
సాక్షి, విజయవాడ: ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను.. బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ కేంద్రం నుంచి తాజాగా దేశాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో ప్రవీణ్ ప్రకాశ్ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.