'నేను ఎవరినీ వేధించలేదు' | case file on railway SP janardhan ovar harassments | Sakshi
Sakshi News home page

'నేను ఎవరినీ వేధించలేదు'

Published Fri, Dec 11 2015 12:22 PM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

'నేను ఎవరినీ వేధించలేదు' - Sakshi

'నేను ఎవరినీ వేధించలేదు'

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే జిల్లా ఎస్పీ జనార్దన్‌పై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాబూరావు, డీజీపీ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వర్తిస్తున్న మల్లికను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. కనకదుర్గ అనే మహిళ రైల్వే ఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్నారు.
 
ఈ ఏడాది జూలైలో బాబూరావు, మల్లిక సమక్షంలో ఎస్పీ జనార్దన్ ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని, ఆమెను ముగ్గురూ కలిసి బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ జరుగుతోంది. తనపై జరిగిన నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయట్లేదని కనకదుర్గ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జీఆర్పీ పోలీసులు సెక్షన్ 354, 506, R/W 34 కింద గురువారం కేసు నమోదు చేశారు.
 
 కక్ష తోనే...
ఈ విషయంపై ఎస్పీ జనార్థన్ వివరణ ఇస్తూ ‘11 నెలలుగా రైల్వే ఎస్పీగా పని చేస్తున్నా. కనకదుర్గ కనీసం ఒక్కరోజు కూడా నా ఆధీనంలో పని చేయలేదు. ఇక వేధింపుల సమస్య ఎలా ఉత్పన్నం అవుతుంది? ఆమె నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం అందింది. ఈ మేరకు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించాను. ఆ కక్షతోనే తప్పుడు ఫిర్యాదు చేశారు. అంతేకానీ నేనెవర్నివేధించలేదు. విచారణలో పోలీసులకు సహకరిస్తా’నన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement