మహబూబాబాద్: ప్రజలు తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రాష్ట్రంలో మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మంత్రి మండలంలోని అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా హట్యాతండా, భీక్యానాయక్ తండా, పెద్దతండా, పెద్దతండా(కొండాపురం) టీఎస్‌కే తండాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
పలువురు గిరిజనులతో మంత్రి నృత్యం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ 24 గంటలు విద్యుత్ కావాలా లేక మూడు గంటలే కావాలా అనే విషయాన్ని ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రూ. 20 లక్షల వ్యయంతో కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మదార్, సహకార సొసైటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల నుంచి ఆదివారం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మెరుగు వెంకటయ్య ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
బీఆర్‌ఎస్ విజయానికి తోడ్పాటు అందించండి..
ప్రత్యేక రాష్ట్ర తరహాలో దేశ సమగ్రాభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు బీఆర్‌ఎస్ అఖండ విజయానికి పాత, కొత్త క్యాడర్ తేడా లేకుండా తోడ్పాటు అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఆదివారం చిన్నమడూరులో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మేడ సునిత సోమనర్సయ్య స్వగృహంలో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం సింగరాజుపల్లిలో కాంగ్రెస్ నాయకులు భూమండ్ల వెంకన్న, ఐలయ్య, కర్రె స్వామి, జోగు భద్రయ్య, మహేందర్, పరశురాములు, కత్తుల సందీప్ తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, మండల సమన్వయకర్తలు పల్ల సుందర్‌రామిరెడ్డి, బస్వ మల్లేశం, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్, సర్పంచ్ మల్లేషం, మేకపోతుల నర్సింహులు, సోమిరెడ్డి పాల్గొన్నారు.
దిల్ ఖుష్‌గా మంత్రి..
మండల కేంద్రంలో టీ పాయింట్ వద్ద పిచ్చపాటిగా మాట్లాడుతూ మంత్రి దిల్‌ఖుష్‌గా కనిపించారు. కామారెడ్డి గూడేనికి చెందిన మహేందర్ కార్యకర్త రేబాన్ అద్దాలతో కనిపించగా కళ్లకలకలా.. సోకద్దలా..? అంటూ తన పీఏలతో బ్లాక్ అద్దాలు తెప్పించుకొని తాను పెట్టుకొని బాగున్నాయంటూనే టీ తాగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment