
మహబూబాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి లను బీజేపీ పావుగా వాడుకుంటోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్, వైద్య కళాశాల పనులను బుధవారం ఆమె పరిశీలించారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర విభజన చట్టంలోని హమీల అమలు కోసం సీఎం కేసీఆర్ అనేకసార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందించని ప్రధాని మోదీ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవని షర్మిల విషయంలో స్పందించడం వెనుక ఉన్న ఆంతర్యమేమింటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇదంతా చూస్తుంటే షర్మిలను బీజేపీ పావుగానే భావించాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని, ఆ విషయంలో సహించేది లేదని హెచ్చరించారు
Comments
Please login to add a commentAdd a comment