తిరుపతిలో పెళ్లి లొల్లి | marriage dispute in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుపతిలో పెళ్లి లొల్లి

Published Fri, Apr 22 2016 1:08 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

తిరుపతిలో పెళ్లి లొల్లి - Sakshi

తిరుపతిలో పెళ్లి లొల్లి

 తిరుమల శ్రీవారి సన్నిధిలో తలపెట్టిన ఒక వివాహం..వివాదానికి దారి తీసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలికి చెందిన జనార్ధన్‌కు, మరో యువతితో శుక్రవారం ఉదయం తిరుమలలో వివాహం జరగాల్సి ఉంది. తిరుమల చేరుకున్న జనార్దన్ కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుండగా డక్కిలి ఎస్సై తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదంటూ అడ్డుతగిలారు. జనార్దన్‌కు మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆమెను కాదని మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

అయితే, అందుకు ఆధారాలు చూపాలని, ఎవరో చెప్పిన మాటలను నమ్మి పెళ్లి చెడగొట్టటం తగదని జనార్దన్ కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. రెండు వర్గాల మధ్య వాదులాట జరుగుతుండగానే కుటుంబసభ్యులు జనార్దన్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లి ముందుగా నిర్ణయించిన అమ్మాయితో తాళి కట్టించి, పెళ్లి తంతు పూర్తి చేయించారు. ఇది తెలుసుకున్న ఎస్సై ఆగ్రహంగా వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో జనార్దన్ తరఫు వారు ఆయనపై దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు అక్కడికి చేరుకుని, వారిని సముదాయించారు. ఈ గొడవతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement