హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు.
రెండు సంప్రదాయాల్లో వివాహం..
ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment