సమ్మక్క, సారలమ్మ దేవతల పసుపు, కుంకుమతోపాటు పట్టుచీర అందిస్తున్న మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లిదయాకర్‌రావు, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు. చిత్రంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయా న్ని సందర్శించారు. రుద్రేశ్వర స్వామి కొలువైన, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కుటుంబసభ్యు లతో కలిసి సందర్శించడం ప్రాధాన్య తను సంతరించుకుంది. రాష్ట్రపతికి హెలిపాడ్ వద్ద గవ ర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యలు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో రామప్ప ప్రధానగేటు వద్దకు చేరుకో గానే రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ములుగు ఎమ్మెల్యే సీతక్కలు స్వాగతం పలికారు. ప్రధానగేటు నుంచి కాలినడ కన ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి పూజా రులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కాగా ఆలయంలో రాష్ట్ర పతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి జలాభిషేకం చేశారు. అనంతరం మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గా రావు రాష్ట్రపతికి సమ్మక్క, సారలమ్మ దేవతలకు చెందిన పసుపు, కుంకుమతోపాటు పట్టుచీర అందించారు. రామప్ప ఆలయ పూజారులు శాలు వాతో సత్కరించి ఆశీర్వచనం చేశారు.
అక్కడి నుంచి రామప్ప గార్డెన్‌లోని గ్రీన్‌హౌస్‌లో రాష్ట్ర పతి కొద్దిసేపు సేదదీరారు. అనంతరం గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక పైనుంచి రూ.62 కోట్లతో చేపడుతున్న ప్రసాద్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. రూ.15 కోట్లతో చేపడుతున్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పరంపర కళా కారుల బృందం శివుని పాటతో పాటు ‘బ్రహ్మ మొకటే పరబ్రహ్మమొకటే’ పాటకు చేసిన నృత్యాన్ని, ఏటూరునాగారానికి చెందిన కోయ కళా కారుల కొమ్మకోయ నృత్యాన్ని రాష్ట్రపతి తిలకించారు. అనంతరం సాయంత్రం 4:20 సమయంలో హైదరాబాద్‌కు వెళ్లారు.
ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మంటలు
రాష్ట్రపతి రామప్ప పర్యటనలో స్వల్ప అపశ్రుతి దొర్లింది. రామప్ప వేదికపై ముర్ము తదితరులు ఆశీనులై గిరిజనుల కొమ్మకోయ, పరంపర సాంస్కతిక కార్యక్రమాలు తిలకిస్తుండగా మీడియా గ్యాలరీ సమీపంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికా రులు, ఫైర్ సిబ్బంది మంటలు చెలరేగకుండా అదుపులోకి తెచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment