సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీన వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డుల జారీపైనా దృష్టి సారించామని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించా రు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆమె అంగన్‌వాడీ యూనియన్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జికోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్య లు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలికెరి, జేడీ సునంద, అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, టీఎన్జీవో ప్రతినిధి నిర్మల, మినీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు వరలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment