జనార్దన్ రాథోడ్‌కు కండువా కప్పి పార్టీలోకి స్వాగతిస్తున్న కిషన్‌రెడ్డి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ శనివారం కమలం గూటికి చేరారు. హైదరా బాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ని ర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు ఉట్నూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూ లమాలలేసి నివాళులర్పించారు.
బంజారా సంప్రదాయ నృత్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని యా వత్ దేశం స్వాగతిస్తుందన్నారు. పార్టీ ఏ బాధ్యత అ ప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందు కు సాగుతానని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పతంగే బ్రహ్మా నంద్, వకుళాభరణం ఆదినాత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment