janardan
-
బీజేపీలోకి జనార్దన్ రాథోడ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ శనివారం కమలం గూటికి చేరారు. హైదరా బాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ని ర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు ఉట్నూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూ లమాలలేసి నివాళులర్పించారు. బంజారా సంప్రదాయ నృత్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని యా వత్ దేశం స్వాగతిస్తుందన్నారు. పార్టీ ఏ బాధ్యత అ ప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందు కు సాగుతానని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పతంగే బ్రహ్మా నంద్, వకుళాభరణం ఆదినాత్ పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘హస్త’వాసి ఎవరో..? -
కోమాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి..
జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన అభిమానులకు ఎనలేని ప్రేమ. ఆయన పేరును జపంలా ఉచ్ఛరిస్తారు. తారక్‌ను ఒక్కసారైనా చూడాలని, కలిసి ఫొటో దిగాలని ఎదురుచూసే ఫ్యాన్స్ ఎంతోమంది. అటు ఎన్టీఆర్ కూడా తనను ఎంతగానో ఆరాధించే అభిమానులను అమితంగా ప్రేమిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన తారక్ వీరాభిమాని జనార్ధన్ కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కోమాలో ఉన్న జానర్ధన్తో, అతడి తల్లితో ఎన్టీఆర్ మాట్లాడి, అధైర్యపడొద్దని, దేవుడిని నమ్మండని భరోసా ఇచ్చాడు. ఎన్టీఆర్ మాటలతో జనార్ధన్ వేళ్లు కదిలించాడని కూడా అక్కడున్న వాళ్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ ఇక లేడు. మంగళవారం (జులై 5) సాయంత్రి జనార్ధన్ తుదిశ్వాస విడిచాడు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు జనార్ధన్ కోలుకోవాలని ప్రార్థించినా.. చివరికి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఎన్టీఆర్ అభిమాన లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనార్ధన్ కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు: View this post on Instagram A post shared by Jr NTR Fans™ (@jrntrfans55) -
భాగ్యనగరం తల్లిలాంటింది!
సాక్షి, సిటీబ్యూరో: భారతదేశంలో ప్రఖ్యాత సితార్ విద్యాంసుల్లో పండిట్ జనార్దన్ మిట్టా ఒకరు. స్వయంకృషితో ఎదిగిన హిందూస్థానీ సంగీత సాధకుడాయన. ఆరు దశాబ్దాలుగా సినీ, శాస్త్రీయ సంగీత రంగాలకు సేవ చేసిన జనార్దన్.. కళా నిలయమైన హైదరాబాద్‌లోనే జన్మించారు. చిన్న వయసులోనే సితార్‌పై మక్కువ పెంచుకుని ఎవరి శిక్షణ లేకుండానే సంగీతంపై పట్టు సాధించారు. ఆనాటి దక్కన్ రేడియోలో బాల కళాకారుడిగా కచేరీలు కూడా ఇచ్చారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ వద్ద మెలకువలు నేర్చుకుని దక్షిణాదిన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సంగమం ఆధ్వర్యంలో అరవై వసంతాల సంగీత వేడుకల సందర్భంగా లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డు అందుకొనేందుకు ఇటీవల రవీంద్రభారతికివచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. విదేశాల్లో సంగీత ప్రయాణం.. పండిట్ జనార్దన్ శాస్త్రీయ రంగంలో గాయకి, తంత్రకారి శైలులు రెండింటిపై పట్టు సాధించిన అరుదైన కళాకారుడిగా పేరు పొందారు. దేశ విదేశాల్లో పర్యటించి హిందూస్తానీ కచేరీలు చేశారు. వి.రాఘవన్, టీఎన్ కృష్ణన్, ఎం చంద్రశేఖరన్ , టీవీ గోపాలకృష్ణన్, కన్యాకుమారి, ఉస్తాద్ షేక్ దావూద్, జాకీర్ హుస్సేన్ వంటి సంగీత దిగ్గజాలతో జుగల్బందీలనూ, ఫ్యూషన్ సంగీత కచేరీలు చేశారు. అమెరికా, యూకే, యూరప్, ఫ్రాన్స్, బెల్జియం, పోలాండ్, జర్మనీ, శ్రీలంక, వెస్టిండీస్, సింగపూర్ వంటి దేశాల్లో తన సితార్ కచేరీలతో ప్రేక్షకులను మైమరపించారు. 1971లో న్యూయర్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేశారు. పండిట్ రవిశంకర్ తర్వాత ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేసిన వాద్య కళాకారుడు మన జనార్దన్ మాత్రమే. 1976లో తిరువాయూరులో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కచేరీ చేసిన తొలి హిందూస్థానీ వాద్య కళాకారుడిగా ప్రత్యేకతను పొందారు. కంచి కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠాల ఆస్థాన విద్వాన్గా సేవలందించారు. సాదర స్వాగతం పలికిన సినీ ప్రపంచం.. జనార్దన్ మిట్టా ప్రతిభను గుర్తించిన సినీ ప్రపంచం సాదరంగా ఆహ్వానించింది. 1958లో భాగ్యదేవత చిత్రంలోని పాటలకు సితార్‌ను వాయించడంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఎస్. రాజేశ్వరావు మొదలుకొని ఏఆర్ రెహమాన్ వరకు దక్షిణాది అన్ని భాషల సంగీత దర్శకుల దగ్గర ప్రధాన సితార్ వాద్యకారుడిగా పనిచేశారు. దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ సినీ గీతాలలో కూడా తన సితార్ మెరుపులు మెరింపించారు. తన ఆరు దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు ముప్పైవేల పాటలకు సితార్ వాద్య సహకారాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఎన్నో వందల చిత్రాల రీరికార్డింగ్ల్లో సన్నివేశాలకు తన సితార్ నాదంతో జీవం పోశారు. తెలుగులో రంగుల కల, అగ్ని సంస్కారం, మలయాళంలో ఎసైప్పన్, సంస్కార్ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. బ్లిస్, శ్రీశైలం, యాభై వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ వంటి లఘు చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు. కథలు సమాజాన్ని ప్రభావితం చేయాలి కమల్‌హాసన్ నటించిన మాటలు లేని పుష్పక విమానం చిత్రంలో తెర వెనుక జనార్దన్ సితార్ ఎన్నో భావాలను పండించింది. ఇక చరిత్రలో నిలిచిపోయే ఘంటసాల భగవద్గీతలో కూడా జనార్దన్ తన సితార్ వాదనతో అమరత్వాన్ని అద్దారు. ఎన్నెన్నో పురస్కారాలు ... మద్రాస్ సినీ మ్యూజిషియన్స్ యూనియన్‌కు అధ్యక్షుడిగా, ట్రస్ట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని, సంగీత కళాభారతి, సంగీత శిరోమణి, సితార్ చక్రవర్తి, సితార్ సమ్రాట్ వంటి ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్నారు. తాను నెలకొల్పిన విశ్వకళా సంగమ సంస్థ ద్వారా కళారూపాలనూ, కళాకారులనూ ప్రోత్సహిస్తున్నారు. ‘ఎన్నెన్నో పురస్కారాలు అందుకొని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అరవై వసంతాల సంగీత జీవిత వేడుకల సందర్భంగా పొందిన టైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు (స్వర్ణ కంకణం) జీవితంలో మరువలేను. భాగ్యనగరంతల్లిలాంటింది. వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడినా హైదరాబాద్‌కు వస్తే తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు ఉంటుంది. ఈ నేల, ఈ గాలి, ఈ వాతావరణం ఎప్పుడూ మరువలేను. హైదరాబాద్‌కు ఎంత చేసినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోలేనిది’ అన్నారు ఆయన. -
గ్రుపుల పేరు చెప్పి సీట్లు అమ్ముకున్నారు
-
రౌడీషీటర్ దారుణ హత్య
కేకే.నగర్: విల్లుపురంలో రౌడీషీటర్ దారుణహత్యకు గురి కాగా, చె న్నైలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాలు.. విల్లుపురం జిల్లాలో మంగళవారం బాంబుతో దాడి జరిపి రౌడీని వేటకత్తులతో దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లా వానూర్ తాలూకా కుయిలాపాళయం శక్తికోవిల్ వీధికి చెందిన జనార్ధనన్(23) రౌడీషీటర్‌గా చలామణి అవుతున్నాడు. ఇతనిపై హత్య, కిడ్నాప్ వంటి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జనార్ధనన్ అనుచరులకు, మరొక రౌడీ రాజ్‌కుమార్ అనుచరులకు మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన కొందరు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తిరుకోవిలూర్ ప్రాంతానికి చెందిన చెల్లపాండి అనే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ కేసుపై విచారణ విల్లుపురం జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో మగళవారం ఉదయం జరిగింది. ఈ కేసులో రౌడీ జనార్ధనన్, సురేష్‌లు హాజరయ్యారు. కేసు విచారణ అనంతరం జనార్ధనన్, సురేష్ ద్విచక్ర వాహనాలపై పుదుచ్చేరికి వెళుతున్నారు. ఆ సమయంలో ఐదు మందికి పైగా వ్యక్తులు మోటారు బైకుపై వారిని వెంబడించారు. రైల్వే వంతెనపై వెళుతుండగా వారిపై నాటు బాంబులను విసిరారు. దీనితో వారు అదుపుతప్పి కింద పడ్డారు. సురేష్ స్పల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా జనార్ధనన్‌పై ఆ ముఠా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వెంటనే ఆ ముఠా బైకులపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనార్ధనన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియపాక్కం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీలో ఉన్న హంతకుల కోసం గాలిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం : పల్లికరనై సమీపంలోని కోవిలంపాక్కం, తుైరె పాక్కం- పల్లావరం రేడియల్ రోడ్డుపై టాస్మాక్ దుకాణం ఉంది. ఈ దుకాణం సమీపంలోని చెట్టుకు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పల్లికరనై పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మద్యం మత్తులో ఏర్పడిన తగాదాలో అతడిని హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? లేక పాతకక్షలు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో పెళ్లి లొల్లి
తిరుమల శ్రీవారి సన్నిధిలో తలపెట్టిన ఒక వివాహం..వివాదానికి దారి తీసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలికి చెందిన జనార్ధన్‌కు, మరో యువతితో శుక్రవారం ఉదయం తిరుమలలో వివాహం జరగాల్సి ఉంది. తిరుమల చేరుకున్న జనార్దన్ కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుండగా డక్కిలి ఎస్సై తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదంటూ అడ్డుతగిలారు. జనార్దన్‌కు మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆమెను కాదని మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే, అందుకు ఆధారాలు చూపాలని, ఎవరో చెప్పిన మాటలను నమ్మి పెళ్లి చెడగొట్టటం తగదని జనార్దన్ కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. రెండు వర్గాల మధ్య వాదులాట జరుగుతుండగానే కుటుంబసభ్యులు జనార్దన్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లి ముందుగా నిర్ణయించిన అమ్మాయితో తాళి కట్టించి, పెళ్లి తంతు పూర్తి చేయించారు. ఇది తెలుసుకున్న ఎస్సై ఆగ్రహంగా వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో జనార్దన్ తరఫు వారు ఆయనపై దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు అక్కడికి చేరుకుని, వారిని సముదాయించారు. ఈ గొడవతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. -
రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్: నగరంలో ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ లో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న జనార్థన్ ను గుర్తుతెలియని దుండగులు అతన్ని బండరాళ్లతో మోది హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. జనార్థన్ పై రౌడీషీట్ ఉంది. -
పెళ్లి కి వెళ్లి వచ్చేసరికి ఇల్లు ఖాళీ
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదుతో పాటు 7తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమరా ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మార్కండేయనగర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జనార్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చాడు. అప్పటికే తాళం పగలగొట్టి ఉండటంతో.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
'నేను ఎవరినీ వేధించలేదు'
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే జిల్లా ఎస్పీ జనార్దన్‌పై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాబూరావు, డీజీపీ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వర్తిస్తున్న మల్లికను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. కనకదుర్గ అనే మహిళ రైల్వే ఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలో బాబూరావు, మల్లిక సమక్షంలో ఎస్పీ జనార్దన్ ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని, ఆమెను ముగ్గురూ కలిసి బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ జరుగుతోంది. తనపై జరిగిన నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయట్లేదని కనకదుర్గ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జీఆర్పీ పోలీసులు సెక్షన్ 354, 506, R/W 34 కింద గురువారం కేసు నమోదు చేశారు. కక్ష తోనే... ఈ విషయంపై ఎస్పీ జనార్థన్ వివరణ ఇస్తూ ‘11 నెలలుగా రైల్వే ఎస్పీగా పని చేస్తున్నా. కనకదుర్గ కనీసం ఒక్కరోజు కూడా నా ఆధీనంలో పని చేయలేదు. ఇక వేధింపుల సమస్య ఎలా ఉత్పన్నం అవుతుంది? ఆమె నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం అందింది. ఈ మేరకు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించాను. ఆ కక్షతోనే తప్పుడు ఫిర్యాదు చేశారు. అంతేకానీ నేనెవర్నివేధించలేదు. విచారణలో పోలీసులకు సహకరిస్తా’నన్నారు. -
సమస్యలు పరిష్కరించేది జనార్దనే
జనార్దన్ టీడీపీ కార్యాలయ ఇన్చార్జి: సెబాస్టియన్ మా సమస్యలను చంద్రబాబు వద్ద ప్రస్తావించేది అతనే హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన జనార్దన్ ఎవరనే విషయాన్ని ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న బిషప్ సెబాస్టియన్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ బాధ్యతలు నిర్వహించే టీడీ జనార్దన్ దృష్టికి తీసుకెళ్లే అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్తాయన్నారు. షరతులతో కూడిన బెయిల్‌పై బయటకొచ్చిన సెబాస్టియన్ గురువారం ఏసీబీ కార్యాలయానికి సంతకం చేయడానికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా టీడీపీ కార్యాలయ ఇన్చార్జి టీడీ జనార్దన్తోనే ప్రస్తావిస్తాం. సీఎం చంద్రబాబును నేరుగా కలిసే అవకాశం మాకు దొరకదు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా బిజీగా ఉంటారు. కనుక మా సమస్యలను జనార్దన్‌తో చెప్పుకుంటాం. ఆ తర్వాత ఆయన సీఎం చంద్రబాబు వద్ద ఆ సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తారు’ అని సెబాస్టియన్ పేర్కొన్నారు. ప్రత్యేక న్యాయస్థానానికి ఏసీబీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జనార్దన్ అనే వ్యక్తి ఎవ రని విలేకరులు ప్రశ్నించగా సెబాస్టియన్ పైవిధంగా స్పందించారు. అయితే ఈ కేసుతో జనార్దన్‌కు ఏలాంటి సంబంధం లేదన్నారు. ఏసీబీ కావాలనే తమను కుట్రపూరితంగా ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించిందన్నారు. తమ ఫోన్లను ఏసీబీ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. తన ఫోన్లో ఎలాంటి సంభాషణలూ రికార్డు కాలేదని, అవన్నీ ఏసీబీ సృష్టిస్తున్న కట్టుకథలని సెబాస్టియన్ చెప్పుకొచ్చారు. -
ఎవరీ జనార్దన్?
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. వీరి సంభాషణల్లో చాలా సార్లు జనార్దన్ పేరు వినిపించింది. ప్రతి విషయాన్ని సండ్ర జనార్దన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొన్ని కీలక భేటీలు జరిగాయి. అయితే జనార్దన్ ఎవరు అన్న విషయం తెలాల్సివుంది. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్‌తో ఆందోళనలు ఉధృతం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసే ఇద్దరి అధికారుల మధ్య ముదిరిన విభేదాలు ఐటీడీఏను అస్తవ్యస్తంగా మార్చాయి. ఐటీడీఏ పీవో జనార్దన్‌కు, డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదట నుంచి మనస్పర్థాలు ఉన్నాయని ప్రచారం ఉంది. రషీద్‌ను పీవో మూడు రోజుల క్రితం సస్పెండ్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. పీవో చర్యలను నిరసిస్తూ ఐటీడీఏ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. దీంతో ఐటీడీఏ సిబ్బంది లేక వెలవెల బోతోంది. పనుల నిమిత్తం వచ్చే గిరిజనులు, ఇతరులు వెనుదిరిగి పోతున్నారు. సమస్యలు పరిష్కరించకుం టే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న తొమ్మిది ఐటీడీఏలలో ఆందోళన నిర్వహిస్తామని ట్రైబల్ వెల్ఫెర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గోపాల్, కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. పరిస్థితి చేయిజారక ముందే ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. సఖ్యత లేదని ప్రచారం.. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌కు డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదటి నుంచే సఖ్యత లేదనే ప్రచారం ఐటీడీఏలో ఉంది. ఈ క్రమంలో పీవో నివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఎవరికి మింగుడు పడటం లేదు. దాదాపు 30 మందికిపైగా ఉద్యోగులను సస్పెండ్, వంద మందికిపైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రషీద్‌కు పీవోకు పడక పోవడంతో జూలై 31న అనారోగ్యం కారణం చూపుతూ రషీద్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించారని ప్రచారం ఉంది. రషీద్ స్థానంలో అప్పటి ఏపీవో జనరల్ వెంకటేశ్వర్లు అదనపు బాధ్యతలు చేపట్టారు. అయన పదవీ విరమణతో ఏవో భీమ్ డీడీటీడబ్ల్యూగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ చివరి వారంలో గిరిజన సంక్షేమశాఖలో సుపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నారాయణరెడ్డిని ఆశ్రమాలకు సరుకులు సకాలంలో సరఫరా చేయడం లేదని అక్టోబర్ 31న సస్పెండ్ చేశారు. ఇలా గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో తెలియక ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డీడీ విధుల్లో చేరడంతో.. అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన డీడీటీడబ్ల్యూ రషీద్ కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. వేతన చెల్లింపులో సాంకేతికలోపం ఏర్పడటంతో అయనను ప్రభుత్వం తిరిగి యథాస్థానికి పంపించింది. గత నెల 28న రషీద్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 5న విధుల్లో చేరారు. అప్పటికే డీటీఏఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు గిరిజన సంక్షేమశాఖలో విధులు నిర్వహిస్తూ సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఈ నెల 9 నుంచి ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐటీడీఏ పీవో అనారోగ్యం కారణంగా సెలవు పెట్టడంతో 13 నుంచి 16వ తేదీ వరకు రషీద్ ఇన్చార్జి పీవోగా వ్యవహరించారు. ఈ సమయంలో 15న డీటీఏఫ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని దీక్ష విరమింపజేశారు. ఈ నేపథ్యంలోనే జీవో ఎంఎస్ నంబర్ 274 ప్రకారం రషీద్‌ను పీవో సస్పెండ్ చేశారు. డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేకున్నా జీవో నంబర్ 274ను ఆధారంగా చూపుతూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఉద్యోగులంత ఏకమై ఆందోళన ఐటీడీఏ పీవో తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఏకమయ్యారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం, షోకాజ్ నోటీసులు జారీచేయడం, నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకుండా విచారణ పేరిట కాలయాపన చేయడంపై ఆందోళన బాట పట్టారు. డీడీటీడబ్ల్యూ, గజిటెడ్, నాన్‌గజిటెడ్, ఉపాధ్యాయుల సస్పెన్షన్లను ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నుంచి ఐటీడీఏ ఎదుట అందోళన నిర్వహిస్తున్నారు. పీవో కిందిస్థాయి ఉద్యోగులతో పనులు చేయిస్తూ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలి కాని ఇలా చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. పీవో వైఖరి మార్చుకోకపోతే న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టడంతో ఐటీడీఏ అస్తవ్యస్తంగా తయారైంది. గిరిజనుల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. -
23న చంద్రబాబు పర్యటన ఖరారు
సాక్షి, ఒంగోలు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 23వ తేదీన జిల్లాకు రానున్నారు. చంద్రబాబు పర్యటన ఖరారైనట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ ఉదయం నెల్లూరు నుంచి చంద్రబాబునాయుడు ఉదయం 10.30కు టంగుటూరులో ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఒంగోలుకు 11 గంటలకు చేరుకుని నగరంలోని హోటల్ సరోవర్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని 12 గంటలకు జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభలో, అనంతరం రాత్రి 7 గంటలకు బాలాజీ తిరుపతిరావు కల్యాణ మండపంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు పయనమవుతారని జనార్దన్ పేర్కొన్నారు.