సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో బెల్టు షాపుల దందా కొనసాగుతోంది. ఏకంగా హోం మంత్రి అనిత ఇలాకాలోనే బెల్టు షాపులకు బహిరంగ వేలం పాటకు దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ అసమర్థత తీరుకు ఇది నిదర్శమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఏపీ హోం మంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం పాట ప్రకటించారు. ఎస్ రాయవరం మండలంలోని పేట సూదిపురంలో బహిరంగ వేలం పాట నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. బెల్టు షాపు వేలంపాట కోసం ముందు రోజు రాత్రి గ్రామంలో దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ కూటమి నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు వేలం పాట జరుగుతున్నట్టు తెలుస్తోంది.
అయితే, రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని సీఎం చంద్రబాబు, మంత్రి అనిత అడ్డగోలు వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా అంటూ ప్రకటన కూడా చేశారు. మరోవైపు.. తనిఖీల్లో బెల్టు షాపు నిర్వాహకులు దొరికినా ఎటువంటి జరిమానా విధించడం లేదు ఎక్సైజ్ అధికారులు. ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఒకటి.. గ్రౌండ్ లెవల్ జరుగుతున్నది మరొకటి అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment