడీ గాలి మాత్రం రాథోడ్‌కు కలిసిరాలేదు. కారణమేమంటే.. పొత్తు ప్రకటించిన నాటి నుంచి జిల్లాలో బీజేపీ-టీడీపీ శ్రేణులు ఉప్పు.. నిప్పులా తయారయ్యాయి. ఆ రెండు పార్టీల అగ్రనేతలు చంద్రబాబు, కిషన్‌రెడ్డి ఒకేరోజు జిల్లాలో పర్యటించి ఎవరికి వారే బహిరంగ సభలు నిర్వహించారు. దీంతో మోడీ హవా రాథోడ్‌కు కలిసిరాకుండా పోయింది. పైగా తెలంగాణవాదం బలంగా పనిచేస్తున్న ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై బరిలో నిలవడం ఆయన గెలుపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబు జపం చేయడం, ఆయనతో జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించడం వంటి చర్యలతో తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతోంది. టీడీపీ పోటీ చేస్తున్న ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిర్పూర్లో ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రావి శ్రీనివాస్ నాలుగో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. ఖానాపూర్ అభ్యర్థి రాథోడ్ రితేష్ ప్రత్యార్థులకు పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్నారు. బెల్లంపల్లి అభ్యర్థి పాటి సుభద్ర, నిర్మల్ అభ్యర్థి బాబర్బేగ్ల పరిస్థితి కూడా ఇంతేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆసిఫాబాద్ అభ్యర్థి మర్సకోల సరస్వతీ మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క బోథ్‌లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు కొంత మెరుగనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థులకు హ్యాండిచ్చారు.. జిల్లాలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితిని గ్రహించి.. ఆ పార్టీకి అన్ని తానై చక్రం తిప్పుతున్న నేతకు ‘బాధ్యతలు’ అప్పగించారు. ఆయన అభ్యర్థులకు హ్యాండిచ్చారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అభ్యర్థుల కోసం వచ్చినదాన్నంత ఈ నేత వెనకేసుకోవడం ఆ పార్టీ అభ్యర్థులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఇదిగో ఇస్తా.. అదిగో ఇస్తా అంటూ వారం రోజులుగా నెట్టుకొచ్చారు. తీరా కీలక సమయంలో అభ్యర్థులకు మొండిచేయి చూపడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో జిల్లాలో ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. వాడిన కమలం టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీకి జిల్లాలో కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన క్రెడిట్ ఉన్నప్పటికీ టీడీపీతో కలువడం కారణంగా జిల్లాలో ఏ ఒక్క సీటును కూడా గెలుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కానీ ఎక్కడా బీజేపీ అభ్యర్థుల గెలుపు దరిదాపుల్లో కనిపించడం లేదు. చెన్నూరులో రాంవేణు, మంచిర్యాలలో మల్లారెడ్డిలు మూడో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. భైంసా, ఆదిలాబాద్‌లలో పోటీ చేస్తున్న రమాదేవి, పాయల్ శంకర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.