జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన అభిమానులకు ఎనలేని ప్రేమ. ఆయన పేరును జపంలా ఉచ్ఛరిస్తారు. తారక్‌ను ఒక్కసారైనా చూడాలని, కలిసి ఫొటో దిగాలని ఎదురుచూసే ఫ్యాన్స్ ఎంతోమంది. అటు ఎన్టీఆర్ కూడా తనను ఎంతగానో ఆరాధించే అభిమానులను అమితంగా ప్రేమిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన తారక్ వీరాభిమాని జనార్ధన్ కోమాలో ఉన్న విషయం తెలిసిందే.
కోమాలో ఉన్న జానర్ధన్‌తో, అతడి తల్లితో ఎన్టీఆర్ మాట్లాడి, అధైర్యపడొద్దని, దేవుడిని నమ్మండని భరోసా ఇచ్చాడు. ఎన్టీఆర్ మాటలతో జనార్ధన్ వేళ్లు కదిలించాడని కూడా అక్కడున్న వాళ్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ ఇక లేడు. మంగళవారం (జులై 5) సాయంత్రి జనార్ధన్ తుదిశ్వాస విడిచాడు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు జనార్ధన్ కోలుకోవాలని ప్రార్థించినా.. చివరికి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఎన్టీఆర్ అభిమాన లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనార్ధన్ కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ?
72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు:
Comments
Please login to add a commentAdd a comment