సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శాఖలు, విభాగాల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే, ప్రభు త్వ విద్యాలయాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు ఉన్నా రు. మొత్తంగా పదిహేను లక్షల మంది విధులు నిర్వర్తి స్తుండగా, ఏడు లక్షల మందికి పైగా రిటైర్డ్ పెన్షన్, కుటుం బ పెన్షన్ దారులు ఉన్నారు. వీరందరికి ప్రతినెలా చివరి రోజు లేదా మరుసటి నెల ఒకటో తేదీన వేతనం బ్యాంక్ ఖాతాల్లో పడడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి మార్చి జీతాన్ని ఏప్రిల్ ఆరవ తేదీ అందుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఏర్పడింది. ఇందుకు కారణం వరుస సెలవులే.
ఆరో తేదీన వేతనం: వరుస సెలవులతో ఆలస్యంగా జీతం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 31వ తేదీ అందరికీ జీతాలు బ్యాంక్ ఖాతాల్లో పడాల్సి ఉంది. శని, ఆది సెలవు అన్న విషయం తెలిసిందే. నెలలో చివరి రోజైన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ అధికారులు బ్యాంక్‌కు జాబితాను పంపడం జరుగుతుంది. ఆ రోజున ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు కావడంతో నగదు బట్వాడా తదితర వ్యవహారాలు ఉండవు. ఏప్రిల్ ఒకటి కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజు కాబట్టి బ్యాంక్‌లకు సెలవు. రెండో తేదీ మహావీర్ జయంతి, మూడో తేదీ గుడ్ ఫ్రైడే సెలవులు. నాలుగు తేదీ శనివారం బ్యాంక్‌లు పనిచేసినా, రాష్ర్ట ప్రభుత్వ ట్రెజరీకి సెలవు. ఇక, ఆదివారం ఏటూ సెలవు కాబట్టి, ఇక ఆరో తేదీ సోమవారం బ్యాంకుల్లో జీతాలు జమ కానున్నాయి.
ఈ సెలవుల కారణంగా ఉద్యోగులు మార్చి జీతాన్ని ఏప్రిల్ ఆరో తేదీ ఈ సారి అందుకోక తప్పడం లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ , రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు జీతం మంజూరు జాప్యం కాబోతున్న విషయాన్ని ముందుగానే ఉద్యోగులకు తెలియజేసే పనిలో పడ్డారు. ఒకటో తేదీ అయితే, చాలు అద్దెలు చెల్లించే, ఇంటి కావాల్సిన అన్నింటిని సిద్ధం చేసుకునే సామాన్య ఉద్యోగులు, ఈ సారి కాస్త సర్దుకోవాల్సిందే. తమకు జీతం జాప్యం అవుతుండ డం పెన్షన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు కలవరం వ్యక్తం చేస్తున్నారు.
ఒకటిన జీతం లేనట్టే
Published Sat, Mar 28 2015 9:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement