వచ్చే నెలలో నా పెళ్లి.. అందుకే తిరుమలకి వచ్చా: కీర్తి సురేశ్ | Keerthy Suresh Visits Tirumala With Family Ahead Of Wedding | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: తిరుమల దర్శనం చేసుకున్న కీర్తి సురేశ్ ఫ్యామిలీ

Nov 29 2024 11:56 AM | Updated on Nov 29 2024 1:47 PM

Keerthy Suresh Visits Tirumala With Family Ahead Of Wedding

హీరోయిన్ కీర్తి సురేశ్.. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి కొండపై కనిపించింది. అలానే తన పెళ్లి గురించి తొలిసారి మాట్లాడింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగనుందని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)

మలయాళ  నిర్మాత సురేశ్, నటి మేనకల చిన్న కూతురు కీర్తి సురేశ్. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈమె నటించిన హిందీ మూవీ 'బేబీ జాన్'.. క్రిస్మస్‌కి రిలీజ్ కానుంది.

గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్ పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. అవి నిజమని స్వయంగా ఈమెనే క్లారిటీ ఇచ్చింది. ఆంటోని తట్టిళ్‌తో తాను 15 ఏ‍ళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తిరుమలలో కనిపించి స్వయంగా మీడియాతో వచ్చే నెలల గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 11-12 తేదీల్లో ఓ రిసార్ట్‌లో వివాహ వేడుక జరగనుంది.

(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement