
రాఖీ వేడుకల్లో మంత్రి పోచారం
బాన్సువాడ: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు శనివారం బాన్సువాడలోని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన అక్క సత్యవతి రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి స్థానిక వెంకటేశ్వర మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.