సాక్షి, కొమురం భీం అసిఫాబాద్: అసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను సీఎం విడుదల చేశారు. లక్షన్నర మంది గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేశారు. పోడు భూములకు రైతుబంధు నిధులు విడుదల చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజన మహిళల పేరు మీదే పోడు భూముల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములపై ఉన్న గతంలోని కేసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చిన తరువాత కేసులు ఉండటం సరికాదని అన్నారు. ఈ మేరకు వేదిక మీదే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు కోసం దాదాపు రూ. 24 కోట్లు నిధుల కేటాయించినట్లు చెప్పారు.
గిరిజన రైతుల పల్లెలకు త్రీ-ఫేజ్ కరెంట్ అందించాలని పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణనే అని పునరుద్ఘాటించారు. అసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు.
అంతకముందు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ రిబ్బన్ కట్ చేసి పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
చదవండి: వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: ఈటల కౌంటర్!
Comments
Please login to add a commentAdd a comment