
సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ సత్యవతి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ విజయానికి మూలం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 87 శాతం ఎమ్మెల్యేలను ఏ విధంగా గెలిచామో.. అదే విధంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలను తమ పార్టీ గెలవడం ఖాయమన్నారు. గడిచిన 9 నెలల్లో సీఎం జగన్ అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రజల్లోకి వెళతామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. (‘టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని బాబే చెప్పారు’)
Comments
Please login to add a commentAdd a comment